జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులు: జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని కార్మికుల నిరవధిక సమ్మె
భువనగిరి జిల్లా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్ మరియు పేషెంట్ కేర్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మరియు పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతం వెంటనే ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. సోమవారం రోజున తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జిఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మరియు పెండింగ్ లో ఉన్న 3నెలల వేతనం చెల్లించాలని శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులు తమ విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె నిర్వహించడం జరిగింది. సమ్మెకు సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మద్దత్తు తెలిపి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2022 జూన్ నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన కొత్త వేతనాలను ఆసుపత్రి కార్మికులు అందుకుంటున్నారని కానీ భువనగిరి జిల్లా ఆసుపత్రిలో మాత్రం అమలు కావడం లేదని ఇట్టి విషయము జిల్లా కలెక్టర్ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ గార్ల దృష్టికి తీసుకెళ్లిన ఏలాంటి ప్రయోజనం లేనందున కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నేటి నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారని హాస్పిటల్ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వారికి అండగా ఉంటామని అయన తెలిపారు. *ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా పెరిగిన వేతనాలు, సమ్మె విరమించిన కార్మికులు..* ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగానే మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెరిగాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. ఈ రోజు జిల్లా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేసి నేటినుండి నిరవధిక సమ్మె ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా హాస్పిటల్ ఏవో మసూద్, టీవీటీ ఏజెన్సీ కాంట్రాక్టర్ ప్రతినిధి శ్రీనివాస్ మరియు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ కార్మికులతో కలిసి చర్చలు జరిపారు ఈ చర్చలలో కార్మికుల వేతనాలు 10,500కు పెంచుతామని, 3నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇస్తామని, అందరికీ ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా చెల్లిస్తామని, 3 షిఫ్ట్ ల విధానాన్ని అమలు చేస్తామని, వేతనాలు ప్రతి నెల 5వ తేదీన చెల్లించుటకు ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఏఐటీయూసీ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉండి పోరాడుతుందని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేసి కార్మికులందరినీ రెగ్యులర్ చేసే వరకు భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తామని ఇమ్రాన్ తెలిపారు. ఈ రోజు జరిగిన సమ్మెకు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరబోయిన మహేందర్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, శానిటేషన్ కార్మికులు మేడబోయిన లక్ష్మి, గుండు వాణి, జేరిపోతుల కమలమ్మ, ఇస్తారమ్మ, సులోచన, నరసింహ, సోమనరసయ్య, కృష్ణ, సుగుణ, కృష్ణవేణి, లావణ్య, లలిత, భారతమ్మ, హేమలత, మహేందర్, స్వప్న, బాలరాజ్, నాగరాణి, లలిత, కిరణ్, విజయలక్ష్మి, రేణుక, శేఖర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
Jul 29 2024, 17:16