Breaking... నిన్నటి రోజున జిల్లా ఎస్పీ పర్యటించింది.. అంతలోనే ఇంత దారుణమా.. మద్యం మత్తులో ఒకరి పై ఒకరు దాడి..
గుగుడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించాలని నిన్నటి రోజున జిల్లా ఎస్పీ పర్యటించి వెళ్లారు అంతలోనే అనంతపురం గుగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ఒకరి పై ఒకరు దాడి నార్పల మండలం గూగుడు గ్రామంలో ఉత్సవాలకు విచ్చేసిన బెంగళూరుకు చెందిన నాగరాజు, ధర్మవరానికి చెందిన శ్రీకాంత్ ఇద్దరూ మద్యం సేవించి గొడవ బెంగళూరుకు చెందిన నాగరాజు పై ధర్మవరానికి చెందిన శ్రీకాంత్ బీర్ బాటిల్లతో దాడి నాగరాజు అనే వ్యక్తి కి తల భాగంలో బలమైన గాట్లు తీవ్ర రక్త స్రావం కావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
నాణ్యమైన విద్య.. మనందరి నినాదం కావాలి.. ఎంఈఓలకు జిల్లా కలెక్టర్ ఉద్బోధ..
నాణ్యమైన విద్య.. మనందరి నినాదం కావాలి.. ఎంఈఓలకు జిల్లా కలెక్టర్ ఉద్బోధ
పనితీరు మరింత మెరుగుపడాలి.. అన్ని మండలాల్లోనూ ఒకే స్థాయి పనితీరు కనబరిచాలి* - *: 'నేను బడికి పోతా..' కార్యక్రమం కింద వచ్చే వారంలోపు 100 శాతం నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* - *: బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలే కానీ పనిలో కాదు* - *: మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి* - *: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్* అనంతపురం, జులై 11 : *నాణ్యమైన విద్య.. మనందరి నినాదం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఎంఈఓలకు ఉద్బోధించారు. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో గురువారం విద్యాశాఖ పరిధిలోని నేను బడికి పోతా, అకడమిక్ మానిటరింగ్ వింగ్, సివిల్ మరియు ఇంజనీరింగ్ పనులు, మధ్యాహ్న భోజనం, నాడు- నేడు, అదనపు తరగతి గదులు, తదితర అంశాలపై ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలోని అన్ని మండలాల్లోనూ ఎంఈఓలు ఒకే స్థాయి పనితీరు కనబరిచాలని, వారి పనితీరు మరింత మెరుగుపడాలని ఆదేశించారు. పనితీరులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. కే.జి.బి.వీలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని, ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం తక్కువ ఉందని, ప్రతి ఏడాది తగ్గుతోందని, ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతం మరింత పెంచాలని ఆదేశించారు. "నేను బడికి పోతా" కార్యక్రమంలో భాగంగా బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలేకానీ పనిలో ఉండకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. పామిడి మండలంలో 87 హ్యాబిటేషన్లలో, ఉరవకొండ మండలంలో 84 హ్యాబిటేషన్లలో ఈ కార్యక్రమం కింద చేపట్టగా, సెట్టూరు మండలంలో కేవలం ఒక హ్యాబిటేషన్ లో ఈ కార్యక్రమం చేపట్టారని, అలా ఎక్కువ తక్కువ కాకుండా అన్ని మండలాల్లోనూ పూర్తిగా ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం కింద మొత్తం 3,356 మందిని గుర్తించగా, ఉరవకొండలోనే 1,617 మందిని గుర్తించారని, మిగిలిన చోట్ల ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ కింద బుక్కరాయసముద్రంలో మాత్రమే ముగ్గురిని గుర్తించారని, మిగిలిన చోట్ల గుర్తించలేదని, చిన్నారుల ఎన్రోల్మెంట్ ప్రక్రియను కూడా ఎలాంటి పెండింగ్ లేకుండా వచ్చేవారంలోపు 100 శాతం పూర్తి చేయాలని ఎంఈఓలను ఆదేశించారు. బడిలో చదవాల్సిన పిల్లలు చదువుకునేలా జిల్లా అంత ఈ కార్యక్రమం చేపట్టాలని, కానీ కొన్ని మండలాలే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశాయి తప్ప మిగతా మండలాలు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. ఇకనుండి ప్రతిరోజు రిపోర్టును పంపాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద పోస్టర్ల ఆవిష్కరణ, డాక్యుమెంటరీ ఫిల్మ్ లను చేపట్టాలన్నారు.