జర్నలిస్టు సమస్యలపై కలెక్టర్ కి ఏపీయూడబ్ల్యూజే వినతిపత్రం సానుకూలంగా స్పందించిన కలెక్టర్ వినోద్ కుమార్..
అనంతపురం: అనంతపురం జిల్లాలో నెలకున్న జర్నలిస్టుల సమస్యల పైన ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమస్యలపై కలెక్టర్ కి వివరించారు జిల్లాలో కొన్నేళ్లుగా అమలు అవుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఈ సంవత్సరం కొనసాగించాలని ఈ సందర్భంగా యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. కొడిమి జర్నలిస్టు కాలనీలో నెలకొన్న సమస్యల పైన కలెక్టర్ కు వివరించారు. పట్టాలు పొందినప్పటికీ ఇప్పటివరకు చాలామంది పట్టాలు గ్రాండ్ రికార్డ్ లో నమోదు కాకపోవడం సహా కాలనీ లో నెలకొన్న సమస్యలు వ పరిష్కరించాలని కోరారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ త్వరలోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కలెక్టర్ ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ అధ్యక్షులు భోగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అయుఫ్ భాష, చలపతి, చౌడప్ప, శ్రీనివాసులు, భూమిరెడ్డి, మల్లేష్, ట్రిక్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు
చిత్తశుద్ధితో డయేరియాని అరికట్టాలి.. రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్..

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలి* - *: రాష్ట్రాన్ని హెల్త్ కేర్ లో ముందంజలో నిలపాలి.. చిత్తశుద్ధితో డయేరియాని అరికట్టాలి.. ప్రజల్లో నమ్మకం కలిగించేలా వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి* - *: రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్* అనంతపురం, జులై 01 : *రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.* - *సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో రాష్ట్ర స్థాయి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమం ప్రారంభించడంపై హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డా.వెంకటేశ్వర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ తో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డాక్టర్లు, సిబ్బంది, తదితరులతో రాష్ట్ర ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.* - *ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ముందుగా నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్యో నారాయణో హరి అని మనమంతా చదువుకున్నామని, సమాజంలో డాక్టర్లకు మంచి గౌరవం ఉందని, భగవంతుడు అన్నిచోట్ల ఉండలేడు కాబట్టి తెల్ల కోటు వేసుకున్న డాక్టర్లను భూమి మీదకు పంపారని, అయితే వైద్యరంగంలో విలువలు తగ్గుతున్నాయని, అధికారులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. వైద్యులంతా ప్రజలకు అందించే సేవలు ఎంతో వెలకట్టలేనివని, కోవిడ్ లాంటి విషమ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి అందించిన సేవలు ఈ జాతి గుర్తుపెట్టుకుంటుందన్నారు. జాతీయస్థాయిలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్రస్థాయిలో ఈరోజు అనంతపురం జిల్లాలో రాష్ట్ర స్థాయి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగిందన్నారు. పిల్లలకు డయేరియా ప్రబలకుండా నివారించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు వారి సమస్యను చెప్పుకోలేరన్నారు. ఐదేళ్లలో ఒక్క మరణం జిల్లాలో సంభవించలేదని, ఇందుకు అభినందనలు తెలిపారు. డయేరియా నివారణకు స్టాండర్డ్ ఎస్ఓపీలు, ఐఈసి యాక్టివిటీలు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆశ వర్కర్లు, ఎంఎల్ఓలు, వైద్య సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, నిత్యం అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైనా సమస్య ఉంటే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 3.7 కోట్ల జింక్ ట్యాబ్లెట్లు సరఫరా చేయడం జరిగిందని, క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం వద్దకు ఓఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్లు వెళ్లాయా లేదా అనేది చూడాలన్నారు. నింగిలోకి రాకెట్ పంపించే రోజుల్లో మనం ఉన్నామని, చిన్నపాటి డయేరియాని అరికట్ట లేకపోతున్నామని, దానిని