నిజంనిప్పులాంటిది

Jul 05 2024, 11:48

ప్రధాని మోడీతో ఏపీ సీఎం భేటీ

ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీని కలిసిన చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వద్దు, ఏం అడిగారో తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) కీలక భాగస్వామిగా ఉన్న నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వకపోతే రాష్ట్రానికి మరింత సహాయం చేయాలని కోరినట్లు చెబుతున్నారు.

ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) కీలక మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ (టిడిపి) చీఫ్ 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదుర్కొన్న సవాళ్లను హైలైట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి కేంద్ర సహాయాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు మరియు ప్రత్యేక కేటగిరీ హోదాకు బదులుగా సహాయం పెంచాలని సూచించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్‌లను కూడా కలిశారు.

హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు ఆరోగ్య మంత్రి జెపి నడ్డాతో సహా ఇతర కేంద్ర మంత్రులను కూడా నాయుడు కలవవచ్చని వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశాల అనంతరం, మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ 'రాష్ట్రాల మధ్య పవర్‌హౌస్‌'గా మళ్లీ ఆవిర్భవించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 'X'పై ఒక పోస్ట్‌లో, 'ఆంధ్రప్రదేశ్ సంక్షేమం మరియు అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి నేను ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో నిర్మాణాత్మక సమావేశం నిర్వహించాను. ఆయన సారథ్యంలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మించిన శక్తిగా పుంజుకుంటుందన్న నమ్మకం నాకుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 67 శాతం పెరిగి 2023 మార్చి చివరి నాటికి రూ.4,42,442 కోట్లకు చేరుకుంది. మార్చి 31, 2024 నాటికి రాష్ట్ర స్థూల ఆర్థిక లోటు రూ. 55,817.50 కోట్లుగా అంచనా వేయబడింది, 2018-19లో రూ. 35,441 కోట్ల కంటే 57 శాతం ఎక్కువ.

నిజంనిప్పులాంటిది

Jul 03 2024, 19:04

మంత్రి వర్గంలో చోటు ఎవరికి ?

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణకు సమాయత్తం అవుతుండటంతో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మంచిర్యాల జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనన్న చర్చ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌లతోపాటు నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రస్తుతం మంత్రి పదవి రేసులో ఉన్నారు.

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో మంత్రి పదవి కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్‌కు ఊపు రాగా, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. మంచిర్యాల నుంచి గెలుపొందిన ప్రేంసాగర్‌రావు 2007-13 వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీగా పదవిని అలంకరించారు. 2018లో మంచిర్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

పీఎస్సార్‌కే మంత్రి పదవి దక్కుతుందని కాంగ్రెస్‌ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి తనయులైన బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్‌, గడ్డం వివేక్‌లు సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. గడ్డం వినోద్‌ 2004లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికకాగా 2009 వరకు కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. గడ్డం వివేక్‌ 2009-14 వరకు పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడిగా సేవలందించారు.

వీరు సైతం కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి మంత్రి పదవి దక్కించుకునేందుకు మంతనాలు సాగించారు. మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనన్న ప్రచారం జిల్లాలో ప్రస్తుతం జోరుగా సాగుతోంది.

నిజంనిప్పులాంటిది

Jul 03 2024, 19:00

రేపు విద్యాసంస్థల బంద్ !

విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై 4వ తేదీన జరిగే విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

మంగళవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి డాక్టర్లను అందించే నీట్‌ పరీక్షపత్రాన్ని లీక్‌చేయడంతో 20లక్షల మంది విద్యార్థుల జీవితం అగమ్యగోచరంగా మారిందన్నారు.

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యా సంస్థల బంద్‌ కార్యక్రమంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు సహకరించాలని కోరారు.

ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుంగమట్ల శివ, పిల్లి కార్తీక్‌, దాసరి కార్తీక్‌, ముఖేష్‌ పాల్గొన్నారు.

Streetbuzz News

Real Time News Platform

నిజంనిప్పులాంటిది

Jul 03 2024, 08:43

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలాసీతారామన్, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా సహా పలువరు కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశం కానున్న చంద్రబాబు.. 

రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్న ఏపీ సీఎం

Streetbuzz News

SB NEWS

REAL TIME NEWS PLATFORM

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Jul 02 2024, 14:16

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై "శ్రీవర్ధన్ రెడ్డి" ఫైర్..

 •హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్.. 

 •షాద్ నగర్ మీడియాతో నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి 

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు.. రాహుల్ గాంధీ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి స్పందించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి జవాబుదారీగా, ప్రజల గొంతుకుగా ఉండే ప్రతిపక్ష నేత.. ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.

నాడు వాజ్‌పేయి, అద్వానీ, సుష్మా స్వరాజ్ లాంటి దిగ్గజాలు ఈ ప్రతిపక్ష నేత పాత్రను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తే.. నేడు అందుకు విరుద్ధంగా రాహుల్ గాంధీ వ్యవహరించారని శ్రీ వర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తన తొలి ప్రసంగంలో బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

లోక్‌సభ వేదికగా రాహుల్ గాంధీ హిందువులపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసి.. ఆయనకు హిందూ సమాజంపై ఉన్న వ్యతిరేకతను మరోసారి తన వ్యాఖ్యల్లో రుజువు చేసుకున్నారన్నారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ పార్టీపై ఉన్న ద్వేషాన్ని రాహుల్ గాంధీ మరోమారు చూపించారన్నారు. హిందువులను అవమానించడం ఇండియా కూటమికి ఇదేం కొత్తకాదని.. గతంలోనూ కాంగ్రెస్, ఆ పార్టీలోని కూటమి సభ్యులు పలుసార్లు హిందూ సమాజంతో పాటు సనాతన ధర్మాన్ని సైతం అవమానించారని శ్రీ వర్ధన్ రెడ్డి చెప్పారు.

2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హిందువులను శిక్షించే విధంగా మత హింస బిల్లును రూపొందించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని గుర్తు చేశారు. కాగా, లోక్‌సభలో హిందువులపై ద్వేషపూరిత ప్రసంగం చేసిన రాహుల్ గాంధీ.. మొత్తం హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

తాము చట్టబద్ధంగా ధర్మ పరిరక్షణకు ముందుకు సాగుతున్నామని ఇలాంటి అఘాయిత్యాలకు గాని ఏలాంటి దాడులు విద్వేషాలకు పాల్పడలేదని ఈ సందర్భంగా శ్రీవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు..

నిజంనిప్పులాంటిది

Jul 02 2024, 12:53

యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు..

దాదాపు 9 నెలల తరువాత లభ్యమైన యువతి ఆచుకీ..

తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ కి పిర్యాదు చేసిన భీమవరంకు చెందిన శివ కుమారి 

యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో సీఐతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ 

విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడుతో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.

జమ్మూ నుంచి ఇద్దరినీ విజయవాడ తీసుకొస్తున్న స్పెషల్ టీం.

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నగర పోలీసు కమిషనర్.

నిజంనిప్పులాంటిది

Jul 02 2024, 09:53

తాడేపల్లిలో జగన్​ నివాసం దగ్గర అడ్డంకులు తొలగింపు - హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ఎవరైనా అనుమతి లేకుండా వెళ్లే వాహనాలను నిలుపుదల చేసేందుకు జగన్​ ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన రెండు టైర్ కిల్లర్లు, నాలుగు హైడ్రాలిక్ బొలార్డ్స్ భూమిలో ఏర్పాటు చేశారు. ఇవి ఆటోమేటిక్ విధానంలో పని చేస్తాయి. వీటిని తొలగించి, జగన్ ఇంటి సమీపంలోని చెకింగ్ పాయింట్లను తీసేశారు.

వైఎస్సార్సీపీ హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. జగన్‌ ప్రస్తుతం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కావడంతో ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భద్రత టెంట్​లను సోమవారం రాత్రి తొలగించారు, ఆయన నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రహదారిలో గతంలో అత్యంత ఆధునిక సామగ్రితో భద్రతా ఏర్పాటు చేశారు.

ఇప్పుడు జగన్ నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రహదారిలో రాకపోకలు మరింత సుగమమయ్యేలా చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపి వేయకుండా వెళ్తే కట్టడి చేసే టైర్ కిల్లర్లు (మేకులతో కూడిన బారికేడ్లు), హైడ్రాలిక్ బుల్లెట్లను క్రేన్ సాయంతో తీసివేశారు. ఇవన్నీ విద్యుత్​తో పని చేస్తాయి. వీటితో పాటు రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్రరత్న పంపింగ్ స్కీం వైపున ఉన్న పోలీసు చెక్ పోస్టును సైతం ఎత్తివేశారు. తొలగించిన సామగ్రిని లారీలో తరలించారు. రహదారి వెంట కంటైనర్లు మాత్రం అలాగే ఉన్నాయి.

