బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన.. ఎంపీపీ దాసరి సునీత..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుక్కరాయసముద్రంలో ఆశ కార్యకర్తల సమావేశం డాక్టర్ స్వాతి లక్ష్మి మరియు డాక్టర్ తెహర్నిశ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆకస్మికంగా మండల ప్రజా పరిషత్ చైర్మన్ దాసరి సునీత గారు సందర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వమని స్నేహపూర్వకంగా పనిచేసుకుంటూ మంచి వాతావరణంలో ఉద్యోగులు ముందుకు వెళ్లాలని తెలియజేశారు. సమస్యలు ఉంటే మాకు తెలియజేస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. సిబ్బంది అంతా వారి వారి విధులను నిర్వహించి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. వైద్యాధికారి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు 4 నెలల గర్భవతి నుండి కాన్ పైన సంవత్సరం వరకు కిల్ కర్రి ఫోన్ కాల్స్ పైన వారికి అవగాహన కల్పించాలని తెలియజేశారు .అలాగే ఈ నెలలో నిర్వహించే జాతీయ నులి పురుగుల దినోత్సవం అందరూ దిగ్విజయంగా పూర్తి చేయాలని దానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటినుంచే అన్ని ప్రభుత్వ ప్రైవేటు అంగన్వాడి పాఠశాలల యందు ప్రధానోపాధ్యాయులకు తెలియజేసి , చేతుల పరిశుభ్రత పైన అవగాహన కల్పించాలని తెలియజేశారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆశ కార్యకర్తలు మరియు సిబ్బంది శ్రమదానం చేసి ఆసుపత్రి ఆవరణంలో ఉన్న మొక్కలను తొలగించడం జరిగింది. ఆసుపత్రిలో కాన్పులు అయ్యే విధంగా ఆశ కార్యకర్తలు గర్భవతులుకు అవగాహన కల్పించాలని తెలియజేయడమైనది. ఈ ఆశ యాప్ ను ప్రతిరోజు అప్డేట్ చేసుకొని పెండింగ్ వర్క్ ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని తెలియజేశారు. అలాగే పొగాకు రహిత సమాజాన్ని నిర్మించడం కోసం పొగాకు ఉత్పత్తులను ప్రజలు వాడకుండా అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి మోహన్ రావు, పీహెచ్ఎం చెన్నమ్మ రామలక్ష్మమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ ఫాతిమా, సూపర్వైజర్ ఈశ్వరమ్మ, జానీ రాజ్, సీనియర్ అసిస్టెంట్ సునీత, హెల్త్ అసిస్టెంట్లు ధనుంజయ , ఆనంద్, శివానంద, ఫార్మసిస్ట్ మహబూబ్ బాషా, స్టాఫ్ నర్స్, అన్ని హెల్త్ వెల్నెస్ సెంటర్లలా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆఫీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది
Aug 10 2024, 07:44