ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజల కష్టాలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణం స్పందించాలి : సిపిఎం
గ్రామపంచాయతీలలో కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనలలో సమస్యలు పెద్ద ఎత్తున పేర్కపోయి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి తగిన నిధులు కేటాయించి గ్రామాల్లో ఉన్న మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సోమవారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం పెంచికల్ పహాడ్, బస్వాపురం గ్రామాలలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం ఆయా గ్రామాలలోని పంచాయతీ కార్యదర్శులకు, ప్రత్యేక అధికారులకు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ్మలు పాల్గొని మాట్లాడుతూ గత ఫిబ్రవరి నుండి సర్పంచ్ పాలన ముగిసి ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన తర్వాత గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎవరిని అడగాలను అర్థం కాని పరిస్థితులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామాలలో రోజురోజుకు మురికి కాలువలు, వీధిలైట్లు, మంచినీళ్ల సమస్యలు పెరుగుతున్నాయని వాటిని తక్షణం పరిష్కారం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. పెంచికల్ పహాడ్ గ్రామంలో మంచినీళ్ల ఫిల్టర్ రిపేరుకు వచ్చి వారం కావస్తున్నా నేటికీ దానిని బాగు చేయించే పరిస్థితి లేదని దాంతో మంచినీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. హనుమాపురం గ్రామంలో లింక్ రోడ్ల సమస్య చాలా పెద్ద ఎత్తున ఉన్నదని అనంతరం, తాజ్ పూర్, కుర్మగూడెం, అనంతరం బస్వాపురం వరకు లింకు రోడ్ల సమస్యలను పరిష్కారం చేయాలి, అక్కడక్కడ దెబ్బతిన్న బీటీ రోడ్లను తక్షణం బాగు చేయాలని అన్నారు. బస్వాపురం నుండి యాదగిరిగుట్ట వరకు లింకు రోడ్డు కూడా తక్షణమే ఏర్పాటు చేయాలని, బస్వాపురం ఉసిల్లవాగుపై బ్రిడ్జిని తక్షణమే నిర్మాణం చేయాలని, భువనగిరి నుండి కృష్ణాపురం పెంచికల్పాడు మీదుగా వెళ్లే ప్రయాణికులకు భువనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని కోరినారు. ప్రభుత్వము ఎన్నికల ముందు ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తానన్న హామీని వెంటనే అమలు చేయాలని, అర్హత కలిగి రేషన్ కార్డు లేని పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని, అన్ని రకాల పెన్షన్స్ కూడా తక్షణం ఇవ్వాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వము అన్ని గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరినీ సమీకరించి సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం తగిన నిధులు విడుదల చేయాలని కోరినారు. గ్రామాలలో రోజురోజుకు కోతుల, కుక్కల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటి నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షకాలంతో దోమల బెడద పెరిగి ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారని గ్రామాలలో తరచుగా గడ్డి మందు, దోమల నివారణ మందు పిచికారి చేయాలని ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పై సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించకపోతే మండల స్థాయిలో ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ, మండల కమిటీ సభ్యులు సిలివేరి ఎల్లయ్య, రాసాల వెంకటేష్, హనుమాపురం సిపిఎం శాఖ కార్యదర్శి మోటె ఎల్లయ్య, బసవపురం శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, పెంచికల్ పహాడ్ శాఖ కార్యదర్శి సుబ్బురు పోచయ్య, నాయకులు ప్రజలు బండి శ్రీను, తెల్జీరి మాణిక్యం, కుసుమ మధు, బాల్ద మల్లయ్య, ఉడుత విష్ణు, మచ్చ భాస్కర్, సిల్వేరు జెమ్మయ్య, చిన్నం బాలరాజు, గోపి స్వామి, సిలువేరు జమదగ్ని, చిన్నం సబితా, గోపె సంధ్య, చాట్ల భారతమ్మ, సిలువేరు సత్యలక్ష్మి, నల్ల నవీన్, చిందం నరసింహ, నరాల కృష్ణ, రాసాల గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Jul 23 2024, 06:39