ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలి.నకిరేకల్ సిఐ రాజశేఖర్
ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలి.నకిరేకల్ సిఐ రాజశేఖర్
నల్గొండ జిల్లా:-
నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో కొత్త చట్టాలపై అవగాహన కలిగించుటకు రోడ్డు ప్రమాదాలు నివారణ గంజాయి మత్తు పదార్థాల నివారణ సైబర్ నేరాల పట్ల అప్రమత్తత బాల కార్మికులు సోషల్ మీడియా స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలా నివారణ కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు దొంగతనాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్పీ ప్రత్యేక కార్యాచరణతో అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యంపుటకు పోలీస్ కళాబృందల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ,, ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం నకిరేకల్ పిఎస్ పరిధిలోని చందంపల్లి గ్రామంలోసీఐ రాజశేఖర్,ఎస్సై గోపిక్రిష్ణ ఆధ్వర్యంలో పోలీస్ కళాకారుల బృందం షేక్ హుస్సేన్, శేఖర్ పురుషోత్తం, సత్యం, మురళి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా,సీఐ రాజశేఖర్,ఎస్ఐ గోపిక్రిష్ణ లు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానం వచ్చిన అనుమానిత వ్యక్తులు కనిపించిన 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు,
Jul 06 2024, 15:52