రైతు ఆత్మగౌరవం కోసం రుణమాఫీ: కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు గాదే శోభారాణి

రామన్నపేట: రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలు రుణమాఫీ అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రామన్నపేట మండల మహిళా అధ్యక్షురాలు గాదె శోభారాణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో రుణమాఫీని ఏడాదికి 25 వేల చొప్పున నాలుగు విడతలుగా లక్ష రూపాయలు మాత్రమే అమలు చేసిందన్నారు. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేండ్లు అధికారంలో ఉన్నా రుణమాఫీ అమలు చేయలేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పెట్టినప్పటికీ రుణమాఫీని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఆగస్టు 15 లోగా మిగతా లక్ష రూపాయలు రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. 7 లక్షల కోట్లు అప్పులు ఉన్న ఈ రాష్ట్రంలో ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేయడం ఆర్థిక భారం అయినప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టు కోవడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. రంగాల్లో ఇచ్చిన మాట నిల బెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగినదని ఆమె అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమాన్ని ఆపకుండా అన్ని కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ అవుతుందని ఆమె చెప్పారు.
వలిగొండ - 7 వ అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వలిగొండ - 7వ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్ పబ్బు నాగమణి ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ నాగమణి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు నిండిన పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించడం జరిగిందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలని కోరారు .ఈ సందర్భంగా ఈసీసీఈ డే నిర్వహించి తల్లిదండ్రులకు ప్రీస్కూల్ విద్య ,పూర్వ బాల్యదశ ప్రాముఖ్యత గురించి వివరించారు .అనంతరం మొక్కలు నాటారు .ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నాగమణి, ఆశ వర్కర్ తెరిసా, తల్లులు నికిత,ఉమా, రమ, ఎస్.కె హజ్రా ,వెంకట నరసమ్మ , రమ్య తదితరులు పాల్గొన్నారు.

ఆగస్టు 5 ,6 న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : పల్లగొర్ల మోదీ రాందేవ్

భువనగిరి : వచ్చే నెల ఆగస్టు 5,6న జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భువనగిరి లోని కాలేజీలు హాస్టల్స్ విజిట్ చేసి అనంతరం ఉమెన్స్ కాలేజ్ వద్ద విద్యార్థులతో కలిసి కరపత్రం ఆవిష్కరణ చేసి అభివాదం చేశారు Bc విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమానికి లక్షలాదిమందిగా తరలిరావాలని చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అలాగే SC, ST,BC బీసీ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రుత్వ శాఖ ఏర్పాటు చేయాలని జనాభా గణనలో బీసీ కుల గణన చేయాలని దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని గవర్నమెంట్ సంస్థలో ప్రైవేటీకరణ నిషేధించాలని బీసీ క్రిమిలేయర్ ను ఎత్తివేయాలని ప్రమోషన్లలో రిజర్వేషన్లు వర్తింపజేయాలని బడ్జెట్లో బీసీలకు 5లక్షల కోట్లు కేటాయించాలని బీసీలంట్లే కేవలం ఓట్లు వేసే యంత్రాలుగనే చూస్తున్నాయి ఈ ప్రభుత్వాలు దేశ గవర్నమెంట్ ఉద్యోగాలలో బీసీలు 7 శాతం గిట్ల లేకపోవడం సిగ్గుచేటు రాజకీయంగా 12 శాతం దాటలేదు బీసీలు రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీసీలకు స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ అని చెప్పి దాన్ని అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారు బీసీల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తాం బీసీ బిల్లుకు మద్దతు అని చెప్పి ఇంతవరకు దాని ఊసే లేదు బీసీ బిల్లుకు మద్దతు తెలపకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపుతామని హెచ్చరించారు .ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు వట్టెం మధు, చిన్నం సాగర్,పబ్బాల ఎలీషా, మనీషా రెడ్డి, శాలిని నాయక్, మాధురి, సంగీత, మౌనిక గౌడ్, వసుందరి,ప్రత్యూష,మానస, సునీత తదితరులు పాల్గొన్నారు.
కూనూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ కే మోహిన్ కి మొహర్రం కానుక రూ. 10వేలు అందజేసిన పారిశ్రామికవేత్త మిర్యాల శేషయ్య

రామన్నపేట: మొహరం పండుగ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా  మండలంలోని భోగారం గ్రామానికి చెందిన ఎస్కే.మోహిన్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కూనూరు సాయి కుమార్ గౌడ్ అధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మిర్యాల శేషయ్య పండుగ కానుకగా రూ.10000/- నగదు ను శుక్రవారం నాడు భోగారం గ్రామానికి వచ్చి అందజేశారు. అనంతరం శేషయ్య మాట్లాడుతూ కులం, మతం విభేదాలు లేకుండా పండుగ నిర్వహించే కార్యక్రమానికి అండగా ఉంటామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎల్లప్పుడూ ముందుండి సహకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కూనూరు రాజు, గోగు సతీష్, జెల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి ,ప్రైవేట్ పాఠశాలల్లో ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి: AISF

అఖిల భారత విద్యార్థి సమైక్య (AISF) యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో మోత్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా AISF జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. మహిళల విద్యార్థులకు బాత్ రూమ్ శుభ్రంగా లేకపోవడం మూలంగా ఇబ్బందులు పడుతున్నారు. .లైబ్రరీ సౌకర్యాలు లేకపోవడం మూలంగా విద్యార్థుల అధ్యయనంతో పాటు వారి భవిష్యత్ పైన కూడా ప్రభావం పడుతుందని అన్నారు. పాఠశాలలో పారిశుద్ధ కార్మికులు లేకపోవడం మూలంగా పాఠశాల ఆవరణమంతా శుభ్రంగా లేకపోవడం మరియు మంచినీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో వైరల్ ఫీవర్ తో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.. చాలా పాఠశాలలో పురాతన భవనాలు కుంగి పోవడంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాఠశాలలు మార్చడం జరుగుతుంది దీని మూలంగా అనేకమంది విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు కావున తక్షణమే సొంత భవనాలను నిర్మించాలి అదే విధంగా అనేక పాఠశాలలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ కొరత ఉంది. కావున తక్షణమే అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని కోరడం జరిగింది లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ గా ఈ సమస్యలన్నీ తీరేవరకు విద్యార్థులకు సరైన విద్య నాణ్యతతో కూడిన సదుపాయాలు కల్పించేంత వరకు పోరాటం కొనసాగుతుందని వారు అన్నారు. అనంతరం ప్రమాదానికి గురైన సెయింట్ ఆన్స్ పాఠశాలను సందర్శించి పాఠశాల కరస్పాండెంట్ తో మాట్లాడడం జరిగింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ మోత్కూరు మండల నాయకులు చందు వినయ్ అనిల్ కుమార్ పాల్గొనడం జరిగింది.
పహిల్వాన్ పురం అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట - అంగన్వాడి బాట

