విద్యుత్ శాఖ నూతన ఎస్ ఈ సంపత్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీం..
ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యుత్ శాఖ నూతన ఎస్ ఈ సంపత్ కుమార్ అధికార బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా ఏపీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ డిస్కం అడిషనల్ సెక్రెటరీ ఇబ్రహీం మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ మరియు అనంతపురం నగర అధ్యక్షులు వీకే కృష్ణుడు అనంతపురం నగర ఉపాధ్యక్షులు చిరంజీవి కళ్యాణదుర్గం డివిజన్ సెక్రెటరీ హనీఫ్ గుత్తి డివిజనల్ సెక్రెటరీ అక్బర్ కనేకల్ సెక్షన్ కోశాధికారి మఠం రమేష్ అసోసియేషన్ 5 రాష్ట్ర అధ్యక్షులు మంజునాథ్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కొదశాధికారి రమేష్ బాబు ఔట్సోర్సింగ్ అనంతపురం ఉపాధ్యక్షురాలు రమాదేవి గారు మరియు సింగనమల కోశాధికారి నల్లప్ప మీటర్ రీడర్స్ జిల్లా కార్యదర్శి కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
గురుపౌర్ణమి రోజున రాతిదులం పోటీలు.. 3 పెద్ద మొత్తంలో బహుమతులు ప్రకటించిన ముంటిమడుగు కేశవరెడ్డి, కాట్టప్ప గారి రామలింగారెడ్డి గాండ్ల విశాలాక్షి..
శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండల కేంద్రంలో *గురుపౌర్ణమి సందర్బంగా శ్రీ సాయిబాబా స్వామి వారిని దర్శించుకొని, రాతిదులం లాగుడు పోటీలకు ముఖ్యఅతిథులుగా హాజరుఅయి కార్యక్రమంను ప్రారంభించిన మొదటి బహుమతి ₹50000/-రూపాయలు ప్రధాత శింగనమల నియోజకవర్గ ద్విసభ్యకమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, రెండొవ బహుమతి ₹40000/- రూపాయలు ప్రధాత టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు, 3బహుమతి ₹30000/- రూపాయలు ప్రధాత మాజీజడ్పీటీసీ గాండ్ల విశాలాక్షి గారు* ఈ కార్యక్రమంలో. అనిల్ చౌదరి. గేట్ కృష్ణారెడ్డి. మండల కన్వీనర్ పాండు.బాలకృష్ణ. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లు రామాంజనేయులు. మాజీ జెడ్పిటిసిగుర్రం ఆదినారాయణ. మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ నాయుడు. గ్రామ కమిటీ అధ్యక్షుడు రామాంజనేయులు.గుర్రం శ్రీనివాసులు. పెనకచర్ల నరసింహారెడ్డి.కల్లూరు రాము. బాబయ్య. గార్లదిన్నె మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
ఐరిస్క్ ప్రెగ్నెంట్ మహిళా సరోజమ్మ కు A+ పాజిటివ్ రక్తం డోనేట్ చేసి ఆ తల్లి బిడ్డకు ప్రాణ రక్షణ కల్పించిన వడియం పేట సర్పంచ్ నాగార్జున..
