* *ముస్లిం మత పెద్దలలో..MLA -BLR**
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం *మస్జీద్ అర్ఫాత్ (చిన్న మసీద్ )* నందు ముస్లిం మైనారిటీ మత పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం , పర్యావరణ పరిరక్షణ కోసం *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్చంధ కార్యక్రమాలకు మిర్యాలగూడ నియోజకవర్గ మైనారిటీ సోదరుల సహాయ సహకారాలు అందించాలని .. *ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ* కార్యక్రమంలో , *వన మహోత్సవం* కార్యక్రమంలో వారు కూడా భాగస్వామ్యులు కావాలనీ కోరడం జరిగింది.. వెంటనే స్పందించిన పెద్దలు MLA గారు చేపడుతున్న ప్రతీ అభివృద్ది కార్యక్రమంలో తమ వంతుగా వారు కూడా భాగస్వామ్యులు అవుతామని . ఆగస్టు 11 ఆదివారం రోజు తమ బాధ్యతగా అవంతిపురం లోని *ఈద్గా* పరిసరాలలో 2వేల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. వారి విన్నపాన్ని స్వాకరించడంతో MLA గారు ధన్యవాదాలు తెలిపారు.అలాగే ఆగస్టు 15 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  *78వ స్వాతంత్ర్య దినోత్సవ* వేడుకల్లో కూడా ప్రతీ ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువులు , పెద్దలు, కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
*పంచాయతీ పోరుకు కసరత్తు*
పంచాయతీ పోరు కసరత్తు ప్రారంభంతో జిల్లాలోని పల్లెల్లో పంచాయతీ వేడి రాజుకొంటోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆగస్టు మొదటి వారానికి కొత్త ఓటర్ల జాబితా పూర్తిచేసి, నిర్ణీత గడువులో రిజర్వేషన్‌ వివరాలు సమర్పించాలని బీసీ కమిషన్‌ను కోరారు. బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుం దని స్పష్టం చేయడంతో పల్లెల్లో పంచాయతీల ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పం చాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ప్రాథమిక కసరత్తును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ మేరకు సెక్రటరీ అశోక్‌కుమార్‌ జారీ చేసిన ఉత్తర్వులు కలెక్టర్లు, జిల్లా ఎలక్షన్‌ అథారిటీస్‌కు అందాయి. ఆగస్టు రెండు, మూడు తేదీల్లో వివిధ జిల్లాల డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు రెండో తేదీన గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటరు జాబి తాను సిద్ధం చేసేందుకు జిల్లాలోని ఐదు మం ది డేటా ఎంట్రీ ఆపరేటర్లకు హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇప్పటికే పంచాయతీ పోరు సందడి ఆరంభమైంది.
*మార్కెట్ యార్డు కీ వచ్చే రైతులకు ఇబ్బంది కలగకూడదు..MLA -BLR*
ఈరోజు మంగళవారం సంత సందర్భంగా అవంతిపురం *మార్కెట్ యార్డు* సందర్శించిన మిర్యలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*. మార్కెట్ యార్డ్ అంతా తిరిగి పరిశీలించారు అలాగె అక్కడి రైతులతో మాట్లాడి ఇక్కడి సదుపాయాలు మరియు అవసరాలు తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ మిర్యాలగూడ మార్కెట్ యార్డ్ పెద్దది కావున వారంలో రెండు సార్లు మంగళవారం మరియు శనివారం జరిగే సంతలు కూడా చాలా పెద్దవి అందుకే రైతులు, వ్యాపారులు పలు ప్రాంతాల నుంచి వస్తుంటారు.. కావున వారికి ఏలాంటి ఇబ్బంది లేకుండా వారికి త్రాగు నీరు లాంటి అన్ని సదుపాయాలు కల్పించాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు .
