సూర్యాపేట జిల్లా :-నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్. ర్యాపేట ట్రాఫిక్ ఎస్ ఐ సాయిరాం.
నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్..
సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ ఐ సాయిరాం..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్ ఐ సాయిరాం శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలో నెంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న 70 ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ వాహనానికి ఉండేలా చూసుకోవాలన్నారు. రవాణా వాహన చట్ట నిబంధనలకు లోబడి ప్రతి ఒక్క వాహనదారుడు వెహికల్ ను నడపాలన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో, వాహనం పార్కింగ్ లో నిలిపినప్పుడు చోరీకి గురైన సమయంలో నెంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల వాహనాన్ని గుర్తించడం కష్ట సాధ్యమవుతుందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా వారి వాహనాన్ని సంబంధించిన పూర్తి ఆధారాలను, ఇన్సూరెన్స్ ను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాన్ని ఇవ్వవద్దన్నారు. ముఖ్యంగా వాహనాలకు సైలెన్సర్లను తొలగించి నడపడం నేరమన్నారు. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. అనంతరం నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు నెంబర్ ప్లేట్ తీసుకువచ్చి వారి వాహనానికి బిగించిన తర్వాతనే వారికి వాహనాన్ని అప్పగించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Jul 13 2024, 19:50