స్వయం ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిఎస్ రామానంద ప్రిన్సిపల్ ప్రభుత్వ ఐటిఐ భువనగిరి
విద్యార్థులు, చదువు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, స్వయం ఉపాధి అవకాశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భువనగిరి పారిశ్రామిక శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ జి. ఎస్ రామానంద అన్నారు. గురువారం భువనగిరి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రం లో కేంద్ర ప్రభుత్వ "సంకల్ప్ ప్రాజెక్టు" లో భాగంగా 15-05-2024 నుండి 31-05-2024 వరకు శిక్షణ పొందిన విద్యార్థులకు *సర్టిఫికెట్ల ప్రదానోత్సవ* కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు "ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ డెవలప్మెంట్" శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న పరిజ్ఞానం, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంకల్ప్ ప్రాజెక్టు స్టేట్ కన్సల్టెంట్ నజీర్ సిద్దిఖీ, యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు ఎర్ర శివరాజ్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు బొక్క రాంబాయి, జిల్లా అధ్యక్షులు ఆవుల వినోద్ కుమార్, డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ బాబూరావు, తులసీరావు, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, గురువయ్య, పరమేష్, రీసోర్స్ పర్సన్ కొడారి వెంకటేష్, చైల్డ్ లైన్ జిల్లా కో- ఆర్డినేటర్ మాటూరి దశరథ, విద్యార్థులు పాల్గొన్నారు.
Aug 03 2024, 20:54