ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను, పరిటాల శ్రీరామ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన దండు శ్రీనివాసులు..
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దండు శ్రీనివాసులు గారు రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారిని మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ గారినివారి స్వగృహంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు కలసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాసరి గంగాధర్ గారు మాజీ ఎంపిటిసి కుల్లాయప్ప టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి బండి పరశురాం అనంతపురం పార్లమెంటుబీసీ సెల్ అధికార ప్రతినిధి బండి పరశురాం సింగనమల నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు బెస్త నారాయణస్వామి పార్లమెంట్ మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి మహమ్మద్ గౌస్ యూనిట్ ఇంచార్జ్ ప్రకాష్ రాయల్ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు..
గూగూడు కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
అనంతపురం జిల్లా నార్పల మండలం గుగుడు గ్రామం నందు ఎంతో వైభవంగా జరిగే గూగూడు కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ I.A.S గారిని ఆహ్వానించిన సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు
అనంతసాగర్ కాలనీ, విజయనగర్ కాలనీల తాగునీటి సమస్యను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి
బుక్కరాయసముద్రం మండల పరిధిలోని అనంతసాగర్ కాలనీ, విజయనగర్ కాలనీ నందు తాగునీటి సమస్యతో కాలనీవాసులు గత రెండు సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బంది పడుతున్నాము అని *టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రామలింగారెడ్డి* అన్నగారి దృష్టికి తీసుకువచ్చారు వెంటనే *అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్* మరియు *మున్సిపల్ కమిషనర్* వారికి సమస్య గురించి విన్నవించడం జరిగింది వెంటనే వారు సానుకూలంగా స్పందించి మున్సిపాలిటీ త్రాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ గారు సుబ్బరాయుడు,అమర,ఈశ్వర్,హరి జయపుత్ర,రాము,రాఘవ,షఫీ తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.
బ్లీచింగ్ పౌడర్ కొనడానికి సిపిఎం పార్టీ భిక్షాటనకు పిలుపు..
బ్లీచింగ్ పౌడర్ కొనడానికి సిపిఎం పార్టీ భిక్షాటనకు పిలుపు..

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. ఈరోజు సిపిఎం మండల కమిటీ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మేజర్ గ్రామ పంచాయితీ జ్వరాలు, అతిసారా సీజనల్ వ్యాదులు తీవ్రంగా ఉన్నాయి. జిల్లా పంచాయతీ అధికారులు విష జ్వరాలు, డయేరియా నివారించడానికి పారిశుద్ధం మీద దృష్టి పెట్టాలని ప్రత్యేక సమావేశం పెట్టి చెప్పారు. వ్యాదులు ప్రభల కుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడం. ప్యాగింగ్ చేయాలని అధికారులు ఆదేశించినప్పటికీ పంచాయితీ కార్యదర్శి గారికి ఏమాత్రం చలనం లేదు. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేవని అంటున్నారు. ప్యాగింగ్ మిషన్ ద్వారా పొగ, డ్రైనేజీ కాలువలలో స్ప్రే చేసి దోమల నివారించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్లు ఉన్నది. పేరుకు మేజర్ గ్రామ పంచాయితీ సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు శూన్యం. గ్రామంలో ఈగల మోత ఎక్కువగా ఉంది. మేజర్ గ్రామ పంచాయితీ బుక్కరాయసముద్రంలో గత నెల రోజుల నుండి తీవ్ర జ్వరాలు, విరోచనాలు పెరుగడం వల్ల రోగుల సంఖ్య బుక్కరాయసముద్రం పట్టణ ఆరోగ్య కేంద్రంలో పెరుగుతూనే ఉన్నది. అయినా పంచాయితీ కార్యదర్శి గారికి దోమల,ఈగల నివారణ చేయడానికి చీమ కుట్టినట్లు కూడా ఎలాంటి చిరు ప్రయత్నం చేయలేదు. దీనివల్ల సీజన్ గా వస్తున్న రోగాల నుండి గ్రామ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తనది కాదనే విధంగా పనిచేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి పంచాయితీలో నిధులు లేవని అంటున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని బ్లీచింగ్ పౌడర్ కొనడానికి, డ్రైనేజీ కాలువలలో స్ప్రే చేయడానికి మందులు, పాగింగ్ ఆయిల్ కొనడానికి నిధులు లేవని అంటున్నందున కొనడానికి సిపిఎం ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తుందని హెచ్చరించారు. తక్షణ పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కమిటీ కోరుతున్నది. లేని పక్షంలో ఆందోళన చేయాల్సి వస్తుందని తెలుపుతున్నాం. ఆర్. కుల్లాయప్ప సిపిఎం మండల కార్యదర్శి, మండల నాయకులు సి నాగేంద్ర, సంజీవరెడ్డి, నెట్టికంటయ్య, పుల్లయ్య, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఘన స్వాగతం..

