అధికారులపై ఎమ్మెల్యే కడియం ఆగ్రహం !

- 1200 మందికి పైగా రైతులకు రుణమాఫీ కాలే...

ఒకే మండలంలో 1200 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. వారంతా ఆందోళనలో ఉన్నారు. మేం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకంపై పర్యవేక్షణ సరిగా లేదు. మీ వల్ల ప్రభు త్వం బద్నాం కావాలా?’ అంటూ స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లీడ్‌బ్యాంక్‌, వ్య వసాయశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం జనగామ కలెక్టరేట్‌ లో లింగాలఘనపురం మండలం నెల్లుట్ల, నవాబ్‌పేట గ్రామాల రైతుల రుణమాఫీలో తలెత్తిన సాంకేతిక సమస్యపై కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, అదనపు కలెక్టర్లు పింకేశ్‌కుమార్‌, రోహిత్‌సింగ్‌, లీడ్‌బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో కలిసి సమీక్షించారు.

తన నియోజకవర్గ పరిధిలోని నవాబ్‌పేటకు చెందిన 800 మంది, నెల్లుట్లకు చెందిన సుమారు 400 మంది రైతులకు కెనరా బ్యాంక్‌ ద్వారా రుణమాఫీ కాలేదని, దీనికి ఎవరు బాధ్యులు అని కడియం మండిపడ్డారు.‘మీపర్యవేక్షణ లోపం వల్ల మేం బద్నాం కావాలా?’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని కలెక్టర్‌ను కోరారు.

Breaking ; కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి‼️

- సచివాలయంలో కొనసాగుతున్న సమీక్ష సమావేశం 

రాష్ట్రంలో కొత్త రేష‌న్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టింది. శ‌నివారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జ‌ర‌గ‌నుంది.

ఈ స‌మావేశానికి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మంత్రులు దామోదర రాజానరసింహా, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ప‌లువురు అధికారులు హాజ‌రు కానున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి కేబినెట్ స‌బ్ క‌మిటీ విధి విధానాలు ఖరారు చేయనుంది.

ఆగ‌స్టు 1వ తేదీన అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రి వ‌ర్గ స‌మావేశం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో కొత్త రేష‌న్ కార్డుల జారీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల రూప‌క‌ల్ప‌న‌కు కేబినెట్ స‌బ్ క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు?

APలో 10,960 గ్రామ, 4044 వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు, చేర్పులు జరిగే ఛాన్సుంది. 

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

అందులోని కార్యదర్శులను ఇతర అవసరాలకు వాడుకునేలా కసరత్తు చేస్తోంది.

 సచివాలయాల్లో ANM, VRO, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ, మహిళా సంరక్షణ కార్యదర్శి ఉండేలా యోచిస్తోంది.

 గ్రామ సచివాలయ కార్యదర్శులను పంచాయతీరాజ్ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్

సిసోడియా బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

విచారణ లేకుండానే జైల్లో ఉంచడానికి వీల్లేదు 

విచారణ వేగవంతంగా జరగాలని కోరడం పిటీషనర్ హక్కు 

ట్రయల్ కోర్టు, హైకోర్టు అంశానికి ప్రాధాన్యం ఇవ్వాల్సింది 

సిసోడియాను మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడమంటే న్యాయాన్ని అపహాస్యం చేయడమే అన్న న్యాయమూర్తులు

ఇకపై UPI ద్వారా రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేయోచ్చు

UPI లావాదేవీల పరిమితి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం.

పన్ను చెల్లించేవారు రూ.5 లక్షల వరకూ ఎలాంటి ఇబ్బందులు లేకుండానే UPI ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు అని స్పష్టం చేసిన ఆర్బీఐ.

నాగచైతన్య - శోభిత నిశ్చితార్థం... ఫోటోలు షేర్ చేసి నాగార్జున

శోభిత ధూళిపాళతో నాగ చైతన్య తన అనుబంధానికి కొత్త పేరు పెట్టాడు. ఇటీవలే నాగ చైతన్య శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకుని తన జోడీగా చేసుకున్నాడు. అవును, మరోసారి నాగ చైతన్య ఒక్కటయ్యాడు. సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య చాలా కాలంగా శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్‌ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి నిశ్చితార్థం ఇటీవల సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక సన్నిహిత కార్యక్రమంలో జరిగింది, వీటి చిత్రాలను చైతన్య తండ్రి మరియు సూపర్ స్టార్ నాగార్జున సోషల్ మీడియాలో పంచుకున్నారు.

నాగార్జున తన కొడుకు మరియు కాబోయే కోడలు యొక్క రెండు చిత్రాలను పంచుకున్నారు. మొదటి చిత్రంలో, నటుడు తన కొడుకు మరియు కాబోయే కోడలును కౌగిలించుకుంటూ పోజులిచ్చాడు. ఈ సమయంలో ముగ్గురి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. రెండవ చిత్రంలో, శోభిత నాగ చైతన్య భుజంపై తల పెట్టుకుని పోజులిచ్చింది. ఫోటోలో ఇద్దరి జోడీ అద్భుతంగా కనిపిస్తోంది. ఈ సమయంలో, ఇద్దరూ సంప్రదాయ దుస్తులలో అద్భుతంగా కనిపిస్తారు. ఫోటోలో, శోభిత పీచు మరియు పింక్ కలర్ చీరలో చాలా అందంగా ఉంది. కాబట్టి చైతన్య తెల్లటి కుర్తా పైజామాలో చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఈ జంట నిశ్చితార్థానికి సంబంధించిన అందమైన చిత్రాలను పంచుకుంటూ, నాగార్జున ఇలా వ్రాశాడు, 'ఈరోజు ఉదయం 9:42 గంటలకు జరిగిన శోభితా ధూళిపాళతో మా కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థాన్ని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము!! మా కుటుంబానికి ఆయనను స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సంతోషకరమైన జంటకు అభినందనలు. అతనికి జీవితాంతం ప్రేమ మరియు ఆనందాన్ని కోరుకుంటున్నాను. దేవుడు ఆశీర్వదిస్తాడు.'

శోభితతో నాగ చైతన్యకి ఇది రెండో పెళ్లి అని మీకు తెలియజేద్దాం. గతంలో, నటి సమంతా 2017 సంవత్సరంలో రూత్ ప్రభుతో ముడి పడింది. అయితే, వారిద్దరూ వివాహం చేసుకున్న నాలుగేళ్ల తర్వాత అంటే అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వారిద్దరూ 2 అక్టోబర్ 2021న విడాకులు తీసుకున్నారు. నాగ మరియు శోభిత ప్రేమకథ గురించి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఇద్దరూ కలిసి మొదటిసారి చూసినప్పుడు వారి డేటింగ్ పుకార్ల గురించి చర్చ మొదలైంది. ఈ సమయంలో శోభిత తన 'మేజర్' సినిమాని ప్రమోట్ చేస్తోంది. ఈ సమయంలో, అతను నాగతో మంచి స్నేహితుడిగా మారాడు మరియు వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

మంత్రి పొంగులేటి కి తృటిలో తప్పిన ప్రమాదం...

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సత్తుపల్లి వెళ్తుండగా వైరా బ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది.పోలీసులు, భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మంత్రి పొంగులేటిని మరో వాహనంలో పంపించారు.

మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారుకు పంక్చర్

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయాణించే వాహనానికి వైరాకు సమీపంలో పంక్చర్ అయింది.

హైలెవెల్ వంతెన దిగిన తర్వాత జాతీయ ప్రధాన రహదారిపై పొంగులేటి ప్రయాణిస్తున్న వాహనం వెనుక భాగంలోని ఎడమ టైరు పంక్చర్ కాగా అప్రమత్తమై కారును వెంటనే నిలిపివేశాడు.

దీంతో పొంగులేటి కాన్వాయ్ రహదారిపై కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం వేరే వాహనంలో పొంగులేటి వెళ్లిపోయారు.

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతూ కోల్‌కతాలో గురువారం తుదిశ్వాస విడిచారు. 2000 నుంచి 2011 వరకు వరుసగా 11 సంవత్సరాలు పశ్చిమబెంగాల్ సీఎంగా ఆయన సేవలందించారు.

రాజ్యసభలో 12 సీట్లకు ఉపఎన్నిక.. షెడ్యూల్ విడుదల

దిల్లీ: రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యింది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది..

అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉండనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పలువురు లోక్‌సభ ఎంపీలుగా ఎన్నికవడం, రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి..

కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్‌, సర్బానంద సోనోవాల్‌, జ్యోతిరాదిత్య సింధియా...తదితర రాజ్యసభ సభ్యులు ఇటీవల ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. నామినేషన్లకు ఆగస్టు 21 చివరి తేదీ అని ఎన్నికల సంఘం వెల్లడించింది..

BiG Breaking: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్ట్ కీలక ఆదేశం

ఢిల్లీ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రారంభించాలని సీబీఐకి కోర్టుకు సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది..

వీలైనంత త్వరగా విచారణ పూర్తి కావాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం గుర్తుచేసింది.

ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణ రాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను నవంబర్‌ నెలకు సుప్రీంకోర్ట్ వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై రెండుసార్లు ధర్మాసనం విచారణ జరిపింది. ఉదయం, మధ్యాహ్నం భోజనం విరామ అనంతరం విచారణ జరిపింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు షాకింగ్‌గా అనిపిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో చెప్పిన అంశాలు ఆశ్చర్యకరమని అన్నారు. కేసులు ట్రయల్‌ ప్రారంభం కాకుండా... ఇన్ని కేసులు ఎలా ఫైల్‌ చేశారని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రశ్నించారు.

ఆరుగురు జడ్జిలు మారిపోయారు, రిటైర్‌ అయ్యారని రఘురామ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పు అని, ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కోర్టుల ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రయల్‌కి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.

డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తున్నారని, సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందని రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్‌ చేస్తున్నామని, ఎలాంటి అడ్డంకి తమకు రావడం లేదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వ్యాఖ్యానించారు.