సాంఘిక సంక్షేమశాఖ స్టడీ సర్కిల్స్ ను పునప్రారంభించాలి..
రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమశాఖ ద్వారా జరుగుతున్న స్టడీ సర్కిల్స్ ఆగిపోవడం వలన దళిత గిరిజన యువకులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వాటిని పునప్రారంభించాలని ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని కలిసి వినతి పత్రం అందజేసిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు గారూ,కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(kvps) రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నల్లప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీ ఆoడ్ర మాల్యాద్రి గారు డప్పు కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆనంద్ గారూ,kvps రాష్ట్ర సహాయ కార్యదర్షులు శ్రీ రఘురాo గారూ,శ్రీ క్రాంతి కుమార్ గారూ పాల్గొన్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా డాక్టర్ స్వాతి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ర్యాలీ..
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ స్వాతి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ గారు మాట్లాడుతూ ప్రపంచ జనాభా అధికారికంగా 8 బిలియన్లు దాటినది. ఈ జనాభా ఇలాగే పెరుగుతూ పోతే భవిష్యత్తు తరాలకు స్థిరమైన, స్నేహ పూర్వక అభివృద్ధికి అలాగే ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. పరిమిత కుటుంబం - అపరిమిత ఆనందం కలిగి ఉంటారు. చిన్న కుటుంబం వలన కలిగే లాభాలు గురించి మరియు కాన్పుల మధ్య ఎడం పాటించడం వల్ల తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని అందుకోసం వారు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని ఈ పద్ధతులు పాటించడానికి అవసరమైన నిరోదులు ఓరల్ పిల్స్ , ఐ యు డి,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ ఏఎన్ఎం దగ్గర గాని ఉచితంగా లభిస్తాయని అలాగే చిన్న వయసులో వివాహం చేయడం వల్ల కలిగే నష్టాల గురించి తెలియ చెప్పారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మోహన్ రావు , పిహెచ్ఎన్ చెన్నమ్మ , సూపర్వైజర్లు ఈశ్వరమ్మ, సత్యనారాయణ శాస్త్రిమరియు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ , ఏఎన్ఎమ్స్ మరియు హెల్త్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది
ఐ.టీ. మంత్రి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి  కర్నూలు జిల్లా కాటప్పగారి రామలింగారెడ్డి గారు..
ఉండవల్లి నివాసంలో రాష్ట్ర IT శాఖ మంత్రి వర్యులు,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి  కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు. శింగనమల నియోజకవర్గం ప్రస్తుత పరిస్థితులపై చర్చించిన నారా లోకేష్ గారు..
ప్రజా బాంధవుడు వైఎస్సార్... మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
ప్రజా బాంధవుడు వైఎస్సార్... మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

ప్రజల మనస్సు గెలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాబాంధవుడని శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ..వైఎస్సార్ నిరంతరం పేదల అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించేవారని, ఇందులో భాగంగా అనేక పథకాలు అమలు చేశారన్నారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు.
డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి..
అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా నార్పల శివకళ జ్యోతి దగ్గర ఉన్న వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నార్పల సత్యనారాయణ రెడ్డి, ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బులోరా వాహనం అదుపుతప్పి బోల్తా.. 30 మంది కూలీలకు తీవ్ర గాయాలు..
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామ సమీపంలో దాదాపు 30 మంది కూలీలతో వెళుతున్న బులోరా వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి*. గాయపడిన వారిని బత్తలపల్లి ఆర్డీటీకి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు ....
ఆలూరు. ఎర్రి స్వామి రెడ్డి ని శ్రీ గూగుడు కుళ్లాయి స్వామి వార్ల బ్రహ్మోత్సవముల ఆహ్వానం..
సింగనమల నియోజకవర్గ యువ నాయకుడు ఆలూరు. ఎర్రి స్వామి రెడ్డి గారిని శ్రీ గూగుడు కుళ్లాయి స్వామి వార్ల బ్రహ్మోత్సవముల ఆహ్వానము కి రావాలని ఆహ్వానించిన గూగూడు గ్రామస్తులు.
త్రాగునీటి సమస్య పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
అనంతపురం, జులై 08 : *త్రాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో త్రాగునీటి సమస్య, జల్ జీవన్ మిషన్, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వజ్రకరూరు మండలంలోని కొనకల్లు గ్రామంలో నీటి సమస్యపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వజ్రకరూరులో అక్రమ కొళాయిలను తొలగించేందుకు నోటీసులిచ్చి వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తాగునీటికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి కావలసిన నిధుల కోసం వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి పంపాలన్నారు. జిల్లా పరిషత్ నుండి కేటాయించే నిధులకు సంబంధించిన పూర్తి నివేదికను తయారు చేయాలని, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు సంబంధించిన నివేదికలను ఈ ఆఫీస్ ద్వారా తయారు చేసి పంపాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్ట్ డిఈ శ్రీనివాసులు, తాడిపత్రి డిఈ శ్రీరాములు, సత్యసాయి డిఈ రామారావు, ఉరవకొండ డిఈ సఫ్రాన్ మరియు సంబంధిత శాఖ జేఈలు, తదితరులు పాల్గొన్నారు.
మడకశిరలో ప్రజల వద్దకే పాలన..
మడకశిర నియోజకవర్గం వర్గం ఎమ్మెల్యే MS. రాజు మడకశిర మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రధాన కూడలి వాల్మీకి సర్కిల్ నందు ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులతో,ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. స్కూటీ లో వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకొని పలకరించి అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారిలో ఒక్కడై వెళుతున్న MLA MS.రాజు.. మడకశిర ప్రజలు వారి నాయకుడు వారి దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న మడకశిర ప్రజలు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సీఎం నారా చంద్రబాబునాయుడు భేటి..
05.07.2024. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సీఎం నారా చంద్రబాబునాయుడు భేటి..

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి న్యూఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసిన విషయం తెలిసిందే. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటి అయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, అధికారులు పాల్గొన్నారు...