కొట్టాల, ఇందుర్తి గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీల ఏర్పాటు

మర్రిగూడెం మండలం కొట్టాల, ఇందుర్తి గ్రామాలలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య సమక్షంలో గ్రామ కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య లు మాట్లాడుతూ.. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి గ్రామ బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇందుర్తి మాజీ సర్పంచ్ జంగిలి ప్రసన్న రవి, కొట్టాల మాజీ సర్పంచ్ గంట కవిత యాదయ్య, గంట మల్లేష్, నందికొండ లింగారెడ్డి, పలువురు నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

లెంకలపల్లి: బెల్టు షాపుల నిర్మూలన కమిటీ ఏర్పాటు

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:

మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య సమక్షంలో గ్రామంలోని రెండు బూత్ ల నుండి కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి గ్రామ బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, ఏర్పుల శ్రీశైలం, నందికొండ లింగారెడ్డి, చాపల రవి, అయితగోని వెంకటయ్య, మేతరి శంకర్, దాసరి వెంకన్న, లింగయ్య, హరీష్, , వెంకటయ్య, యాదయ్య, నాగరాజు, శ్రీను, గిరి, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు కు ఘన సన్మానం
ఫిజికల్ డైరెక్టర్ గా పదోన్నతి బదిలీ పై వెళ్లిన బొమ్మపాల గిరిబాబు ను ఇవాళ జేబీఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆయనను సన్మానించి అభినందించారు. పాఠశాల లో క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకల్పనకు, విద్యాభివృద్ధికి, విద్యార్థుల సంఖ్య పెంచడానికి వారు చేసిన కృషిని కొనియాడారు.
నాయి బ్రాహ్మణ కుటుంబాలకు అండగా నాయి యువసేన ఫౌండేషన్
మిర్యాలగూడ పట్టణ నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యుడు దోమలపల్లి ఎల్లయ్య గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఎల్లయ్యకు ప్రస్తుతం కుల వృత్తి చేయలేని స్థితిలో ఉన్నందున విషయం తెలుసుకున్న నాయి యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వారి నివాసం అభంగాపురం గ్రామంలో 50 కేజీల బియ్యం మరియు వారానికి సరిపడా కూరగాయలను, నిత్యవసర సరుకులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం నాయి యువసేన ఫౌండేషన్ వారు మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని, కలిసి ఉంటేనే కలదు సుఖం అని వారు అన్నారు. ఆపదలో ఉన్న వారిని తమ వంతు సహాయ సహకారాలు అందించడంలో మా నాయి యువసేన ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో యాదగిరి, సత్య, ఉపేందర్, నగేష్, వెంకట్, నరేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
NLG: హెడ్మాస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.డి యూసుఫోద్దీన్ కు సన్మానం
నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు ప్రభుత్వ హైస్కూల్ FAC హెడ్మాస్టర్ గా  బాధ్యతలు స్వీకరించిన యూసఫోద్దీన్ లకు ఈరోజు గేయ రచయిత
డాక్టర్ వై. శ్యాంసుందర్ రెడ్డి మరియు ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు లు శాలువాతో ఘనంగా సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల లోని ఉపాధ్యాయులు.. ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో అనుభవం నిబద్ధత గల వారని, వారందరి కృషి ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతూ విద్యార్థి విద్యార్థులు చదువుతోపాటు సర్వతో ముఖాభివృద్ధి సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని తెలిపారు.
NLG: గ్రామ సమస్యలపై ఫిర్యాదు అందజేసిన ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు
మర్రిగూడెం మండలం, ఖుదాభక్షి పల్లి గ్రామంలో  ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవైఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్ పలు గ్రామ సమస్యల పై డిప్యూటీ తహసిల్దార్ తారక రామన్ కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా బూడిద సురేష్ మాట్లాడుతూ.. రైతుల పొలాలలో ఉన్న ఇనుప స్తంభాలను తొలగించి వాటి స్థానంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, గ్రామంలో ఆక్రమణకు గురైన గ్రామకంఠం భూములను కాపాడాలని, గ్రామంలో బందరు దొడ్డి ఆక్రమణకు గురికాకుండా యధాస్థితిలో ఉంచాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ కార్యదర్శి పొట్టగిరి, సహాయ కార్యదర్శి మేతరి యాదయ్య, సీనియర్ నాయకులు ఇష్కిల్ల మహేందర్, సిరిపంగి శ్రీనివాస్ బొమ్మగాని హనుమంతు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
