సెంట్రల్ యూనివర్సిటీ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
సెంట్రల్ యూనివర్సిటీ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు. సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామం నందు నూతనంగా నిర్మించిన సెంట్రల్ యూనివర్సిటీ నందు పూర్తి అయిన భవనాల పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు విసి ఎస్ ఏ కోరి గారు బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీత గారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మరియు సిబ్బంది జంతలూరు సర్పంచ్ సుజాతమ్మ గారు టిడిపి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం పూర్తయిన అకాడమిక్ బ్లాక్ బాయ్స్ హాస్టల్ మరియు గర్ల్స్ హాస్టల్ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి యూనివర్సిటీ కావలసిన సహాయ సహకారాలను గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరిన్ని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కరువు జిల్లా మన అనంతపురం జిల్లాకు సెంట్రల్ యూనివర్సిటీ ని తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు
సింగనమల మండల నూతన పదవి బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వో కు శుభాకాంక్షలు తెలిపిన.. సింగనమల మండల టిడిపి నాయకులు
సింగనమల నూతన ఎమ్మార్వో కు టిడిపి నాయకులు శుభాకాంక్షలు.. సింగనమల నూతన తహసిల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సాకే బ్రహ్మయ్య సార్ గారికి సింగనమల మండల ఆఫీసులో నూతన ఎమ్మార్వో గారికి పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ మార్కెట్ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ మాజీ సర్పంచ్ రామాంజనేయులు మాజీ సర్పంచ్ ముంత వెంకటేష్ శంకర్ నారాయణ జడేజా దాల్ వీర బాలముని ప్రకాష్ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు
అమ్మవారిపేట గ్రామంలో తాగునీటి ఎద్దడిని గమనించి తాగునీటి పైప్ లైన్లను మరమ్మతులు చేయించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి పంచాయతీ అమ్మవారిపేట గ్రామంలో తాగునీరు పైపు పగిలిపోవడంతో వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు.
సిరికల్చర్ అధికారులు ఎంపీపీ దాసరి సునీతకు ప్రశంసలు.. బుక్కరాయసముద్రం మండలంలో సిరికల్చర్ సాగుపై అధికారులతో చర్చించిన ఎంపీపీ దాసరి సునీత..

నాడు అనంతపురం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో మీరు సిరికల్చర్ ప్రస్తావన తెచ్చినందుకే మా పై అధికారులు సిరి కల్చర్ డిపార్ట్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇప్పుడు మేము సిరికల్చర్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము కనుక మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని సిరికల్స్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. బుక్కరాయసముద్రం మండలంలో సిరికల్చర్ సాగుపై అధికారులతో చర్చించిన ఎంపీపీ దాసరి సునీత.. ఈ కార్యక్రమంలో సిరి కల్చర్ అధికారులు ఓబులేసు గారు మండల అధికారి ఓబుల రెడ్డి గారు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ మండలంలో సెరికల్చర్ సాగు చేయాలంటే రైతులకు వచ్చే సబ్సిడీ షెడ్లను వాటి సాగులో మెలకువలు ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పారు.

బండారు విశ్వభారతి అనే అమ్మాయి వివాహానికి ఆర్థిక సాయం అందించిన పసుపుల ఫుడ్స్ అధినేత పసుపుల హనుమంతు రెడ్డి..
సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దలాపురం గ్రామంలో బండారు విశ్వభారతి అనే అమ్మాయి వివాహానికి వారి తాతాగరైనా కుళ్లాయప్పకి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన పసుపుల ఫుడ్స్ అధినేత, మాజీ జిల్లా సర్పంచుల అధ్యక్షుడు పసుపుల హనుమంతు రెడ్డి
నూతన తహసీల్దార్ పుణ్యవతి కి శుభాకాంక్షలు తెలిపిన బుక్కరాయసముద్రం మండల టీడీపీ శ్రేణులు..
