మైనర్ బాలికను కిరాతకంగా హత్య చేసిన నిందితులను శిక్షించాలి..
మైనర్ బాలికను కిరాతకంగా హత్య చేసిన నిందితులను శిక్షించాలి
మహిళల ప్రాణాలకు రక్షణ కరువైంది..? సాకే హరి మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని పాలన ఎవరిదైనా వీటిని అరికట్టలేకపోతున్నారని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మండిపడ్డారు.గురువారం నగరంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం ముందు నంద్యాల జిల్లా ముచ్చు మర్రి గ్రామంలో మైనర్ బాలిక వాల్మీకి స్రవంతి కిరాతక హత్యను ఖండిస్తూ జే,ఏ,సీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సాకే హరి మాట్లాడుతూ.. మానవత్వం మంటగలిసేలా మైనర్ బాలికపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో మహిళలపై నానాటికి అత్యాచార,హత్యలు పెట్రేగిపోతున్నాయని వృద్ధులు,బాలికలపై సైతం దారుణాలకు తెగబడటం మరింత బాధకరమన్నారు.విచ్చలవిడిగా మద్యం,డ్రగ్స్,గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావడం వలనే నేరాలు పెరుగుతున్నాయన్నారు.ఇదే విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి స్వయంగా తెలిపారని మాదకద్రవ్యాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్ననప్పటికి యదేచ్ఛగా డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుందన్నారు.స్రవంతిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు కూడా మైనర్లే కావడం అటువంటి వారికి గంజాయి ఎలా వచ్చిందో తేల్చాలన్నారు.దుర్మార్గులు బాలికపై హత్యాచారం చేసి హతమార్చి కాలవలోకి శవం వేస్తే ఇప్పటికి శవం ఆచూకి లేదన్నారు. గతంలో చీరాల యువతి అత్యాచారం హత్య కూడా గంజాయి ముఠా చేసిందే అన్నారు.అలాగే అనకాపల్లిలో ప్రేమించ లేదని యువతిని కత్తితో దారుణంగా పొడిచి పరారైనా నిందితున్ని ఇంత వరకు వరుకు అరెస్టు చేయలేదని వాపోయారు. అనతి కాలంలోనే మహిళలపై అనేక ఘోరాలు జరుగుతున్న నివారించడంలో పోలీసులు, ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు.అదే విధంగా విద్యాలయాల్లో గంజాయి సరఫరా చేస్తూ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న కనీస చర్యలు లేవన్నారు.కొన్ని చోట్ల ఏకంగా ఎమ్మెల్యే,మంత్రులు దృష్టికి గంజాయి భాధిత యువత తల్లి, దండ్రలు మా పిల్లలు గంజాయికి బానిసలుగా మారరు మీరే కాపాడాలని చేతులెత్తి దండం పెట్టుకున్నారంటే రాష్ట్రంలో గంజాయి ఎంత విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందో అర్థం చేసుకోవచ్చున్నారు.వరసగా జరుగుతున్న దారుణాలు చూసైనా ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పైట్ ఫర్ రైట్స్ కేపీ రాజు.సామాజిక వేదిక అది నారాయణ.బిసి,మైనార్టీ నాయుకులు ఈశ్వరయ్య.ధనంజయ్య.ఆశిఖ్.నాగేంద్ర.మురళి.నారాయణస్వామి.గోపాల్.ఓబులేసు.వివిధ కుల,ప్రజా, మహిళ సంఘాల నాయకులు శాంతమ్మ.మారెక్క ,పద్మావతి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Jul 12 2024, 07:38