* - *అకడమిక్ మానిటరింగ్ వింగ్ కింద జ్ఞాన జ్యోతి కార్యక్రమంలో భాగంగా ఎస్జిటీలు, అంగన్వాడీ టీచర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, షెడ్యూల్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ చేపట్టాలన్నారు. జ్ఞాన ప్రకాష్ రిఫ్రెషర్ శిక్షణ కింద ప్రతి ఒక్కరికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, లక్ష్యం నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలని, వచ్చే ఆగస్టు ఒకటో తేదీ నాటికి శిక్షణ కేంద్రంలో పనులు మొదలు కావాలన్నారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అమలులో భాగంగా విద్య అవగాహన శిబిరాలు నిర్వహించడం, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు, విద్య మరియు సౌకర్యాలు ప్రాముఖ్యతను పోస్టర్ల ద్వారా, డాక్యుమెంటరీ లు, గతంలో పాఠశాలలో చదివి ప్రయోజకులుగా ఉన్న వారిని ఆదర్శంగా చూపుతూ, పిల్లల తల్లితండ్రులకు, గ్రామ పెద్దలకు, పిల్లలకు అందుబాటులో ఉండే విద్యా సౌకర్యాలపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. సోషియల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలను ప్రతి ఒక్క గ్రామాలు, మండలాల వారిగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో విద్యార్థులకు కిట్ల పంపిణీకి సంబంధించి నోట్ పుస్తకములు పంపిణీ పూర్తి కాగా, మిగిలిన యూనిఫామ్స్, బ్యాగ్, బెల్ట్స్, డిక్షనరీలు, బూట్లు, టెస్ట్ బుక్ లు త్వరితగతిన అందేలా చూడాలన్నారు. పీఎంశ్రీ స్కూల్స్ సంబంధించిన పనులు ఏ స్థితుల్లో ఉన్నవి, పనులు ఆగిపోయాయి, దీనికి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించారు. నాడు - నేడు పాఠశాల పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలపగా, ఎన్ని బిల్లులు ఉన్నాయో పెండింగ్ బిల్లుల జాబితాను తయారుచేసి ఇవ్వాలని తెలిపారు.* - *జిల్లాలో 1,694 పాఠశాలల్లో 1,87,954 మంది చిన్నారులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం జరుగుతోందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏ పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకానికి వంట మనుషులు లేరు అనేది ఉండడానికి వీలులేదని, ఎక్కడైనా సమస్య వచ్చిన 24 గంటల్లోపు పరిష్కరించాలని డిఈఓని ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో బయటికి వచ్చి తిని వెళ్లడం లాంటివి ఉండరాదని, పాఠశాలల్లోనే భోజనం అందించాలన్నారు. పాఠశాల వేళలో పిల్లలు బయటికి వెళ్లకుండా చూడాలని, నిబంధనలను అతిక్రమించరాదన్నారు. పిల్లలతో ఎక్కడా పని చేయించకుండా చూడాలన్నారు. ప్రతి నెల 15వ తేదీలోపు బిల్లులు సబ్మిట్ చేయాలని, బిల్లుల సబ్మిట్ ఆలస్యం అయితే చర్యలు తీసుకోవడానికి వెనకాడమన్నారు. చిన్నారులకు అందించే చిక్కీల గడువు తేదీని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రతినెలా డిఈఓ, సమగ్ర శిక్ష, బీసీ సంక్షేమం, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ రెసిడెన్షియల్, తదితర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.* - *విద్యాశాఖలో క్యాడర్ వారీగా అధికారుల స్థాయి నుంచి వాచ్మెన్ వరకు ఖాళీల వివరాలను మొత్తం ఎక్స్ఎల్ సీట్లో అందించాలన్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నుంచి లెటర్ పంపించాలన్నారు. మండల స్థాయిలో ఎంఈఓలతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, కేజీబీవీ ప్రిన్సిపాల్ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయాలన్నారు.* - *ఈ సమావేశంలో డీఈవో వరలక్ష్మి, విద్యాశాఖ ఏడీలు కృష్ణయ్య, నాగరాజు, ఏఎంఓ చంద్రశేఖర్ రెడ్డి, సీఎంవో గోపాల్, జిసిడివో వాణిదేవి, కార్యాలయం సూపరింటెండెంట్లు, సిబ్బంది, ఎంఈవో 1, 2లు, తదితరులు పాల్గొన్నారు..
మైనర్ బాలికను కిరాతకంగా హత్య చేసిన నిందితులను శిక్షించాలి..
