madagoni surendar

Jul 10 2024, 13:14

తెలంగాణ :-2 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల.

రైతులకు గుడ్ న్యూస్..

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 2024, ఆగస్ట్ 15వ తేదీలోపు బ్యాంకుల్లోని 2 లక్షల రూపాయల అప్పు మాఫీకి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి మంచి విషయం చెప్పారు.

2 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల..

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 2024, ఆగస్ట్ 15వ తేదీలోపు బ్యాంకుల్లోని 2 లక్షల రూపాయల అప్పు మాఫీకి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి మంచి విషయం చెప్పారు. రుణ మాఫీకి సంబంధించిన విధివిధానాలను 2 రోజుల్లో విడుదల చేస్తున్నామని వెల్లడించారాయన. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా.. జూలై 9వ తేదీ ఈ విషయాన్ని స్పష్టం చేశారాయన. రెండు రోజుల్లో రుణమాఫీ గైడ్లైన్స్ విడుదల చేస్తామన్నారు.

ఆగస్టు 15 లోగా పూర్తి చేస్తాము..నిధుల సమీకరణ స్టార్ట్ అయింది..రేపు రైతు భరోసా పై ఖమ్మం లో అభిప్రాయం సేకరణ స్టార్ట్ చేస్తున్నాము. రైతులు, ఉద్యోగులు, మేధావులు, రైతు సంఘాల నేతలు అభిప్రాయలు తీసుకుంటున్నాము.. నేను ఇంత వరకు రైతు బంధు తీసుకోలేదు చెక్ లు ఇచ్చిన తిరిగి ఇచ్చానని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

madagoni surendar

Jul 10 2024, 11:21

ఏపీ :-ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే.

ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే.

ఏపీ : ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్,

ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి.

ఏపీ : ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్,

ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి.

అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును

ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇందుకోసం QR

కోడ్లు ఏర్పాటు చేశారు. ఇసుక డిపోలు ఉ.6

నుంచి సా.6 వరకు పని చేస్తాయి. స్టాక్ ఉన్నంత

వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇస్తారు.

www.mines.ap.gov.in ద్వారా మీ సమీపంలోని

ఇసుక డిపో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

madagoni surendar

Jul 09 2024, 23:00

సూర్యాపేట జిల్లా:- మఠంపల్లి మండలం అల్లిపురం లో రాధిక రైస్ మిల్లులో భారీ పిడిఎస్ బియ్యం పట్టివేత

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లిపురం లో రాధిక రైస్ మిల్లులో భారీ పిడిఎస్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిలువ ఉంచిన 250 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు....

మఠంపల్లి మండలం అల్లిపురం గ్రామానికి చెందిన రాధిక రైస్ మిల్లు వ్యాపారస్తుడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి చెందినది గా గుర్తింపు...

ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న హుజూర్నగర్ సీఐ చరమందరాజు మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులు సివిల్ సప్లై అధికారులు...

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు....

madagoni surendar

Jul 09 2024, 18:50

హైదరాబాద్ :-చట్నీలో ఎలుక:మంత్రి దామోదర నరసింహ ఆగ్రహం

చట్నీలో ఎలుక:మంత్రి దామోదర నరసింహ ఆగ్రహం

హైదరాబాద్ :జులై 09

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌ పూర్ జేఎన్టీయూ కాలేజ్ క్యాంటీన్‌లో చట్నీలో ఎలుక వచ్చిన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేఎన్టీయూలో జరిగిన ఘటనపై తక్షణం విచారణ చేపట్టాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక ఆర్డీఓ, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టి వెంటనే నివేదిక ను సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఇలాంటి ఘటనలు పున రావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికా రులకు సూచించారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాల్లో ఉన్న బోర్డింగ్, హాస్టళ్లను, క్యాంటీన్లను తనిఖీలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆహార పదార్థాలను తయా రు చేసే నిర్వాహాకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ను తీసుకోవాలని మంత్రి కోరారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు బేకరీలు, బోర్డింగ్, హాస్టల్స్, క్యాంటీన్లు, ఆహార పదార్థా లు తయారు చేసే నిర్వాహ కుల పై నిఘా ఉంచాలని మంత్రి అధికారాన్ని ఆదేశించారు.

madagoni surendar

Jul 09 2024, 16:44

చిత్తూరు జిల్లా :-పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి 2 + 2 భద్రత కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

A.P:-చిత్తూరు:పెద్దిరెడ్డి కి 2+2 భద్రత ఇవ్వండి.. హైకోర్టు ఆదేశం

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి 2 + 2 భద్రత కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.

ప్రాణహాని ఉందని ఆయన చెప్పినందున దీనిని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నామని తెలిపింది.

తదుపరి విచారణ రెండు వారాలులకు వాయిదా వేసింది.

.