నూతన తహసీల్దార్ పుణ్యవతి కి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు.. బుక్కరాయసముద్రం మండలం నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన పుణ్యవతి కి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పసపల హనుమంత రెడ్డి, జిల్లా టీడీపీ బీసీ నాయకులు పొడరాళ్ల రవీంద్ర లు పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాజకీయాలు కు సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందేటట్లు చూడాలని తహసీల్దార్ పుణ్యవతి ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కన్వీనర్ బండి ఆదినారాయణ, పెద్దప్పయ్య, నాగార్జున, గంగాధర్, ఈశ్వరయ్య, శివా రెడ్డి, రవీంద్ర, తలారి ఆది, ఓబులపతి, బాబా ఫక్రుద్దీన్ వలి, తదితరులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన.. ఎంపీపీ దాసరి సునీత..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుక్కరాయసముద్రంలో ఆశ కార్యకర్తల సమావేశం డాక్టర్ స్వాతి లక్ష్మి మరియు డాక్టర్ తెహర్నిశ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆకస్మికంగా మండల ప్రజా పరిషత్ చైర్మన్ దాసరి సునీత గారు సందర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వమని స్నేహపూర్వకంగా పనిచేసుకుంటూ మంచి వాతావరణంలో ఉద్యోగులు ముందుకు వెళ్లాలని తెలియజేశారు. సమస్యలు ఉంటే మాకు తెలియజేస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. సిబ్బంది అంతా వారి వారి విధులను నిర్వహించి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. వైద్యాధికారి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు 4 నెలల గర్భవతి నుండి కాన్ పైన సంవత్సరం వరకు కిల్ కర్రి ఫోన్ కాల్స్ పైన వారికి అవగాహన కల్పించాలని తెలియజేశారు .అలాగే ఈ నెలలో నిర్వహించే జాతీయ నులి పురుగుల దినోత్సవం అందరూ దిగ్విజయంగా పూర్తి చేయాలని దానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటినుంచే అన్ని ప్రభుత్వ ప్రైవేటు అంగన్వాడి పాఠశాలల యందు ప్రధానోపాధ్యాయులకు తెలియజేసి , చేతుల పరిశుభ్రత పైన అవగాహన కల్పించాలని తెలియజేశారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆశ కార్యకర్తలు మరియు సిబ్బంది శ్రమదానం చేసి ఆసుపత్రి ఆవరణంలో ఉన్న మొక్కలను తొలగించడం జరిగింది. ఆసుపత్రిలో కాన్పులు అయ్యే విధంగా ఆశ కార్యకర్తలు గర్భవతులుకు అవగాహన కల్పించాలని తెలియజేయడమైనది. ఈ ఆశ యాప్ ను ప్రతిరోజు అప్డేట్ చేసుకొని పెండింగ్ వర్క్ ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని తెలియజేశారు. అలాగే పొగాకు రహిత సమాజాన్ని నిర్మించడం కోసం పొగాకు ఉత్పత్తులను ప్రజలు వాడకుండా అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి మోహన్ రావు, పీహెచ్ఎం చెన్నమ్మ రామలక్ష్మమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ ఫాతిమా, సూపర్వైజర్ ఈశ్వరమ్మ, జానీ రాజ్, సీనియర్ అసిస్టెంట్ సునీత, హెల్త్ అసిస్టెంట్లు ధనుంజయ , ఆనంద్, శివానంద, ఫార్మసిస్ట్ మహబూబ్ బాషా, స్టాఫ్ నర్స్, అన్ని హెల్త్ వెల్నెస్ సెంటర్లలా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆఫీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది
ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు.. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ దాసరి సునీత గారు ఐ సి డి ఎస్ పి డి శ్రీదేవి..
ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు.. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ దాసరి సునీత గారు ఐ సి డి ఎస్ పి డి శ్రీదేవి..