*హార్ట్ ఎటాక్‌లను దూరం చేసే సరికొత్త మందు భారత మార్కెట్లోకి ఇంజెక్షన్‌ రూపంలో అందుబాటులోకి ఇన్‌క్లిసిరాన్‌*
ఎల్‌డీఎల్‌ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందంటున్న వైద్యులు *హార్ట్‌ ఎటాక్‌లు డబుల్‌.* గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య భారతదేశంలో భారీగా పెరుగుతోంది. హృద్రోగ సమస్యల కారణంగా ఏటా సంభవిస్తున్న మరణాల్లో 20 శాతం మంది పురుషులు గుండెపోటుతో మరణిస్తుండగా 17 శాతం మంది మహిళలు అదే సమస్యతో చనిపోతున్నారు. గత 30 ఏళ్లలో గుండె సంబంధిత వ్యాధులతో సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో పదేళ్ల ముందే గుండె సంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి. యుక్తవయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవల మరింతగా పెరి గింది. గుండెపోటుకు ఎన్నో కారణాలున్నా ప్రధానంగా తక్కువ సాంద్రతగల కొవ్వుల (ఎల్‌డీఎల్‌) కారణంగా ఎక్కువగా హార్ట్‌ఎటాక్స్‌ వస్తున్నాయి. *అసలేంటీ మందు..?* ఇన్‌క్లిసిరాన్‌ అనే మందు శరీరంలోని కొలెస్టరాల్‌ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

సాధారణంగా కొలెస్టరాల్‌ స్థాయిలను తగ్గించేందుకు స్టాటిన్స్‌ అనే రకం మందులు ఎన్నో ఏళ్లుగా అందుబాటులో ఉన్నా ఇన్‌క్లిసిరాన్‌ మాత్రం వాటికన్నా ఎన్నో రెట్లు ప్రభావవంతగా పనిచేస్తుందని అంటున్నారు. ఇంజెక్షన్‌ రూపంలో ఉండే ఈ మందును ఇన్సులిన్‌ మాదిరిగా వేసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకోసారి తీసుకుంటే గుండెపోటు దరిచేరదని పేర్కొంటున్నారు *ఎలా పనిచేస్తుంది?* సాధారణంగా ఇన్‌క్లిసిరాన్‌ (సింథటిక్‌ ఎస్‌ఐ ఆర్‌ఎన్‌ఏ) కొవ్వులు తయారయ్యే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ప్లాస్మాలోని తక్కువ సాంద్రతగల కొవ్వుల (ఎల్‌డీఎల్‌)ను నియంత్రించే సెరిన్‌ ప్రోటీన్‌ అయిన ప్రోప్రోటీన్‌ కన్వర్టేజ్‌ సబి్టలిసిన్‌ కెక్సిన్‌-9 (పీసీఎస్‌కే9)కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పీసీఎస్‌కే9 మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏకు ఇది అతుక్కొని పీసీఎస్‌కే9 ప్రోటీన్‌ తయారుకాకుండా అడ్డుకుంటుంది. దీంతో ప్లాస్మాలో ఎల్‌డీఎల్‌ గణనీయంగా తగ్గి రక్తంలోని ఎల్‌డీఎల్‌ను కాలేయం గ్రహించేలా చేస్తుంది. తద్వారా హృద్రోగ సమస్యలు రాకుండా కాపాడుతుంది. 200 వరకు ఉన్న స్థాయి కూడా 40 వరకు తగ్గేంత ప్రభావవంతంగా ఈ మందు పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.



ఈ మందు తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకమైన జీవన విధానాన్ని పాటించాలి. ఆల్కహాల్, సిగరెట్‌ వంటి అలవాట్లకు దూరంగా ఉంటే మందు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ట్రై-గ్లిజరైడ్స్‌ ఉన్న వారిపై ఈ మందు అంతగా ప్రభావం చూపదు. - శ్రీనివాస్‌ కుమార్, ఇంటర్వెన్షనల్‌అపోలో హాస్పిటల్స్‌ *ఎవరెవరు వాడొచ్చు?* సాధారణంగా హృద్రోగ సమస్యలు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. కుటుంబంలో ఎవరికైనా హృద్రోగ సమస్యలు ఉన్న చరిత్ర ఉంటే వారందరూ తక్కువ వయసులోనే ఈ మందు తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే అధిక కొలెస్టరాల్‌తో బాధపడుతున్న వారు, 40 ఏళ్లు దాటిన వారు ఈ మందును తీసుకుంటే హార్ట్‌ఎటాక్‌ రాకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. గుండెలో స్టెంట్‌ వేయించుకున్న వారు కూడా ఈ ఇంజెక్షన్‌ తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. *అనుమతులు వచ్చాయా?* ఇప్పటికే ఈ మందుకు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అనుమతులు మంజూరు చేయగా భారత్‌లో 6 నెలల కిందటే డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) కార్యాలయం అనుమతులు ఇచి్చంది. దీంతో తాజాగా ఈ మందును మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.



నేటి నుంచి హృద్రోగ సమస్యలపై కాన్ఫరెన్స్‌ గుండె సమస్యలపై అవగాహన కోసం ఈ నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో ప్రీమియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ కాన్ఫరెన్స్‌ జరగనుంది. అపోలో హాస్పిటల్స్, అమెరికాలోని కార్డియోవ్యాస్కులర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌తో కలిసి ఫ్యాక్ట్స్‌ ఫౌండేషన్‌ ఈ సదస్సును నిర్వహించనుంది. గురువారం జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. గుండె విఫలమైనప్పుడు ఉపయోగపడే కొత్త పరికరాల పాత్రపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టులు హాజరు కానున్నారు.
*నేను నా మిర్యాలగూడ స్వచ్చంధ కార్యక్రమాలకు ప్రైవేటు టీచర్స్ సహకారాలు కూడా అందించండి..MLA -BLR*
ఈరోజు మిర్యాలగూడ MLA క్యాంప్ కార్యాలయం నందు ప్రైవేటు స్కూల్ టీచర్స్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మాట్లాడుతూ. మిర్యాలగూడ నియోజకవర్గ పర్యావరణ పరిరక్షణలో భాగంగా, కాలుష్య నియంత్రణ లక్ష్యంతో నిర్వహిస్తున్న నేను నా మిర్యాలగూడ స్వచ్చంధ కార్యక్రమాలు అయిన *వన మహోత్సవం* కార్యక్రమానికి మరియు *ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ* కార్యక్రమానికి ప్రైవేటు ఉపాధ్యాయులు అందరూ తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు.. ప్రతీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు విద్యార్థులలో అవేర్నెస్ తీసుకొని రావాలి. వారి వారి ఇండ్లలో మొక్కలు నాటమని తెలియజేయండి . అలాగే *ఆగస్టు 1వ తేది* నుంచి ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని విద్యార్థులకు సూచనలు చేసి వాటి వలన జరిగే పర్యావరణ కాలుష్యాని విద్యార్థులకు బోధించాలి ... అదే విధంగా ఆగస్టు 15న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *78 వ స్వతంత్ర దినోత్సవ* వేడుకల్లో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అందరూ మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణలో వారిని కూడా భాగస్వామ్యులు చేయడం చాలా ఆనందంగా ఉంది.. మేము అందరం కూడా నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో చేయబోయే ప్రతీ ఒక్క స్వచ్చంధ కార్యక్రమానికి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు స్కూల్స్ ప్రధాన ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
*ప్లాస్టిక్ కవర్ల నియంత్రణకు మీ అందరూ సహకరించాలి , వ్యాపారులతో MLA -BLR*
మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*. *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న మరో స్వచ్చంధ కార్యక్రమం నియోజకవర్గంలో *ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ* ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మిర్యాలగూడలోని ప్లాస్టిక్ కవర్స్ హోల్సేల్ వ్యాపారులను మరియు మార్కెట్ లోని కూరగాయలు మరియు పలు వ్యాపారులను కలసి *ఆగస్టు 1వ తేదీ* నుంచి ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని, మరియు అమ్మకాలను పూర్తిగా తగ్గించాలని , *7వ తేది* వరకు మార్కెట్ లో ప్లాస్టిక్ కవర్ అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత మీదే.

*ఆగస్టు 15 వ* తేది వరకు మిర్యాలగూడ నియోజకవర్గం పూర్తి ప్లాస్టిక్ కవర్ల రహితంగా మారాలని.. దాని కోసం మాతో పాటు మీరు కూడా సహకరిస్తే అందరం కలసి మిర్యాలగూడ నియోజకవర్గం పర్యావరణ పరిరక్షణలో భాగం అవ్వాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు.. తదితరులు పాల్గొన్నారు.
*మూసి కుడి కాలువ నీటి విడుదల ద్వారా రైతుల హర్షం..MLA -BLR*
ఈరోజు మూసి కుడి కాలువ ద్వారా పంటపొలాలకు నీటి విడుదల ను చేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే గౌ,, శ్రీ వేముల వీరేశం గారు ,DCMS చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, ప్రాజెక్టు SE, EE, DE,AE , ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ * ఈ మూసి కుడి కాలువ ద్వారా *అమనగళ్ళు, కల్వేలపాలెం, చిరుమర్తి, పొరెడ్డి గూడెం, పాములపాడు, భీమనపెల్లి, లక్ష్మిదేవి గూడెం, రావులపెంట* గ్రామాలకు సాగు నీరు అందడం జరుగుతుంది.
➡️ఆయకట్టు రైతులకు ఇబ్బంది లేకుండా సాగు నీరు అందిస్తాం ➡️ప్రతి ఎకరానికి నీరు అందజేయడమే లక్ష్యం ➡️నీటి విడుదలతో ఆయకట్టు రైతుల హర్షం వ్యక్తమవుతోంది. ➡️ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా రైతుల పక్షాన ధన్యవాదాలు.
*బడ్జెట్ తర్వాత మద్యం ధరల సంగతేంటి* ? మందుబాబులకు లక్కా..? కిక్కా..?
బడ్జెట్ తర్వాత ప్రతిసారీ మద్యం ప్రియులు బడ్జెట్‌ను అనేక విషయాలను నిశితంగా చూస్తారు. ముఖ్యంగా బడ్జెట్‌లో మద్యం ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని ఈసారి ఓ కన్నేసి ఉంచారు. దీనికి సంబంధించిన అప్‌డేట్ చూసి హ్యాపీగా ఉన్నారు. మోదీ సర్కారు 3.0లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024లో అన్నీ వర్గాలకు మేలు చేసేలా కేటాయింపులు చేశామని ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే అందులో ఎంత వాస్తవం ఉంది..అన్నింటి కంటే ముఖ్యమైన మద్యం ధరలపై కేంద్ర సర్కారు ట్యాక్సులు పెంచిందా లేక తగ్గించిందా అనే సందేహాలు ప్రతీ ఒక్కరిలో ఉన్నాయి.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మద్యం ధరలు పెరిగాయా లేక తగ్గాయా అని సురాపాన ప్రేమికుల్లో ఒకటే టెన్షన్ ఉంది. అయితే వారి ఆశలపై మాత్రం కేంద్రం ఊరటనిచ్చే విధంగానే నిర్ణయం తీసుకుంది. మంగళవారం, జూలై 23, BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వం మూడవ ప్లీనరీ బడ్జెట్ సెషన్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.బడ్జెట్‌ ప్రకటన వెలువడగానే సామాన్యుల మదిలో మెదులుతున్న మొదటి ప్రశ్న ఏయే ఉత్పత్తుల ధరలు పెరిగాయి, ఏయే ఉత్పత్తుల ధరలు తగ్గాయి? ఇందులో సిగరెట్ మరియు మద్యం ధర ఉంది.

ఈసారి బడ్జెట్‌లో సుర ప్రియులకు శుభవార్త. ఎక్సైజ్ సుంకం లేదా ఎక్సైజ్ సుంకంలో ప్రభుత్వం ఎటువంటి నిర్దిష్ట మార్పులను కూడా ప్రకటించలేదు. దీంతో మద్యం ధర పెరగడం లేదని తెలిసింది. యాదృచ్ఛికంగా, మద్యం ధర మాత్రమే కాదు, సిగరెట్ సహా పొగాకు ఉత్పత్తుల ధరలను కూడా బడ్జెట్‌లో పెంచలేదు. జీఎస్టీ పెంపు వల్ల పొగాకు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం చేయలేదు.
* ఏపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం..ఆశలపై నీళ్లు*
2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడే విధంగా బడ్జెట్‌ రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 3.0 బడ్జెట్‌ను తయారు చేశామని.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని, ద్రవ్యోల్బణం తగ్గుతోందని ఆమె తెలిపారు. బడ్జెట్‌‌లో ఆంధ్రప్రదేశ్‌, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు అధిక స్థాయిలో కేటాయింపులు దక్కాయి. ముఖ్యంగా ఏపీ రాజధాని అభివృద్దికి ప్రత్యేకంగా రూ. 15,000 కోట్లు కేటాయిస్తున్నట్టు పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ, జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ క్రెడిట్ కోసం ఇరు పార్టీల నేతలు పోటీ పడ్డారు. తమ వల్లే ఈ కేటాయింపులని టీడీపీ నేతలు అంటుంటే, పవన్ వల్లే ఇంతటి స్థాయిలో నిధులు వచ్చాయంటూ జనసేన నేతలు చంకలు గుద్దుకున్నారు. తీరా ఇది సాయం కాదు అప్పుగా మాత్రమే ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే అసలు విషయం తర్వాత కానీ తెలియలేదు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ , ఏపీకి కేటాయించిన బడ్జెట్‌పై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో ఉందని కేంద్ర మంత్రి అంటూనే దాని ప్రకారం రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. అంటే ప్రపంచ బ్యాంక్ ద్వారా ఆర్ధిక సాయం అందేలా చూస్తామని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ అంటే రుణాలు ఇచ్చేదే తప్ప ఉచితంగా ఇవ్వదు. మరి ఆ విధంగా ఆలోచిస్తే ఏపీకి ఇచ్చే రూ. 15000 వేల కోట్ల రూపాయల రుణమే తప్ప ఆర్ధిక సాయం ఏ మాత్రం కాదని అర్ధం అవుతోంది.


రాష్ట్ర ప్రభుత్వానికి , వరల్డ్ బ్యాంక్‌కు మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది, అంతే తప్పిస్తే ఈ రూ. 15000 వేల కోట్లకు కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదన్న మాట. ప్రపంచ బ్యాంకు ఎవరికీ ఉచితంగా రుణం ఇవ్వదు , కాబట్టి ఈ రూ.15000 వేల కోట్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటోంది. దీనిపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. నిధులు అప్పుల రూపంలోనే అయినా వాటిని తీర్చేది 30 ఏళ్ల తర్వాతే అని కూడా చంద్రబాబు చెప్పడం విశేషం.అప్పు అయినా ముప్పయ్యేళ్ల తర్వాత తీరుస్తామని చంద్రబాబు అనడం బట్టి కేంద్రం ఈ విషయంలో ఏపీకి ప్రత్యేకంగా చేసిన సాయం ఏమిటి అన్న చర్చ సాగుతోంది.
*కార్మికులకు అద్దె గృహాల స్కీం.. మరో 3 కోట్ల కొత్త ఇళ్లు*
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(pmay) కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) బడ్జెట్ 2024(budget 2024) సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో పీఎం ఆవాస్ యోజనపై ప్రభుత్వం పెద్ద దృష్టి పెట్టిందని ఆర్థిక మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(pmay) కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) బడ్జెట్ 2024(budget 2024) సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో పీఎం ఆవాస్ యోజనపై ప్రభుత్వం పెద్ద దృష్టి పెట్టిందని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ పథకం కింద మరో 3 కోట్ల ఇళ్లు కొత్తగా నిర్మించనున్నట్లు తెలిపారు. ఇది సిమెంట్ రంగానికి సానుకూల వార్త. దీంతోపాటు పరిశ్రమ కార్మికులకు అద్దె ఇళ్ల పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (PPP మోడ్) ద్వారా నిర్మిస్తారు. దీనిలో కార్మికుల కోసం అద్దె గృహాలలో డార్మిటరీ తరహా వసతి ఉంటుందని చెప్పారు.


14 పెద్ద నగరాలు ఈ క్రమంలో 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాలను అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో కోటి ఇళ్లకు అర్బన్ హౌసింగ్ ప్లాన్ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతోపాటు అర్బన్ హౌసింగ్ కోసం రూ.2 లక్షల కోట్లు అందుబాటులోకి తెస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. PMAY అర్బన్ హౌసింగ్ 2.0 కింద రూ. 10 లక్షల కోట్ల బడ్జెట్‌తో ప్రజల గృహ అవసరాలను తీర్చనున్నట్లు ఆర్థిక మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్ల విలువైన సహాయాన్ని అందిస్తుందని, ఈ హౌసింగ్ ప్రాజెక్టులకు రాయితీ ధరలను అందజేస్తుందని ఆమె తెలిపారు. వాస్తవానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా ఒక కోటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లను అందిస్తుంది. వచ్చే ఐదేళ్లలో రూ. 2.2 లక్షల కోట్ల కేంద్ర సహాయం కూడా చేర్చబడుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. ఈ పథకం కింద గృహాలు ఉన్నవారు, పేద తరగతి నుంచి వచ్చిన వారు ఈ ప్రయోజనాలను పొందుతారు.