నల్లగొండ: బ్రాహ్మణ సేవా సమితి జిల్లా కమిటీ ఎన్నిక.. నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా సిరి ప్రగడ శ్రీనివాస శర్మ..

బ్రాహ్మణ సేవాసమితి జిల్లా కమిటీ ఎన్నిక

తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి జిల్లా కమిటీని సోమవారం జిల్లా కేంద్రంలోని గొల్లగూడ రామాలయంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా సిరి ప్రగడ శ్రీనివాస్ శర్మ, జిల్ల ప్రధాన కార్యదర్శిగా వేదాంతం కృష్ణ చరణ్ చార్యులు, ఉపాధ్యక్షులు పసునూరి రాంబాబు,సిరిప్రగడ ఆనందరావు,గాదె గిరిధర్ రావు, సహాదు కార్యదర్శ్మి గా కంజర్ యశ్వంత్ చార్యులు, కోశాధికారిగా కలాహలం సంజయుచార్యులు, ప్రచార కార్యదర్శి రంగరాజు జగదీష్, కార్యవర్గ సభ్యులు మారేవల్లి వెంకటాచార్యులు, గాదె మురళి కృష్ణ మడపు సంతోష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ ఆదేశాల మేరకు ఈరోజు కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కమిటీ జిల్లా పేద బ్రాహ్మకుల కోసం ఎల్లవేళలు అందుబాటులు ఉండి అందరికి సహయ సహకారలు అందించి కమిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి లతోపాటు జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ లు రాష్ట్ర మంత్రులు తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎంతోమంది బ్రాహ్మణులు వెనకబడి ఉన్నారని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అవకాశం కల్పించి బ్రాహ్మణ కులానికి చెందిన విద్యార్థులకు విదేశీ చదువుల కోసం ఆర్థికంగా ప్రోత్సహించాలని కోరారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద.. అన్ని గేట్లను మూసివేసిన అధికారులు..

శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద

అన్ని గేట్లను మూసివేసిన అధికారులు

జులై 29న శ్రీశైలం గేట్లు ఎత్తిన అధికారులు

ఈ నెల 5న నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తిన అధికారులు

శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుత నీటిమట్టం 881.20 అడుగులు

ఇన్ ఫ్లో 77,598, ఔట్‌ ఫ్లో 68,211 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ 194.3096 టీఎంసీలు

హైదరాబాద్‌లో సీజనల్‌ వ్యాధుల టెన్షన్‌.. టెన్షన్...

హైదరాబాద్‌లో సీజనల్‌ వ్యాధుల టెన్షన్‌. రోగులతో కిక్కిరిసిపోతున్న ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులు. రోజు రోజుకి పెరుగుతున్న డెంగ్యూల కేసులు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌, నిలోఫర్‌లో విపరీతంగా OPలు. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో వెయ్యికి చేరుకున్న OP. OP విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత. బదిలీలతో వైద్యుల కొరతు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఆస్పత్రులు. ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ.

నల్లగొండ: రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి: దళిత బంధు సాధన సమితి

రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలి

రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వినతి పత్రం అందజేసి, అనంతరం దళిత బంధు సాధన సమితి నాయకులు బడుపుల శంకర్, కందుల లక్ష్మయ్య మాట్లాడుతూ..

గత ప్రభుత్వం నిరుపేద దళితులను గుర్తించి ఆర్థిక భరోసగా దళిత బంధులో లబ్ధిదారులుగా ఎంపిక చేసిందని తెలిపారు. ఎంపిక సమయంలో ఎంపీడీవో, గ్రామపంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల నుండి వాటికి సంబంధించిన అన్ని పత్రాలను తీసుకొని పరిశీలన చేసి దళిత బంధు పోర్టల్ లో పేర్లను నమోదు చేశారని పేర్కొన్నారు. బ్యాంకులో కూడా దళిత బంధు లబ్ధిదారులతో జీరో ఎకౌంటును తీయించారని వెల్లడించారు. దళిత బందులో నిధులను విడుదల చేశారని, లబ్ధిదారులకు రూ. 10 లక్షలు జమాయ్యాయి. గ్రౌండింగ్ జరిగే లోపు ఎన్నికల నియామవళి రావడంతో లబ్ధిదారులకు గ్రౌండిగ్ చేయలేదన్నారు. ఎన్నికల తర్వాత గ్రౌండిగ్ చేస్తారు అనుకున్నాం కానీ ఎకౌంటు లను ఫ్రీజింగ్లో పెట్టి ఇప్పటివరకు గ్రౌండిగ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి దళిత జాతికి రావాల్సిన దళిత బంధు నిధులను విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. దళిత బంధు కోసం సాగే పోరాటంలో దళిత బంధు లబ్ధిదారులంతా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పోతేపాక నవీన్, దొడ్డి రమేష్, పుల్లెంల ఏడుకొండలు, కొప్పోలు విమలమ్మ, మామిడి ఎల్లయ్య, పేరపాక నరసింహ, అద్దంకి రవీందర్, బాకి నరసింహ, బొజ్జ శ్రీను, బొజ్జ సురేష్, దర్శనం రాంబాబు, అప్పల మధు, ఉదారి శ్రీకాంత్, కొండేటి నాగయ్య, బాలస్వామి, చింతకింది సైదులు, పోలే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రాజ్ తరుణ్-లావణ్య కేసులో ముఖ్యంగా వినపడిన పేరు మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్...

