సూర్యాపేట జిల్లా :-సూర్యాపేట ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాను.తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి.
సూర్యాపేటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాను
తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
నల్గొండ జిల్లా :-
.
ముప్పై ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు తాను చేసిన ప్రజాసేవకు గుర్తింపు గా సిఎం రేవంత్ రెడ్డి తనను రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం పట్ల టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ధన్యవాదములు తెలిపారు. ఎటువంటి పదవులు లేనప్పటికీ సూర్యాపేట నియోజకవర్గం లో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో వుంటూ తాను నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేశానని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పటేల్ రమేష్ రెడ్డి కి ఘనస్వాగతం పలికారు. సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చారు. అనంతరం పట్టణంలోని మెడికల్ కాలేజ్, కోర్టు చౌరస్తా, శంకర్ విలాస్ సెంటర్, ఎంజి రోడ్ మీదుగా బైక్ ర్యాలీతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పర్యాటక శాఖ మంత్రి జూపూడి క్ర్రష్ణారావు సహకారంతో టూరిజం కార్పోరేషన్ ద్వారా సూర్యాపేట సద్దల చెరువు అభివృద్ధి కి, మూసి నది అభివృద్ధి కోసం నిధులు తీసుకుని వస్తానని చెప్పారు. ఉండ్రుగొండ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో సూర్యాపేట అభివృద్ధి కోసం నిధులు తీసుకుని వస్తానని చెప్పారు. రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు సోనియా గాంధీ హామి ఇచ్చిన ఆరు గ్యారంటీ లలో ఐదు గ్యారంటీ లను సిఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని, ఆగస్టు నెల 15 వ తేది నుండి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫి ని కూడ అమలు చేయడం జరుగుతుందని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పటేల్ రమేష్ రెడ్డి ని పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, కౌన్సిలర్ లు షఫి ఉల్లా, వెలుగు వెంకన్న, నామా అరుణ, గట్టు శ్రీనివాస్, ముదిరెడ్డి రమణారెడ్డి, నిమ్మల వెంకన్న, జ్యోతి కరుణాకర్ , రమేష్ నాయుడు, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, ఫరూక్, తండు శ్రీనివాస్, సాజిద్, ధర్మా నాయక్, వల్దాస్ దేవేందర్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Jul 12 2024, 12:50