అరికట్టాలన్నారు. వెనుకబడిన రాష్ట్రాలతో కాకుండా తమిళనాడు, కేరళ లాంటి ముందుండే రాష్ట్రాలతో మన రాష్ట్రం ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటులో పోటీపడాలన్నారు. నిత్యం అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, డయేరియా ప్రబలకుండా అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిత్తశుద్ధితో డయేరియాని అరికట్టాలని, ప్రజల్లో నమ్మకం కలిగించేలా వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సేవ చేయాలని, అందరి సహకారంతో రాష్ట్రాన్ని హెల్త్ కేర్ లో ముందంజలో నిలపాలని, ఇందుకు అధికారులంతా బాగా పనిచేయాలన్నారు.* - *ఈ సందర్భంగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డా.వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కింద అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అన్ని జిల్లాల్లో చేపడుతున్న యాక్టివిటీలను, డయేరియా క్యాంపెయిన్ స్ట్రాటజీని తెలియజేశారు.* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు అతిసారా నియంత్రణ మాసోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో రెండు వారాల నుంచి సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహించామని, రాష్ట్ర స్థాయి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమం ప్రారంభించడం జిల్లాకు గర్వకారణం అన్నారు. డయేరియా క్యాంపెయిన్ స్ట్రాటజీ, జూలై 1 నుంచి 14 వరకు ఐసిడిఎస్, ఆర్డబ్ల్యూఎస్, తాగునీరు మరియు శానిటేషన్, పట్టణ గ్రామీణ అభివృద్ధి మరియు విద్య, వైద్య శాఖ పరిధిలో చేపట్టే యాక్టివిటీల గురించి వివరించారు. ఆయా శాఖల అధికారుల భాగస్వామ్యంతో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా కమ్యూనిటీ యాక్టివిటీలను చేపడుతున్నామన్నారు. జిల్లాలో జింక్ ట్యాబ్లెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు బెడ్స్ మోతాదుకు సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఎక్కడైనా డయేరియా కేసు వచ్చిన వెంటనే చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల యాంటీ డేంగి నెల అని, ఇంటింటికి వెళ్లి డెంగి అనుమానితులను గుర్తిస్తున్నామని, పాజిటివ్ వస్తే వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని, జిల్లాలో డయేరియా అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.* *రాష్ట్ర స్థాయి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ :* - *ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ పోస్టర్లను మంత్రి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, జిల్లా కలెక్టర్, తదితరులు ఆవిష్కరించారు. అనంతరం నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. తదనంతరం మంత్రిని డిఎంహెచ్ఓ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మెడికల్ టీం, తదితరులు శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు రెవెన్యూ భవనం ఎదుట డయేరియాపై డప్పు కళాకారులు పాటల ద్వారా అవగాహన కల్పించగా, మంత్రి, జిల్లా కలెక్టర్ తదితరులు తిలకించారు. ఆ తర్వాత రెవెన్యూ భవనంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ పై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మలేరియా నివారణ, డెంగ్యూ నివారణ కార్యక్రమాలు, డ్రైడే ఫ్రైడే, అవగాహన కార్యక్రమాల గురించి మంత్రికి వివరించారు.* - *ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, జిల్లా పరిషత్ సీఈఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డిసిహెచ్ఎస్ డా.పాల్ రవికుమార్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా. కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి ఓబులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మణిక్యరావు, డిఎంహెచ్ఓ స్టాటిటికల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ఎన్సిడి నోడల్ ఆఫీసర్ నారాయణస్వామి, పిహెచ్సి, యూపీహెచ్సి, సిహెచ్సి మెడికల్ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు..

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పింఛన్లు పంపిణీ చేసిన టిడిపి జనసేన నాయకులు సాకే మురళీకృష్ణ, మహిళా నాయకురాలు అంచలరంగమ్మ..
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు శింగనమలనియోజకవర్గఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీగారి ఆదేశానుసారం నందు శింగనమల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ *సాకే మురళీ కృష్ణ* గారు, ఆధ్వర్యంలో జూలై ఒకటో తారీకు తెల్లవారుజామున 6 గంటలకు జనచైతన్య నగర్ ఎల్బీనగర్ లలో సచివాలయం సిబ్బంది, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ప్రజలు కలిసి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోటోకు పాలాభిషేకం నిర్వహించడం జరిగినది,తదుపరి అర్హులున్న ప్రతి పెన్షనర్ ఇంటికి వెళ్లి సచివాలయం సిబ్బందితో కూటమి పార్టీ నాయకులు 7000 అమౌంట్ అందజేయడం జరిగినది(ఏప్రిల్, మే ,జూన్, ఒక్కో నెలకు ₹1000 చొప్పున జూలై నెలలో 4వేల తో కలిపి ఒక్కొక్కరికి ₹7000 పెన్షన్) ఇవ్వడం జరిగినది, ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది *గౌరవనీయులు చంద్రబాబునాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పెద్దలు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో మన ముఖ్యమంత్రివర్యులకి ఉప ముఖ్యమంత్రి వర్యులకి సాధ్యమవుతుందని పెన్షన్ దారులు తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే టిడిపి తోనే సాధ్యమని చెప్తున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ *సాకే మురళీ కృష్ణ* టిడిపి అనంతపురం జిల్లా తెలుగు మహిళా నాయకురాలు *అంచల రంగమ్మ* JSP మండల ప్రధాన కార్యదర్శి *అరటి తాహిర్* టిడిపి నాయకులు *మొహమ్మద్ రఫీ నార్పల వల్లి* యువవ నాయకులు *మొహమ్మద్ అర్షాద్* తదితరులు పాల్గొన్నారు జై టిడిపి జై జనసేన
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న కోడుమూరు నియోజకవర్గం MLA, నియోజవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి..
40 సంవత్సరాల తర్వాత కర్నూలు జిల్లా కోడుమూరు నియోజవర్గంలో టిడిపి ఘనవిజయం సాధించిన శుభ సందర్భంగా విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న కోడుమూరు నియోజకవర్గం MLA బొగ్గుల దస్తగిరి గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి (కోడుమూరు నియోజకవర్గ పరిశీలకుడు) కాటప్పగారి రామలింగారెడ్డి గారు, టీడీపీ నాయకులు అనిల్ చౌదరి గారు..
దళితుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ..
దళితుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు. సింగనమల శాసన సభ్యురాలు బండారు శ్రావణ శ్రీ గారు నార్పల పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు సమావేశమై నార్పల లోని ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్ కాంపౌండ్ విషయమై వారు ఎమ్మెల్యే గారికి వివరించారు కాంపౌండ్ పూర్తిగా శిథిలావమైపోయినది కాంపౌండ్ నిర్మించాలని వారు ఎమ్మెల్యే గారికి సూచించారు మరియు అంబేద్కర్ నార్పల క్రాస్ నందు నిర్మాణం కొరకు గతంలో అప్రూవల్ వచ్చింది వాటిని పరిష్కరించి నిర్మాణం చేయాలని వారు కోరారు మరియు మండలంలోని ఒక అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని కోరారు ఈ విషయమై ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి మీ యొక్క పనులను పరిష్కరిస్తాను అని చెప్పడం జరిగిందిఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సింగనమల ఇంచార్జ్ రంగాపురం పుల్లప్పసీనియర్ నాయకులు గడ్డం నాగేపల్లి జయరాం కార్యదర్శి రాజు ప్రసాదు గంగయ్య నారాయణ రమణ లక్ష్మీనారాయణ గోపాలు తదితర ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీకి అన్ని విధాల సన్నద్ధం.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం, జూన్ 29 : వెలగపూడి, ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి శనివారం పెన్షన్ల పంపిణీ, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు.* *అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్డీఏ పిడి ఈశ్వరయ్య, డీపీఓ ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.* - *వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద జూలై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీకి అన్ని విధాలా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒకటో తేదీనే 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని, ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ మొదలు కావాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా అనేది వారి మండలంలోని కొన్ని ప్రాంతాలను తనిఖీ చేయాలన్నారు. నియోజకవర్గ అధికారులు పెన్షన్ల పంపిణీని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం బ్యాంకుల నుంచి అవసరమైన నగదు పూర్తిగా విత్ డ్రా చేసుకుని పాయింట్ పర్సన్ లకు అప్పగించాలన్నారు. పెన్షన్ల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, జిల్లాలో సజావుగా, విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డిఏ అడ్మిన్ అసిస్టెంట్ అజంతుల్లా పాల్గొన్నారు..

రాష్ట్ర డిజిపి శ్రీ ద్వారకా తిరుమల రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన కోడుమూరు నియోజకవర్గం MLA మరియు నియోజకవర్గం పరిశీలకులు
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ ద్వారకా తిరుమల రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన కోడుమూరు నియోజకవర్గం MLA బొగ్గుల దస్తగిరి గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి (కోడుమూరు నియోజకవర్గ పరిశీలకుడు) కాటప్పగారి రామలింగారెడ్డి గారు,కోడుమూరు నియోజకవర్గం మాజీ టీడీపీ ఇంచార్జ్ విష్ణు వర్ధన్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు అనిల్ చౌదరి గారు..
ఎన్టీఆర్ భరోసా పింఛన్ రూ.7000 లు అందించడం లో అలసత్వం వద్దు.. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ రూ.7000 లు అందించడం లో అలసత్వం వద్దు : ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ శింగనమల నియోజకవర్గ పరిధిలోని శింగనమల, గార్లదిన్నె,బుక్కరాయసముద్రం,నార్పల,పుట్లూరు,యల్లనూరు మండలాలలోని అన్ని గ్రామ సచివాలయాల పరిధిలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ దారులకు జులై నెల 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని మండలాల ఎంపీడీఓ లకు క్యాంప్ ఆఫీస్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ప్రతి లబ్దిదారుని ఇంటికి వెళ్లి పంపిణీ చేయాలి,ఈ విషయంలో ఎంపీడీఓ ఆఫీస్ అధికారులు,గ్రామ పంచాయితీ అధికారులు,సచివాలయం అధికారులు అలసత్వం చేయకుండా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. అలాగే డయోరియా వ్యాధి ప్రబలకుండా,సీజనల్ వ్యాధులు రాకుండా నివారణకు పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు శుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నార్పల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..

నార్పల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు

శింగనమల నియోజకవర్గం,నార్పల మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రావణి శ్రీ ఆస్పత్రిలోని కొన్ని వైద్య సేవా విభాగాలు ను పరిశీలించారు.స్కానింగ్ యంత్రం ఉండి కూడా సంబంధించిన డాక్టరు లేరని,మహిళా గర్భవతులు జిల్లా కేంద్రం కి వెళ్లి పరీక్షలు చేయించుకుని వస్తున్నారు.అలాగే రోగులకు ఇచ్చే మందు మాత్రలు సరిపడా రావడం లేదని,రెట్టింపు అవసరం ఉంది. కాన్పు కు వచ్చిన తరువాత తల్లి,బిడ్డలకు ఇచ్చే కిట్లు అందడం లేదు.సెలైన్ సీసాలు అందుబాటులో లేవు. వీటన్నింటి గురించి సంబంధించిన అధికారులు కు రిపోర్ట్ చేయాలనీ తెలిపారు. ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు వైద్య సిబ్బంది తో మాట్లాడుతూ డయోరియా వ్యాధి,సీజనల్ వ్యాధుల చికిత్స కు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.అంబులెన్స్ ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు ఆదేశించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసిన.. కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి..
మంగళగిరి లోనీ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు, టీడీపీ నాయకులు అనిల్ చౌదరి.