రాష్ట్రవ్యాప్తంగా ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి మోతే మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ప్రారంభించిన. టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
సూర్యాపేట జిల్లా :-
రాష్ట్రవ్యాప్తంగా ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి
మోతే మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ప్రారంభించిన. టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
నల్గొండ జిల్లా :-
గౌరవ అతిథులుగా హాజరైన మండల తహసిల్దార్..
ఎంపీడీవో...వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో కూడిన ప్రెస్ క్లబ్ భవనాలను నిర్మించాలని స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజానికి దిశా నిర్దేశం చేసే ఫోర్త్ ఎస్టేట్ మీడియాకు సరైన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 90% జర్నలిస్టులకు పక్కా ప్రెస్ క్లబ్ భవనాలు లేక హోటల్లో చెట్ల కింద ప్రైవేటు భవనాల మెట్ల పైన కూర్చొని కాలం వార్తలు సేకరించే దయనీయమైన పరిస్థితి నెలకొన్నదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా భవనాలు నిర్మించాలని కోరారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ సంఘమిత్ర, మండల ఎంపీడీవో హరి సింగ్, భారత రాష్ట్ర సమితి మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ, భాస్కర్, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు బి శ్రీనివాస్, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు దోసపాటి రాములు, బిజెపి మండల ఉపాధ్యక్షులు కొడిసే వెంకన్న, టీఎస్ జెఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌసుద్దీన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువరన్ ఆచార్యులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలకల చిరంజీవి, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏర్పుల సాయి కృష్ణ , మండల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గట్టిగుండ్ల రాము, ఉపాధ్యక్షులు మాలోత్ కోటి నాయక్, కోశాధికారి గురజాల వెంకన్న, సహాయ కార్యదర్శి డి ఎలీషా, కమిటీ సభ్యులు కొండ ఉదయ్, అన్ని పార్టీల నాయకులు మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ , ఆర్.టి.ఐ నాయకులు, నాయకులు పేర్ల రామయ్య, సిఐటియు మండల కన్వీనర్ దోసపాటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Jul 26 2024, 20:57