మైనర్ బాలికను కిరాతకంగా హత్య చేసిన నిందితులను శిక్షించాలి

మహిళల ప్రాణాలకు రక్షణ కరువైంది..? సాకే హరి మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని పాలన ఎవరిదైనా వీటిని అరికట్టలేకపోతున్నారని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మండిపడ్డారు.గురువారం నగరంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం ముందు నంద్యాల జిల్లా ముచ్చు మర్రి గ్రామంలో మైనర్ బాలిక వాల్మీకి స్రవంతి కిరాతక హత్యను ఖండిస్తూ జే,ఏ,సీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సాకే హరి మాట్లాడుతూ.. మానవత్వం మంటగలిసేలా మైనర్ బాలికపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో మహిళలపై నానాటికి అత్యాచార,హత్యలు పెట్రేగిపోతున్నాయని వృద్ధులు,బాలికలపై సైతం దారుణాలకు తెగబడటం మరింత బాధకరమన్నారు.విచ్చలవిడిగా మద్యం,డ్రగ్స్,గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావడం వలనే నేరాలు పెరుగుతున్నాయన్నారు.ఇదే విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి స్వయంగా తెలిపారని మాదకద్రవ్యాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్ననప్పటికి యదేచ్ఛగా డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుందన్నారు.స్రవంతిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు కూడా మైనర్లే కావడం అటువంటి వారికి గంజాయి ఎలా వచ్చిందో తేల్చాలన్నారు.దుర్మార్గులు బాలికపై హత్యాచారం చేసి హతమార్చి కాలవలోకి శవం వేస్తే ఇప్పటికి శవం ఆచూకి లేదన్నారు. గతంలో చీరాల యువతి అత్యాచారం హత్య కూడా గంజాయి ముఠా చేసిందే అన్నారు.అలాగే అనకాపల్లిలో ప్రేమించ లేదని యువతిని కత్తితో దారుణంగా పొడిచి పరారైనా నిందితున్ని ఇంత వరకు వరుకు అరెస్టు చేయలేదని వాపోయారు. అనతి కాలంలోనే మహిళలపై అనేక ఘోరాలు జరుగుతున్న నివారించడంలో పోలీసులు, ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు.అదే విధంగా విద్యాలయాల్లో గంజాయి సరఫరా చేస్తూ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న కనీస చర్యలు లేవన్నారు.కొన్ని చోట్ల ఏకంగా ఎమ్మెల్యే,మంత్రులు దృష్టికి గంజాయి భాధిత యువత తల్లి, దండ్రలు మా పిల్లలు గంజాయికి బానిసలుగా మారరు మీరే కాపాడాలని చేతులెత్తి దండం పెట్టుకున్నారంటే రాష్ట్రంలో గంజాయి ఎంత విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందో అర్థం చేసుకోవచ్చున్నారు.వరసగా జరుగుతున్న దారుణాలు చూసైనా ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పైట్ ఫర్ రైట్స్ కేపీ రాజు.సామాజిక వేదిక అది నారాయణ.బిసి,మైనార్టీ నాయుకులు ఈశ్వరయ్య.ధనంజయ్య.ఆశిఖ్.నాగేంద్ర.మురళి.నారాయణస్వామి.గోపాల్.ఓబులేసు.వివిధ కుల,ప్రజా, మహిళ సంఘాల నాయకులు శాంతమ్మ.మారెక్క ,పద్మావతి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
కొరపాడు నందు ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొరపాడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఆర్ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాది కారి గారు మాట్లాడుతూ ప్రపంచ జనాభా అధికారికంగా 8 బిలియన్లు దాటినది. ఈ జనాభా ఇలాగే పెరుగుతూ పోతే భవిష్యత్తు తరాలకు స్థిరమైన, స్నేహపూర్వక అభివృద్ధికి, అలాగే ఆర్థిక అభివృద్ధికి, అలాగే ఆరోగ్య అభివృద్ధి ఆటకం కలుగుతుందన్నారు. పరిమిత కుటుంబం అపరిమిత ఆనందం కలిగి ఉంటారు. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబము కనుక దీనివలన అనేక లాభాలు గురించి మరియు కాన్పుల మధ్య ఎడం పాటించడం వల్ల తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారనిఅందుకోసం వారు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని, ఇవి పాటించడానికి అవసరమైన నిరోధులు,నోటితో మింగు మాత్రలు, కాపర్ T లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితముగా ఆరోగ్య కార్యకర్త లభిస్తాయి. అలాగే చిన్న వయసులో వివాహం చేయడం వల్ల కలిగే నష్టములు గురించి తెలియపరిచినారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విద్యా బోధకురాలు ఎస్ పర్వీన్, విజయలక్ష్మి ప్రధాన ఉపాధ్యాయిని గారు, కేశవయ్య సూపర్వైజర్ గారు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ నాజియా, ఏఎన్ఎం రామలక్ష్మి, లక్ష్మీదేవి,హెల్త్ అసిస్టెంట్ రాజేంద్రప్రసాద్, మరియు గురుకుల పాఠశాల స్టాఫ్ నర్స్ మాధవి గారు మరియు సిబ్బంది మరియు ఆశ తిరుపాలమ్మ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే కుటుంబ నియంత్రణ ప్రతిజ్ఞ గురుకుల పాఠశాల విద్యార్థులచే చెప్పించడం జరిగింది. ధన్యవాదములు
సాంఘిక సంక్షేమశాఖ స్టడీ సర్కిల్స్ ను పునప్రారంభించాలి..
రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమశాఖ ద్వారా జరుగుతున్న స్టడీ సర్కిల్స్ ఆగిపోవడం వలన దళిత గిరిజన యువకులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వాటిని పునప్రారంభించాలని ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని కలిసి వినతి పత్రం అందజేసిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు గారూ,కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(kvps) రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నల్లప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీ ఆoడ్ర మాల్యాద్రి గారు డప్పు కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆనంద్ గారూ,kvps రాష్ట్ర సహాయ కార్యదర్షులు శ్రీ రఘురాo గారూ,శ్రీ క్రాంతి కుమార్ గారూ పాల్గొన్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా డాక్టర్ స్వాతి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ర్యాలీ..
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ స్వాతి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ గారు మాట్లాడుతూ ప్రపంచ జనాభా అధికారికంగా 8 బిలియన్లు దాటినది. ఈ జనాభా ఇలాగే పెరుగుతూ పోతే భవిష్యత్తు తరాలకు స్థిరమైన, స్నేహ పూర్వక అభివృద్ధికి అలాగే ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. పరిమిత కుటుంబం - అపరిమిత ఆనందం కలిగి ఉంటారు. చిన్న కుటుంబం వలన కలిగే లాభాలు గురించి మరియు కాన్పుల మధ్య ఎడం పాటించడం వల్ల తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని అందుకోసం వారు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని ఈ పద్ధతులు పాటించడానికి అవసరమైన నిరోదులు ఓరల్ పిల్స్ , ఐ యు డి,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ ఏఎన్ఎం దగ్గర గాని ఉచితంగా లభిస్తాయని అలాగే చిన్న వయసులో వివాహం చేయడం వల్ల కలిగే నష్టాల గురించి తెలియ చెప్పారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మోహన్ రావు , పిహెచ్ఎన్ చెన్నమ్మ , సూపర్వైజర్లు ఈశ్వరమ్మ, సత్యనారాయణ శాస్త్రిమరియు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ , ఏఎన్ఎమ్స్ మరియు హెల్త్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది
ఐ.టీ. మంత్రి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి  కర్నూలు జిల్లా కాటప్పగారి రామలింగారెడ్డి గారు..
ఉండవల్లి నివాసంలో రాష్ట్ర IT శాఖ మంత్రి వర్యులు,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి  కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు. శింగనమల నియోజకవర్గం ప్రస్తుత పరిస్థితులపై చర్చించిన నారా లోకేష్ గారు..
ప్రజా బాంధవుడు వైఎస్సార్... మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
ప్రజా బాంధవుడు వైఎస్సార్... మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

ప్రజల మనస్సు గెలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాబాంధవుడని శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ..వైఎస్సార్ నిరంతరం పేదల అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించేవారని, ఇందులో భాగంగా అనేక పథకాలు అమలు చేశారన్నారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు.
డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి..
అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా నార్పల శివకళ జ్యోతి దగ్గర ఉన్న వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నార్పల సత్యనారాయణ రెడ్డి, ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బులోరా వాహనం అదుపుతప్పి బోల్తా.. 30 మంది కూలీలకు తీవ్ర గాయాలు..
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామ సమీపంలో దాదాపు 30 మంది కూలీలతో వెళుతున్న బులోరా వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి*. గాయపడిన వారిని బత్తలపల్లి ఆర్డీటీకి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు ....