త్రాగునీటి సమస్య పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
అనంతపురం, జులై 08 : *త్రాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో త్రాగునీటి సమస్య, జల్ జీవన్ మిషన్, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వజ్రకరూరు మండలంలోని కొనకల్లు గ్రామంలో నీటి సమస్యపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వజ్రకరూరులో అక్రమ కొళాయిలను తొలగించేందుకు నోటీసులిచ్చి వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తాగునీటికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి కావలసిన నిధుల కోసం వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి పంపాలన్నారు. జిల్లా పరిషత్ నుండి కేటాయించే నిధులకు సంబంధించిన పూర్తి నివేదికను తయారు చేయాలని, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు సంబంధించిన నివేదికలను ఈ ఆఫీస్ ద్వారా తయారు చేసి పంపాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్ట్ డిఈ శ్రీనివాసులు, తాడిపత్రి డిఈ శ్రీరాములు, సత్యసాయి డిఈ రామారావు, ఉరవకొండ డిఈ సఫ్రాన్ మరియు సంబంధిత శాఖ జేఈలు, తదితరులు పాల్గొన్నారు.
Jul 10 2024, 12:14