నల్గొండ, ఖమ్మం,వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే.ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న
నల్గొండ, ఖమ్మం,వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నకిరేకల్ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో నిర్వహించగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మరియు నల్గొండ,ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరయ్యారు
ఈ కార్యక్రమనికి ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,వివిధ సంఘాల నాయకులు,పట్టభద్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ -; ఈనాటి నల్గొండ,ఖమ్మం,వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎంమ్మెల్సి అభ్యర్థిగా బరిలో ఉంటున్న తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మొట్టమొదటిగా మన నియోజకవర్గం నుండి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మన అందరి ఆశీర్వాదం మల్లన్నగారికి ఇచ్చి మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోవడం కోసం ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీరందరూ ఒకసారి చప్పట్ల ద్వారా మల్లన్నగారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి వేదిక ముందు ఉన్న నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మల్లన్నకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన DTF,PRTU,TPTF సంఘాల నాయకులు రావడం జరిగింది,వాళ్ళందరూ మల్లన్నను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తునందుకు వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా.. ఈరోజు ముఖ్యంగా మల్లన్నకు ఎందుకు ఓటు వెయ్యాలి అన్నదానికి నేను సమాధానం చెప్త.మల్లన్న చట్ట సభలకు పోవాలి. నేను మొన్న ఒక యూట్యూబ్ లో చూసిన ఏంత సిల్లి గా ఏంత చిల్లర గా మాట్లడుతుండంటే ఒక వ్యక్తి దాదాపు సెంచరీ కి నియరెస్టు గా కేసులు పెట్టుకొని తెలంగాణలో నడుస్తున్న నియంతృత్వ పాలనను,నియంత పాలనను గద్దె దించేవరకు ఎన్ని కేసులైనా ఎన్నిసార్లు జైలుకైన చివరికి తెలంగాణ ప్రజల కోసం తన ప్రాణాన్ని తృణ ప్రాణంగా పెడతా కానీ ఆ దొర కి తలవంచ అని ఆ దొరని దించడమే లక్ష్యం అని కొట్లడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న అలా కొట్లడిండు కాబట్టే తెలంగాణ ప్రజలను చైతన్య వంతులను చేసిండు కాబట్టే,తెలంగాణ ప్రజలకి వాస్తవాలు చుయించిండు కాబట్టే,తెలంగాణ ప్రజలకు సత్యాలు చెప్పిండు కాబట్టే, ఆ సత్యాలను వాస్తవాలను నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనే సత్యాన్ని కూడా ఈ సందర్బంగా గుర్తు చేస్తున్న.నేను చాలామంది జర్నలిస్టులను చూసిన,నాకు చాలా మంది జర్నలిస్టులు ప్రెండ్స్ ఉన్నారు.ఏక్కడనో ఒక్క దగ్గర కుటుంబమో పిల్లలో ఆస్తి అంతస్తో అడ్డువచ్చి కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది.కానీ మల్లన్న తో నాకు అంతకుముందు పరిచయం లేకున్నా చాలా గర్వపడే వాడిని ఒక నిఖార్సయిన జర్నలిస్టు గా ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపుత అని ఛాలెంజ్ చేసిన దమ్మున్న మొగోడు మల్లన్న ఒక కమిట్మెంట్ ఉంటే ఒక నిబద్ధత ఉంటే ఒక నిఖార్సయిన వ్యక్తిగా ఎదైనా సాధించవచ్చు అని మల్లన్న ను చూస్తే తెలుస్తుంది ఆరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోజు ఉన్న ధనం,ఆరోజు ఉన్నటువంటి అధికార భలం నాతో సహా ఏ ఒక్కరూ సపోర్ట్ చెయ్యకున్న ప్రజల బలంతోని చువుకున్న వాళ్ళ బలంతోని ,ఆలోచించే వాళ్ళ మద్దతు తొని కొద్దిలో మిస్ అయ్యింది.కానీ నైతికమైన గెలుపైన కూడా గెలుపు స్వీకరించలేదు ఓటమి అనే గుణపాఠం నుండి గెలుపు అనే మెట్టు వైపు పరుగెడుత అని బయల్దేరిన వ్యక్తి మన మల్లన్న నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో మనకి తెలిసిన ప్రతి ఒక్కరికీ పోన్ చేసి మన అభ్యర్థి తీన్మార్ మల్లన్న కి మద్దతుగా నిలబడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మల్లన్న వాయిస్ చట్ట సభల్లో ఉంటే అది సామాన్యుని వాయిస్ ప్రజల వాయిస్ ,నీతి వైపు ధర్మం వైపు మాట్లాడిన గొంతుక చట్ట సభల్లో ఉంచవలసిన అవసరం మన మీద ఉంది.నిన్న జరిగిన ఎన్నికలలో చూసినం బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోయినాయి.ఈ రెండు పార్టీలు వేరు కాదు అని నిన్న ఎన్నికలలో తేలిపోయింది.రేపు జరగబోయే ఎంయల్సి ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యే ప్రమాదం ఉంది.కావున మనం అందరం కలిసి మల్లన్నకు ఓటు వేసి భారీ మెజారిటీతో చట్ట సభకు పంపించవల్సిందిగా కొరుకుంటున్నాను.
నల్గొండ,ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ -;
ఖమ్మం,నల్లగొండ,వరంగల్, పట్టభద్రుల MLC ఉపఎన్నికల్లో వీరేశం అన్న తమ్ముడు తీన్మార్ మల్లన్న నిలబడ్డడు . ఎక్కడికి పోయిన ఒక్కటే మాట పోయిన సారి మల్లన్నకు అన్యాయం జరిగింది.. ఈసారి జరగదు అసలు ఈ ఉపఎన్నిక ఎందుకొచ్చిందంటే....!!పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆఫ్ట్రాల్ పదవి ఎందుకని వదిలేస్తే వచ్చింది. 3 యేండ్ల పాటు MLCగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ సంఘాల నాయకుల్ని అన్నా ముఖ్యమంత్రిని కలిపించిండా వారి సమస్యలు వినిపిచిండా.
నేను MLC ఐన తెల్లారే అన్ని ఉద్యోగ సంఘాల నాయకుల్ని సీఎం దగ్గరికి తోలుక పోతా...వారి సమస్యలు వినిపిస్తా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అధికారం లో ఉన్నన్ని నాళ్ళు కబ్జాలు చేయటానికే టైం సరిపోలేదు... ఇంకా మనకు పనిచేయటానికి టైం ఎక్కడిది.నేను ఓడిపోయిన రోజునుండి ఈ రోజు వరకు కూడా మీకోసం పేదల కోసం పోరాటం చేస్తునే ఉన్న.... చేస్తూనే ఉంటా. కేసీఆర్ వందల కేసులు నా మీద పెట్టించిండు.... నేను ఏ రోజు భయపడలేదు.
ఆ కేసుల్లో నాసొంత సమస్య ఒక్కటి లేదు అవన్నీ కేసీఆర్ ని ప్రశ్నించడం మూలంగా పెట్టిన అక్రమ కేసులే . కేసీఆర్ ని గద్దె దించుతామని శపథం చేసిన చేసిచూయించిన అది నా పోరాట పటిమ అంటే. ఈ ఎన్నికల్లో మీ ప్రేమ అభిమానం ఎలా ఉండబోతుందో నాకు తెలుసు ఎక్కడన్నా ఈదేశ రాజకీయాల్లో తన కుటుంబ ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చి రాజకీయాల్లో పోటీ చేసిన నాయకుడు ఉండా? ఇంత వరకు లేడు కదా. ఇగో మీ వీరేశం అన్న తమ్ముడు తీన్మార్ మల్లన్న మాత్రం ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చి MLCగా పోటీ చేస్తుండు
అమ్మ అయ్య మీద ఒట్టేసి చెబుతున్న మీ ఓటు వృధా కానివ్వను....
Jul 03 2024, 18:42