ఆలూరు. ఎర్రి స్వామి రెడ్డి ని శ్రీ గూగుడు కుళ్లాయి స్వామి వార్ల బ్రహ్మోత్సవముల ఆహ్వానం..
సింగనమల నియోజకవర్గ యువ నాయకుడు ఆలూరు. ఎర్రి స్వామి రెడ్డి గారిని శ్రీ గూగుడు కుళ్లాయి స్వామి వార్ల బ్రహ్మోత్సవముల ఆహ్వానము కి రావాలని ఆహ్వానించిన గూగూడు గ్రామస్తులు.
త్రాగునీటి సమస్య పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
అనంతపురం, జులై 08 : *త్రాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో త్రాగునీటి సమస్య, జల్ జీవన్ మిషన్, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వజ్రకరూరు మండలంలోని కొనకల్లు గ్రామంలో నీటి సమస్యపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వజ్రకరూరులో అక్రమ కొళాయిలను తొలగించేందుకు నోటీసులిచ్చి వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తాగునీటికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి కావలసిన నిధుల కోసం వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి పంపాలన్నారు. జిల్లా పరిషత్ నుండి కేటాయించే నిధులకు సంబంధించిన పూర్తి నివేదికను తయారు చేయాలని, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు సంబంధించిన నివేదికలను ఈ ఆఫీస్ ద్వారా తయారు చేసి పంపాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్ట్ డిఈ శ్రీనివాసులు, తాడిపత్రి డిఈ శ్రీరాములు, సత్యసాయి డిఈ రామారావు, ఉరవకొండ డిఈ సఫ్రాన్ మరియు సంబంధిత శాఖ జేఈలు, తదితరులు పాల్గొన్నారు.
మడకశిరలో ప్రజల వద్దకే పాలన..
మడకశిర నియోజకవర్గం వర్గం ఎమ్మెల్యే MS. రాజు మడకశిర మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రధాన కూడలి వాల్మీకి సర్కిల్ నందు ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులతో,ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. స్కూటీ లో వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకొని పలకరించి అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారిలో ఒక్కడై వెళుతున్న MLA MS.రాజు.. మడకశిర ప్రజలు వారి నాయకుడు వారి దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న మడకశిర ప్రజలు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సీఎం నారా చంద్రబాబునాయుడు భేటి..
05.07.2024. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సీఎం నారా చంద్రబాబునాయుడు భేటి..
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి న్యూఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసిన విషయం తెలిసిందే. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటి అయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, అధికారులు పాల్గొన్నారు...
శాసనసభ్యుడు జగన్ ప్రజాస్వామ్యం గురించి కక్ష సాధింపు గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది,, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు..
శాసనసభ్యుడు జగన్ ప్రజాస్వామ్యం గురించి కక్ష సాధింపు గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది,, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, నా తోటి శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి కు ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం చాలా ఆనందపడాల్సినటువంటి సమయం. సొంత బాబాయిని గొడ్డలితో నరికించి సంపించిన పులివెందుల ఎమ్మెల్యేకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నట్టోరియల్ క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడం పెద్ద ఆశ్చర్య పోల్చినటువంటి అంశం ఏమీ కాదు , చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుడిని నడు రోడ్డు మీద గొడ్డలితో నరికించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 20 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గం లో జరుగుతున్న నరమేధం 14 కేసులు ఉన్నటువంటి నరహంతకుడు భూకబ్జాదారుడు ప్రజలను పీల్చి పిప్పి చేసినటువంటి నట్టోరియల్ క్రిమినల్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు మంచి వ్యక్తిగా కనిపించడం బహుశా 30 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డికి 14 కేసులు ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కనిపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి కక్ష సాధింపు గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు చేసి ఉంటే రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసుడిని మాచర్ల పట్టణంలో పోలీసులు బట్టలు ఊడదీసి కొట్టి ఊరేగించి అరెస్టు చేయాలి. అంతటి నరరూప రాక్షసుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దేశం మొత్తం చూస్తుండగా కేసు నమోదు చేసి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలను పగలగొట్టిన ప్రజాస్వామ్యవాది రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి ఇవేం పగలగొడితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతుంటే అక్రమంగా అరెస్టు చేశారని జగన్ తెలపడం సిగ్గుచేటు అన్నారు . ఈరోజు జగన్ కు రాజ్యాంగం ప్రజాస్వామ్ గుర్తుకు వచ్చింది రేపు మాకు అంబేద్కర్ గారిని కూడా గుర్తు చేస్తాం . సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అత్యాచారం చేసి భర్త సమక్షంలో అతి కిరాతకంగా హత్యాచారం చేయడం జగన్మోహన్ రెడ్డి కు కనపడలేదా నీ తాడేపల్లి ప్యాలెస్ అతి సమీపంలో మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోరు డెలివరీ చేస్తే వాన్ని పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయం చేస్తూ ఉండడం మీకు సిగ్గుచేటు అన్నారు. స్థానిక శాసనసభ్యుడిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం మీడియా సమక్షంలో కూడా ఖండించని పాపాన పోలేదన్నారు.
ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను, పరిటాల శ్రీరామ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన దండు శ్రీనివాసులు..
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దండు శ్రీనివాసులు గారు రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారిని మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ గారినివారి స్వగృహంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు కలసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాసరి గంగాధర్ గారు మాజీ ఎంపిటిసి కుల్లాయప్ప టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి బండి పరశురాం అనంతపురం పార్లమెంటుబీసీ సెల్ అధికార ప్రతినిధి బండి పరశురాం సింగనమల నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు బెస్త నారాయణస్వామి పార్లమెంట్ మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి మహమ్మద్ గౌస్ యూనిట్ ఇంచార్జ్ ప్రకాష్ రాయల్ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు..
గూగూడు కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
అనంతపురం జిల్లా నార్పల మండలం గుగుడు గ్రామం నందు ఎంతో వైభవంగా జరిగే గూగూడు కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ I.A.S గారిని ఆహ్వానించిన సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు
అనంతసాగర్ కాలనీ, విజయనగర్ కాలనీల తాగునీటి సమస్యను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి
బుక్కరాయసముద్రం మండల పరిధిలోని అనంతసాగర్ కాలనీ, విజయనగర్ కాలనీ నందు తాగునీటి సమస్యతో కాలనీవాసులు గత రెండు సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బంది పడుతున్నాము అని *టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రామలింగారెడ్డి* అన్నగారి దృష్టికి తీసుకువచ్చారు వెంటనే *అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్* మరియు *మున్సిపల్ కమిషనర్* వారికి సమస్య గురించి విన్నవించడం జరిగింది వెంటనే వారు సానుకూలంగా స్పందించి మున్సిపాలిటీ త్రాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ గారు సుబ్బరాయుడు,అమర,ఈశ్వర్,హరి జయపుత్ర,రాము,రాఘవ,షఫీ తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.
బ్లీచింగ్ పౌడర్ కొనడానికి సిపిఎం పార్టీ భిక్షాటనకు పిలుపు..
బ్లీచింగ్ పౌడర్ కొనడానికి సిపిఎం పార్టీ భిక్షాటనకు పిలుపు..
దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. ఈరోజు సిపిఎం మండల కమిటీ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మేజర్ గ్రామ పంచాయితీ జ్వరాలు, అతిసారా సీజనల్ వ్యాదులు తీవ్రంగా ఉన్నాయి. జిల్లా పంచాయతీ అధికారులు విష జ్వరాలు, డయేరియా నివారించడానికి పారిశుద్ధం మీద దృష్టి పెట్టాలని ప్రత్యేక సమావేశం పెట్టి చెప్పారు. వ్యాదులు ప్రభల కుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడం. ప్యాగింగ్ చేయాలని అధికారులు ఆదేశించినప్పటికీ పంచాయితీ కార్యదర్శి గారికి ఏమాత్రం చలనం లేదు. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేవని అంటున్నారు. ప్యాగింగ్ మిషన్ ద్వారా పొగ, డ్రైనేజీ కాలువలలో స్ప్రే చేసి దోమల నివారించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్లు ఉన్నది. పేరుకు మేజర్ గ్రామ పంచాయితీ సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు శూన్యం. గ్రామంలో ఈగల మోత ఎక్కువగా ఉంది. మేజర్ గ్రామ పంచాయితీ బుక్కరాయసముద్రంలో గత నెల రోజుల నుండి తీవ్ర జ్వరాలు, విరోచనాలు పెరుగడం వల్ల రోగుల సంఖ్య బుక్కరాయసముద్రం పట్టణ ఆరోగ్య కేంద్రంలో పెరుగుతూనే ఉన్నది. అయినా పంచాయితీ కార్యదర్శి గారికి దోమల,ఈగల నివారణ చేయడానికి చీమ కుట్టినట్లు కూడా ఎలాంటి చిరు ప్రయత్నం చేయలేదు. దీనివల్ల సీజన్ గా వస్తున్న రోగాల నుండి గ్రామ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తనది కాదనే విధంగా పనిచేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి పంచాయితీలో నిధులు లేవని అంటున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని బ్లీచింగ్ పౌడర్ కొనడానికి, డ్రైనేజీ కాలువలలో స్ప్రే చేయడానికి మందులు, పాగింగ్ ఆయిల్ కొనడానికి నిధులు లేవని అంటున్నందున కొనడానికి సిపిఎం ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తుందని హెచ్చరించారు. తక్షణ పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కమిటీ కోరుతున్నది. లేని పక్షంలో ఆందోళన చేయాల్సి వస్తుందని తెలుపుతున్నాం. ఆర్. కుల్లాయప్ప సిపిఎం మండల కార్యదర్శి, మండల నాయకులు సి నాగేంద్ర, సంజీవరెడ్డి, నెట్టికంటయ్య, పుల్లయ్య, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Jul 09 2024, 07:53