ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

సముద్రమట్టానికి 1.5 కి.మీ.ఎత్తులో అల్పపీడనం

అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం

ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు

30 నుంచి 40 కి.మీ.వేగంతో ఈదురుగాలులు

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో..

మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం

వినియోగదారుల హక్కులకు తూట్లు పొడుస్తున్న పెట్రోల్ బంకులపై కలెక్టర్ కు పిర్యాదు..

వినియోగదారుల హక్కులకు తూట్లు పొడుస్తున్న పెట్రోల్ బంకులపై కలెక్టర్ కు పిర్యాదు..

వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు కల్పించాల్సిన ఉచిత సేవలను విస్మరించడంపై నల్గొండ పట్టణానికి చెందిన ఎండి సాధిక్ పాషా మరియు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం ఉచిత త్రాగునీరు, మరుగుదొడ్లు, ఉచిత ఫోన్ సౌకర్యం అలాగే వాహనాలకు గాలి నింపడం లాంటి కనీస సౌకర్యాలను వినియోగదారుల చట్టం ప్రకారం వాహన వినియోగదారులకు అందించాల్సిన బాధ్యత పెట్రోల్ బంకుల నిర్వాహకులపై ఉన్నది.

కానీ అట్టి నిబంధనలను ఆయా పెట్రోల్ బంకుల యజమానులు వినియోగదారులకు ఉచితంగా సేవలను అందించకపోగా వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు.ఇటీవల సామాజిక కార్యకర్త అయినటువంటి సాదిక్ పాషా వారి వాహనానికి దేవరకొండ రోడ్డు విశాల్ మార్ట్ పక్కన గల హెచ్. పి. పెట్రోల్ బంకులో తన వాహనానికి పెట్రోల్ పోయించుకున్న తరువాత టైర్లలో గాలి నింపమని కోరగా అక్కడి మేనేజరు దురుసుగా మాట్లాడడమే కాకుండా ఎక్కడ ఫిర్యాదు చేస్తారో చేసుకోండి మాకేం అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది.అంతేకాకుండా జిల్లా కేంద్రంలో ఉన్న జైలు పెట్రోల్ బంకులో సైతం పరిమితికి మించి గాలిని టైర్లలో నింపడం వలన వాహన టైర్లు పేలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. కావున ఇట్టి విషయమై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించగా అక్కడి సిబ్బంది పెడచెవిన పెట్టడం జరిగింది.ఇది కేవలం ఏ ఒక్క పెట్రోల్ బంకుకే పరిమితం కాదు నల్గొండ పట్టణంలో ఉన్న దాదాపు 80% బంకుల్లో ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.

అలాగే చాలా పెట్రోల్ బంకుల్లో వాహనాలకు గాలి నింపే సాధనాలు పూర్తిగా చెడిపోయి శిధిలావస్థలో దర్శనమిస్తున్నాయి.అంతేకాక పలు పెట్రోల్ బంకుల్లో పది రూపాయల నాణేలు మరియు ఫోన్ పే, గూగుల్ పే, లాంటి ఆన్ లైన్ పేమెంట్ లను నిరాకరిస్తూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూన్నారు. ఒకవేళ పెట్రోల్ నాణ్యతలో వినియోగదారునికి అనుమానం కలిగినచో అట్టి నాణ్యతను చెక్ చేయడానికి ఫిల్టర్ పేపర్ అందుబాటులో ఉంచడం లేదు మరియు చాలా పెట్రోల్ బంకుల్లో డెన్సిటీ డిస్ప్లే కూడా చేయడం లేదు ఇలాంటి విషయాలు సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో వీరి ఆటలు సాగుతున్నాయి మరియు పెట్రోల్ బంకుల్లో పనిచేసే ఉద్యోగులు వినియోగదారులతో ఎలా మసలుకోవాలో అవగాహన లేక పలుమార్లు వినియోగదారులతో ఘర్షణలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కావున ఇట్టి విషయాలపై సంబంధిత అధికారులు లు దృష్టి సారించి వినియోగదారులకు ఉచితంగా అందించాల్సిన సేవలను పటిష్టంగా అమలుపరచాలని అట్టి సేవలను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఎం.డి. సాధిక్ పాష, ఎస్బి న్యూస్ రిపోర్టర్ కిరణ్ కుమార్,గుండె జనార్ధన్,జిల్లా కర్ణకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ తెలంగాణ ప్రభుత్వం(హైదరాబాద్) అడిషనల్ డైరెక్టర్ కు విజ్ఞప్తి పత్రం అందజేసిన కట్టెల శివకుమార్

షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ విజ్ఞప్తి 

విషయం,: షెడ్యూల్ సంక్షేమ వసతి గృహ వార్డెన్లు హెచ్ డబ్ల్యు ఓ గత 10 12 సంవత్సరాల నుండి ఒకే చోట ఉండి జిల్లాలో పాతుకపోవడం జరిగింది వీరిని ట్రాన్స్ఫర్ చేయుట గురించి 