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని  పహిల్వాన్ పురం అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని ప్రైమరీ స్కూలు ప్రధానోపాధ్యాయులు రమేష్ , అంగన్వాడి టీచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల పిల్లలను అంగన్వాడి కేంద్రంలో చేర్పించి వారికి పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని ,తల్లిదండ్రులు తమ పిల్లలని అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలి .వారి ఆరోగ్య విద్య, దృష్టి సారించాలని కోరారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు .అంగన్వాడి కేంద్రంలో నర్సరీ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపించకుండా ఆ వయసు ఉన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలి .ఆటపాటలతో విద్యను అందిస్తున్నాము మరియు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బాలమని, రాణి ,ఆశా వర్కర్లు పద్మ ,చంద్రకళ మరియు తల్లులు రజిత, మమత ,సంతోష, అలివేలు, లావణ్య, హేమలత, మౌనిక, గౌతమి, గీత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
సుంకి శాల పాఠశాల నుండి బదిలీపై వెళ్తున్న టీచర్లకు ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల పాఠశాల నుండి బదిలీ పై వెళ్తున్న టీచర్లు ఆలకుంట్ల శ్రీనివాస్ , వరమ్మ ,వై వి ఎన్ . రెడ్డి,వి మాధవి లకు బదిలీ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి బుగ్గారెడ్డి  ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించినారు . ఈ కార్యక్రమంలో  వారి సేవలకు గుర్తుగా  టీచర్లకు మెమెంటోస్  అందజేసి వీడ్కోలు శుభాకాంక్షలు తెలియజేశారు. సుంకి శాల పాఠశాలకు బదిలీపై వచ్చిన టీచర్లు ఇద్దరు అయాజ్ అహ్మద్. పి శ్రీను  లకు హెచ్ ఎం.  జి. బుగ్గా రెడ్డి సాదరంగా  ఆహ్వానం పలికినారు. బదిలీపై వెళ్లిన టీచర్లు వారి అనుభవము విద్యార్థులతో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మొగిలి పాక నరసింహ, పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి వినతి

భువనగిరి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, 1921 లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు 1923 లో "రూపాయి దాని సమస్య- పరిష్కార మార్గం" అనే పుస్తకాన్ని వ్రాసి హిల్టాన్ యంగ్ కమిషన్, సైమన్ కమిషన్,రాయల్ కమిషన్ కు ఇవ్వడం వల్ల నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ఏర్పాటు చేసారని, ఆనాడు అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదని , అలాంటి నాయకుని ఫోటోని కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా, పార్లమెంటులో మాట్లాడాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కి, కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఆద్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన, ఆర్బిఐ పైన ఉందని ఎం పి అన్నారు . ఈ అంశంపై పార్లమెంట్లో మాట్లాడతానని, ఈనెల 29,30,31తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగే "మహాధర్నాకు" హాజరవుతానని ఎం పి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. భువగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చిన వారిలో కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్, గౌరవాధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, జిల్లా ఎస్సీ /ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, తెలంగాణ దళిత సేన రాష్ట్ర అద్యక్షులు పల్లెర్ల వెంకటేష్, నాయకులు నల్ల కృష్ణ, కుడుదుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఔరవాణి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

ఎన్నికలో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్ట మొదటి సారిగా మహిళలకూ ఉచిత ప్రయాణం, రెండోదిగా ఉచిత కరెంటు బిల్లు గృహ జ్యోతి నేడు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణ మాఫీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామంలో పాలాభిషేకం చేశారు. ముందు ముందు సామాన్య ప్రజల హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పేదోడి కి న్యాయం జరగాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారనే సాధ్యమన్నారు. తెలంగాణ మార్పు అంటే పేదోడి దగ్గరికి వచ్చిన ఫలితమే నేడు ఎంతో మంది రైతు కళ్ళల్లో ఆనందం వెలుగుతుందన్నారు.అదే విధంగా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిగోటి శేఖర్, ముప్పిడి రవి, సింగం నర్సింహా, ముక్కముల నాగరాజు, రూపాని రాములు, నడిగోటి అంజయ్య, ఎల్లయ్య, మాధగోని శ్రీను, జక్కిలి గణేష్, శేఖర్, రఘు, నర్సింహా చారి, శివ, జలంధర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
వలిగొండ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాలాభిషేకం చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయుచున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భువనగిరి నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి మండల కేంద్రంలోని రైతు వేదిక వరకు ఎడ్లబండి పై ఊరేగింపుగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితో పాటు వందలాది మంది కార్యకర్తలు రైతులు , రైతు వేదిక కు చేరుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో రుణమాఫీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు కే . జండగే తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో, మండల అధికారులు, మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్ , కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి , గరిసె రవి, పలుసం సతీష్ గౌడ్ ,బత్తిన లింగయ్య, కాసుల వెంకన్న, బత్తిని సహదేవ్, పాలకూర్ల వెంకటేశం, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.