త్వరలోనే ఆలయాలకు కొత్త పాలకమండళ్లు: మంత్రి

రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలపై సమీక్ష చేస్తున్నట్లు ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. 

త్వరలోనే అన్ని ఆలయాలకు కొత్త పాలకమండళ్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి వరకు కొనసాగిన పాలకమండళ్ల సభ్యులు తమ పదవీకాలంతో సంబంధం లేకుండా రాజీనామాలు చేయడం నైతిక విలువలు పాటించడం అవుతుందని తెలిపారు.

AP : బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం, హత్య

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో బాలిక (8) అదృశ్యం ఘటన కలకలం రేపింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. 

బాలిక ఆడుకుంటుండగా సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లామని.. అనంతరం అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ విషయం బయటపడుతుందనే భయంతో బాలికను కాల్వలోకి తోసేశామని తెలిపారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

AP : ట్రిపుల్ ఐటీలో గంజాయి.. మంత్రి లోకేశ్ ఆగ్రహం


వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు

 గంజాయిని ప్రోత్సహించే స్థానిక నాయకులపైనా కఠిన చర్యలకు ఆదేశించారు. దీనిపై మంత్రిని విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడతామని తెలిపారు.

AP : జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశించింది.

జగన్ కేసులపై గతంలో హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు 3వారాలకు వాయిదా వేసింది.
నా గుండె వేయి ముక్కలైంది: షర్మిల

యూపీలోని హథ్రాస్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. “ఈ ఘటన నా హృదయాన్ని వేయి ముక్కలు చేసింది. ఈ దుఃఖాన్ని వ్యక్తీకరించేందుకు నాకు పదాలు దొరకడం లేదు.

ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. యూపీ సీఎం యోగి నిరంకుశ పాలనవల్లే ఈఘటన జరిగింది. దీనిపై కేంద్ర విచారణ జరిపించాలి” అని ట్వీట్ చేశారు.
AP : నాసిరకం విత్తనాలకు చెక్... - విక్రయిస్తే కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు...

రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. "నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలి. అనుమతి లేని, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి.

రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. ఖరీఫ్ లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలి. ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలి" అని అధికారులను ఆదేశించారు.
AP : మహిళా పోలీసులపై పిటిషన్... విచారణ 3 వారాలు వాయిదా...
సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీసు విధులు అప్పగింతపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ అంశంపై 3 వారాల లో ప్రభుత్వ నిర్ణయం తెలపాలని ఆదేశించింది.

మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పేర్కొంటూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన ఉమామహేశ్వరావు పిటిషన్ వేశారు. వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విడాకుల ముచ్చట... ఆ పనికే విడాకులు ఇచ్చింది...

చిన్న చిన్న కారణాలకే భార్యభర్తలు విడాకులు తీసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇల్లు శుభ్రంగా ఉంచడం లేదని, ట్రైమ్ కు భోజనం పెడతాలేదని విడాకులు తీసుకున్న సంఘటనలు కొకొల్లాలు ఉన్నాయి.

తాజాగా ఊరగాయ పచ్చడి డబ్బాలపై భర్త మూతలు బిగుతుగా పెడుతుండడంతో తాను తీయలేకపోతున్నాని అతడికి భార్య విడాకులు ఇచ్చింది. రెడ్డిట్ అనే సోషల్ మీడియాలో భార్య పోస్టు చేసింది. ఊరవేసిన అవకాయ, నిమ్మకాయ పచ్చడి డబ్బాల మూతలను భర్త గట్టిగా మూసి పెడుతున్నాడు. ఈ మూతలు తీయడానికి భార్య ప్రయత్నించిన ఓపెన్ కాకపోవడంతో పక్కింటి వాళ్లు సహాయం తీసుకునేది.

ఇలా పలుమార్లు మూతల విషయంలో దంపతులు మధ్య గొడవల జరిగాయి. భర్తకు ఎంత చెప్పినా పట్టించుకోకపోవడంతో కోర్టు నుంచి విడాకులు తీసుకుంటున్నట్టుగా అతడికి నోటీసులు పంపించింది.

భర్త క్షమాపణలు చెప్పిన కూడా భార్య వినలేదు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్న విషయానికే విడాకులు తీసుకుంటావా? అని నెటిజన్లు భార్యపై కామెంట్లు చేస్తున్నారు. పచ్చడి డబ్బాలకు మూత బిగుతుగా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.
'కల్కి' : బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత...

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి కల్కి 2898ఏడీ సినిమాతో బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నారు. ఈ సినిమాకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయిన ఊహించని స్థాయిలో హైప్ అయితే క్రియేట్ అయ్యింది.ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మొదటి మూడు రోజులకి చాలా చోట్ల థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. రెండు ట్రైలర్స్ తోనే సినిమా ఎలా ఉండబోతోందనేది డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆడియన్స్ కి పరిచయం చేసేశారు. దీంతో కల్కి సినిమా చూడాలనే ఇంటరెస్ట్ అందరికి పెరిగింది. కల్కి 2898ఏడీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ అమెరికాలో రెండు వారాల ముందుగానే స్టార్ట్ చేశారు. దీంతో మూవీ ప్రీమియర్ షోలు ఇంకా ఫస్ట్ డే చూడాలని అనుకునేవారు ముందుగానే టికెట్స్ భారీగా బుక్ చేసుకున్నారు.


జూన్ 26 వ తేదీన నార్త్ అమెరికాలో కల్కి మూవీ ప్రీమియర్ షోలు పడ్డాయి. వీటికి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో రిలీజ్ తరువాత కూడా టికెట్ బుకింగ్స్ అనేవి జోరుగా జరిగాయి. కేవలం ప్రీమియర్స్ ద్వారానే కల్కి 2898ఏడీ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా 3.9 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఇదే హైయెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ అని తెలుస్తుంది. ఇక రిలీజ్ రోజైన గురువారం కూడా 1.5+ మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ వసూళ్లనేవి అయ్యాయి. ఓవరాల్ 5.5+ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కల్కి మూవీ మొదటి రోజు సాధించింది. ఇప్పటి దాకా ఏ సినిమా కూడా ఈ స్థాయిలో వసూళ్లు అందుకోలేదు. కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా ఓవరాల్ కలెక్షన్స్ 250 కోట్ల దాకా వసూలు అయ్యాయని సమాచారం తెలుస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటాని ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
AP : ఏపీ సర్వీసులోకి మహేష్ చంద్ర లడ్డా?

రాష్ట్ర సర్వీస్ లోకి IPS అధికారి మహేష్ చంద్ర లడ్డా రానున్నారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో CRPF ఐజీగా మహేష్ చంద్ర లడ్డా పనిచేస్తున్నారు. లడ్డాను రాష్ట్ర సర్వీసులోకి పంపాలని కేంద్రానికి AP సీఎం చంద్రబాబు లేఖ రాశారు. దీంతో IPS లడ్డాను రాష్ట్ర సర్వీసులోకి పంపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డాకు ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ap