ఉద్యాన పంటలు సాగు చేసిన రైతుల వివరాలను ఈ - పంట ద్వారా నమోదు.. ఉద్యానాధికారి శైలజ..
ఈ పంట నమోదు: ఈరోజు బుక్కరాయసముద్రం మండలం , పసలూరు కొత్తపల్లి, రేకులకుంట గ్రామంలో ఖరీఫ్ 2024 సంవత్సరం ఈ పంట నమోదు లో భాగంగా ఉద్యాన పంటలు సాగు చేసిన రైతుల వివరాలను ఈ పంట ద్వారా నమోదు చేయడమైనది. మండల వ్యాప్తంగా ఈ పంట ద్వారా నమోదు చేయించుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్పుట్స్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, అకాల వర్షాలు మరియు ఈదురు గాలుల వలన పంట నష్ట పరిహారాలు ,పంట మీద బ్యాంకు రుణాలు అందుతాయని తెలపడం అయినది .పంట నమోదుకు రైతు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం ,ఆధార్ కార్డు, రైతు ఫోన్ నెంబర్తో ఆయా గ్రామాల రైతు సేవ కేంద్రాల్లో వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి పంట నమోదు చేసుకోవాలని తెలపడం అయినది .దీర్ఘకాలిక ఉద్యాన పంటలను గత ఏడాది పంట నమోదైన పంటలను ఆటోమేటిక్గా ఫార్వర్డ్ చేయాలని రైతు సేవా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడమైనది. ఎంఐడిహెచ్ 2024 ఆర్థిక సంవత్సరం లో భాగంగా కొత్తగా నాటిన చి నీ ,మామిడి, జామ, బంతిపూల తోటలను సందర్శించడమైనది.ఈ కార్యక్రమంలో ఉద్యానాధికారి శైలజ, ఉద్యాన మరియు వ్యవసాయ సిబ్బంది అనూష నదియా, జోష్ణ ,ముని కుమార్ పాల్గోడమైనది.
Aug 10 2024, 08:03