హెచ్ డబ్లూ వార్డెన్లు షెడ్యూలు సంక్షేమ వసతిగృహ వార్డెన్లు వీరు ఒకే దగ్గర ఉండడం వలన వీరు డ్యూటీ సక్రమంగా నిర్వహించడం లేదువీరు డ్యూటీ సక్రమంగా నిర్వహించకపోగా వివిధ సంఘాలలో ఉండి సంఘ పదవులు అనుభవిస్తూ సంఘాలు అడ్డుపెట్టుకొని దొంగ ఫేక్ అనారోగ్య సర్టిఫికెట్లు సృష్టించికొని ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలోనే ఉండాలని చూస్తున్నారు విద్యార్థులకు అందవలసిన నాణ్యమైన భోజనం వసతులు కల్పించకుండా వీరు విద్యార్థులకు అందవలసినవి ఇవ్వకుండా అక్రమ పద్ధతిలో అవినీతికి పాల్పడుతున్నారు కావున ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం లాంగ్ స్టాండ్ అయిన ప్రతి ఒక్కరి ని ట్రాన్స్ఫర్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఓయూ రాష్ట్ర కార్యదర్శి బాకీ తరుణ్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ అలంపల్లి కొండన్న రఘు పాల్గొన్నారు పాల్గొని వివరించారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ హరీష్ రావును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు...

కేంద్రమంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

హరీష్‌రావు మంచి నాయకుడు, ప్రజల మనిషి

హరీష్‌ BJPలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలి

నేను హరీష్‌రావుతో మాట్లాడలేదు-బండి సంజయ్‌

బీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు ఒక్కడే మంచి నేత

బీజేపీలో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం ఒక డ్రామా

బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసే రావాలి-బండి

భద్రాద్రి:సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి జిల్లాకు చెందినవి అవి పక్క జిల్లాలకు మళ్లించడం సరికాదు మా నీళ్లు మాకే కావాలి:సిపిఐ ఎంఎల్

సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి జిల్లాకు చెందినవి అవి పక్క జిల్లాలకు మళ్లించడం సరికాదు మా నీళ్లు మాకే కావాలి:సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం దగ్గర మొదలైన సీతారామ ప్రాజెక్టు నీళ్లు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏ ఒక్క మండలానికి ఇవ్వకుండా పక్క జిల్లాకు తరలించడంలో ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల పనితీరని అర్థమవుతుందని CPI ML న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పిలుపునిచ్చారు.

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీలు ఇచ్చిన పిలుపులో ఈరోజు దుమ్ముగూడెం లక్ష్మీనగరం గ్రామంలో గ్రామంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల మొత్తం గోదావరి నీళ్లు తరలిస్తుంటే నీళ్లు నిధులు నియామకాల పేరుతో జరిగిన తెలంగాణ ఉద్యమం తో సాధించుకున్న ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా సీతారామ ప్రాజెక్టులో అన్యాయం చేస్తే కొట్లాడి సాధించుకున్న సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఈరోజు ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరావు బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఒక్క ఎకరాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వకుండా పక్క జిల్లాకు తరలించడంలో అంతర్యమేమిటో చెప్పాలని వారు అన్నారు.ఈ జిల్లాలో జిల్లాలో పాత డిజైన్లు మార్చి కొత్త డిజైన్ తీసుకువచ్చి భద్రాద్రి కొత్తగూడెంకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారన్నారు.సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల హక్కుని సామాజిక సూత్రాలను కూడా మరిచిపోయి చట్టబద్ధత హక్కులను కూడా మరిచిపోయి ఈ ముగ్గురు మంత్రులు నీళ్లను పక్క జిల్లాల తరలించడం అంటే ఇక్కడ ఏజెన్సీ ప్రజలపై వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని వారు అన్నారు.తక్షణమే గోదావరి నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్త పాటు ఏజెన్సీ ప్రాంతాలకు అందించాలని ఏజెన్సీలో ఉన్న భూములను సస్యశ్యామలం చేయాలని ఇక్కడున్నటువంటి ప్రజల్ని రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వారు అన్నారు.

అలాగే టేకులపల్లిలో రోళ్ళపాడు రిజర్వాయర్ కడితే ఈ జిల్లా తో పాటు పక్క జిల్లాలకు కూడా ఉపయోగం జరుగుతుందని ఆ క్రమంలో రోళ్ళపాడు రిజర్వాయర్ని నిర్మించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో బుద్దులు సమ్మక్క మడకం సమ్మక్క మడకం సీత శ్రీ శీలం లక్ష్మి దేవి అజయ్ రాజు రమేష్ కనక తదితరులు పాల్గొన్నారు.

మత్స్యశాఖ సమాఖ్య చైర్మన్ కమీషనర్ లను సన్నానించిన ముదిరాజ్ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్

మత్స్యశాఖ సమాఖ్య చైర్మన్ కమీషనర్ లను సన్నానించిన ముదిరాజ్ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్

ఈరోజు హైదరాబాదులోని మత్స్యశాక కార్యాలయంలో మత్స్య సహకార సమాఖ్య చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మెట్టు సాయిని మరియు కమిషనర్ ప్రియలకు సన్నానం చేసి అభినందించిన తెలంగాణ రాష్ర్టముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ ని మరియు మత్స్యశాఖ సమాఖ్య చైర్మన్ మెట్టు సాయిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని ఈ సందర్భంగా రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు కొంతమంది మత్స్యశాఖ అధికారులు పెడుతున్న ఇబ్బందులు అధికార దుర్వినియోగం ఇతరత్రా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు ఇట్టి సమస్యల విషయంలో పరిష్కారానికి కృషి చేస్తామని హమీ ఇచ్చినందున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు

ఎన్డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మురళికి ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన శివ కుమార్..

నేడు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్రం స్టేట్ అధ్యక్షులు కట్టెల శివకుమార్ గారు ఎన్డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ మరియు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బీసీ కులానికి చెందిన నాగిళ్ల మురళి అధ్యక్షుడు అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అయిన కట్టెల శివకుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నుండి 1982 లాస్ లో ఉన్న నష్టాలలో నడుస్తున్న ఎన్ డి సి ఎం ఎస్ ను గత మూడు సంవత్సరాలుగా అనేక బ్రాంచీలు జిల్లా లేవల్ను ఏర్పాటు చేసి మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 90 లక్షల నష్టాలలో ఉన్న ఎన్డీసీఎంఎస్ ను ప్రస్తుతము మూడు కోట్ల లాభాలోకి నడిపించిన ఘనత వీరికి దక్కుతుందని తెలియజేసినాడు మరియు టీఎన్జీవోస్ ఉద్యోగస్తుల అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగి వారి మంచి చెడులను జిల్లాలో మొత్తంగా పరిశీలించి వారి సమస్యలపై ఎనలేని పోరాటం చేయాలని తెలుపుతూ వారికి మరొకసారి మా అసోసియేషన్ తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అల్లం పల్లి కొండన రాష్ట్ర కార్యదర్శి కమ్మలా నరేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ కళాశాల ఫీజులపై నియంత్రణ, మరియు కళాశాలల నిర్వహణలో లోపల గురించి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ వినతి పత్రం

నేడు నల్గొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి డిఐఈఓ దస్రు నాయక్ గారిని కలిసి వినతిపత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్

 

నల్గొండ జిల్లా లో ఇంటర్ కళాశాలల ఫీజులపై నియంత్రణ ఏర్పాటు చేయాలి పర్మిషన్ లేకుండా ఇంటర్ కాలేజీలు నిర్వహించడం జరుగుతుంది 

జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్ కాలేజీలకు హాస్టల్ పర్మిషన్ లేకున్నా యదేచ్చగా లక్షల రూపాయలు తీసుకుంటూ హాస్టల్ నడిపిస్తున్నారు.

అప్లికేషన్ ఫామ్ పేరిట వెయ్యి నుండి 1500 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది 

 జూనియర్ కళాశాలలో హెచ్సిసి సీఈసీ ఒకేషనల్ గ్రూపులు నడపకుండా కేవలం బైపిసి ఎంపీసీ అడ్మిషన్స్ తీసుకొని నానో స్పార్క్ బ్యాచ్ గ్రూపులు అని లక్షల రూపాయలు దండుకోవడం జరుగుతుంది.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా పెద్ద మొత్తంలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు 

జూనియర్ కళాశాల ప్రైవేట్ యాజమాన్యం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం బయటపెట్టకుండా విద్యార్థుల తల్లిదండ్రుల మోసం చేయడం జరుగుతుంది 

 క్రీడా ప్రాంగణాలు ల్యాబ్స్ లేకుండా ఒకే పర్మిషన్ తీసుకొని రెండు మూడు బిల్డింగ్స్ లలో కాలేజీ రన్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి 

 

రేకుల షెడ్లలో కాలేజీలు నడపడం వలన విద్యార్థులను తీవ్ర తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది కావున వాటిపై పర్మిషన్ రద్దు చేయాలని నిరు పేద విద్యార్థులకు న్యాయం చేసి ఫీజుల నియంత్రణ చేయాలని తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న రాష్ట్ర కార్యదర్శి కమల నరేష్ జిల్లా కోఆర్డినేటర్ కిషోర్ సురేందర్ ప్రవీణ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో నూతనంగా నల్లగొండ వన్ టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన సిఐకి ఘన స్వాగతం...

సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో నూతనంగా నల్లగొండ వన్ టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన సిఐకి ఘన స్వాగతం...

నేడు సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో నల్గొండ వన్ టౌన్ సిఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి కి పూల మొక్క అందించి, ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బైరు సైదులు గౌడ్, ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగరి రామకృష్ణ, నల్లగొండ జిల్లా కార్యదర్శి మాలే వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు

*నల్గొండ వన్ టౌన్ సిఐ గా ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి  నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపిన అడ్వకేట్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ మిత్రాస్ యూనిటీ ఆఫ్ యూత్ చైర్మన్ కంబాలపల్లి శ్రీకాంత్ వర్మ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న శ్రీధర్ మోహన్ చిత్రం నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.