గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి: ఉప్పుల ముత్యాలు జిల్లా కార్యవర్గ సభ్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ, కనీస వేతనం జిఓ నంబర్ 60 ప్రకారం 26000 వేలు ఇవ్వాలని *జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల ముత్యాలు మాట్లాడుతూ* గురువారం రోజున గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని ఒక్క రోజు సమ్మె పిలుపులో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలో MPDO కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది అని అన్నారు. గ్రామాలలో గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నప్పటికీ నేటికి ప్రభుత్వ ఉద్యోగులుగా గ్రామ పంచాయితీ కార్మికులను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల గా రెగ్యులర్ చేయలేదని వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.ఎన్నికల మేనిపొస్టెలో సైతం రేవంత్ రెడ్డి గారు గ్రామపంఛాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ,ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయాలని కోరారు.పది లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని , విధినిర్వహణలో చనిపోయిన కార్మికుని కుటుంబం లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి మారుపాక వెంకటేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, ఏఐవైఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎం.డి నయీమ్, సుద్దాల సాయికుమార్, భాషబోయిన మల్లేష్, గ్రామ పంచాయితీ యూనియన్ మండల అధ్యక్ష ,కార్యదర్శులు కూరెళ్ళ కిష్టయ్య , ఇంద్రపెళ్లి జ్ఞానేశ్వర్ , మండల గౌరవాధ్యక్షులు నోముల స్వామి , ఉపాధ్యక్షులు శ్రీను ,కోశాధికారి సుదగాని రమేష్ ,సహాయకార్యదర్శి కూరెళ్ళ సైదులు ,నాయకులు కవిత ,నర్సిరెడ్డి , తాల్లపల్లి నరసింహ ,చారి తదితరులు పాల్గొన్నారు..
ఉత్తమ సేవారత్న పురస్కారాన్ని అందుకున్న సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్

యాదాద్రి భువనగిరి జిల్లా: అమ్మా, నాన్న మరియు అన్నయ్య" ఆశిస్సులతో ఎస్ ఎల్ పి సంస్థ అందించే "కళాకార్ మరియు సేవా రత్న పురస్కారాన్ని" భువనగిరి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అందుకున్నారు. బుధవారం హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో ప్రజా యుద్ధనౌక ఏపూరి సోమన్న, ఎల్ వి సేవా వేదిక చైర్మన్ ఎల్. వి కుమార్, హైకోర్టు అడ్వకేట్ రాపోలు ప్రభాకర్,ఐ వి ఎఫ్ రాష్ట్ర అద్యక్షులు ఉప్పల్ శ్రీనివాస్, స్ర్తీ , శిశు సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి గార్ల చేతులమీదుగా "ఉత్తమ సామాజిక సేవా రత్న పురస్కారాన్ని" అందుకున్నారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ సేవారత్న పురస్కారం ద్వారా బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. అవార్డుల పురస్కార కార్యక్రమంలో ఎస్ ఎల్ పి ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, ఎస్ జె ఆర్ ఫౌండేషన్ చైర్మన్ లు సామ శ్రీధర్ ,పంజాల వెంకట్ గౌడ్, తెలంగాణ మహిళా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గంగపురం పద్మ, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వంగపల్లి అంజయ్య, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు మహ్మద్ షానూర్ బాబా, ఐ. వి. ఎఫ్. జిల్లా అధ్యక్షులు కుక్కటపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జంతర్ మంతర్ వద్ద బీసీల ధర్నా, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్

దేశవ్యాప్తంగా కులగణన పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ మద్దతు తెలిపిన కాంగ్రెస్ టిడిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు జన గణనలో కుల గణన చేపట్టాలని పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభల్లో బీసీలు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు .జాతీయ బిసి సంక్షేమ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీలు ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు ,మల్లురవి, నాగరాజు, అప్పలనాయుడు, లక్ష్మీనారాయణ, బాబురావు, మాజీ ఎంపీ వి హనుమంతరావు తో పాటు పలువురు వామపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాదిమంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, బీసీ సంఘాల నాయకులు ధర్నాలు పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో బిసి నాయకులు గుజ్జు సత్యం భరత్ కుమార్, ముత్యం వెంకన్న ,డాక్టర్ పద్మలత ,మల్లేశం పటేల్, లింగం ,జయంతి ,కృష్ణమాచారి, వేముల రామకృష్ణ ,మోడీ రాందేవ్, చిల్లర స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

గద్దర్ అన్న ఆశలను కొనసాగిద్దాం.... .

యాదాద్రి భువనగిరి జిల్లా:  తన జీవితాంతం పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు గద్దర్ అన్న ఆశయాలను కొనసాగించాలని దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య,పీ సీ సీ డెలిగేట్ తంగెళ్ళపల్లి రవి కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ లు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్దర్ అన్న ఉద్యమాలు భువనగిరి ప్రాంతానికి చాలా దగ్గరి సంబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్ అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు కొడారి వెంకటేష్, బర్రె సుదర్శన్, గోద వెంకటేశ్వర్లు,ఎండి జలీల్, సలావుద్దీన్, కైరంకొండ వెంకటేష్, భాస్కర్ నాయక్, శివలింగం, తాళ్ళపల్లి చంద్రశేఖర్, కొత్త బాలరాజు, శ్రీనివాస్,పల్లెర్ల వెంకటేష్ ,గుమిడెలల్లి రమేష్ , మహంకాళి సురేష్, కుంచం రాజు,తదితరులు పాల్గొన్నారు.

పల్లివాడ యుపిఎస్ లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు

తెలంగాణ సిద్దాంతకర్త, తెలంగాణ జాతిపిత కీ.శే. ప్రొఫెసర్ జయంతిని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని UPS పల్లివాడ పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. లంచ్ విరామ సమయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జయశంకర్ సార్ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాళంకరణ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ జీవితం తెలంగాణకు అంకితం చేసిన తీరును విద్యార్థులకు వివరించారు. అనంతరం స్వీట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల HM సుధారాణి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఘాసీరాం, పాల్వంచ హరికిషన్, రఘురాం రెడ్డి, కృష్ణయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
లోతుకుంట ఆదర్శ పాఠశాలలో డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల ప్రమాదంపై అవగాహన సదస్సు

డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలకు బానిసలై చిన్న వయసులోనే బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు* *విద్యార్థులు డ్రక్స్ మహమ్మారికి బానిసలు కాకుండా చదువుల్లో ముందుండాలి* *వలిగొండ స్థానిక ఎస్సై మహేందర్ లాల్* *ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత* *భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల ప్రమాదంపై వేముల నాగరాజు మండల కార్యదర్శి అధ్యక్షతన ఎస్ఎఫ్ఐ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత స్థానిక ఎస్సై మహేంద్రా లాల్ మాట్లాడుతూ నేటి విద్యార్థులు యువత గంజాయి డ్రగ్స్ మత్తు మత్తు పదార్థాలకు బానిసలై బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నత చదువులకు ఉద్యోగాలకు దూరమై కుటుంబాలకు భారంగా మారుతున్నారని డ్రగ్స్ డ్రగ్స్ గంజాయి వల్ల అనారోగ్యం పాడవ్వడమే కాకుండా కుటుంబాన్ని ఆర్థికపరంగా ఇబ్బందులు పెడతారని అన్నారు సాధారణంగా గ్రామాల్లో అనేక మంది విద్యార్థులు యువత గంజాయి డ్రగ్స్ కు బానిసలుగా మారి ఆరోగ్యాలు పాడు చేసుకునే కాకుండా చదివేషణలకు పాల్పడుతున్నారని అన్నారు మండల వ్యాప్తంగా పరిసరాల్లో గంజాయి డ్రగ్స్ కదలికలు కనిపించిన వెంటనే పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా అనవసరమైన వీడియోలు రియల్ పబ్జి లాంటి వాటికి బానిసలై ఫోన్లో మునిగిపోకుండా విద్యార్థులు చదువులో ముందుండాలన్నారు ఈ సమాజం బాగుపడాలంటే విద్యార్థులుగా చిన్న వయసు నుండే మంచి లక్షణాలతో చదువుల్లో ముందుంటూ గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు సిర్పంగి స్వామి, బొడ్డుపల్లి వెంకటేష్, కవిడే సురేష్,ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఈర్ల రాహుల్,జిల్లా కమిటీ సభ్యులు బుగ్గ ఉదయ్ నరేందర్,ఎండి ఫర్దిన్ కళాశాల నాయకులు శృతి ఫాతిమా లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలి: కల్లూరు ధర్మేంద్ర AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా:  పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. ఏ ఐ వై ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా సమితి సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్ అధ్యక్షతన భువనగిరి లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా *ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర* లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ని తాము స్వాగతిస్తున్నామని వారు అన్నారు. అయితే పోటీ పరీక్షల తేదీలు, ఫలితాలు,ఇంటర్వ్యూలు, నియామకాలు నిర్దిష్టమైన పద్ధతిలో వేగవంతంగా జరగాలని, అదే విధంగా ప్రభుత్వ శాఖలలో ఖాళీలను కూడా ప్రకటిస్తే బాగుంటుందని వారు డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని, విద్యాభ్యాసం పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు లేక తల్లిదండ్రులకు భారంగా మారారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన పాలకులు నిర్లక్ష్య ధోరణిని గత10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో చూశామని వారు గుర్తుచేశారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిలబడాలని వారు అన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్ లను ఏర్పాటు చేయాలని, స్టడీ మెటీరియల్స్ ను ఉచితం గా అందించాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి, ఎస్ సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ యువతకు బ్యాంకుల నుండి సబ్సీడీ రుణాలను ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఎల్లంకి మహేష్, పేరబోయిన మహేందర్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్, ఏ ఐ వై ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి నయీమ్, కార్యవర్గ సభ్యులు సుద్దాల సాయికుమార్, కంబాల వెంకటేష్, పేరబోయిన మహేష్, జిల్లా సమితి సభ్యులు మోగిళ్ళ శేఖర్ రెడ్డి, నరేష్, మెట్టు లక్ష్మణ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

