ఏలూరు జిల్లా :-ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నలుగురు నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ :-
ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నలుగురు నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్
ఏలూరు: ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నలుగురు వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డి.ఎస్.పి శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీ చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటల్ ను నడుపుతున్నాడు. ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరులు వృత్తులను ఎంచుకొని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకట దుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్ లో విలేఖరిగా పనిచేస్తుంది. ఆమె ఒక పథకం ప్రకారం ఇందిరమ్మ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్ కి వెళ్ళింది. ఆ దుకాణ యజమాని ఎక్కడ అని అడిగి హోటల్లో అన్ని పరిశీలించి తాను ఫుడ్ సేఫ్టీ అధికారిని.. హోటల్ ఏమి సరిగా లేవని ఆ హోటల్ యజమాని అప్పలనాయుడుని బెదిరించింది. కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ ను ఎలా నడుపుతున్నారని, దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించింది. దీనికి భయపడిన అప్పలనాయుడు వెంటనే లైసెన్స్ తీసుకుంటాను ఇకనుంచి నిబంధనలు పాటిస్తానని చెప్పాడు. అప్పటికి ఆ యజమాని మాటలు వినకుండా మరొక వ్యక్తికి ఫోన్ చేసింది. రూ 10,000 ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు. వీరి ప్రవర్తన పై అనుమానం వచ్చిన యజమానికి సీసీ కెమెరాలు దగ్గర తీసుకువెళ్లి డబ్బులు ఇస్తాను చెప్పి ఈ విషయాన్ని అందర్నీ అడగగా వాళ్ళు నకిలేని అధికారులు తెలిసింది వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియజేయడంతో వేలూరు పోలీస్ స్టేషన్ వచ్చేసి దర్యాప్ చేసి ప్రధాన నిందితురాలు అయిన వెంకట దుర్గా దేవి పాట సహకరించి బుక్కురి దేవి ప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి, పులిగా రాంబాబులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు..వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్స్ రెండు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేస్ చేదించిన ఎస్సై రాజారెడ్డిని ఆయన అభినందించారు. ఎవరైనా అధికారులు అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు
Jul 26 2024, 19:05