యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి : AISF
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబ్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలి* ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం వస్తువుల అభిలాష్ అధ్యక్షతన భువనగిరి లో జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణికంఠ రెడ్డి, లక్ష్మణ్ మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రం గా ప్రాముఖ్యత పొందిన యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి గవర్నమెంట్ డిగ్రీ ,పీజీ కళాశాల లేకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ యూనివర్సిటీ మాదిరిగానే పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఇక్కడ కూడా దేవస్థానం నిధులతో అన్ని వసతులు , కోర్సులతో కూడిన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణలో డ్రగ్స్ మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని విద్యార్థులు వాటికి బానిసలు కాకుండా ఉన్నత చదువులపై దృష్టి సారించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని,యూనివర్సిటీలకు వీసీ లను వెంటనే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మణికంఠ రెడ్డి ,లక్ష్మణ్ డిమాండ్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగల వెంకటేష్ మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థి సంఘం బలోపేతం కోసం విద్యార్థులు నడుం బిగించాలని అన్నారు జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ,సంక్షేమ హాస్టల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో వసతి గృహ అధికారులు సమయం పాలన పాటించడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు మారపాక లోకేశ్వర్ , ఆర్ చందు , రామ్ చరణ్ , సాయి చరణ్, టీ ప్రవీణ్, శ్రీకాంత్ మండల నాయకులు వినీల్ ,భారత్ సుమన్ తదితరులు పాల్గొన్నారు
Aug 15 2024, 20:02