వయనాడ్ వరద బాధితులకు అండగా ఉందాం: CPM రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ

కేరళ రాష్ట్రం వయనాడ్ ప్రాంతంలోని వరద బాధితుల అండగా ఉందామని , అన్ని విధాలుగా సహకారం అందించి ఆదుకుందామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. వరద బాధితుల సహాయార్థం సిపిఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భువనగిరి పట్టణంలోని మండలానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విరాళాలు సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యంతో కొండ చర్యలు విరిగిపడి వాగులు వంకలతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేలాదిమంది గాయాలపాలై క్షతగాత్రులుగా సర్వం కోల్పోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారందరినీ మానవత దృక్పథంతో ఆదుకోవడానికి ప్రజలు రాజకీయాలకతీతంగా ముందుకు వచ్చి అన్ని విధాల సహకారం అందించాలని కోరినారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేకమంది మేధావులు సినీ కళాకారులు అభ్యుదయవాదులు తమ వంతు సహకారం అందిస్తున్నారని వారందరికీ సిపిఎం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈరోజు వివిధ ప్రభుత్వ ఆఫీసులలో సహాకారం అందించిన ఉద్యోగస్తులకు అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ , పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపళ్లి ముత్యాలు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య , చీమలకొండూరు శాఖ కార్యదర్శి బోడ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

గోపరాజుపల్లి అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సలిగంజి మణెమ్మ మాట్లాడుతూ... నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేయస్కరం అని అన్నారు. అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలు, చిన్నారులు, తల్లులకు అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన గంటలోపే పాలు ఇవ్వాలని అమ్మ పాలు అమృతం లాంటివని అన్నారు నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు దోహదపడతాయని అన్నారు . అపోహలు వీడి తప్పకుండా తల్లిపాలు తాగించాలని, బిడ్డకు రోగునిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఆర్ సంజయ్ ,గ్రామపంచాయతీ సెక్రటరీ పి నవనీత, గర్భిణీ స్త్రీలు ,ఆయా దేవేంద్ర ,తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ముప్పిడి రవి జన్మదిన వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకుని జన్మదిన వేడుకలు - ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కేక్ కటింగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్కట్ పల్లి మండలం పరిధిలోని ఔరవాణి గ్రామానికి చెందిన డాక్టర్ ముప్పిడి రవి జన్మదిన వేడుకలు సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నడిగోటి శేఖర్, సింగం నర్సింహా, ముక్కముల నాగరాజు, బొంతల రమేష్, నడిగోటి టిల్లు, నడిగోటి రాజు, పురం సతీష్ యువజన సంఘం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.