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మొట్టమొదటిసారిగా విచ్చేయుచున్న శుభ సందర్భంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహమ్మద్ సలీం, డిప్యూటీ మేయర్లు తొగటం భాస్కర్ రెడ్డి, దాసరి వాసంతి సాహిత్య, కమిషనర్ మేఘ స్వరూప్, టిడిపి నాయకులు మరియు కార్యాలయ సిబ్బంది సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.. అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయానికి తొలిసారిగా విచ్చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో ఘన స్వాగతం.. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పరిచయ సమావేశం ఏర్పాటు నగరంలో అండర్ డ్రైనేజీ సమస్య, నీటి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతాం డంపింగ్ యార్డ్ లో జరిగిన అక్రమాలు, ఆ కాంట్రాక్టర్లపై తప్పకుండా చర్యలు చేపడతామన్న ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు

మరణించిన కుటుంబానికి10 వేల రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి..
మరణించిన కుటుంబానికి10 వేల రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామంలో నివాసముంటున్న మంగళ నాగభూషణం గారి అమ్మ గారు మరణించారు విషయం తెలుసుకొని వారి కుటుంబానికి మీకు అండగా నేనుంటాను అని భరోసా ఇచ్చి వారికి ₹10000 ఆర్థిక సహాయం చేసిన *నిరుపేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి *మన శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమాడుగు కేశవరెడ్డి గారు.* మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం వారి ఏ కష్టం వచ్చినా కష్టాల్లో నేను తోడుగా ఉంటానని ముంటిమడుగు కేశవరెడ్డి గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.!
గూగూడు బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయండి.. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు..
గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జాప్యం చేస్తున్న అధికారుల పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన *ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు*..... ఈ కార్యక్రమం లో *టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు* పాల్గొన్నారు. రాష్ట్రం లో ప్రసిద్ధి చెందిన కుల్లాయి స్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలను దర్శించుకున్నారు అందరి సహకారంతో అంగరంగ వైభవంగా జరిపిస్తాము.రాష్ట్రం నలుమూలల నుండే కాక పక్క రాష్ట్రల నుండి వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం. ఉత్సవాలు సమీపిస్తున్న వేళ అధికారులు నిర్లక్ష్యం వీడి విధులు సక్రమంగా నిర్వర్తించాలి. వృద్ధులు,మహిళలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం వచ్చే భక్తులకు తాగు నీటి ఎద్దడి ఏర్పడకుండా ట్యాంకులను ఏర్పాటు చేస్తాo ఈ కార్యక్రమంలో RDO వెంకటేష్,నాయకులు ఆకుల ఆంజనేయులు, పంచాయతీ రాజ్ అధికారులు,టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జాప్యం చేస్తున్న అధికారుల పై ఫైర్.. ఎమ్మెల్యే బండారు శ్రావణి..

గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జాప్యం చేస్తున్న అధికారుల పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ రాష్ట్రం లో ప్రసిద్ధి చెందిన కుల్లాయి స్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలను దర్శించుకున్నారు ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మొదటి ఉత్సవాలు అందరి సహకారంతో అంగరంగ వైభవంగా జరిపిస్తాం కుల్లాయి స్వామి ఉత్సవాలు చేయడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్రం నలుమూలల నుండే కాక పక్క రాష్ట్రల నుండి వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం ఉత్సవాలు సమీపిస్తున్న వేళ అధికారులు నిర్లక్ష్యం వీడి విధులు సక్రమంగా నిర్వర్తించాలి వృద్ధులు,మహిళలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం వచ్చే భక్తులకు తాగు నీటి ఎద్దడి ఏర్పడకుండా ట్యాంకులను ఏర్పాటు చేస్తాం గ్రామం మొత్తం వీధిలైట్లుల అలకరణ పెద్ద ఎత్తున స్వాగతం పలికిన టీడీపి నాయకులు ఈ కార్యక్రమంలో RDO వెంకటేష్,పంచాయతీ రాజ్ అధికారులు,టీడీపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు,ఆకుల ఆంజనేయులు టిడిపి నాయకులు పాల్గొన్నారు

