తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవు: కేటీఆర్

దిల్లీ: తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తామని హెచ్చరించారు..

దిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావు.. న్యాయకోవిదులతో చర్చలు జరిపారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై దిల్లీలో భారాస న్యాయపోరాటం చేస్తుందన్నారు.

రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్‌ ప్రతినిధుల బృందం సమావేశమవుతుందని, భారాస తరఫున త్వరలోనే సుప్రీం కోర్టులో కేసు వేస్తామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు.

దళిత మహిళపై ఇంత దాష్టీకమా?

షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడిని కేటీఆర్‌ ఖండించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళిత మహిళపై ఇంత దాష్టీకమా? అని మండిపడ్డారు. 'ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?' అని ప్రశ్నించారు.

రక్షించాల్సిన పోలీసుల దగ్గరే రక్షణలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. దాడికి పాల్పడిన పోలీసులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

ప్రతీ మూడు నెలలకు కలెక్టర్ల సదస్సు

ప్రతీ మూడు నెలలకు కలెక్టర్ల సదస్సు ఉంటుంది

- రోజుల తరబడి, గంటల తరబడి సమావేశాలు ఉండవు – ఎంతపెద్ద సమావేశమైనా గంటన్నరలోపు ముగిస్తా

– నాతో సహా పనితీరును అంచనా వేసుకుంటూ ముందుకెళ్తా – పనిచేసే వారిని ఎన్నేళ్లయినా ఒకే పదవిలో ఉంచుతా

– పనిచేయకపోతే మాత్రం ఉపేక్షించేది లేదు – ప్రతీ నెల ఒకటో తేదీ ‘పేదల సేవలో’ కార్యక్రమం

– పేదల సమస్యల పరిష్కారం దిశగా పాలన ఉండాలి – పేదరిక నిర్మూలన లక్ష్యంగా పాలన ఉండాలి

- నా పర్యటనల్లో అధికారులు అత్యుత్సాహం వద్దు – చెట్లు కొట్టేయడం, రెడ్ కార్పెట్లు వేయడం, స్కూల్స్ కు సెలవివ్వడం, రోడ్లపై జనాన్ని నిలిపివేయడం చేయొద్దు: సీఎం చంద్రబాబు

MLC Kavitha:కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా.. మళ్లీ టెన్షన్..

న్యూఢిల్లీ /హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( BRS MLC Kavitha) ఇప్పట్లో తీహార్ జైలు నుంచి బయటికి వచ్చే మార్గాలు ఏ మాత్రం కనిపించట్లేదు..

కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరిన కవిత తరపు న్యాయవాది

ఆగస్టు-07 కు తదుపరి విచారణను వాయిదా వేసిన జడ్జ్ కావేరి భవేజా

ఎల్లుండి ఏం జరుగుతుందో అని బీఆర్ఎస్‌లో పెరిగిపోయిన టెన్షన్

District Collectors Conference: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కలెక్టర్ల సమావేశం ఇదే..

ఈ భేటీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ హాజరయ్యారు.. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడానికి సిద్ధమైంది సర్కార్‌.. ప్రభుత్వ ప్రాధాన్యతలను కలెక్టర్లకు వివరించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేయనున్నారు..

ప్రజలకు సేవలందించే విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దని స్పష్టం చేయనున్నారు.. ఫేక్ వార్తలు, తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడే తిప్పి కొట్టాలని కలెక్టర్లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందంటున్నారు.. తాను జిల్లాల పర్యటనలకు వచ్చేటప్పుడు అవసరానికి మించి జాగ్రత్తలు తీసుకోవద్దని.. ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని మరోసారి స్పష్టం చేయబోతున్నారు సీఎం..

అయితే, ఈ కలెక్టర్ల సమావేశానికి ఓ ప్రత్యేకత ఉంది.. విభజన జరిగిన పదేళ్ల కాలంలో తొలిసారి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది.. 2014-19 మధ్య కాలం తొలి రోజుల్లో హోటళ్లల్లో, ఆ తర్వాత ప్రజా వేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించేవారు..

ఇక, గత ప్రభుత్వంలో కేవలం ఒక్కసారి మాత్రమే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు అప్పటి సీఎం.. గత ప్రభుత్వంలో తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను ప్రజా వేదికలో నిర్వహించిన నాటి సీఎం జగన్. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ప్రజా వేదికను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు..

