గోపరాజుపల్లి అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సలిగంజి మణెమ్మ మాట్లాడుతూ... నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేయస్కరం అని అన్నారు. అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలు, చిన్నారులు, తల్లులకు అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన గంటలోపే పాలు ఇవ్వాలని అమ్మ పాలు అమృతం లాంటివని అన్నారు నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు దోహదపడతాయని అన్నారు . అపోహలు వీడి తప్పకుండా తల్లిపాలు తాగించాలని, బిడ్డకు రోగునిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఆర్ సంజయ్ ,గ్రామపంచాయతీ సెక్రటరీ పి నవనీత, గర్భిణీ స్త్రీలు ,ఆయా దేవేంద్ర ,తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ముప్పిడి రవి జన్మదిన వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకుని జన్మదిన వేడుకలు - ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కేక్ కటింగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్కట్ పల్లి మండలం పరిధిలోని ఔరవాణి గ్రామానికి చెందిన డాక్టర్ ముప్పిడి రవి జన్మదిన వేడుకలు సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నడిగోటి శేఖర్, సింగం నర్సింహా, ముక్కముల నాగరాజు, బొంతల రమేష్, నడిగోటి టిల్లు, నడిగోటి రాజు, పురం సతీష్ యువజన సంఘం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇండ్లు ఇచ్చేంతవరకు భూ పోరాటాలు ఆపము: సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాలఅశోక్ డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా  కలెక్టర్ కార్యాలయం ముందు ఇంటి నివేషణ స్థలాలు ఇవ్వాలని సోమవారం  పికెటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వందలాదిమంది లబ్ధిదారులతో పికెటింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ బంగ్లా గేటు ముందు ఎండలో కూర్చుని ఆందోళన చేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఏవో జగన్ గారిని ఆందోళన వద్దకు పంపించి వినతిపత్రాన్ని స్వీకరించడం జరిగింది అన్ని విషయాలు విన్న తర్వాత కలెక్టర్ గారికి చెప్పి సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అర్హుల జాబితా 2000 మండల పరిధిలోగల హనుమాపురం సర్వేనెంబర్ 28 లో 76 ఎకరాలు బొమ్మాయిపల్లి బస్వాపురం లో ఇంటి నివేషణ స్థలాలు కేటాయించినప్పటికిని స్థలాలు చూపించలేదని వెంటనే లేఅవుట్ చేసి ఎవరి స్థలాలు వారికి చూపించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ భూములలో ఇంటి నివేషణ స్థలాలు ఇండ్లు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో నిర్ణయించి హామీ ఇచ్చారని గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా భూములు పంచలేదని అన్నారు ప్రజలు అనేక విధాలుగా ఆందోళన నిర్వహిస్తున్నప్పటికిని నివేశన స్థలాలు పట్టాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని అన్నారు ఈ ఆందోళన కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమన సబిత బండి జంగమ్మ ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ సిపిఐ భువనగిరి పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ సిపిఐ నాయకులు చింతల పెంటయ్య నాగపురి యాదగిరి అబ్బులు బద్దం వెంకటరెడ్డి వడి శ్రీను చిక్క నరసయ్య షర్ఫుద్దీన్ తో పాటు వందలాది మంది లబ్ధిదారులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి,AIYF ఆధ్వర్యంలో వరదబాధితుల నిధి సేకరణ

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో ఇటీవల సంభవించిన వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో వందలాది ప్రజలు మృత్యువాత పడ్డారు, వేలాదిమంది నిరాశ్రయులు అయిన బాధితులకు అండగా నిలవాలని AIYF తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో భువనగిరి లో వరద బాధితుల నిధి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా *ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర,సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు* లు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రానికి చేయూతగా 5వేల కోట్లను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ ఆకస్మిక విపత్తులు సంభవించినా ప్రజలంతా ఐక్యమత్యంతో సహాయసహకారాలు అందిచాల్సిన బాధ్యత పౌరులపై ఉంటుందని వారు ఉద్ఘటించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలను వేగవంతం చేసుకోవడానికి పటిష్ట అధికార యంత్రాంగాన్ని తయారుచేయాలని వారు అన్నారు. అదేవిధంగా విపత్తులను ముందుగానే పసిగట్టడానికి మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఎల్లంకి మహేష్, పేరబోయిన మహేందర్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్, ఏ ఐ వై ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి నయీమ్, కార్యవర్గ సభ్యులు సుద్దాల సాయికుమార్, కంబాల వెంకటేష్, పేరబోయిన మహేష్, జిల్లా సమితి సభ్యులు మోగిళ్ళ శేఖర్ రెడ్డి, నరేష్, మెట్టు లక్ష్మణ్, ఎల్లంకి చంద్రశేఖర్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ లెక్చరర్స్ ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా ఎండి యాకుబ్ బాబా నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి కృప డిగ్రీ మరియు పేజీ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు కత్తి వెంకటస్వామి హాజరై మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా మహమ్మద్ యాకూబ్ బాబా కు రాష్ట్ర అధ్యక్షులు కత్తి వెంకటస్వామి నియామక పత్రాన్ని అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన యాకూబ్ బాబ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ లెక్చరర్స్ పోరం బలోపేతం చేస్తానని, జిల్లా లొ లెక్చరర్స్ సమస్యలను రాష్ట్ర కమిటీ తెలిపి , పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లాలోని లెక్చరర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ లెక్చరర్ ఫోరం అసోసియేట్ ప్రెసిడెంట్ కొడిమాల కృష్ణ, తెలంగాణ లెక్చరర్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కర్తాల శ్రీనివాస్, శ్రీ సాయి కృప డిగ్రీ మరియు పీజీ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రైవేట్ కళాశాలల మేనేజ్మెంట్ జాయింట్ సెక్రెటరీ సింగబోయిన మల్లేశం వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె శ్రవణ్ రెడ్డి కృషి ఐటిఐ ప్రిన్సిపాల్ నామోజు రమేష్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన భోజనం అందించాలని AISF వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని పరిపాలన అధికారి జగన్ గారికి సోమవారం  ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది ఈరోజు ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన కళాశాల వసతి గృహంలో పురుగులు ఉన్న అన్నం విద్యార్థులకు పెట్టారని తెలుసుకొని అక్కడికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన వసతి మరియు భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు గతంలో అనేకసార్లు కలెక్టర్ గారికి బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేసిన పర్యవేక్షణ లోపంతో హాస్టల్ వార్డెన్లు అందుబాటులో లేకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య నాయకురాలు సబిత ఏఐఎస్ఎఫ్ నాయకులు చింతపల్లి అరుణ్, ప్రవీణ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నెరవేరిన 30 ఏళ్ల కల, ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయం: నారపాక నరేందర్ నిదానపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో న్యాయం, ధర్మం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి విజయం సాధించడం హర్షించదగ్గ విషయమని నిదానపల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నారపాక నరేందర్ అన్నారు.ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ, ఏ బి సి డి వర్గీకరణపై ఎనలేని పోరాటం చేసి జాతి కొరకు తన జీవితాన్ని పణంగా,పెట్టి హక్కు సాధించుకున్న ఘన చరిత్ర మందకృష్ణ మాదిగదని ఆయన పోరాటం ఢిల్లీ వరకు వెళ్లి ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటానని ఎన్ని రోజులైనా నా పోరాటం విరమించేది లేదని పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాట పటిమను చూపించి సాధించుకున్న ఘనుడు మందకృష్ణ మాదిగని, ఈ యొక్క తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ అమలు చేస్తామని హామీ ఇవ్వడం ఎంతో గర్వించదగ్గ విషయమని,పారదర్శకంగా అమలు చేయాలని ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
వక్ఫ్ బోర్డ్ పై కుట్ర పడుతున్న మోడీ ప్రభుత్వం: మహమ్మద్ అతహర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు

కేంద్రం లోని మోడీ ప్రభుత్వం ఒక వర్గం పై కక్ష పూరితంగా వ్యవహారిస్తూ వారికి చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తుల పై కన్నేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అతహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు చట్టాలలో 40 సవరణలు చేయాలని కేంద్ర కాబినెట్ సమావేశం అయ్యి అంగీకరించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వారం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టె అవకాశం ఉందని ఇండియా కూటమి తో పాటు ఎన్డిఏ కూటమి లో ఉన్న బీజేపేతర ప్రాంతీయ పార్టీ లు కూడా వ్యతిరేకించాలని కోరారు.ఇలా మోడీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వారి మత స్వేచ్ఛ హక్కును ఉల్లంగిస్తున్నారని మండిపడ్డారు.
ZPHS టేకుల సోమవారం 1989-90 ,SSC బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం. పాఠశాలకు 60 వేలు ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ టేకుల సోమారం 1989-90 ఎస్ఎస్సి బ్యాచ్ వారు 34 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది .ఈ కార్యక్రమానికి అందరూ టీచర్లు మరియు విద్యార్థిని విద్యార్థులు హాజరు కావడం జరిగింది. పనుమటి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే స్కూల్ విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ నిర్మాణం గురించి 60,000 రూపాయలను పూర్వ విద్యార్థులు డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు MMS ఫంక్షన్ హాల్ టేకుల సోమారంలో చాలా ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పనుమటి నరేందర్ రెడ్డి MD జహంగీర్ రాయగిరి రవీందర్ గజ్జి గంగారాo యాదవ్ సోలిపురం సురేఖ పద్మ లు పాల్గొని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
అరూరు: తుమ్మల నర్సయ్య సేవాసమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామానికి చెందిన బండారు భూపాల్ రెడ్డి ఆకస్మికంగా మరణించినందున వారి కుటుంబ సభ్యులకు కీర్తిశేషులు తుమ్మల నరసయ్య సేవాసమి తి ఆధ్వర్యంలో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది .పిల్లల పైచదువులకు కూడా సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల శ్రీనివాస్ ,సంతోష్, అధ్యక్షులు కసర బోయిన లింగయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి పిట్టల సుధాకర్, ఓబీసీ మండల అధ్యక్షుడు కనకా చారి ,ఆరూరు మాజీ సర్పంచ్ లు జినుకల దానయ్య , పోలేపాక చెమ్మయ్య, ఆవుల స్వామి, బండారు చిన్న నరసింహారెడ్డి ,మహిపాల్ రెడ్డి, మత్స్య  సహకార సంఘం మండల అధ్యక్షుడు బండి  రవికుమార్, ఆవుల అంజయ్య, కసుర బోయిన నరసింహ ,ఎలిమినేటి సంతోష్ కుమార్, కోయిగూర మధు ,మీసాల మత్స్యగిరి ,గడ్డల నరసింహ ,ఆనందు ,ఎలిమినేటి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.