బుక్కరాయసముద్రం ఆరోగ్య పరిధిలో స్టాప్ డయేరియా ప్రోగ్రాంలో భాగంగా మరియు డెంగ్యూ మాసోత్సవం..
స్టాప్ డయేరియా ప్రోగ్రాంలో భాగంగా మరియు డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా బుక్కరాయసముద్రం ఆరోగ్య పరిధిలో ఉన్న అన్ని హెల్త్ వెళ్లే సెంటర్ల నందు మరియు అంగన్వాడి సెంటర్ల నందు ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా 0-5 ఐదు పిల్లల తల్లిదండ్రులకు, మరియు స్కూలుకు వెళ్లే పిల్లలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం పై హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ తెలియజేయడమైనది, అలాగే డెంగ్యూ జ్వరాలకు సంబంధించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పాత టెంకాయ చిప్పలు ,పాత సామాన్లు ,పాత కూలర్లలో నీరు నిలువ లేకుండా చూసుకొని ఎప్పుడు ఇంటి పరిసరాలు పొడిగా ఉండేటట్లు చూసుకోవాలని, తాగునీటి మరియు అవసరాల నిమిత్తం వాడుకునే నీటి పైన మూతలు తప్పకుండా ఉంచుకోవాలని, పాత టైర్లు బయట ప్రదేశాల్లో లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించి , మలేరియా డెంగ్యూ జరాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు, అన్ని హెల్త్ వెల్నెస్ సెంటర్ల నందు మంచి నీటి వనరులను పరీక్షించి వాటి రిపోర్టులను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ స్వాతి లక్ష్మి వడియంపేట పాల్గొనడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంఈఓ లింగ నాయక్ గారు,సిహెచ్ మోహన్ రావు, పిహెచ్ఎన్ చేన్నమ్మ, నాగలక్ష్మమ్మ , హెల్త్ ఎడ్యుకేటర్ ఫాతిమా, సూపర్వైజర్లు సత్యనారాయణ శాస్త్రి, ఈశ్వరమ్మ, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, శివానంద ,నాగరాజు, పాఠశాలల ఉపాధ్యాయులు,మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ జ్యోతి, జయంతి, గౌతమి, మంజు భార్గవి, మణి, శ్రీజ, శ్రీ కీర్తి, యామిని, సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఆదినారాయణమ్మ, నాగేంద్రమ్మ , బోజ్జమ్మ, లక్ష్మీదేవి, నాగలక్ష్మి, వరలక్ష్మి, నందిని, రాజేశ్వరి, మరియు అన్ని గ్రామాల ఆశ కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు
Jul 05 2024, 07:46