న్యాయం కోసం వచ్చిన బాధితురాలిని లైంగికంగా వేదించిన సనత్ నగర్ సీఐ

హైదరాబాద్ :-

న్యాయం కోసం వచ్చిన బాధితురాలిని లైంగికంగా వేదించిన సనత్ నగర్ సీఐ

ఇన్స్పెక్టర్ పురెందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సీపీ

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ పట్ల అసభ్య చాటింగ్

సైబరాబాద్ సీపీని ఆశ్రయించిన బాధితురాలు. సీఐ చేసిన చాటింగ్ సీపికి చూపించిన బాధితురాలు.

అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్ కి రావాలి అంటూ సీఐ మేసేజిలు

హైదరాబాద్:-విద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద దాడి చేసిన ఓ యువకుడు.

తెలంగాణ. హైదరాబాద్ :-

విద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద దాడి చేసిన ఓ యువకుడు.

హైదరాబాద్ - సనత్ నగర్లో విద్యుత్ బకాయిలు 6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ సిబ్బంది రాములు అనే ఇంటి యజమానిని అడిగాడు

బిల్లు కట్టడానికి యజమాని నిరాకరించడంతో.. విద్యుత్ సిబ్బంది కరెంటు కట్ చేశారు

దీంతో యజమాని కుమారుడు కిక్ బాక్సర్ అయిన మురళీదర్ రావు(19) విద్యుత్ సిబ్బంది పై దాడి చేసి పిడి గుద్దులు గుద్దాడు.

పోలీసులపై పోలీసుల లాఠీఛార్జ్!*
ఝార్ఖండ్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (SPO)పై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని ఎస్పీఓలు సీఎం హేమంత్ సోరెన్ నివాసం వద్ద నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఎస్పీఓలు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి.

ఆంధ్రప్రదేశ్.పల్నాడు జిల్లా :- ప్రభుత్వ అధికారి కారు బోల్తా.. తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్. పల్నాడు జిల్లా :-

ప్రభుత్వ అధికారి కారు బోల్తా తీవ్రగాయాలు

పల్నాడు: నరసరావుపేటలో విధులు నిర్వహిస్తున్న పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రంగారావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెర్లపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన రంగారావును గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రైతును రారాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నకిరేకల్ ల్లో జోరు వర్షంలో అంబరాన్ని అంటిన రైతన్న సంబరాలో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం

నల్గొండ జిల్లా :-

రైతును రారాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

నకిరేకల్ ల్లో జోరు వర్షంలో అంబరాన్ని అంటిన రైతన్న సంబరాలో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

.

నల్గొండ జిల్లా :-

నకిరేకల్ నియోజకవర్గం:-కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ నిధులు విడుదల సంధర్బంలో చేస్తున్న సంబరాల్లో భాగంగా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ నుండి మెయిన్ సెంటర్ వరకు రైతన్నలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఎండ్ల బండ్లు, ట్రాక్టర్ లు, డోల్లు, డీజె చప్పుడుల నడుమా జోరు వర్షంలో రైతులు, నృత్యాలు వేసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాని చేయటం జరిగింది.

అనంతరం మెయిన్ సెంటర్ నందు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ ధన్యవాదాలు మన నాయకుడు మన ముఖ్యమంత్రి రుణమాఫీ ఓకే సారి చేసి రైతులకు ఒడ్డున చేర్చటమే కాకుండా మాయ మాటలు చెప్పే ప్రతిపక్షాలను లేవలేకుండా కొట్టాడు వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు, రుణమాఫీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది దేశంలో ఏ ప్రభుత్వం చేయనిది నాడైనా నేడైనా మన ప్రభుత్వమే చేసింది ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఓ మాజీమంత్రి రాజకీయల నుండి తప్పకుంటా అన్నాడు మన ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో

గత ప్రభుత్వం చేసిన అప్పుల తాలూకు ఏడు వేలకోట్ల వడ్డీ కడుతున్నం ఈ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంతో పాటు ప్రజాస్వామ్య పాలన కూడా వచ్చింది ముఖ్యమంత్రి తో మాట్లాడి 10ఎకరాల్లో ఇంట్రిగెటెడ్ స్కూల్ నిర్మాణం చేసుకుందాం100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభం చేసుకుందాం డ్రిగి కళాశాల ను తెచ్చుకుందాం ఎన్నికల ముందు బిఆర్ఎస్ వారు అయిటిపాముల లిఫ్ట్ కు కొబ్బరికాయలు కొట్టారు తప్ప ఏమి లేదు, దాన్ని ఒక సంవత్సరంలో పూర్తి చేసుకుందాంబ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు నీళ్లు.మీద చల్లుకొని ఊరేగింపు చేశాడు తప్ప అక్కడ పనులేమి జరగలేదు.బ్యాంకు సమస్యలు ఏమైనా ఉంటే నేను మాట్లాడుతా నా దృష్టికి తీసుకురండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులదే గెలుపు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు, భారీ ఎత్తున హాజరుఅయ్యారు.

విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం.3వ తరగతి వరకు అంగన్ వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన

తెలంగాణ.

విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం.

3వ తరగతి వరకు అంగన్ వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన

4 నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు రవాణా సదుపాయం

విద్యావేత్తలతో చర్చించి ప్రణాళికలు రూపొందిచాలని విద్యాశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని విద్యా శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం, ఇతర అధికారులకు సీఎం సూచించారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్లా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పై విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ మేరకు సూచనలు చేశారు.అంగన్ వాడీలకు సింగిల్ టీచర్

చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంగన్ వాడీలలో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా విద్యా బోధన కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ నియమించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు.రెసిడెన్షియల్స్ కు రవాణా సదుపాయం 3వ తరగతి వరకు అంగన్ వాడీ ప్లే స్కూల్ లో బోధన తర్వాత విద్యార్థులు 4వతరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకునేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లివచ్చేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని సీఎం సూచించారు.విద్యావేత్తలతో చర్చించాక పైలట్ ప్రాజెక్టు

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్లే స్కూల్, సెమీ రెసిడెన్షియల్ విధానాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయడానికంటే ముందే విద్యా వేత్తల అభిప్రాయాలు తీసుకోవాలని విద్యా శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యావేత్తల సూచనలను బట్టి ముందుగా ఒకట్రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు ఉండాలని సీఎం చెప్పారు.

సీఎస్ఆర్ ఫండ్స్ తోనూ..

పాఠశాల్లో వసతులు, సౌకర్యాల పెంపు కోసం ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ( సీఎస్ఆర్) ఫండ్స్ పైనా దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు. వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామం లో రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం

నల్గొండ జిల్లా:-నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో రైతు వేదిక భవనం లో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడియె కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

.

నల్గొండ జిల్లా :-

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో రైతు వేదిక భవనం లో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడియె కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం గ్రామంలో రైతులతో కలిసి ట్రాక్టర్ ను నడిపి గ్రామంలోని రైతులు డప్పుచప్పుల్లతో ఆనందం వ్యక్తం చేస్తు ర్యాలీ ని నిర్వహించిన్న.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినం ఈరోజు అమలు చేస్తున్నం ఎవరు ఎన్ని ఛాలెంజ్ లు చేసినా మన ముఖ్యమంత్రి ఏక కాలంలో రుణాలు మాఫీ చేస్తూ రైతుల పక్షపాతిగా నిలుస్తున్నారుముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి నకిరేకల్ నియోజకవర్గ రైతుల తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ రాష్టంలో రైతు రాజ్యం వచ్చింది.రేపు అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు, పాలభిశేకలు చేసి రాష్ట్ర ప్రభుత్వం కి ధన్యవాదాలు తెలపాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.

తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాల జాబితాను విడుదల చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రానున్న మూడు రోజులు అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే జూలై 16న (మంగళవారం) గుజరాత్‌లో అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. అలాగే వచ్చే మూడు రోజుల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, నాగాలాండ్, కేరళ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ :-కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలి: ఏపీ సీఎం చంద్రబాబు హితవు

కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలి: ఏపీ సీఎం చంద్రబాబు హితవు

సీఎం చంద్రబాబు ఆ పార్టీ కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు.

అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ..

‘కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలి.

ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే..

నేనూ వారి కాళ్లకు దండం పెడతా.

ఈ రోజు నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నా.

తల్లిదండ్రులు, భగవంతుడికి తప్ప నాయకుల కాళ్లకు దండం పెట్టకూడదు.’ అని అన్నారు.

ఈ మేరకు కార్యకర్తలు, ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు.

నల్గొండ జిల్లా :-మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత

పెన్ పహాడ్ మండల వాసుల నుండి

మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత

నల్గొండ జిల్లా :-మిర్యాలగూడలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు

శనివారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో

మిర్యాలగూడ డిఎస్సీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్సై రవి వారి సిబ్బంది పట్టణంలో గాలింపు చర్యలలో ఉన్న క్రమంలో ఈ నెల 12 న మధ్యాహ్నం పట్టణ శివారు నందు అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలు తనిఖీ చేశారు

వెహికిల్ నెం.1 TS-08-0-0433 మహింద్రా బోలెరో వాహనం, 15-29-1-6434 మహిళ మెరాజొ వాహనాలను తనిఖీ చేసి క్రమంలో అందులో ఉన్న దాదాపు నలుగురు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోగ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. అట్టి వాహనాలలో సుమారు 35 లక్షల రూపాయల విలువగల 140.585 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు

గంజాయి అక్రమ రవాణా గురించి అదుపులోకి తీసుకున్న వ్యక్తి భూక్యా రాముని విదారించగా అతను చెప్పిన వివరాల ప్రకారం ఈరెండు వాహనాలు

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలానికి చెందిన నూనవత్ జగన్, నునావత్తు మంచ నాయక్ ల ఆదేశాల మేరకు ఒకటి హైదరాబాద్ నుండి, మరొకటి సూర్యాపేట నుండి దేవరకొండ ప్రాంతంలో మద్దిమడుగు వెళ్ళే దారిలో నిర్జన ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు సరఫరా చేసిన గంజాయిని రెండు వాహనాలలో లోడ్ చేసుకుని జగన్, మంచ నాయక్ ఆదేశాల మేరకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు .

పెన్ పహాడ్ మండలానికి చెందిన మరికొంత మండి ఉన్నట్లు తెలిపినాడు. పరారీలో ఉన్న నిందితుల గురించి మిర్యాలగూడ డి.ఎస్.పి ఆధ్వర్యంలో ముగ్గురు సిఐ లతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ గంజాయి సప్లై చేసినది ఎవరు ఇది ఎటు రవాణా అవుతుంది అనే విషయమై పోలీసు వారు విచారణ చేస్తున్నార

గంజాయి రవాణాలో పట్టుబడ్డ రాము పై మరియు ఇతర నిందితులపై గతంలో కేసులు ఉన్నాయని తెలిపారు

నిందితుల వివరాలు

నూనవత్ బగన్, వయస్సు 32 సంఘాలు, న్యూ బంజారాహిల్స్, పెన్ పహాడ్ మండలం, పరారీలో ఉన్నాడు

2. నునావత్ మంచ నాయక్, వయస్సు 45 సం//లు, జల్ మాల్ కుంట తండ, పెన్ పహాడ్ మండలం, పరారీలో

3. ఆంగోతు నాగరాజు, వయస్సు 33 సం||లు, లాల్ సింగ్ తండ, పెన్ పహాడ్ మండలం, (పరారీలో ఉన్నాడు

4. బాణోతు సాయి, వయస్సు 28 సం//లు, జుబ్లీపుర, ఖమ్మం జిల్లా, (పరారీలో ఉన్నాడు

5. భూక్యా రాము S/O రామోజీ, వయస్సు 35 సం!!లు, వృత్తి: ప్రైవేట్ ఎంప్లాయి, నివాసం: లాల్ సింగ్ తండ, పెస్ పహాడ్ మండలం (అరెస్ట్ చేయబడిన వ్యక్తి

నిందితుడి నుండి స్వాదీన పర్చుకున్న పొత్తు వివరాలు

140.585 కిలోల గంజాయి (35 లక్షల విలువ గలది

2. TS-08-D-0433 3. TS-29-F-6434

ఈ కేసులో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుదాకర్, పోలియా ఇన్స్పెక్టర్ జనార్ధన్, హాలియా ఎస్సై సతీష్, మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్ఐ రవి మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు