madagoni surendar

Jul 13 2024, 20:52

ఆంధ్రప్రదేశ్ :-కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలి: ఏపీ సీఎం చంద్రబాబు హితవు

కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలి: ఏపీ సీఎం చంద్రబాబు హితవు

సీఎం చంద్రబాబు ఆ పార్టీ కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు.

అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ..

‘కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలి.

ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే..

నేనూ వారి కాళ్లకు దండం పెడతా.

ఈ రోజు నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నా.

తల్లిదండ్రులు, భగవంతుడికి తప్ప నాయకుల కాళ్లకు దండం పెట్టకూడదు.’ అని అన్నారు.

ఈ మేరకు కార్యకర్తలు, ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు.

madagoni surendar

Jul 13 2024, 19:50

నల్గొండ జిల్లా :-మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత

పెన్ పహాడ్ మండల వాసుల నుండి

మిర్యాలగూడలో భారీగా గంజాయి పట్టివేత

నల్గొండ జిల్లా :-మిర్యాలగూడలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు

శనివారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో

మిర్యాలగూడ డిఎస్సీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్సై రవి వారి సిబ్బంది పట్టణంలో గాలింపు చర్యలలో ఉన్న క్రమంలో ఈ నెల 12 న మధ్యాహ్నం పట్టణ శివారు నందు అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలు తనిఖీ చేశారు

వెహికిల్ నెం.1 TS-08-0-0433 మహింద్రా బోలెరో వాహనం, 15-29-1-6434 మహిళ మెరాజొ వాహనాలను తనిఖీ చేసి క్రమంలో అందులో ఉన్న దాదాపు నలుగురు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోగ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. అట్టి వాహనాలలో సుమారు 35 లక్షల రూపాయల విలువగల 140.585 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు

గంజాయి అక్రమ రవాణా గురించి అదుపులోకి తీసుకున్న వ్యక్తి భూక్యా రాముని విదారించగా అతను చెప్పిన వివరాల ప్రకారం ఈరెండు వాహనాలు

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలానికి చెందిన నూనవత్ జగన్, నునావత్తు మంచ నాయక్ ల ఆదేశాల మేరకు ఒకటి హైదరాబాద్ నుండి, మరొకటి సూర్యాపేట నుండి దేవరకొండ ప్రాంతంలో మద్దిమడుగు వెళ్ళే దారిలో నిర్జన ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు సరఫరా చేసిన గంజాయిని రెండు వాహనాలలో లోడ్ చేసుకుని జగన్, మంచ నాయక్ ఆదేశాల మేరకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు .

పెన్ పహాడ్ మండలానికి చెందిన మరికొంత మండి ఉన్నట్లు తెలిపినాడు. పరారీలో ఉన్న నిందితుల గురించి మిర్యాలగూడ డి.ఎస్.పి ఆధ్వర్యంలో ముగ్గురు సిఐ లతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ గంజాయి సప్లై చేసినది ఎవరు ఇది ఎటు రవాణా అవుతుంది అనే విషయమై పోలీసు వారు విచారణ చేస్తున్నార

గంజాయి రవాణాలో పట్టుబడ్డ రాము పై మరియు ఇతర నిందితులపై గతంలో కేసులు ఉన్నాయని తెలిపారు

నిందితుల వివరాలు

నూనవత్ బగన్, వయస్సు 32 సంఘాలు, న్యూ బంజారాహిల్స్, పెన్ పహాడ్ మండలం, పరారీలో ఉన్నాడు

2. నునావత్ మంచ నాయక్, వయస్సు 45 సం//లు, జల్ మాల్ కుంట తండ, పెన్ పహాడ్ మండలం, పరారీలో

3. ఆంగోతు నాగరాజు, వయస్సు 33 సం||లు, లాల్ సింగ్ తండ, పెన్ పహాడ్ మండలం, (పరారీలో ఉన్నాడు

4. బాణోతు సాయి, వయస్సు 28 సం//లు, జుబ్లీపుర, ఖమ్మం జిల్లా, (పరారీలో ఉన్నాడు

5. భూక్యా రాము S/O రామోజీ, వయస్సు 35 సం!!లు, వృత్తి: ప్రైవేట్ ఎంప్లాయి, నివాసం: లాల్ సింగ్ తండ, పెస్ పహాడ్ మండలం (అరెస్ట్ చేయబడిన వ్యక్తి

నిందితుడి నుండి స్వాదీన పర్చుకున్న పొత్తు వివరాలు

140.585 కిలోల గంజాయి (35 లక్షల విలువ గలది

2. TS-08-D-0433 3. TS-29-F-6434

ఈ కేసులో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుదాకర్, పోలియా ఇన్స్పెక్టర్ జనార్ధన్, హాలియా ఎస్సై సతీష్, మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్ఐ రవి మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు

madagoni surendar

Jul 12 2024, 12:50

సూర్యాపేట జిల్లా :-నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్. ర్యాపేట ట్రాఫిక్ ఎస్ ఐ సాయిరాం.

నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్..

సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ ఐ సాయిరాం..

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్ ఐ సాయిరాం శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలో నెంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న 70 ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ వాహనానికి ఉండేలా చూసుకోవాలన్నారు. రవాణా వాహన చట్ట నిబంధనలకు లోబడి ప్రతి ఒక్క వాహనదారుడు వెహికల్ ను నడపాలన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో, వాహనం పార్కింగ్ లో నిలిపినప్పుడు చోరీకి గురైన సమయంలో నెంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల వాహనాన్ని గుర్తించడం కష్ట సాధ్యమవుతుందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా వారి వాహనాన్ని సంబంధించిన పూర్తి ఆధారాలను, ఇన్సూరెన్స్ ను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాన్ని ఇవ్వవద్దన్నారు. ముఖ్యంగా వాహనాలకు సైలెన్సర్లను తొలగించి నడపడం నేరమన్నారు. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. అనంతరం నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు నెంబర్ ప్లేట్ తీసుకువచ్చి వారి వాహనానికి బిగించిన తర్వాతనే వారికి వాహనాన్ని అప్పగించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Jul 12 2024, 11:38

తెలంగాణలో నెల 15 నుంచి అమ్మ మాట- అంగన్వాడీ బాట

తెలంగాణలో నెల 15 నుంచి అమ్మ మాట- అంగన్వాడీ బాట

హైదరాబాద్:జులై 12

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 'అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నట్లు తెలుస్తుంది. తెలం గాణలో రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం కొత్తగా ప్రీప్రై మరీ సిలబస్‌ను సిద్ధం చేసింది. చిన్నారుల్ని గుర్తించి ఈ ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్చించేందుకు ఈ నెల 15 నుంచి 20 వరకు అమ్మ మాట- అంగన్వాడీ బాట పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది.

ఈ కార్యక్రమం చివరిరోజున సామూహిక అక్షరాభ్యా సాలు నిర్వహించనుంది..

madagoni surendar

Jul 10 2024, 20:43

కామారెడ్డి జిల్లా :-ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా

ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా

కామారెడ్డి జిల్లా :జులై 10

ఏటీఎంలోకి చొరబడ్డ దుండగులు.. ఏకంగా ఏటీఎం మిషిన్‌ను ఎత్తుకెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

ఏటీఎంలో రూ. 3.95 లక్షల నగదు ఉన్నట్టు సమాచా రం. ఘటనా స్థలాన్ని బాన్సువాడ డీఎస్పీ సత్యనా రాయణ, సీఐ నరేష్‌ పరిశీలించారు. మూడు గంటల ప్రాంతంలో వచ్చిన దుండుగులు.. కేవలం మూడు నిమిషా ల్లోనే ఏటీఎంను ఎత్తుకెళ్లి నట్టు సమాచారం.

ఎస్‌ఐ మోమన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ వారం తెల్లవారు జామున 3 గంటలా 20 నిమిషాల సమయంలో దొంగలు చాకచక్యంగా ఏటీఎంలోకి చొరబడి డబ్బులతో సహా ఏటీఎం మెషిన్‌ను ఎత్తుకెళ్లారు.

ఏటీఎంలో రూ. 3 లక్షలా 95 వేలు ఉన్నాయని, ఏటీఎంతో సహా దొంగలు ఎత్తుకెళ్లినట్టు బ్రాంచ్‌ చీఫ్‌ మేనేజర్‌ మోహన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

ప్రధాన కూడలిలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించగా..ఏటీఎం ఎత్తుకెళ్లిన దొంగలు మహారాష్ట్ర వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.

త్వరలోనే దుండగులను పట్టుకుంటామని తెలిపారు. ఏటీ ఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన ఘటనలు చూశాం కానీ.. ఏకంగా మిషిన్‌ను ఎత్తుకెళ్లిన ఘటన ఇంతవరకు చూడలేదని స్థానికులు పేర్కొంటున్నారు...

madagoni surendar

Jul 10 2024, 19:35

సూర్యాపేట జిల్లా :-సూర్యాపేట ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాను.తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి.

సూర్యాపేటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాను

తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

నల్గొండ జిల్లా :-

.

ముప్పై ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు తాను చేసిన ప్రజాసేవకు గుర్తింపు గా సిఎం రేవంత్ రెడ్డి తనను రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం పట్ల టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ధన్యవాదములు తెలిపారు. ఎటువంటి పదవులు లేనప్పటికీ సూర్యాపేట నియోజకవర్గం లో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో వుంటూ తాను నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేశానని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పటేల్ రమేష్ రెడ్డి కి ఘనస్వాగతం పలికారు. సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చారు. అనంతరం పట్టణంలోని మెడికల్ కాలేజ్, కోర్టు చౌరస్తా, శంకర్ విలాస్ సెంటర్, ఎంజి రోడ్ మీదుగా బైక్ ర్యాలీతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పర్యాటక శాఖ మంత్రి జూపూడి క్ర్రష్ణారావు సహకారంతో టూరిజం కార్పోరేషన్ ద్వారా సూర్యాపేట సద్దల చెరువు అభివృద్ధి కి, మూసి నది అభివృద్ధి కోసం నిధులు తీసుకుని వస్తానని చెప్పారు. ఉండ్రుగొండ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో సూర్యాపేట అభివృద్ధి కోసం నిధులు తీసుకుని వస్తానని చెప్పారు. రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు సోనియా గాంధీ హామి ఇచ్చిన ఆరు గ్యారంటీ లలో ఐదు గ్యారంటీ లను సిఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని, ఆగస్టు నెల 15 వ తేది నుండి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫి ని కూడ అమలు చేయడం జరుగుతుందని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పటేల్ రమేష్ రెడ్డి ని పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, కౌన్సిలర్ లు షఫి ఉల్లా, వెలుగు వెంకన్న, నామా అరుణ, గట్టు శ్రీనివాస్, ముదిరెడ్డి రమణారెడ్డి, నిమ్మల వెంకన్న, జ్యోతి కరుణాకర్ , రమేష్ నాయుడు, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, ఫరూక్, తండు శ్రీనివాస్, సాజిద్, ధర్మా నాయక్, వల్దాస్ దేవేందర్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Jul 10 2024, 13:14

తెలంగాణ :-2 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల.

రైతులకు గుడ్ న్యూస్..

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 2024, ఆగస్ట్ 15వ తేదీలోపు బ్యాంకుల్లోని 2 లక్షల రూపాయల అప్పు మాఫీకి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి మంచి విషయం చెప్పారు.

2 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల..

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 2024, ఆగస్ట్ 15వ తేదీలోపు బ్యాంకుల్లోని 2 లక్షల రూపాయల అప్పు మాఫీకి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి మంచి విషయం చెప్పారు. రుణ మాఫీకి సంబంధించిన విధివిధానాలను 2 రోజుల్లో విడుదల చేస్తున్నామని వెల్లడించారాయన. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా.. జూలై 9వ తేదీ ఈ విషయాన్ని స్పష్టం చేశారాయన. రెండు రోజుల్లో రుణమాఫీ గైడ్లైన్స్ విడుదల చేస్తామన్నారు.

ఆగస్టు 15 లోగా పూర్తి చేస్తాము..నిధుల సమీకరణ స్టార్ట్ అయింది..రేపు రైతు భరోసా పై ఖమ్మం లో అభిప్రాయం సేకరణ స్టార్ట్ చేస్తున్నాము. రైతులు, ఉద్యోగులు, మేధావులు, రైతు సంఘాల నేతలు అభిప్రాయలు తీసుకుంటున్నాము.. నేను ఇంత వరకు రైతు బంధు తీసుకోలేదు చెక్ లు ఇచ్చిన తిరిగి ఇచ్చానని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

madagoni surendar

Jul 10 2024, 11:21

ఏపీ :-ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే.

ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే.

ఏపీ : ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్,

ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి.

ఏపీ : ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్,

ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి.

అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును

ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇందుకోసం QR

కోడ్లు ఏర్పాటు చేశారు. ఇసుక డిపోలు ఉ.6

నుంచి సా.6 వరకు పని చేస్తాయి. స్టాక్ ఉన్నంత

వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇస్తారు.

www.mines.ap.gov.in ద్వారా మీ సమీపంలోని

ఇసుక డిపో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

madagoni surendar

Jul 09 2024, 23:00

సూర్యాపేట జిల్లా:- మఠంపల్లి మండలం అల్లిపురం లో రాధిక రైస్ మిల్లులో భారీ పిడిఎస్ బియ్యం పట్టివేత

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లిపురం లో రాధిక రైస్ మిల్లులో భారీ పిడిఎస్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిలువ ఉంచిన 250 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు....

మఠంపల్లి మండలం అల్లిపురం గ్రామానికి చెందిన రాధిక రైస్ మిల్లు వ్యాపారస్తుడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి చెందినది గా గుర్తింపు...

ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న హుజూర్నగర్ సీఐ చరమందరాజు మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులు సివిల్ సప్లై అధికారులు...

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు....

madagoni surendar

Jul 09 2024, 18:50

హైదరాబాద్ :-చట్నీలో ఎలుక:మంత్రి దామోదర నరసింహ ఆగ్రహం

చట్నీలో ఎలుక:మంత్రి దామోదర నరసింహ ఆగ్రహం

హైదరాబాద్ :జులై 09

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌ పూర్ జేఎన్టీయూ కాలేజ్ క్యాంటీన్‌లో చట్నీలో ఎలుక వచ్చిన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేఎన్టీయూలో జరిగిన ఘటనపై తక్షణం విచారణ చేపట్టాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక ఆర్డీఓ, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టి వెంటనే నివేదిక ను సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఇలాంటి ఘటనలు పున రావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికా రులకు సూచించారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాల్లో ఉన్న బోర్డింగ్, హాస్టళ్లను, క్యాంటీన్లను తనిఖీలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆహార పదార్థాలను తయా రు చేసే నిర్వాహాకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ను తీసుకోవాలని మంత్రి కోరారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు బేకరీలు, బోర్డింగ్, హాస్టల్స్, క్యాంటీన్లు, ఆహార పదార్థా లు తయారు చేసే నిర్వాహ కుల పై నిఘా ఉంచాలని మంత్రి అధికారాన్ని ఆదేశించారు.