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయము నందు ఎంపీపీ దాసరి సునీత గారి అధ్యక్షతన ఘనంగా జరిగింది. . ఈ సమావేశానికి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి గారు సిడిపిఓ ఉమా శర్మ గారు ఈ ఓ ఆర్ డి దామోదర్ అమ్మగారు ఏవో శ్రీవాణి గారు అంగన్వాడి సూపర్వైజర్ నాగమణి హేమలత అన్నపూర్ణ గారు అంగన్వాడి టీచర్లు మరియు గర్భవతులు పాలిచ్చు తల్లులు పాల్గొనడం జరిగింది.* - ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి తల్లి కాన్పు అయిన గంటలోపు ముర్రు పాలు తన బిడ్డకు తాగించాలని, దీనివల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎటువంటి అంటూ వ్యాధులు రాకుండా తోడ్పడుతాయన్నారు. బిడ్డ అన్ని దశల్లోనూ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని, బిడ్డ మానసికంగా ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో తోడ్పడతాయని తల్లిపాలుకు మించిన శక్తి, ఆహారం ఎందులోనూ ఉండదని తెలియజేశారు. అంతేకాక పుట్టినది మొదలు ఆరు నెలలు పాటు కేవలం తల్లిపాలే తాగించాలని, ఆరు నెలల తర్వాత రెండు సంవత్సరాలు తల్లిపాలుతోపాటు అనుబంధ ఆహారం ఇవ్వాలని, దీనివల్ల బిడ్డ మరియు తల్లి యొక్క ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుందని తెలియజేశారు. సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడి ఆయాలు, ప్రతి గర్భిణీ స్త్రీ కి, ప్రసవించిన ప్రతి తల్లికి, వారి ఇంటి నందు కుటుంబసభ్యులకు తల్లి పాలు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈరోజు నుండే ఈ నెల ఏడో తేదీ దాకా ఏడు రోజులు పాటు ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. కార్యక్రమం చివర్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది. కార్యక్రమానికి హాజరైన సిబ్బంది చేత తల్లిపాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. విచ్చేసిన గర్భవతులు, పాలిచ్చు తల్లులు మొదలగు వారు పాల్గొన్నారు.
Flash.. Flash.. తిరుమల లడ్డు ప్రసాదానికి 308 ఏళ్లు..
తిరుమల లడ్డు ప్రసాదానికి 308 ఏళ్లు.. ఆంధ్ర ప్రదేశ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వాములవారి అత్యంత ప్రీతికరమైన ప్రసాదం లడ్డు ఎవరైనా తిరుమల వెళ్లి వస్తే ముందుగా అడిగేది లడ్డు ఎంతో ప్రాముఖ్యత గల లడ్డుని తిరుమలలో ప్రసాదంగా పెట్టడం ప్రారంభించిన నేటి 308 ఏళ్ళు పూర్తయింది 1715 ఆగస్టు 2న లడ్డును ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు. ఆలయం లో స్వచ్ఛమైన శెనగపిండి పట్టిక బెల్లం నెయ్యి ఎండు ద్రాక్ష యాలుకలు జీడిపప్పు పచ్చ కర్పూరంతో ప్రత్యేకంగా తయారు చేస్తారు..
కొర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ని బొమ్మలాటపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన.. జిల్లా స్థాయి వైద్య నిపుణులు..
కొర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ని బొమ్మలాటపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్ నకు జిల్లా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అధికారి అయిన డాక్టర్ . V. సుజాత గారు మరియు,డాక్టర్ .V. రవిశంకర్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డు లను పరిశీలించి మరియు తల్లి పాల వారోత్సవాల కార్యక్రమం లో పాల్గొని గర్భిణీ లకు బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ . R. వినోద్ కుమార్ గారు, C. సుధాకర్ రెడ్డి సర్పంచ్ గారు మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు వరం లాంటివి, అమృతం లాంటివి కనుక ప్రతి గర్భిణీ కాన్పు అయిన వెంటనే బిడ్డకు తల్లి పాలు పట్టించాలని చెప్పడం జరిగినది. ఆరోగ్య విద్యా బోధకురాలు S. పర్వీన్ గారు మాట్లాడుతూ ముర్రు పాల ఆవశ్యకతను, తల్లిపాలవలన తల్లికి, బిడ్డకు కలిగే లాభలను, మరియు దూరమగు జబ్బులను గురించి వివరించడం జరిగింది. అలాగే తల్లిపాల వారోత్సవాలపై ర్యాలీ, గోడ ప్రతికలను విడుదల చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సూపెర్వైసర్ B. శ్రీదేవి, ఎం. ల్. హెచ్. పి. రమ్యశ్రీ, ఎ. ఎన్. ఎం. S. ప్రియదర్శిని,V. రమేష్ బాబు,అంగన్వాడీ కార్యకర్త, ఆశాలు, గర్భవతులు, బాలింతలు, ఇతర సిబ్బంది కూడా పాల్గొనడం జరిగినది