facebook చూస్తూ.. చూస్తూ.. ఓ చిన్న ప్రకటన కనబడడంతో ఆశ్చర్యపోయి.. హుటా.. హుటిన ఇంటి నుంచి బయలుదేరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు చేరుకొని రాయదుర్గం మండలం గుమ్మగట్ట గ్రామానికి చెందిన ఐరిస్క్ ప్రెగ్నెంట్ మహిళా సరోజమ్మ బెర్త్ ను అక్కడున్న నర్స్ను అడిగి తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసా.. ఆమెకు ఏ పాజిటివ్ బ్లడ్ కావలసి ఉండడంతో ఫేస్బుక్లో ఆ ప్రకటన చూసి సరోజమ్మ దగ్గరికి చేరుకొని ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని... నాది ఏ పాజిటివ్ బ్లడ్ అని ఆమెకు ధైర్యం చెప్పి బ్లడ్ డొనేషన్ సెంటర్లో కి వెళ్లి తన వంతు సహాయంగా తల్లి బిడ్డ ప్రాణ రక్షణ కొరకు ఏ పాజిటివ్ బ్లడ్ ను డొనేట్ చేయడం జరిగింది. ఆ మహిళ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.. అందుకేనేమో వడియం పేట ప్రజలు మంచి మనసుతో నాగార్జునను సర్పంచ్ గా ఎన్నిక చేయడం జరిగింది.. సర్పంచ్ అంటే ఇలా ఉండాలని రుజువు చేసుకున్న మన సర్పంచ్ నాగార్జున...  సర్పంచ్ నాగార్జున బ్లడ్ డొనేషన్ చేయడంతో తనకు తన తో పాటి ఊరికి మంచి పేరు రావడం జరుగుతుందని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.. అసలు ఏ పాజిటివ్ బ్లడ్ దొరకాలంటేనే ఎంతో కష్టంగా ఉంటుంది. అందుకే సర్పంచ్ నాగార్జున గారు తనంతకుతానే ప్రకటన చూసి ఏడు నెలలు నిండిన ప్రెగ్నెంట్ మహిళ సరోజమ్మ ప్రాణ రక్షణకు బ్లడ్ డొనేట్ చేసి ఆపద్బాంధవుడిలా నిలిచాడు...
బుక్కరాసముద్రం మండలంలో ఓబులాపురం గ్రామం నందు రైతులతో నూనెగింజల పంటలపై సమీక్ష..
నూనెగింజల పంటలపై సమీక్ష : మండలములోని ఓబులాపురం గ్రామములో భారత ప్రభుత్వ వ్యవసాయశాఖ, నూనెగింజల అభివృద్ధి విభాగం అధికారులు శ్రీ అవినాష్ గారు శ్రీ శ్రీకాంత్ గారు (అసిస్టెంట్ డైరెక్టర్స్) గ్రామములోని రైతుల యొక్క వేరుశనగ పొలంలను సందర్శించి వేరుశనగ పంట విస్తీర్ణం గురించి పంట విత్తిన సమయం నుండి పంట కోత వరకు ఎంత పెట్టుబడి పెట్టుచున్నారని దిగుబడులు ఎంత వచ్చుచున్నాయని సేద్యపు ఖర్చులకు విత్తనమునకు విత్తనశుద్ధికి, కలుపు తీయడానికి ఎరువులకు పురుగుమందులకు, తెగుళ్ళమందులకు,సూక్ష్మపోషకాలకు పంట కోతలకు ఎంత ఖర్చు అవుతున్నదని ఖరీఫ్ రబి సీజన్ల వారీగా అడిగి వ్రాత పూర్వకంగా తీసుకున్నారు. అదేవిదంగా సబ్సిడీ విత్తనం అందుతున్నద లేదా సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు అందుతున్నాయా లేదా సూక్ష్మ పోషకాలు సబ్సిడీ ధరలపై అందుతున్నాయా లేదా అని ఎందుకు విస్తీర్ణం తగ్గుతున్న దని రైతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామరైతులు సకాలంలో వర్షాలు కురవడం లేదని సాగు ఖర్చులు పెరిగిపోయాయని దిగుబడులు తగ్గిపోయాయని సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు వ్యక్తిగతంగా పనిముట్లు ఇవ్వవలెనని సూక్ష్మ పోషకాలు సబ్సిడీ పై అందజేయవలెనని ఉపాధి హామీ పతకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయవలెనని కోరారు. జిల్లావ్యవసాయధికారిని శ్రీమతి ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ ఈనెల ఆఖరివరకు వేరుశనగ విత్తుకొనవచ్చని రాబోయే నాలుగు ఐదు రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నదని రైతులు అదర్య పడవద్దని తెలియజేసారు ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ డైరెక్టర్, అనంతపురం డివిజన్ శ్రీ రవి గారు, కేంద్ర వేరుశనగ పరిశోధన కేంద్రం అధిపతి శ్రీ అజయ్ గారు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రంలో వర్షపు నీరు, మురికి నీరు నిలువ ఉన్నచోట గాంభూజియా చేపలను వదిలిన జిల్లా మలేరియా అధికారి డి ఓబులు..
బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రo లో డెంగ్యూ మాసోత్సవాలలో భాగంగా *జిల్లా మలేరియా అధికారి డి ఓబులు గారు, సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ గారి* ఆధ్వర్యంలో మండల కేంద్రమైన బుక్కరాయసముద్రంలో వర్షపు నీరు, మురికి నీరు నిలువ ఉన్నచోట గాంభూజియా చేపలను వదిలే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మలేరియా అధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి నీరు నిల్వ ఉన్నచోట లార్వా ఎక్కువ ఉండి దోమలను అభివృద్ధి చేస్తాయి కనుక ఆ నీటిలో గాంబుజియా చేపలను వదలడం ద్వారా వదలటం ద్వారా లార్వాలను అవి తినేసి దోమల ఉత్పత్తిని అరికడతాయని తెలియజేశారు. వివిధ గ్రామాలలో నీరు నిల్వ ఉన్నచోట ఈ చేపలను వదలాలని తెలియజేశారు. అన్ని సచివాలయాలకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ చేపలను అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. అలాగే ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహించి దోమల ఉత్పత్తిని అరికట్టాలని, అలాగే ఇంటి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాత టైర్లు, టెంకాయ చిప్పలు, పాత కూలర్లు, మొదలగు వాటిలో నీరు నిలువ లేకుండా చూసుకొని ఈ దోమల ఉత్పత్తిని అరికట్టాలని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తహేరున్నిసా , సామాజిక ఆరోగ్య అధికారి మోహన్ రావు, మలేరియా సబ్ యూనిట్ అధికారి మద్దయ్య, సబ్ యూనిట్ సూపర్వైజర్ శ్రీధర్ మూర్తి, పిహెచ్ఎన్ చేన్నమ్మ, నాగలక్ష్మమ్మ ,హెల్త్ ఎడ్యుకేటర్ ఫాతిమా, సూపర్వైజర్లు ఈశ్వరమ్మ, సత్యనారాయణ శాస్త్రి, జానీ రాజ్, హెల్త్ అసిస్టెంట్ ధనుంజయ, ఆనంద్, మరియు ఆఫీస్ సబార్డినేట్ శివరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా శ్రీ కె.వి.మురళీకృష్ణ IPS గారు పదవీ బాధ్యతల స్వీకరణ..

అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా శ్రీ కె.వి. మురళీకృష్ణ IPS గారు జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి ఎస్పీగా 15 నెలలు పనిచేశాను. అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టాం. సాధారణ బదిలీలలో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీగా నియమించారు. ప్రతిష్టాత్మకమైన అనంతపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉంది. ఈ జిల్లా ఎస్పీగా నాకు అవకాశమిచ్చిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర డిజిపి గారికి ధన్యవాదాలు * ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటైన బేసిక్ పోలీసింగ్ లో భాగమైన అంశాలపై దృష్టిపెడతాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పట్ల ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు మరింత సేవలు అందేలా కార్యాచరణ రూపొందిస్తాం. గంజాయి నియంత్రణపై చట్టపరమైన గట్టి చర్యలు తీసుకుంటాం. గంజాయి అక్రమ రవాణాదారులు, విక్రేతలు, వినియోగదారులను గుర్తించి చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లా ప్రశాంతంగా ఉంచేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకారం తీసుకుంటాం. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తాం. నిష్పక్షపాతంగా, చట్టపరంగా వ్యవహరిస్తాం. ఎవరైనా విఘాతం కల్గిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తాం. క్షేత్రస్థాయిలో మహిళా సమస్యలను గుర్తించి తగు పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాళ్లకు... వాళ్ల యెడల నేరాలకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, కళాశాలల యజమానులు, పరిశ్రమల యజమానుల సహకారం తీసుకుంటాం. జిల్లాలో పని చేస్తున్న హోంగార్డుల నుండీ పోలీసు సిబ్బంది, అధికారులు మరియు వారి కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తాం. పోలీసులకు అవసరమైన సంక్షేమ చర్యలను తీసుకుంటాం. ప్రజలతో మమేకమై మెరుగైన సేవలు అందిస్తూ పోలీసుశాఖ పట్ల విశ్వాసాన్ని, ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తాం. పోలీసులు, మీడియా కలిసి సుహృద్భావ వాతావరణంలో ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తాం..

బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మొక్కలు నాటిన జిల్లా పరిషత్ CEO మండల ఎంపీపీ..
అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీమతి వైఖోమ్ నిదియా దేవి ఐఏఎస్ గారు బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు "హరిత అనంత" కార్యక్రమం క్రింద మొక్కలు నాటించి ప్రతిజ్ఞ చేయించి ప్రతి మొక్క ను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ వారు నాటిన మొక్క ను అడాప్ట్ చేసుకోవాలని తెలిపారు.ఈ కార్య్రమంలో ఎంపీపీ శ్రీమతి దాసరి సునీత గారు, ఎంపిడిఓ శ్రీమతి యం. శోభారాణి గారు EORD APO s. ,AO Senior assistant. Typist ఉపాధి హామీ సిబ్బంది తో పాటు వెలుగు సిబ్బంది అందరూ పాల్గొన్నారు
అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అందజేయాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అందజేయాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..  ముగ్గురు విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్* అనంతపురం, జులై 15 : - *అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో ముగ్గురు విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్ల (ఆర్టిఫిషియల్ లెగ్స్)ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పంపిణీ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పుట్లూరు మండలం కందిగోపుల గ్రామానికి చెందిన వెంకట రామయ్య, ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన ఓబులమ్మ, గుత్తి ఆర్ఎస్ కు చెందిన భాగ్యమ్మ అనే ముగ్గురు విభిన్న ప్రతిభావంతులకు ఒక్కొక్కటి 3 వేల రూపాయలు విలువ చేసే కృత్రిమ కాళ్లను మరియు వెయ్యి రూపాయలు విలువచేసే చేతి కర్రలను జిల్లా కలెక్టర్ వారు కూర్చున్న చోటుకే స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అందజేసేందుకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వికలాంగుల సంక్షేమ శాఖ ఎడిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి రసూల్, తదితరులు పాల్గొన్నారు.
సామాన్య భక్తులతో కలిసి క్యూలో వెళ్లి కుళ్లాయి స్వామి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
సామాన్య భక్తులతో కలిసి క్యూలో వెళ్లి కుళ్లాయి స్వామి ఆంజనేయస్వామి దేవాలయలను దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గూగూడు గ్రామాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం మత సామరస్యానికి ప్రతీక ఈ జంట ఆలయాలు ఎమ్మెల్యే ఐన తర్వాత మొదటి సారి ఉత్సవాలు జరగడం చాలా సంతోషం గతంలో ఉన్న ప్రజా ప్రతినిధులు గుగూడు అభివృద్ధి మరిచారు కుల్లాయి స్వామి ఆశీస్సులతో గుగూడు గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తాం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కు ఇక్కడ ఉన్న సమస్యలను గురించి వివరించాం ఎంపీ సానుకూలంగా స్పందించి తప్పుకుండా ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు కుళాయి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా పోలీసులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు,జిల్లా నాయకులు ఆలం వెంకట్ నరస నాయుడు,ఆంజనేయులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
గూగూడు మొహరం బ్రహ్మోత్సవాలు సందర్బంగా శ్రీ గూగూడు కుల్లాయి స్వామి, శ్రీ ఆంజనేయ స్వాములను దర్శించుకున్న ఎమ్మెల్యే, ఎంపీ, ద్విసభ్య కమిటీ సభ్యులు
శింగనమల నియోజకవర్గం నార్పల మండలం గూగూడు మొహరం బ్రహ్మోత్సవాలు సందర్బంగా గ్రామం లో ఎంతో ప్రసిద్ధి గాంచిన జంట ఆలయాలైన శ్రీ గూగూడు కుల్లాయి స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న *ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ గారు,ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు* మత సామరస్యానికి ప్రతీక ఈ జంట ఆలయాలుకుల్లాయి స్వామి ఆశీస్సులతో గుగూడు గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తాం. ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు, ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు.కుళాయి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా పోలీసులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చొరవ చుపిస్తున్నారని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు