నా గుండె వేయి ముక్కలైంది: షర్మిల

యూపీలోని హథ్రాస్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. “ఈ ఘటన నా హృదయాన్ని వేయి ముక్కలు చేసింది. ఈ దుఃఖాన్ని వ్యక్తీకరించేందుకు నాకు పదాలు దొరకడం లేదు.

ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. యూపీ సీఎం యోగి నిరంకుశ పాలనవల్లే ఈఘటన జరిగింది. దీనిపై కేంద్ర విచారణ జరిపించాలి” అని ట్వీట్ చేశారు.
AP : నాసిరకం విత్తనాలకు చెక్... - విక్రయిస్తే కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు...

రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. "నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలి. అనుమతి లేని, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి.

రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. ఖరీఫ్ లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలి. ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలి" అని అధికారులను ఆదేశించారు.
AP : మహిళా పోలీసులపై పిటిషన్... విచారణ 3 వారాలు వాయిదా...
సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీసు విధులు అప్పగింతపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ అంశంపై 3 వారాల లో ప్రభుత్వ నిర్ణయం తెలపాలని ఆదేశించింది.

మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పేర్కొంటూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన ఉమామహేశ్వరావు పిటిషన్ వేశారు. వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విడాకుల ముచ్చట... ఆ పనికే విడాకులు ఇచ్చింది...

చిన్న చిన్న కారణాలకే భార్యభర్తలు విడాకులు తీసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇల్లు శుభ్రంగా ఉంచడం లేదని, ట్రైమ్ కు భోజనం పెడతాలేదని విడాకులు తీసుకున్న సంఘటనలు కొకొల్లాలు ఉన్నాయి.

తాజాగా ఊరగాయ పచ్చడి డబ్బాలపై భర్త మూతలు బిగుతుగా పెడుతుండడంతో తాను తీయలేకపోతున్నాని అతడికి భార్య విడాకులు ఇచ్చింది. రెడ్డిట్ అనే సోషల్ మీడియాలో భార్య పోస్టు చేసింది. ఊరవేసిన అవకాయ, నిమ్మకాయ పచ్చడి డబ్బాల మూతలను భర్త గట్టిగా మూసి పెడుతున్నాడు. ఈ మూతలు తీయడానికి భార్య ప్రయత్నించిన ఓపెన్ కాకపోవడంతో పక్కింటి వాళ్లు సహాయం తీసుకునేది.

ఇలా పలుమార్లు మూతల విషయంలో దంపతులు మధ్య గొడవల జరిగాయి. భర్తకు ఎంత చెప్పినా పట్టించుకోకపోవడంతో కోర్టు నుంచి విడాకులు తీసుకుంటున్నట్టుగా అతడికి నోటీసులు పంపించింది.

భర్త క్షమాపణలు చెప్పిన కూడా భార్య వినలేదు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్న విషయానికే విడాకులు తీసుకుంటావా? అని నెటిజన్లు భార్యపై కామెంట్లు చేస్తున్నారు. పచ్చడి డబ్బాలకు మూత బిగుతుగా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.
'కల్కి' : బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత...

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి కల్కి 2898ఏడీ సినిమాతో బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నారు. ఈ సినిమాకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయిన ఊహించని స్థాయిలో హైప్ అయితే క్రియేట్ అయ్యింది.ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మొదటి మూడు రోజులకి చాలా చోట్ల థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. రెండు ట్రైలర్స్ తోనే సినిమా ఎలా ఉండబోతోందనేది డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆడియన్స్ కి పరిచయం చేసేశారు. దీంతో కల్కి సినిమా చూడాలనే ఇంటరెస్ట్ అందరికి పెరిగింది. కల్కి 2898ఏడీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ అమెరికాలో రెండు వారాల ముందుగానే స్టార్ట్ చేశారు. దీంతో మూవీ ప్రీమియర్ షోలు ఇంకా ఫస్ట్ డే చూడాలని అనుకునేవారు ముందుగానే టికెట్స్ భారీగా బుక్ చేసుకున్నారు.


జూన్ 26 వ తేదీన నార్త్ అమెరికాలో కల్కి మూవీ ప్రీమియర్ షోలు పడ్డాయి. వీటికి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో రిలీజ్ తరువాత కూడా టికెట్ బుకింగ్స్ అనేవి జోరుగా జరిగాయి. కేవలం ప్రీమియర్స్ ద్వారానే కల్కి 2898ఏడీ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా 3.9 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఇదే హైయెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ అని తెలుస్తుంది. ఇక రిలీజ్ రోజైన గురువారం కూడా 1.5+ మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ వసూళ్లనేవి అయ్యాయి. ఓవరాల్ 5.5+ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కల్కి మూవీ మొదటి రోజు సాధించింది. ఇప్పటి దాకా ఏ సినిమా కూడా ఈ స్థాయిలో వసూళ్లు అందుకోలేదు. కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా ఓవరాల్ కలెక్షన్స్ 250 కోట్ల దాకా వసూలు అయ్యాయని సమాచారం తెలుస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటాని ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
AP : ఏపీ సర్వీసులోకి మహేష్ చంద్ర లడ్డా?

రాష్ట్ర సర్వీస్ లోకి IPS అధికారి మహేష్ చంద్ర లడ్డా రానున్నారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో CRPF ఐజీగా మహేష్ చంద్ర లడ్డా పనిచేస్తున్నారు. లడ్డాను రాష్ట్ర సర్వీసులోకి పంపాలని కేంద్రానికి AP సీఎం చంద్రబాబు లేఖ రాశారు. దీంతో IPS లడ్డాను రాష్ట్ర సర్వీసులోకి పంపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డాకు ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ap
ఆంధ్రప్రదేశ్ : మెగా DSCకి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు...?
DSC 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కారు కార్యాచరణని రూపొందిస్తోంది. రెండు రకాలుగా DSC నోటిఫికేషన్ జారీ యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా DSCకి ఓ నోటిఫికేషన్.. టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా DSCకి వేరే నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది. ఈనెల 30న రెండు నోటిఫికేషన్లను విడుదల చేయాలని కసరత్తు చేస్తోంది.
ఎయిర్ హోస్టెస్ సుర్భి ఖాతూన్ తన ప్రైవేట్ పార్ట్ లో దాచి కిలో బంగారం తీసుకువస్తూ పట్టుబడింది


. కేరళలోని కన్నూర్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ ఎయిర్‌ హోస్టెస్‌ నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్న ఎయిర్ హోస్టెస్ 960 గ్రాముల బంగారాన్ని తన పురీషనాళంలో దాచినట్లు గుర్తించబడింది మరియు మే 28 న అరెస్టు చేయబడింది కన్నూర్‌లో దిగిన విమానంలో మస్కట్‌ క్యాబిన్‌ సిబ్బంది. ఒక నిర్దిష్ట గమనికపై, కోల్‌కతాకు చెందిన సురభి ఖాటూన్ మంగళవారం మస్కట్ నుండి విమానంలో వచ్చినప్పుడు DRI అధికారులు ఆమెను ఆపారు. అతడిని పరిశీలించగా మలద్వారంలో దాచిన 960 గ్రాముల బంగారం బయటపడింది. తర్వాత ఖాతూన్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. సహచరులను గుర్తించడానికి మరియు ఆపరేషన్‌తో ముడిపడి ఉన్న బంగారం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను కనుగొనడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని DRI తెలిపింది. మూలం ప్రకారం, స్మగ్లింగ్ కార్యకలాపాలకు తనను నియమించిన కొంతమంది వ్యక్తుల పేర్లను సురభి వెల్లడించింది. ఇతర క్యాబిన్ సిబ్బంది స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా DRI దర్యాప్తు చేస్తోంది. స్మగ్లింగ్‌లో మరికొంత మంది సిబ్బంది ప్రమేయం ఉందన్న ఆరోపణలపై విచారణలో వివరాలు వెల్లడయ్యాయని, రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.
*ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు*


*నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరంలేదని సజ్జల వ్యాఖ్యానించారంటూ వ్యాఖ్యలు* *సజ్జలపై టీడీపీ నేత దేవినేని ఉమ, లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు* *సజ్జలపై తాడేపల్లి పోలీసుల కేసు* కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై తాడేపల్లి పోలీసులు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల వ్యాఖ్యానించినట్టుగా వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ పై టీడీపీ నేత దేవినేని ఉమ, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గురువారం చేసిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
చంద్రగిరి డీఎస్పీపై వేటు.. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం*

చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్‌కుమార్‌పై చర్యలు* *డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం* *ఇటీవల పరిణామాలోనే డీజీపీ హరీష్ నిర్ణయం* తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్‌కుమార్‌‌పై వేటు పడింది. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. చంద్రగిరిలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనల విషయంలో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన పరిణామాల విషయంలో చర్యలు తీసుకోకపోవడమే కారణమని సమాచారం. నియోజకవర్గంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో విఫలం కావడం.. పోలింగ్ రోజు రాత్రి జరిగిన ఘర్షణలుపై తెలుగు దేశం పార్టీ నేతలు ఆరోపణలు చేయడంతో పాటుగా సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. రాజ్‌కుమార్‌ మూడు నెలల క్రితం చంద్రగిరి డీఎస్పీగా వచ్చారు. మరో వాదన కూడా వినిపిస్తోంది.. డీఎస్పీ రాజ్‌కుమార్ తన స్నేహితుడైప హోమియోపతి డాక్టర్‌ను స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్లారని.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసి ఈసీ సీరియస్ కావడంతో చర్యలు తీసుకున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ నెల 13వ తేదీ పోలింగ్‌ రోజున రాత్రి.. చంద్రగిరి మండలం కూచివారిపల్లె, రామిరెడ్డిపల్లెల్లో చోటు చేసుకున్న ఘర్షణలు జరిగాయి. ఈ దాడులకు చంద్రగిరి పోలీసుల వైఫల్యమే కారణమని ఎన్నికల కమిషన్‌కు సిట్‌ బృందం రిపోర్టు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే చంద్రగిరి డీఎస్పీపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్‌కుమార్‌ను వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇటీవల తిరుపతి ఎస్పీని కూడా ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. చంద్రగిరి నియోజకవర్గంలో ఘటనలు.. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటనతో.. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌‌ను కూడా బదిలీ చేశారు. తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్‌ను ఎన్నికల సంఘం నియమించింది. ఇప్పుడు తాజాగా చంద్రగిరి డీఎస్పీని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.