ఇంతకు ముందే తాడేపల్లి ప్యాలెస్ ముందు అంక్షలు తొలిగాయి. నాలుగు లేన్ల రహదారి మంగళగిరి - తాడేపల్లి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి పక్కన పేదలను బలవంతంగా ఖాళీ చేయించటంతో పాటు రహదారిని పూర్తిగా పోలీసులు దిగ్బంధించారు. ఇప్పుడు సామాన్య ప్రజలకు రహదారి అందుబాటులోకి వచ్చింది. సమీప పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, పొలాలకు వెళ్లే రైతులు, రైతు కూలీలు ఇలా వివిధ వర్గాల ప్రజలకు రహదారి అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ రహదారిలోకి వెళ్లాలంటే ఉన్నతాధికారులు సైతం తమ ఫొటోలు, గుర్తింపు కార్డులు ముందుగా ఇస్తేనే అటువైపు అనుమతించే పరిస్థితి ఉండేది.

ఇదే విధంగా జగన్​ అక్రమ కట్టడాలు, ఆడంబర బందోబస్తులకు ఎన్డీయే ప్రభుత్వం ఒక్కొక్కటిగా చెక్​ పెడుతోంది. దీంతో ప్రజలకు విముక్తి కలుగుతోంది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ జగన్​ వెలగబెట్టిన కార్యాలను ప్రభుత్వం చక్కబెడుతూ వస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Jul 01 2024, 16:36

హైకోర్టులోను కేసీఆర్‌కు ఎదురుదెబ్బ !

- పవర్ కమిషన్ పై హైకోర్టు కీలక నిర్ణయం 

- కెసీఆర్ ను విచారించాలని గ్రీన్ సిగ్నల్ 

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. విద్యుత్ అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్ విచారణపై కేసీఆర్ సవాల్ చేశారు.

నేడు కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణను కేసీఆర్ సవాల్ చేశారు. ఇరువైపుల వాదనలూ విన్న న్యాయస్థానం ప్రభుత్వ వాదనలను సమర్థిస్తూ కేసీఆర్ పిటిషన్‌ను కొట్టేసింది.

హైకోర్టులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై మూడు రోజుల ముందే వాద‌న‌లు ముగిశాయి. అయితే ఆ రోజున హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జ‌స్టిస్ ఎల్ న‌ర‌సింహారెడ్డి జారీ చేసిన నోటీసులు ర‌ద్దు చేయాల‌ని కేసీఆర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అసలు కేసీఆర్ పిటిష‌న్‌కు విచార‌ణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాద‌న‌లు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ ఏడాది మార్చి 14న జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ సంఘాన్ని నియమించింది. కమిషన్‌ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని ఇవాళ హైకోర్టు కొట్టివేసింది.

నిజంనిప్పులాంటిది

Jul 01 2024, 16:34

పురుగుల మందు డబ్బాతో చెట్టెక్కిన రైతు !

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తన భూమి సమస్యను పరిష్కరించాలంటూ ఓ రైతు చెట్టు ఎక్కిన సంఘటన చోటు చేసుకుంది బాధితుడు భూక్య బాలు చెప్పిన వివరాల ప్రకారం

పెద్దనాగారం జీపీ పరిధిలోని హజ్ తండ కు చెందిన తనకు రెండు ఎకరాల భూమి ఉండగా తన భూమిని భూక్య హరిలాల్ భద్రు ల పేరిట పట్టా చేయడంతో తను సర్వేకు అప్లై చేసుకొనగా సర్వేయర్ వచ్చి సర్వే చేసే క్రమంలో అడ్డు తగిలినట్లు తెలిపాడు.

తన భూమిని తనకి ఇప్పించాలంటూ ఎన్నోసార్లు తహశీల్దార్ కు విన్నవించుకున్నట్లు తెలిపాడు ఇప్పటివరకు తన భూమిని తన పేరిట చేయకపోవడంతో తనకు అన్యాయం జరిగుతుందని బాధితుడు బాలు తెలిపాడు.

తహశీల్దార్ నాగరాజును వివరణ కోరగా సర్వేయర్ వివరణ తీసుకుని ఉన్నతాధికారులకు తెలియ చేయనున్నట్లు తెలిపాడు తహశీల్దార్ పోలీసులు భూ సమస్యను పరిష్కరించుతామంటూ హామీ ఇవ్వడంతో రైతు చెట్టుపైనుండి కిందికి దిగాడు.

నిజంనిప్పులాంటిది

Jul 01 2024, 16:05

వామ్మో ‼️; రాష్ట్రంలో మళ్ల కరెంట్ తిప్పలు !

- ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ కోతలు 

- ఆదిలాబాద్ రిమ్స్ లో కరెంటు లేక మస్తు తిప్పలు 

- వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి 

- రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంస్థల్లో కరెంటు కోతలు 

- తక్కువ ఓల్డ్ ఏజ్ కి ఇంటికి సరఫరా పెరుగుతున్న విద్యుత్ బిల్లులు 

- పంట పొలాల్లో కాలిపోతున్న మోటర్లు 

తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు ఎప్పుడు వచ్చేదో.. ఎప్పు డు పోయేదో తెలిసేది కాదు. కరెంటుపై అస లు గ్యారంటీ ఉండేది కాదు. రాత్రీ.. పగలూ పొలాల కాడ ఉండి నీళ్లు పారిచ్చేటోళ్లం. ఒక్క వానకాలం పంటే తీసేది. ఇగ ఎండాకాలంలో పొలాలన్నీ బీళ్లుగానే ఉండేటివి. ఆనాడు నరకం చూసినం. ఇక వెల్డింగ్‌, మెకానిక్‌వంటి దుకాణాలు నడిపించే వారికి గిరాకీలుండేటివి కావు. కరెంట్‌ కోతల వల్ల అనేక పరిశ్రమలు మూతపడ్డయ్‌. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినంక 24 గంటల ఉచిత కరెంటిచ్చిన్రు.

రైతులందరం పదేండ్ల పాటు రంది లేకుంట ఎవుసం చేసుకున్నం. యేటా రెండు.. మూడు పంటలు కూడా తీసినం. నిరంతర విద్యుత్‌తో చిరువ్యాపారులకు సైతం చేతినిండా పని దొరికింది. ఇదంగా కేసీఆర్‌ గొప్పతనమే. గాయనలెక్క మంచి పనులు చేసినోళ్లు లేరు. ఇప్పుడు కాంగ్రెసోళ్లు అధికారంలోకి వచ్చినంక మళ్లా కరెంట్‌ కష్టాలు మొదలైనయ్‌. ఎప్పుడు పడితే అప్పుడు కోతలు పెడుతున్నరు. యాసంగిలో పంటలు ఎండిపోయినయ్‌. గీ వర్షాకాలంలో కూడా కరెంటు సరిగా ఇస్తరో.. ఇవ్వరోనని భయమైతంది.’ అని రైతులు అభిప్రాయపడుతున్నారు.

2014 కంటే ముందు కరెంటు లేక అష్టకష్టాలు పడ్డం. కరెంటు లేక, లో ఓల్టేజీతో మోటర్లు కాలిపోయేవి. రైతులు అరిగోస పడుతున్నా పట్టించుకునేవాళ్లు కాదు. కాలిపోయిన కరెంటు మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు రిపేరు చేయించుకునేందుకు తిప్పలపడేటోళ్లం. తెలంగాణ వచ్చినంక మా గోస తీర్చింది కేసీఆరే. 24 గంటల పాటు కరెంటిచ్చిండు. పదేండ్లు రంది లేకుంట పంటలు తీసినం. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినంక మళ్లా కరెంట్‌ కోతలు పెడుతున్నరు. పంటలు పండుతయన్న గ్యారెంటీ లేకుంటైతంది. 

తెలంగాణ రాకముందు కరెంటు కష్టాలు అనుభవించినం. కరెంటు ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలిసేది కాదు. పంటలేసి మస్తు నష్టపోయినం. కొందరైతే ఎవుసం ఇడిసిపెట్టి కూలీ పనులకు పోయిన్రు. మన రాష్ట్రం వచ్చి కేసీఆర్‌ సీఎం అయినంక రైతుల బాధలు తీర్చిండు. 24 గంటలు కరెంటిచ్చి ఢోకా లేకుంట చేసిండు.

 - రైతు (లచ్చయ్య) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా