నిజంనిప్పులాంటిది

Jul 01 2024, 07:48

ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం..

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెనుమాకలో స్వయంగా ఇస్లావత్ సాయి అనే మహిళకు వితంతు పెన్షన్, బానావత్‌ పాములు నాయక్‌ అనే వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్‌ అందజేసిన సీఎం చంద్రబాబు.. పాల్గొన్న మంత్రి నారా లోకేష్‌.. 

లబ్ధిదారులతో మాట్లాడిన చంద్రబాబు

Streetbuzz News

SB NEWS

REAL TIME NEWS PLATFORM

నిజంనిప్పులాంటిది

Jun 30 2024, 07:13

టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది...

భారత్ మొదటి బ్యాటింగ్ చేసి నిర్ణయత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది..

విరాట్ కోహ్లీ 76 (59) పరుగులతో రాణించగా అక్షర్ పటేల్ 47 (31) పరుగులు శివం దుబాయ్ 27 (16) పరుగులు చేశారు..

తర్వాత బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ నష్టానికి 169 పరుగులు చేసి పరుగులు చేసి భారత్ చేతిలో ఓటమిపాలైంది..

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Jun 29 2024, 08:54

మరికాసేపట్లో కొండగట్టుకు పవన్ కళ్యాణ్!

మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయలుదేరనున్నారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.

గతంలో వారాహికి తొలిపూజ కొండగట్టులోనే నిర్వహించారు. కూటమి పొత్తులను ప్రకటించింది కొండగట్టులోనే కావడం గమనార్హం. రాత్రి అమరావతి నుంచి పవన్ హైదరాబాద్ వచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మాదాపూర్‌‌లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు చేరుకుంటారు.

కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టులో ప్రత్యేక పూజలు తర్వాత తిరిగి హైదరాబాద్‌కు కల్యాణ్ ప్రయాణమవుతారు. రోడ్డు మార్గంలో సాయంత్రం 4.30గంలకు హైదరాబాద్ నివాసానికి చేరుకుంటారు.

తమ అధినేత కోసం తెలంగాణ జనసేన భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది. పవన్ రాక గురించి ముందుగానే ప్రచారం జరగడంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడంతా పటిష్ట బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు.

నిజంనిప్పులాంటిది

Jun 28 2024, 07:36

త్వరలో రాష్ట్ర క్యాబినెట్‌ విస్తరణ!

- జూలై మొదటివారంలోనే ముహూర్తం.. 

- పీసీసీ చీఫ్‌ ఎంపికపైనా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు

- 4 రోజులుగా ఢిల్లీలోనే రేవంత్‌.. 

- అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి భట్టి.. 

- సోనియాతో మహేశ్‌కుమార్‌, యాష్కీ భేటీ

రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది. క్యాబినెట్‌ను జూలై మొదటివారం లో విస్తరించే అవకాశం ఉన్నట్టు సమాచా రం. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకంపైనా కాంగ్రెస్‌ అధిష్ఠా నం దృష్టి సారించింది.

క్యాబినెట్‌ విస్తరణ, పీసీసీ చీఫ్‌ ఎంపికపై రాష్ట్ర నేతలతో ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలు జోరుగా చర్చలు జరుపుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను అధిష్ఠానం మళ్లీ ఢిల్లీకి పిలిపించుకున్నది. గురువారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు భేటీ అయ్యారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, కొత్త అధ్యక్షుడి ఎంపికతోపాటు ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేరికపై కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. జూలై మొదటి వారంలో మంత్రివర్గాన్ని విస్తరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

పార్టీలో కొత్తగా చేరినవారిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి? పాతవారిలో ఎవరికి ఇవ్వాలనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల అభిప్రాయాలను దీపాదాస్‌ మున్షీ తీసుకున్నట్టు సమాచారం. స్థానికత, సామాజికవర్గాల కోణం లో లెక్కలు వేస్తున్నట్టు సమాచారం.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పదవీకాలం జూలై 7తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానం దృష్టి సారించడంతో ఆశావాహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీగౌడ్‌ గురువారం కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మరోవైపు తమవారికి మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు పలువురు మంత్రులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

నిజంనిప్పులాంటిది

Jun 28 2024, 07:31

వచ్చే రెండు రోజులు వర్షాలు !

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌లోని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది.

గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో అత్యధికంగా 10.49 సెం.మీ, కరీంనగర్‌ జిల్లా కరీంనగర్‌ మండలంలో 9.89 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.

Streetbuzz News

SB NEWS

REAL TIME NEWS PLATFORM

నిజంనిప్పులాంటిది

Jun 27 2024, 09:12

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రెండు మంత్రి పదవులు?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రెండు మంత్రి పదవులు?

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్యేల కోసం సీఎం రేవంత్ రెండు మంత్రి పదవులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం 6 ఖాళీలు ఉండగా 4 భర్తీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.

మరికొందరూ చేరిన తర్వాత వారందరిలో ఇద్దరికి మంత్రి పదవి దక్కనున్నట్లు టాక్.

కాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

నిజంనిప్పులాంటిది

Jun 26 2024, 16:37

అయోధ్య గర్భగుడిలో నీటి లీకేజి !

- స్పష్టత ఇచ్చిన ఆలయ కమిటీ 

అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) గర్భగుడి నుంచి వర్షపు నీరు లీకవుతోందన్న (roof leak) వార్తలపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) స్పందించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను తోసిపుచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించిన రామమందిరం (Ayodhya Ram Temple) ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా అర్ధ సంవత్సరం కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చిన్నపాటి వర్షానికే ఆలయం పైకప్పు నుంచి నీరు కారుతోందని ఆలయ ప్రధాన ఆర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్‌ పేర్కొన్నారు. అయితే గర్భగుడి నుంచి వర్షపు నీరు లీకవుతోందన్న (roof leak) వార్తలపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) స్పందించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను తోసిపుచ్చారు. పైకప్పు లీక్‌ కాలేదని స్పష్టం చేశారు.

విద్యుత్‌ తీగల కోసం అమర్చిన పైపుల ద్వారా నీరు కిందకు వచ్చిందని వివరించారు. ‘ఆలయంలో నీటి లీకేజీ లేదు. అయితే, విద్యుత్‌ తీగల కోసం అమర్చిన పైపుల నుంచి వర్షం నీరు ఆలయంలోపలికి వచ్చింది. ఆలయ భవనాన్ని నేనే స్వయంగా పరిశీలించాను. రెండో అంతస్తు నిర్మాణంలో ఉంది. రెండో అంతస్తు పైకప్పు పూర్తైతే వర్షం నీరు ఆలయంలోకి రావడం ఆగిపోతుంది’ అని నృపేంద్ర మిశ్రా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

కాగా, సోమవారం అర్ధరాత్రి జల్లులు పడిన తర్వాత పైకప్పు ద్వారా ఆలయ గర్భగుడిలోకి వర్షపు నీరు వచ్చిందని ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. రామ్‌లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం, వీఐపీ దర్శనం కోసం భక్తులు వచ్చే ప్రదేశం వరకూ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్‌ అవుతోందన్నారు. ‘దేశం నలుమూలల నుంచి వచ్చిన ఇంజినీర్లు రామమందిరాన్ని నిర్మిస్తుండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించారు. కానీ వర్షం పడితే పైకప్పు లీక్‌ అవుతుందని ఎవరకీ తెలియదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయం పైకప్పు లీక్ అవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఎందుకు జరిగింది..? ఇంత పెద్ద ఇంజనీర్ల సమక్షంలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా పొరపాటు’ అని అన్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించి లీకేజీని అరికట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆలయం నుంచి నీరు బయటకు వెళ్లేలా చూడాలని కోరారు.

1800 కోట్లతో ఆలయ నిర్మాణం !

ఆయోధ్య ఆలయ ప్రారంభోత్సవాన్ని ఈ ఏడాది జనవరి 22న ఎంతో అర్భాటంగా నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దీన్ని బీజేపీ తన సొంత కార్యక్రమంలా నిర్వహించిందనే విమర్శలు ఉన్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. రాజకీయ, సినిమా, పరిశ్రమ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు చూసేందుకు లైవ్‌ ఏర్పాట్లు కూడా చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నేతృత్వంలో చేపట్టిన ఈ రామ మందిర నిర్మాణ అంచనా వ్యయం రూ.1,800 కోట్లుగా ఉన్నది. ఆలయ నిర్మాణం, అనంతర నిర్వహణ కోసం ట్రస్టుకు దాతల నుంచి దాదాపు రూ.3,500 కోట్ల మేర వచ్చాయి.

నిజంనిప్పులాంటిది

Jun 26 2024, 15:35

2 రాష్ట్రాలు... 2 నాలుకలు...

హర్యానాలో తమ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి బీజేపీలోకి మారడంతో ఆమెను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌ కు లేఖ రాసింది... 

కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది..

హర్యానా లో పార్టీ మారితే వేటు వేయాలని కోరుతున్న కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు మౌనంగా ఉంది

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Jun 26 2024, 11:41

లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఓం బిర్లా ఎన్నిక..

18వ లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. స్పీకర్ కుర్చీలో ఓం బిర్లాను ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూర్చొబెట్టారు..

ఎన్డీయే తరఫున లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో లోక్ సభ స్పీకర్ ఎంపిక చేశారు..

Streetbuzz News

Real Time News Platform

నిజంనిప్పులాంటిది

Jun 26 2024, 10:56

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గుమ్మళ్ళ సృజన

ప్రతిష్టాత్మక జిల్లాలో పనిచేయటం ఆనందంగా ఉంది..

గతంలో కూడా జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటాం

అధికారులు తో సమీక్ష నిర్వహిస్తాం

గతం లొ ఎన్టీఆర్ జిల్లాలో పని చేసిన అనుభవం వుంది 

రాష్ట్రం లోనే అత్యంత ప్రతిష్టత్మకమైన జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను 

ఎన్టీఆర్ జిల్లా కు దేశ వ్యాప్తంగా మంచిపేరు వచ్చే విదంగా సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తాను అని తెలిపారు