గతంలో తనకు ఉన్న 5+5 ఉన్న భద్రతను 1+1 గా తగ్గించారని పెద్దిరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

madagoni surendar

Jul 09 2024, 15:22

ఆపరేటర్ల సమస్యను పరిష్కారానికి కృషి.రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్.

తెలంగాణ రాష్ట్రo:- ఆపరేటర్ల సమస్యను పరిష్కారానికి కృషి

రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్.

అసోసియేన్ ప్రతినిధులతో రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్.

నల్గొండ జిల్లా:-

తెలంగాణ ఎన్నికల కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ ఎన్నికల కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సోమవారం హైదరాబాదులో చిక్కడపల్లిలో అసోసియేషన్ ఎన్నికలు జరిగాయని, తాను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక అయినట్లు వివరించారు. తమ ఆపరేటర్ల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.తనతో పాటు అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా జోతి ( కొడంగల్), ప్రధాన కార్యదర్శిగా మాణిక్యప్రసాద్ కోశాధికారిగా రాచకొండ మహేష్ (సూర్యాపేట) ఎన్నికయ్యారని చెప్పారు.తమను రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిదులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

madagoni surendar

Jul 09 2024, 14:44

మృతి చెందిన జర్నలిస్టు రమణ కుటుంబానికి బాసటగా నిలిచిన.తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్

సూర్యాపేట జిల్లా :-

మృతి చెందిన జర్నలిస్టు రమణ కుటుంబానికి బాసటగా నిలిచిన

తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్

6వేలరూపాయల నగదు 25 కేజీల బియ్యం అందజేత

..

గత ఏడు సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు రమణ కుటుంబానికి తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆర్థికంగా తోడ్పాటును అందించారు.మంగళవారం సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామంలో గల ఆయన నివాసానికి చేరుకొని దశదినకర్మల ఖర్చుల నిమిత్తం రమణ భార్య కు ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. సందర్భంగా అసోసియేషన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ తోటి జర్నలిస్టులకు కు ఏదైనా ఇబ్బందులలో ఉన్న క్రమంలో తమకు తోచిన విధంగా సహకరించేదుకు ముందుకు వస్తామని ప్రస్తుతం రమణ అంత్యక్రియలకు అదేవిధంగా దశదిన కర్మ కార్యక్రమానికి సహకరించిన ఇతర యూనియన్ మిత్రులకు అదే విధంగా తమ అసోసియేషన్ మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ అసోసియేషన్ నుండి 6వేల రూపాయల నగదు 25 కేజీల బియ్యం ఇవ్వటం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువరన్ ఆచార్యులు, హుజూర్నగర్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు చిలక సైదులు,సూర్యాపేట నియోజకవర్గ కమిటీ సభ్యులు తాప్సి అనిల్,దేశగాని వెంకట్ గౌడ్,వల్దాసు శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

madagoni surendar

Jul 08 2024, 19:17

సూర్యాపేట జిల్లా:-జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి ఆర్డీవో కు వినతి పత్రం అందించిన హుజూర్నగర్ టీఎస్ జేఏ జర్నలిస్టులు

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

ఆర్డీవో కు వినతి పత్రం అందించిన హుజూర్నగర్ టిఎస్ జేఏ జర్నలిస్టులు

నల్గొండ జిల్లా :-

...

ఎన్నో సంవత్సరాలుగా వేతనాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు ఉచిత సేవ అందిస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు అదేవిధంగా నియోజకవర్గ కమిటీ సభ్యులు ఆర్డీవోకు సోమవారం వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొట్టే నాగరాజు యాదవ్ మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎంతోకాలంగా జర్నలిస్టులుగా కొనసాగుతున్న తమకు ఇంటి స్థలాలు లేదా ప్రత్యేక ఇండ్లు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా హెల్త్ కార్డులు అక్రిడేషన్ కార్డులు పోలీస్ భరోసా కార్డులు ఇప్పించాలని ఇంకా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవోకు సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ఆదేశానుసారం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్లు దేవరం రామకృష్ణారెడ్డి, బరిగెలవిజయ్ కుమార్, త్రిపురారం లక్ష్మారెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షులు అల్వాల రవికుమార్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు చిలక సైదులు, ప్రధాన కార్యదర్శి పిడమర్తి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాతంగి రవి, కోశాధికారి మలోతు శంకర్ నాయక్ , కమిటీ సభ్యులు పల్లె సుధాకర్, మీసాల వీరబాబు, బేత శివారెడ్డి తదితర జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు

madagoni surendar

Jul 08 2024, 15:59

తెలంగాణ :-రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం.తొలత తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో పర్యటించాలని ఆయన నిర్ణయించారట.రేపు ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం.దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. సీఎం అయ్యాక తొలిసారి జిల్లల పర్యాటకు రానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

madagoni surendar

Jul 07 2024, 18:08

ఏపీ:పేలిన బాయిలర్.. 15 మందికి తీవ్రగాయాలు

ఏపీ: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలింది.

ఏపీ : ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.