అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఘన స్వాగతం..
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మొట్టమొదటిసారిగా విచ్చేయుచున్న శుభ సందర్భంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహమ్మద్ సలీం, డిప్యూటీ మేయర్లు తొగటం భాస్కర్ రెడ్డి, దాసరి వాసంతి సాహిత్య, కమిషనర్ మేఘ స్వరూప్, టిడిపి నాయకులు మరియు కార్యాలయ సిబ్బంది సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.. అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయానికి తొలిసారిగా విచ్చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో ఘన స్వాగతం.. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పరిచయ సమావేశం ఏర్పాటు నగరంలో అండర్ డ్రైనేజీ సమస్య, నీటి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతాం డంపింగ్ యార్డ్ లో జరిగిన అక్రమాలు, ఆ కాంట్రాక్టర్లపై తప్పకుండా చర్యలు చేపడతామన్న ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు
Jul 09 2024, 07:42