కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిన బిజెపిని వ్యతిరేకించాలి. తమ్ముని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
ఈ మధ్యకాలంలో పార్లమెంటులో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందని దీనిపై ప్రజలు బిజెపిని వ్యతిరేకించాలని, కేంద్ర బడ్జెట్లో తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళకు అన్యాయం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం స్థానిక సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం నిర్మల సీతారామన్ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశారని, తెలంగాణకు అన్యాయం చేసిన బిజెపి సంబంధించిన ఎంపీలు కనీసం నోరు మెదపకుండా ఉన్నారని, రాష్ట్ర ప్రజలకు బిజెపి ఎంపీలు బడ్జెట్ విషయంలో సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో అన్యాయం చేసిందని బిజెపిని నిలదీయాలని, ఒత్తిడి పెంచాలని వారు అన్నారు. బిజెపిపై చేసే పోరాటంలో కాంగ్రెస్ ముందుండి పోరాడాలని వారు పిలుపునిచ్చారు. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసే న్యాయబద్ధమైన విషయాల్లో సహకరిస్తామని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా పెరుగుతున్న బిజెపి ప్రమాదాన్ని ఎదిరించడంలో ప్రగతిశీల శక్తులు ఐక్యం కావాలని వారు అన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గత బిఆర్ఎస్ పాలనలో అనేక ఇబ్బందులు పడ్డారని ప్రజా ఉద్యమాలు చేస్తున్న తరుణంలో సిపిఎం కార్యకర్తలు కదిలి ప్రజా పోరాటాలు నిర్వహించాలని వారు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిధులు కేటాయించకుండా ఉత్తుత్తి మాటలు మాట్లాడితే ఉపయోగం లేదని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ కూడా మాటలకే పరిమితమై ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని నూతన రేషన్ కార్డుల పై వెంటనే జీవో విడుదల చేయాలని వారు అన్నారు. పేద ప్రజలు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమాలను అరిస్తూ నిర్బంధాలను ప్రయోగిస్తుందని గత బిఆర్ఎస్ విధానాలను కాంగ్రెస్ అనుసరిస్తే పోరాటాలు తప్ప మరొకటి లేదని వారు పిలుపునిచ్చారు. వీరితోపాటు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిరిపంగి స్వామి, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేష్, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, గంగాదేవి సైదులు, బొల్లు యాదగిరి, ఎండి పాషా, బండారు నరసింహ, దోడ యాదిరెడ్డి, గుంటోజు శ్రీనివాస చారి, బూరుగు కృష్ణారెడ్డి, మద్దెపురం రాజు, గుండు వెంకటనర్సు, గడ్డం వెంకటేష్, అవ్వరు రామేశ్వరి, రాచకొండ రాములమ్మ, మండల కార్యదర్శులు ధూపటి వెంకటేష్, గాడి శ్రీనివాస్, బురు అనిల్, వేముల భిక్షం, మండల నాయకులు తుర్కపల్లి సురేందర్, కూర శ్రీనివాస్, చీరిక శ్రీశైలం రెడ్డి, మెరుగు వెంకటేశం, కవుడే సురేష్, గర్దాసు నరసింహ, కందాడి సత్తిరెడ్డి, వేముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Jul 30 2024, 20:04