ఇద్దరు ఆర్డీవోలపై వేటు
వేత కేసులో ఇద్దరు ఆర్డీవోలను, ఒక సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో మదనపల్లె ఆర్డీవోగా పనిచేసిన మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌తో పాటు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్ట్టెంట్ గౌతంతేజ్‌లను సస్పెండు చేసింది. ఇదే కేసులో ఇటీవల మదనపల్లె వన్‌టౌన్ సీఐ వలీబషును వీఆర్‌కు పంపి, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండు చేశారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తమ అదుపులో అనుమానితులు ఎవరూ లేరన్నారు. ఎఫ్‌ఎ్‌సఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్) నివేదిక రాగానే 15 రోజుల్లో నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. మాధవరెడ్డి ఇంట్లో 500 వరకు ఇళ్ల స్థలాలు, భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో శశికాంత్ ఇంట్లో మదనపల్లెకు చెందిన భూముల రికార్డులు దొరికాయన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ తుకారం ఇంట్లోనూ, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఇంట్లో కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నామని, ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఫైళ్ల కాల్చివేత కేసును అన్ని కోణాల్లో సాంకేతిక సహకారంతో పరిశోధిస్తున్నట్లు వివరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినట్లు తెలిపారు. సెల్ టవర్ డంప్స్ తీశామని, 2000కు పైగా ఫోన్ కాల్‌డేటాను పరిశీలించినట్లు తెలిపారు. వాట్సా్‌పలకు సంబంధించి ఐపీడీఆర్‌ను కూడా పరిశీలించినట్లు చెప్పారు. ఇప్పటికే అనుమానితుల ఇళ్లను సోదా చేసి విలువైన ఆధారాలు సేకరించినట్లు ప్రకటించారు. పరిశోధనకు ఉపయోగపడే డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొత్తగా 8 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో సీఐడీ అధికారుల సహకారంతో 15 బృందాలు విచారణ చేసినట్లు తెలిపారు.
సోమవారం మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ప్రజలు పోటెత్తారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకుల వేఽధింపులకు గురైన బాధితులు వెల్లువలా వచ్చారు. సబ్‌కలెక్టర్ మేఘస్వరూ్‌పకు సుమారు 150 మంది బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. వైసీపీ నాయకులు తమ భూములు ఆక్రమించారని, దౌర్జన్యంగా లాక్కున్నారని, విలువైన భూములను అతి తక్కువ ధరకే కాజేశారని.. చాలా వరకు ఇలాంటి ఫిర్యాదులే ఉన్నాయి.
మదనపల్లె సబ్ డివిజన్‌లోని భూబాధితులు ఆగస్టు 4వ తేదీ మదనపల్లె సబ్ కలెక్టరేట్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, తమ పార్టీ అండగా ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఫైళ్లు దహనమైన గదిని, కాలిన కాగితాలను, పరిసరాలను ఆయన పరిశీలించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి పోలీసులు అనుమతించకుండా ఆయనను అడ్డుకోవడంతో సీపీఐ నాయకులు పోలీసులను తోసుకుని వెళ్లి కార్యాలయంలో జరిగిన సంఘటనను పరిశీలించారు. అనంతరం ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు. అంతజాగ్రత్తగా పోలీసులు ఉంటే ఇప్పటికే నిందితులను పట్టుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఉద్దేశపూర్వకంగానే స్వార్థ ప్రయోజనాల కోసం పైళ్లు కాల్చినట్లు సంఘటనను చూస్తే అర్థం అవుతుందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలను అన్నివిధాలా దోచుకున్నారని ఆరోపించారు. నిరుపేదల భూములను ఆక్రమించి వారిపైనే దౌర్జన్యం చేసి కేసులు కట్టిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
పట్టణంలోని కదిరి రోడ్డులో సర్వే నంబరు 145/6లో 22 సెంట్ల భూమిని నా భర్త మల్లికార్జున కొనుగోలు చేశారు. ఈ స్థలంపై కన్నేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత, పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో మా స్థలం సబ్‌డివిజన్ ఫైలు మాయం చేశారు. ఈ స్థలంపై హక్కులేని వారి వద్ద కొనుగోలు చేసినట్లు రిజిస్ర్టేషన్ చేయించుకుని, మా స్థలాన్ని కబ్జా చేశారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలతకు అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వీరబల్లి గ్రామంలో ఐదెకరాల విస్తీర్ణం ఉన్న చెరువును రెవెన్యూ అధికారులు కేటాయించారు. ఆపై ఆ చెరువును 2023లో ఫ్రీహోల్డ్‌గా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్తగారి ఊరు వీరబల్లి. ఈ గ్రామ పరిధిలోని సుగాలితాండా సమీపంలో ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రదిబ్బ చెరువును పెద్దిరెడ్డి భార్య పేరుతో కేటాయించారు.
Jul 30 2024, 15:10