HYD : డ్రగ్స్‌ పెడ్లర్‌ మస్తాన్‌ సాయి అరెస్ట్‌. వరలక్ష్మి టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్‌ సాయి. గుంటూరు జిల్లాలో మస్తాన్‌ సాయి అరెస్ట్‌ చేసిన ఏపీ పోలీసులు. లావణ్య, రాజ్‌తరుణ్‌ కేసులోనూ వినిపించిన మస్తాన్‌ సాయి పేరు. మస్తాన్‌ సాయి ఫోన్‌లో అమ్మాయిల వీడియోలు గుర్తింపు. పలువురు అమ్మాయిలను బ్లాక్‌మెయిల్‌ చేసిన మస్తాన్‌ సాయి.

నల్లగొండ: నల్లగొండ బిజెపి చేనేత సెల్ కో కన్వీనర్ కటకం శ్రీధర్ ఆధ్వర్యంలో చండూరులో ఘనంగా చేనేత దినోత్సవం..

నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా చేనేత సెల్ కో కన్వీనర్ కటకం శ్రీధర్ గారి ఆధ్వర్యంలో

చండూరు పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేనేత కళాకారులు మహిళలు పెద్ద పెద్ద ఎత్తున హాజరు అయ్యారు స్థానిక మార్ కొండయ్య దేవస్థానంలో జరిగిన ఈ కార్యక్రమం లో మహిళా చేనేత కళాకారునిలను శాలువాతో సత్కరించి వారికి మూమెంట్ అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి చేనేత సెల్ రాష్ట్ర కోకన్వీనర్ మిర్యాల వెంకటేశం గారు ముఖ్యఅతిథిగా విచ్చేయడం జరిగింది అలాగే ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం. గారు ఓబిసి మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ తిరందాసు కనకయ్య గారు. గుర్రం బిక్షమయ్య గారు. ఏలె స్చంద్రశేఖర్ గారు.

తిరందాస్ శ్రీను.కౌన్సిలర్ చిలుకూరి రాధిక శ్రీనివాస్ గారు. 

గంజి శ్రీనివాస్. చెరుపల్లి కృష్ణ గారు. తదితరులు పాల్గొనడం జరిగింది.

చట్టాలపై పౌర సమాజం అవగాహన కలిగి ఉండాలి:సురుపంగ శివలింగం

 "చట్టాలపై పౌర సమాజం అవగాహన కలిగి ఉండాలి"

-- సురుపంగ శివలింగం

 

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం మరియు ఎస్సీ, ఎస్టీ ల ప్రత్యేక ప్రగతి నిధి చట్టం పట్ల పౌర సమాజం పూర్తి అవగాహన కలిగిఉండాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివలింగం అన్నారు.

ఈరోజు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సిటిజన్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎన్నిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత గిరిజనుల రక్షణ చట్టాలు మరియు సంక్షేమ, అభివృద్ధి చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిరంతరం జరగవలసిన అవసరం ఉన్నదన్నారు.

దేశవ్యాప్తంగా ప్రజలను సంఘటిత పరిచి చైతన్యం చేయవలసిన భాద్యత పౌర సమాజంపై ఉన్నదన్నారు.

ఇందుకోసం కృషి చేస్తున్న దళిత సంఘాలకు అభినందనలు తెలిపారు.

జిల్లాలో సిటీజన్స్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆవిర్భావం జరగడం నూతన కమిటీ ఎన్నుకోవడం మంచి పరిణామమని ఈకమిటీలు గ్రామ గ్రామాన ఏర్పాటు చేయాలని అంతేకాకుండా కమిటీల బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.

 దళిత గిరిజన విశ్రాంత ఉద్యోగులు, అద్వకేట్ లు, జర్నలిస్టులు, దళిత గిరిజన నాయకులు పాల్గొన్నారు.

అనంతరం నూతన అడ్ హాక్ కమిటీని ఎన్నుకున్నారు.

గౌరవ సలహదారులుగా మేడి లక్ష్మయ్య, కట్టెల శివకుమార్, కె. మధు, డి. నాగయ్య, కె. విజయలక్ష్మి, మోహన్,  కె. యాదయ్య, మౌనిక,  తదితరులను ఎన్నుకున్నారు.

నకిరేకల్: అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మిరియాల వెంకటేశం

నకిరేకల్: అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి... బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మిరియాల వెంకటేశం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలని ఆపార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం అన్నారు. నకిరేకల్ పట్టణ అధ్యక్షుడు పల్స శ్రీను అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉంటూ అధికార పార్టీ వైఫల్యాలను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుడుకుంట్ల సాయన్న వనం వేణు, పందాల సైదులు, కారింగు నాగరాజు, చంద్రగిరి శ్రీను, తండు నాగరాజు, యన్నం వెంకటేశం, కానుకుర్తి నరేష్ పాల్గొన్నారు.

స్థిరాస్తి అమ్మకందారులకు నిర్మలమ్మ బిగ్‌ షాక్‌...

స్థిరాస్తి అమ్మకందారులకు నిర్మలమ్మ బిగ్‌ షాక్‌

ఇకపై నో ఇండెక్సేషన్‌ తీసుకొస్తున్న కేంద్రం

15 ఏళ్లు దాటిన ప్రాపర్టీలు అమ్మితే..

ఇకపై 12.5 శాతం పన్ను కట్టాల్సిందేనంటున్న కేంద్రం

ఇండెక్సేషన్‌ మినహాయింపు తీసేసిన కేంద్రం

ఇల్లు అమ్మితే లాభాల్లో 12.5% ట్యాక్స్ కట్టాల్సిందే

లాంగ్‌టర్మ్‌ కేపిటల్‌ గెయిన్స్‌పై 12.5 శాతం పన్ను

కేంద్రంనిర్ణయంతో నష్టాల్లో రియాల్టీ కంపెనీల షేర్లు

భద్రాచలం: చర్ల:పోడు సాగు భూములకు పట్టాలి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల రేంజర్ ఉపేందర్కు వినతిపత్రం..

పోడు సాగు భూములకు పట్టాలి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల రేంజర్ ఉపేందర్కు వినతిపత్రం

పోడు సాగు భూములకు పట్టాలి ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల ఫారెస్ట్ రేంజర్ ఉపేందర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పోడు కొట్టుకొని సాగు చేసుకుంటున్న భూములకి పట్టాలి ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం కలిసి భూములు దున్నుకొని ఇవ్వకుండా పంటలు వేసుకునియ్యకుండా వేసిన పంటలను నాశనం చేస్తూ కాలం పబ్బం గడిపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో పీసా 1/70 యాక్టివ్ అటవీ హక్కుల చట్టం ప్రకారం ఏజెన్సీలో ఆదివాసీలకు హక్కులుఅని చెప్పి ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములకి పట్టాలి ఇవ్వకుండా ఆపుతున్నారని వారన్నారు బడా పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకి అటవీ హక్కుల నిబంధనలు ఉల్లంఘిస్తూ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ అధికారులు వాళ్లకెట్ల పర్మిషన్లు ఇస్తున్నారో పరిశ్రమలకు బిల్డింగ్ లకి నిర్మాణాలకు ఎలా పరిమిషన్లు ఇస్తున్నారో చర్ల మండల ప్రజలకు చెప్పాలని వారన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడు, గూడు గుడ్డ లేకుండా అర్ధాకలితో అలమటిస్తున్న ఆదివాసులకు ఎకరం భూమి కొట్టుకొని సాగు చేసుకుంటే వీళ్లకు చట్టాలు నిబంధనలు గుర్తుకు రావడం లేదా అని ఆయన అన్నారు తక్షణమే ఏజెన్సీ ఆదివాసులకు వారి హక్కుల ప్రకారం సాగు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వారు కోరారు?

ఈ కార్యక్రమంలో p o w మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఇర్ప సమ్మక్క మంగక్క రాజు తులసి రాసి రమేష్ బయమ్మ రాజమ్మ భవాని సెంకర్ పొడుభూముల సాగుదారులు తదితరులు పాల్గొన్నారు.