బుక్కరాయసముద్రం ఆరోగ్య పరిధిలో స్టాప్ డయేరియా ప్రోగ్రాంలో భాగంగా మరియు డెంగ్యూ మాసోత్సవం..
స్టాప్ డయేరియా ప్రోగ్రాంలో భాగంగా మరియు డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా బుక్కరాయసముద్రం ఆరోగ్య పరిధిలో ఉన్న అన్ని హెల్త్ వెళ్లే సెంటర్ల నందు మరియు అంగన్వాడి సెంటర్ల నందు ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా 0-5 ఐదు పిల్లల తల్లిదండ్రులకు, మరియు స్కూలుకు వెళ్లే పిల్లలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం పై హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ తెలియజేయడమైనది, అలాగే డెంగ్యూ జ్వరాలకు సంబంధించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పాత టెంకాయ చిప్పలు ,పాత సామాన్లు ,పాత కూలర్లలో నీరు నిలువ లేకుండా చూసుకొని ఎప్పుడు ఇంటి పరిసరాలు పొడిగా ఉండేటట్లు చూసుకోవాలని, తాగునీటి మరియు అవసరాల నిమిత్తం వాడుకునే నీటి పైన మూతలు తప్పకుండా ఉంచుకోవాలని, పాత టైర్లు బయట ప్రదేశాల్లో లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించి , మలేరియా డెంగ్యూ జరాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు, అన్ని హెల్త్ వెల్నెస్ సెంటర్ల నందు మంచి నీటి వనరులను పరీక్షించి వాటి రిపోర్టులను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ స్వాతి లక్ష్మి వడియంపేట పాల్గొనడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంఈఓ లింగ నాయక్ గారు,సిహెచ్ మోహన్ రావు, పిహెచ్ఎన్ చేన్నమ్మ, నాగలక్ష్మమ్మ , హెల్త్ ఎడ్యుకేటర్ ఫాతిమా, సూపర్వైజర్లు సత్యనారాయణ శాస్త్రి, ఈశ్వరమ్మ, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, శివానంద ,నాగరాజు, పాఠశాలల ఉపాధ్యాయులు,మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ జ్యోతి, జయంతి, గౌతమి, మంజు భార్గవి, మణి, శ్రీజ, శ్రీ కీర్తి, యామిని, సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఆదినారాయణమ్మ, నాగేంద్రమ్మ , బోజ్జమ్మ, లక్ష్మీదేవి, నాగలక్ష్మి, వరలక్ష్మి, నందిని, రాజేశ్వరి, మరియు అన్ని గ్రామాల ఆశ కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు
ఎన్నికల వ్యయ ఖర్చుకు సంబంధించిన తుది అకౌంట్స్ ఈనెల 3వతేదీలోపు సమర్పించాలి.. ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్
ఎన్నికల వ్యయ ఖర్చుకు సంబంధించిన తుది అకౌంట్స్ ఈనెల 3వతేదీలోపు సమర్పించాలి.. ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే..

అనంతపురం, జులై 02 : అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీంతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ తో కలిసి అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గంకు సంబంధించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే ఐ.ఆర్.ఎస్ (సీనియర్ అధికారి), జిల్లాలోని రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు నితిన్ అగర్వాల్ ఐ.ఆర్.ఎస్, జిల్లాలోని అనంతపురం అర్బన్, రాప్తాడు, సింగనమల, కళ్యాణదుర్గం నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు రాందాస్ టి.కాలే, తదితరులు పాల్గొన్నారు.* - *ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే మాట్లాడుతూ అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయ ఖర్చుకు సంబంధించిన తుది అకౌంట్స్ ఈనెల 3వతేదీలోపు సమర్పించాల్సి ఉంటుందన్నారు. 03.07.2024 తేదీ నాటికి అందరూ అభ్యర్థులు కూడా ఎన్నికల అంతిమ లెక్కలను డీఈవోకి సమర్పించాలని, లేనిచో వారు డిస్క్ క్వాలిఫై అవుతారన్నారు. ఇప్పటివరకు సమర్పించిన వారి తుది అకౌంట్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుది అకౌంట్స్ సమర్పించని వారిని పిలిపించుకుని తుది అకౌంట్స్ సమర్పించాలని వారికి తెలియజేయాలన్నారు. ఈనెల మూడో తేదీన సాయంత్రం 5 గంటల లోపల అంతిమ నివేదికలను, లెక్కచారాలను, తుది అకౌంట్స్ ను సమర్పించాలన్నారు.* *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ప్రకారం పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తమ నామినేషన్ తేదీ నుంచి ఎన్నికల ఫలితాల తేదీ వరకు ఖర్చు చేసిన వివరాలకు సంబంధించిన నివేదిక, ఎక్స్పెండిచర్ డీటెయిల్స్, అన్ని ఖర్చుల వివరాలు, బిల్లులు, ఓచర్లు, అఫిడవిట్స్, బ్యాంకు పుస్తకాలు, ఎబిసి రిజిస్టర్లు ఖచ్చితంగా సరిచూసుకొని అభ్యర్థి సంతకంతో జులై 3వ తేదీలోగా సమర్పించాలన్నారు. తుది అకౌంట్స్ సమర్పించని వారిని పిలిపించుకోవాలని, తుది అకౌంట్స్ ని ఈనెల 3వ తేదీ లోపల సమర్పించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డిసిఒ అరుణకుమారి, టూరిజం ఆర్డీ వెంకటేశ్వర్లు, జిల్లా ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.