33/11 కెవి. విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరీ  పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ: పట్టణంలో బీట్ మార్కెట్ ఏరియాలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు.. రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ. 3 కోట్ల రూపాయల విలువ గల 33/11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరీ చేయించి పనులకు శంకుస్థాపన చేశారు. గత వేసవిలో దాదాపు 14 నుంచి 15 వేల గృహాల ప్రజలు లోవోల్టేజీ సమస్య కారణంగా ఇబ్బందులు పడ్డారు.
NLG: డీసీసీబీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కుంభం శ్రీనివాసరెడ్డి ని అభినందించిన మంత్రి
నల్గొండ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంభం శ్రీనివాస్ రెడ్డి  డీసీసీబీ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. రైతులకు సేవ చేసేందుకు డీసీసీబీ ఒక మంచి అవకాశం, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు, నాయకునికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీని చిరస్థాయిగా నిలబెడతామన్నారు.
NLG: నిర్మాణరంగ కార్మికుల పెండింగ్ క్లైమ్ లను వెంటనే పరిష్కరించాలి: సిఐటియు జిల్లా అధ్యక్షుడు
నల్లగొండ జిల్లా వెల్ఫేర్ బోర్డులో పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్ ను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల మండల జనరల్ బాడీ సమావేశం బి. లక్ష్మయ్య అధ్యక్షతన సిఐటియు కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో నిర్మాణరంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందించడంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని లేబర్ అధికారులు ప్రదర్శిస్తున్నారని వెంటనే క్లైములు పరిష్కారం చేయకపోతే డీసీఎల్ ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.           
వెల్ఫేర్ బోర్డులో 3 వేల కోట్ల రూపాయలు మూలుగుతున్న కార్మికులకు క్లెయిమ్స్ చెల్లించడంలో లేబర్ అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తూ కార్మికుల చెప్పులు అరిగేలాగా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఇస్తున్న నష్టపరిహారాలు కూడా పెంచాలని డిమాండ్ చేశారు. నిర్మాణ కార్మికుల యాప్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించి మళ్లీ పనిలోకి తేవాలని కోరారు.సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులందరూ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా చేరి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అనుభవించాలని కోరారు. ప్రభుత్వాలు నిర్మాణరంగా కార్మికుల పట్ల సవితి తల్లి ప్రేమ ప్రదర్శిస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘ మండల నాయకులు బి. లక్ష్మయ్య, నీలకంఠం రాములు, పిడిగం  వెంకటయ్య, పగడాల పెద్దఅంజయ్య, ఊరి పక్క యాదయ్య, పగిళ్ల రాములు, గ్యార నరేష్,  సీత పర్వతాలు పగడాల అశోక్ లప్పంగి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
పిఏసిఎస్ చైర్మన్ పందుల యాదయ్య గౌడ్ అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ సమావేశం
మర్రిగూడ మండల కేంద్రంలో పిఏసిఎస్ చైర్మన్ పందుల యాదయ్య గౌడ్ అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతు బంధు పథకం పైన రైతుల సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీఏ ఎల్లయ్య హాజరైనారు. ఈ సందర్భంగా రైతుల సలహాలు-సూచనల నివేదికను ప్రభుత్వానికి పంపుటకు మినిట్స్ రిపోర్ట్ ను సహకార అధికారులు సేకరించారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు మహేశ్వరం మారెమ్మ, పగడాల లింగయ్య, మొగుదల ముత్యాలు, మండారీ అచయ్య, ఆంబోతు బొడ్య, బాయికడి ఏడు కొండలు, మామిడి యాదయ్య, ఉప్పునూతల మల్లయ్య, గుంటోజు రామా చారి, చామకూర తేజశ్రీ, సహకార అధికారులు అసిస్టెంట్ రిజిష్టర్ రామనర్సయ్య, వ్యవసాయ అధికారులు ఏఓ హేమలత, ఏఈఓ లు విజయ్ కుమార్, పావని, శ్రీలత, సుజాత, సంఘ సీఈఓ రావిరాల శ్రీనివాస్, సంఘ సిబ్బంది కోట మల్లికార్జున్, రావిరాల శివ సాయి, కట్కూరి సందీప్, మదగోని పరమేష్, మరియు సంఘ సభ్యులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.