మరోవైపు.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణకు సచివాలయంలో సరైన వేదిక లేకున్నా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.. ఫంక్షన్ హాళ్లు.. హోటళ్లల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి అంగీకరించని సీఎం చంద్రబాబు.. అనవసరపు ఖర్చు వద్దని స్పష్టం చేశారు.. సచివాలయంలోనే సర్దుకుని కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిద్దామని సీఎం చెప్పడంతో.. సచివాలయంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

Andhra Pradesh: ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో బిజీబిజీ

ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో బిజీబిజీగా గడపనున్నారు

ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 వరకు శాఖల వారీగా అధికారులతో సమావేశం కానున్నారు..

ఉదయం పది గంటలకు కలెక్టర్లతో భేటీ కానున్నారు. కలెక్టర్ల సదస్సులో ప్రారంభోత్సవం చేయనున్నారు సీసీఎల్‌ఏ జయలక్ష్మి, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్.

కలెక్టర్లను ఉద్దేశించి సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడనున్నారు. ఆతర్వాత ప్రాధాన్యతను బట్టి ముందుగా వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలు, ఆక్వా, అటవీశాఖలపై సమీక్ష జరపనున్నారు.

అనంతరం గనులు, నీటి వనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించనున్నారు.

ఆ తర్వాత గనులు, నీటి వనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు మౌలిక సదుపాయల కల్పనపై సమీక్ష జరపనున్నారు. లంచ్ తర్వాత పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ శాఖలు, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య, పురపాలక శాఖలపై చర్చించనున్నారు.

చివరిగా రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు, శాంతి భద్రతలపై సమీక్ష చేయనున్న సీఎం. సాయంత్రం ఎస్పీలతో శాంతి భద్రతలపై చర్చించనున్నారు. సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, HODలు మినహా ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు.

సీఎం, డిప్యూటీ సీఎం పేషీ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ , హోం శాఖల మంత్రులు, డీజీపీ, సీఎస్ సిబ్బంది మినహా మరెవరూ కలెక్టర్ల సదస్సు సమావేశ హాలుకు అనుమతి లేదని చెప్పారు.

కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత ప్రజెంటేషన్లను వారే తెచ్చుకోవాలని సూచించారు. నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పెట్టుకోవాలని సూచనలు చేశారు.

శ్రీశైలం: జలాశయానికి తగ్గుతున్న వరద నీరు..

జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.. 

ఇన్ ఫ్లో 3,46,410 క్యూసెక్కులు.. 

ఔట్ ఫ్లో 3,74,676 క్యూసెక్కులు.. 

పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.. 

ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులు.. 

కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

30 ఏళ్లుగా MRPS పోరాటం !

MRPS)‏కు ధర్నాచౌక్‌ అడ్డాగా మారింది. 30 ఏళ్ల పాటు జరిగిన వర్గీకరణ పోరాటంలో ఎన్నో ఆందోళనలు ఇక్కడే జరిగాయి. రిజర్వేషన్ల వర్గీకరణకు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి 1994 జూలై 7న ఉద్యమాన్ని ప్రారంభించింది.

నాటి నుంచీ ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) సారథ్యంలో ధర్నాచౌక్‌ వేదికగా అనేక ఉద్యమాలు కొనసాగాయి.

ఇందిరాపార్కు వద్ద గల ధర్నాచౌక్‌(Dharnachowk)లో అనేక నిరాహారదీక్షలు, చలో హైదరాబాద్‌, చలో సచివాలయ ముట్డడి వంటి కార్యక్రమాలు జరిగాయి.

వర్గీకరణ కోసం ధర్నాచౌక్‌లో ఉదయం 11 గంటలకు మహాధర్నా ప్రారంభమై రాత్రి ఏడు గంటల వరకూ ఆందోళనలు కొనసాగిన సందర్భాలు ఉన్నాయి.

ఓసారి నిరాహార దీక్ష మొదలుపెట్టిన మందకృష్ణ(Mandakrishna) దానిని అమరణ దీక్షగా మార్చడంతో రెండు మూడు రోజుల పాటు ఆందోళనలు కొనసాగాయి.

ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రాత్రికి రాత్రే పోలీసులు ఆస్పత్రికి తరలించి అక్కడ ఉన్న ఆందోళనకారులను అరెస్టు చేశారు.

పోరాటం ఫలించడంతో గతంలో ఆందోళనల్లో పాల్గొన్న ఎంఆర్‌పీఎస్‌ నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ ఇందిరాపార్కు వద్ద గురువారం సంబరాలు జరుపుకున్నారు.

Kargil Vijay Diwas: నేడు కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం .. ప్రధాని మోదీ ద్రాస్ లో పర్యటన..

నేడు కార్గిల్ విజయ్ దివస్(Kargil Vijay Diwas) 25వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) లడఖ్‌(Ladakh)లోని కార్గిల్‌లో పర్యటించనున్నారు..

ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఇక్కడ ప్రధాని మోదీ 1999 యుద్ధ వీరులకు నివాళులర్పిస్తారు. వారి కుటుంబ సభ్యులను కూడా కలవనున్నారు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవం సందర్భంగా జులై 24 నుంచి 26 వరకు ద్రాస్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ 2022లో కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు..

ప్రపంచంలోనే ఎత్తైన

కార్గిల్ యుద్ధంలో(kargil war) అమరవీరుల జ్ఞాపకార్థం ఉదయం 9:20 గంటలకు ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని పీఎంఓ కార్యాలయం తెలిపింది.

ఆ తర్వాత షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. ఈ సొరంగం లేహ్‌కు అన్ని రకాల కనెక్టివిటీలను అందిస్తుంది. పూర్తయిన తర్వాత ఇది ప్రపంచంలోనే ఎత్తైన సొరంగం కావడం విశేషం. అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు.

ఆ తర్వాత 'షహీద్ మార్గ్' (వాల్ ఆఫ్ ఫేమ్)ను సందర్శిస్తారని మేజర్ జనరల్ మాలిక్ తెలిపారు. సందర్శకుల పుస్తకంపై సంతకం చేసి కార్గిల్ యుద్ధ కళాఖండాల మ్యూజియాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ప్రధాని మోదీ 'వీర్ నారీస్' (యుద్ధంలో అమరులైన సైనికుల భార్యలు)తో కూడా సంభాషించనున్నారు. వీర్ భూమిని కూడా సందర్శిస్తారు..

చీల్చి చెండాడి వేటాడుతం...‼️

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. బ‌డ్జెట్‌ను చూస్తుంటే ఇది రైతు శ‌త్రువు ప్ర‌భుత్వం అని తేలిపోయింద‌న్నారు. అన్ని వ‌ర్గాల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెన్నుపోటు పొడిచింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వ‌ద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు.

గ‌త ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల సంక్షేమాన్ని ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. యాద‌వ సోద‌రుల ఆర్థికాభివృద్ధి కోసం ప్ర‌వేశ‌పెట్టిన గొర్రెల పంపకం ప‌థ‌కాన్ని మూసివేసిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది. అట్ట‌డుగు వ‌ర్గాల గొంతు కోసింది. ద‌ళిత బంధు ప్ర‌స్తావ‌న లేనే లేదు. ఇది చాలా దుర్మార్గం. ద‌ళిత స‌మాజం ప‌ట్ల నిర్ల‌క్ష్యానికి, ఫ్యూడ‌ల్ విధానానికి ఇంత గొప్ప నిద‌ర్శ‌నం లేదు. మ‌త్స్య‌కారుల‌కు భ‌రోసా లేదు. ఇందులో విశేషం ఏంంటంటే.. అంకెలు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆర్థిక మంత్రి ఒత్తిఒత్తి ప‌లక‌డం త‌ప్ప కొత్త‌గా ఏం లేదు అని కేసీఆర్ పేర్కొన్నారు.

మ‌హిళ‌ల ప‌ట్ల కూడా చాలా విష‌యాలు స్ప‌ష్టంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉండే. ఏదో కొత్త‌గా ల‌క్ష కోట్ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాలు ఇస్తామ‌ని చెప్పారు. అది ఆల్రెడీ ఉన్న స్కీమే. దుర‌దృష్టం ఏందంటే.. ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ త‌ర్వాత మేం కూడా క‌నీసం 6 నెల‌ల స‌మ‌యం ఇవ్వాల‌నుకున్నాం. నేను కూడా పెద్ద‌గా శాస‌న‌స‌భ‌కు రాలేదు. కానీ ఈ రోజు బ‌డ్జెట్ చూస్తే.. ఏ ఒక్క పాల‌సీ ఫార్ములేష‌న్ జ‌ర‌గ‌లేదు. రాష్ట్రానికి సంబంధించిన‌టువంటి ఏ ఒక్క విష‌యంలో కూడా ఈ అర్బ‌క ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు పాల‌సీ ఫార్ములేష‌న్ చేసిన‌ట్టుగా క‌న‌బ‌డుత‌లేదు అని కేసీఆర్ తెలిపారు.

వ్య‌వ‌సాయం విష‌యంలో మాకు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉండే. ఈ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ స్థీరిక‌ర‌ణ జ‌ర‌గాల‌ని, మేం రెండు పంట‌ల‌కు రైతుబంధు ఇచ్చాం. వీళ్లెమో ఎగ్గొడుతామ‌ని చెబుతున్నారు. రైతుల‌కు ఇచ్చిన డ‌బ్బును పాడు చేసినం.. చెడ‌గొట్టినం.. దుర్వినియోగం చేసినం అనే ప‌ద్ధ‌తిలో దుర‌దృష్ట‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శ‌త్రువు ప్ర‌భుత్వం అని తెలుస్తుంది.

ధాన్యం కొనుగోలు చేయ‌లేదు. విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డం లేదు. నీళ్లు స‌ర‌ఫ‌రా చేయ‌డం లేదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా రైతుబంధు, రైతుభ‌రోసా ప్ర‌స్తావ‌నే లేదు. రైతుభ‌రోసా ఎప్పుడు వేస్తార‌ని మా ఎమ్మెల్యేలు అరిస్తే క‌నీసం స‌మాధానం చెప్ప‌డం లేదు. కాబ‌ట్టి రైతుల‌ను ఈ ప్ర‌భుత్వం వంచించింది. వృత్తి కార్మికుల‌ను వంచించింది అని కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇండ‌స్ట్రీయ‌ల్ పాల‌సీ ఏమిటి..? ఏం లేదు వ‌ట్టిదే గ్యాస్.. ట్రాష్. ఇదేదో స్టోరీ టెల్లింగ్‌లాగా ఉంది త‌ప్ప బ‌డ్జెట్‌లాగా లేదు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయ పాల‌సీ ఏమిటి..? పారిశ్రామిక పాల‌సీ ఏమిటి..? ఐటీ పాల‌సీ ఏమిటి..? ఇంకా ఇత‌ర అనేక పాల‌సీలు.. పేద వ‌ర్గాల‌కు సంబంధించిన పాల‌సీ ఏమిటి..? అనే ఏ ఒక్క‌దాని మీద కూడా స్ప‌ష్ట‌త లేదు.

అంత వ‌ట్టిదే గ్యాస్, ట్రాషే. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ప్లాట్‌ఫామ్స్ స్పీచ్ లాగా ఉంది త‌ప్ప అది బ‌డ్జెట్ ప్ర‌సంగంలా లేదు. రాజ‌కీయ స‌భ‌ల్లో చెప్పిన‌ట్టుగా ఉంది త‌ప్ప ఏ ఒక్క పాల‌సీని కూడా నిర్దిష్టంగా ఈ ప‌నిని మేం ఇలా సాధిస్తాం.. మా గోల్స్, టార్గెట్స్ ఇవి అనే ప‌ద్ధ‌తి కానీ, ప‌ద్దు కానీ లేదు. ఇది పేద‌ల బ‌డ్జెట్ కాదు.. రైతుల బ‌డ్జెట్ కాదు.. ఎవ‌రి బ‌డ్జెటో రేపు మీకు విశ్లేష‌ణ‌లో తెలుస్త‌ది. భ‌విష్య‌త్‌లో బ్ర‌హ్మాండంగా చీల్చి చెండాడ‌బోతాం అని కేసీఆర్ తేల్చిచెప్పారు.

నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు..

ప్రశ్నోత్తరాలు, కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. 

ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం.. 

గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ.. 

ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్న సీఎం చంద్రబాబు.. 

ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్న మంత్రులు.