madagoni surendar

Jun 29 2024, 13:39

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తొలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన.జిల్లా యువజన నాయకులు ముక్కామల శేఖర్ యాదవ్

నల్లగొండ జిల్లా :-

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తొలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారి జన్మదినం సందర్భంగా నకిరేకల్ లో వారి నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకకు హజరై కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన.కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన నాయకులు ముక్కామల శేఖర్ యాదవ్, కట్టంగూర్ మాజీ ఎంపీటీసీ గట్టిగొర్ల సత్తయ్య యాదవ్, కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ మండల యువజన నాయకులు మేడి విజయకుమార్,రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Jun 24 2024, 19:53

"ప్రజావాణి" తో ప్రజల సమస్యలు పరిష్కారం.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

"ప్రజావాణి" తో ప్రజల సమస్యలు పరిష్కారం

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-

సోమవారం నాడు నకిరేకల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గతంలో నిర్వహించే వారు.పేద వారికి, వృద్ధులు, వికలాంగులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటురని దూర బారం ఐతుందని గమనించి మన జిల్లా కలెక్టర్ ఇకపై ప్రతీ సోమవారం మండల స్థాయి కార్యలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహించలను కోవటం మంచి నిర్ణయం.

ఇకపై సమస్యలు పరిష్కారానికి సులువుగా ఉంటుంది

అధికారులందరికి నా విజ్ఞప్తి మీకు ఏ సమస్యలున్నా నేను పరిష్కారం చేస్తా నా దృష్టికి తీసుకురండి. మీ వంతుగా కూడా వచ్చిన దరఖాస్తులన్నీటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చేయండి పారదర్శకంవమైన పాలన ఇద్దాంనకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న అధికారులందరూ బాగా పనిచేస్తున్నారు అందరికీ నా అభినందనలు.ఈ కార్యక్రమంలో నకిరేకల్ మండల యం.పి.పి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్,పి.ఏ.సి.ఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మండల స్థాయి అధికారులు తదితరులు.

madagoni surendar

May 14 2024, 16:27

నల్గొండ, ఖమ్మం,వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే.ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న
నల్గొండ, ఖమ్మం,వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నకిరేకల్ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో నిర్వహించగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  మరియు నల్గొండ,ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరయ్యారు ఈ కార్యక్రమనికి ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,వివిధ సంఘాల నాయకులు,పట్టభద్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నకిరేకల్  ఎమ్మెల్యే వీరేశం  మాట్లాడుతూ -; ఈనాటి నల్గొండ,ఖమ్మం,వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎంమ్మెల్సి అభ్యర్థిగా బరిలో ఉంటున్న తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మొట్టమొదటిగా మన నియోజకవర్గం నుండి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మన అందరి ఆశీర్వాదం మల్లన్నగారికి ఇచ్చి మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోవడం కోసం ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీరందరూ ఒకసారి చప్పట్ల ద్వారా మల్లన్నగారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి వేదిక ముందు ఉన్న నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మల్లన్నకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన DTF,PRTU,TPTF సంఘాల నాయకులు రావడం జరిగింది,వాళ్ళందరూ మల్లన్నను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తునందుకు వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా.. ఈరోజు ముఖ్యంగా మల్లన్నకు ఎందుకు ఓటు వెయ్యాలి అన్నదానికి నేను సమాధానం చెప్త.మల్లన్న చట్ట సభలకు పోవాలి. నేను మొన్న ఒక యూట్యూబ్ లో చూసిన ఏంత సిల్లి గా ఏంత చిల్లర గా మాట్లడుతుండంటే ఒక వ్యక్తి దాదాపు సెంచరీ కి నియరెస్టు గా కేసులు పెట్టుకొని తెలంగాణలో నడుస్తున్న నియంతృత్వ పాలనను,నియంత పాలనను గద్దె దించేవరకు ఎన్ని కేసులైనా ఎన్నిసార్లు జైలుకైన చివరికి తెలంగాణ ప్రజల కోసం తన ప్రాణాన్ని తృణ ప్రాణంగా పెడతా కానీ ఆ దొర కి తలవంచ అని ఆ దొరని దించడమే లక్ష్యం అని కొట్లడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న అలా కొట్లడిండు కాబట్టే తెలంగాణ ప్రజలను చైతన్య వంతులను చేసిండు కాబట్టే,తెలంగాణ ప్రజలకి వాస్తవాలు చుయించిండు కాబట్టే,తెలంగాణ ప్రజలకు సత్యాలు చెప్పిండు కాబట్టే, ఆ సత్యాలను వాస్తవాలను నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనే సత్యాన్ని కూడా ఈ సందర్బంగా గుర్తు చేస్తున్న.నేను చాలామంది జర్నలిస్టులను చూసిన,నాకు చాలా మంది జర్నలిస్టులు ప్రెండ్స్ ఉన్నారు.ఏక్కడనో ఒక్క దగ్గర కుటుంబమో పిల్లలో ఆస్తి అంతస్తో అడ్డువచ్చి కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది.కానీ మల్లన్న తో నాకు అంతకుముందు పరిచయం లేకున్నా చాలా గర్వపడే వాడిని ఒక నిఖార్సయిన జర్నలిస్టు గా ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపుత అని ఛాలెంజ్ చేసిన దమ్మున్న మొగోడు మల్లన్న ఒక కమిట్మెంట్ ఉంటే ఒక నిబద్ధత ఉంటే ఒక నిఖార్సయిన వ్యక్తిగా ఎదైనా సాధించవచ్చు అని మల్లన్న ను చూస్తే తెలుస్తుంది ఆరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోజు ఉన్న ధనం,ఆరోజు ఉన్నటువంటి అధికార భలం నాతో సహా ఏ ఒక్కరూ సపోర్ట్ చెయ్యకున్న ప్రజల బలంతోని చువుకున్న వాళ్ళ బలంతోని ,ఆలోచించే వాళ్ళ మద్దతు తొని కొద్దిలో మిస్ అయ్యింది.కానీ నైతికమైన గెలుపైన కూడా గెలుపు స్వీకరించలేదు ఓటమి అనే గుణపాఠం నుండి గెలుపు అనే మెట్టు వైపు పరుగెడుత అని బయల్దేరిన వ్యక్తి మన మల్లన్న నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో మనకి తెలిసిన ప్రతి ఒక్కరికీ పోన్ చేసి మన అభ్యర్థి తీన్మార్ మల్లన్న కి మద్దతుగా నిలబడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మల్లన్న వాయిస్ చట్ట సభల్లో ఉంటే అది సామాన్యుని వాయిస్ ప్రజల వాయిస్ ,నీతి వైపు ధర్మం వైపు మాట్లాడిన గొంతుక చట్ట సభల్లో ఉంచవలసిన అవసరం మన మీద ఉంది.నిన్న జరిగిన ఎన్నికలలో చూసినం బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోయినాయి.ఈ రెండు పార్టీలు వేరు కాదు అని నిన్న ఎన్నికలలో తేలిపోయింది.రేపు జరగబోయే ఎంయల్సి ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యే ప్రమాదం ఉంది.కావున మనం అందరం కలిసి మల్లన్నకు ఓటు వేసి భారీ మెజారిటీతో చట్ట సభకు పంపించవల్సిందిగా కొరుకుంటున్నాను.

నల్గొండ,ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ -;
ఖమ్మం,నల్లగొండ,వరంగల్, పట్టభద్రుల MLC ఉపఎన్నికల్లో వీరేశం అన్న తమ్ముడు తీన్మార్ మల్లన్న నిలబడ్డడు . ఎక్కడికి పోయిన ఒక్కటే మాట పోయిన సారి మల్లన్నకు అన్యాయం జరిగింది.. ఈసారి జరగదు  అసలు ఈ ఉపఎన్నిక ఎందుకొచ్చిందంటే....!!పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆఫ్ట్రాల్ పదవి ఎందుకని వదిలేస్తే వచ్చింది. 3 యేండ్ల పాటు MLCగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ సంఘాల నాయకుల్ని అన్నా ముఖ్యమంత్రిని కలిపించిండా వారి సమస్యలు వినిపిచిండా.
నేను MLC ఐన తెల్లారే అన్ని ఉద్యోగ సంఘాల నాయకుల్ని సీఎం దగ్గరికి తోలుక పోతా...వారి సమస్యలు వినిపిస్తా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అధికారం లో ఉన్నన్ని నాళ్ళు కబ్జాలు చేయటానికే టైం సరిపోలేదు... ఇంకా మనకు పనిచేయటానికి టైం ఎక్కడిది.నేను ఓడిపోయిన రోజునుండి ఈ రోజు వరకు కూడా మీకోసం పేదల కోసం పోరాటం చేస్తునే ఉన్న.... చేస్తూనే ఉంటా. కేసీఆర్ వందల కేసులు నా మీద పెట్టించిండు.... నేను ఏ రోజు భయపడలేదు.

ఆ కేసుల్లో నాసొంత సమస్య ఒక్కటి లేదు అవన్నీ కేసీఆర్ ని ప్రశ్నించడం మూలంగా పెట్టిన అక్రమ కేసులే . కేసీఆర్ ని గద్దె దించుతామని శపథం చేసిన చేసిచూయించిన అది నా పోరాట పటిమ అంటే. ఈ ఎన్నికల్లో మీ ప్రేమ అభిమానం ఎలా ఉండబోతుందో నాకు తెలుసు  ఎక్కడన్నా ఈదేశ రాజకీయాల్లో తన కుటుంబ ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చి రాజకీయాల్లో పోటీ చేసిన నాయకుడు ఉండా? ఇంత వరకు లేడు కదా. ఇగో మీ వీరేశం అన్న తమ్ముడు తీన్మార్ మల్లన్న మాత్రం ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చి MLCగా పోటీ చేస్తుండు

అమ్మ అయ్య మీద ఒట్టేసి చెబుతున్న మీ ఓటు వృధా కానివ్వను....

madagoni surendar

May 08 2024, 15:26

ఎట్టకేలకు పట్టాలెక్కనున్న తొలి ప్రైవేట్ రైలు
ఎట్టకేలకు పట్టాలెక్కనున్న తొలి ప్రైవేట్ రైలు
దేశంలోని తొలి ప్రయివేటు రైలు వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది.

కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వరకూ రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహిస్తుంది.

భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ సర్వీసును నిర్వహిస్తారు.

తిరువనంతపురంలో మొదలయ్యే ఈ రైలు త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ మీదుగా గోవా చేరుకుంటుంది.

ఈ రైల్లో 2 స్లీపర్ కోచ్‌లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకెండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి.

వైద్య నిపుణులతో పాటు మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వైఫై, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనువుగా టూర్ ప్యాకేజీలను సైతం రెడీ చేశారు.....

madagoni surendar

May 02 2024, 10:12

కట్టంగూర్ మండల కేంద్రంలోని 195 వ బూత్ లోఇంటింటి ప్రచారం నిర్వహించిన.నాయకులు
నల్గొండ జిల్లా:- కట్టంగూర్ మండల కేంద్రంలోని 195 వ బూత్ లో   గురువారం నాడు భువనగిరి పార్లమెంట్  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా యూవజన నాయకులు రెడ్డిపల్లి విరస్వామి,నాయకులు చిక్కుల లింగయ్య,పోగుల చంద్రయ్య గౌడ్, సలీమ్,బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

madagoni surendar

May 02 2024, 09:55

కట్టంగూర్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
కట్టంగూర్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం నల్గొండ జిల్లా:- కట్టంగూర్ మండల కేంద్రం లో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో  గెలిపించాలని కోరుతూ 193వ బూత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈసందర్బంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యరించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు గట్టిగొర్ల సతయ్య, ఐతగోని ఝన్సీనర్సింహాగౌడ్,మండల సీనియర్ నాయకులు బుచ్చాల వెంకన్న, చెరుకు సైదులు, కానుగు లింగయ్య,నర్సింగ్ లింగయ్య,పోగుల రాజేందర్, పొడిచేటి రాములు,నాయకులు కార్యర్తలు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 12 2024, 17:27

ఓటరుగా నమోదుకు ఇంకా మిగిలింది చివరి 3 రోజులే
*ఓటరుగా నమోదుకు ఇంకా మిగిలింది చివరి 3 రోజులే*
త్వరగా స్పందించండి.. ఓటరుగా నమోదు చేయండి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందిన వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు.

అయితే.. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుంది.

2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

మీ ఫోన్లోనూ కూడా
*voters.eci.gov.in* సైట్
లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రజాస్వామ్యం రక్షణ, అవినీతి వ్యతిరేక ప్రభుత్వాల కోసం యువతరం కదిలి తక్షణమే ఓటు నమోదు చేసుకోండి.

madagoni surendar

Apr 05 2024, 10:56

భారతదేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచివుండే గొప్ప దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్ బాబూ జగ్జీవన్ రామ్ 117 వ జయంతి వేడుకలోనకిరేకల్ ఎమ్మెల్యే
భారతదేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచివుండే  గొప్ప దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్

బాబూ జగ్జీవన్ రామ్ 117 వ జయంతి వేడుకలో

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ జిల్లా :- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద ఉన్న వారి విగ్రహాం వద్ద పూలమాల వేసి ఘన నివాళులర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
అనంతరం ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని.. బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్పూర్తి దాయకమని, దళిత సమాజాభివృద్ధికోసం వారు చేసిన సేవలు గొప్పవని కొనియాడారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా, గొప్ప రాజకీయవేత్తగా, సామాజిక సమానత్వం కోసం తన జీవితకాల పోరాటం చేసిన సంస్కరణ శీలిగా భారతదేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచివుండే  గొప్ప దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉపప్రధాని పదవితో పాటు, పలు మంత్రిత్వ శాఖలు చేపట్టి ఆయా రంగాల్లో తనదైన ముద్రను, భారతదేశ పురోభివృద్ధికి పునాదులు వేసారని అన్నారు.  దళితులు, వెనుకబడిన తరగతులు, అణచివేతకు గురైన వర్గాల ఉన్నతి కోసం, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు, కార్మికోద్యమాలను నడిపారని తెలిపారు. కార్మికశాఖ మంత్రిగా, కార్మిక సంక్షేమ విధానాలకు బాటలు వేసిన బాబూ జగ్జీవన్ రామ్ ... కార్మిక లోక పక్షపాతి అని కీర్తించారు. జీవిత పర్యంతం పేదలు, పీడిత వర్గాల సంక్షేమం, హక్కుల సాధన కోసం పనిచేసిన బాబు జగ్జీవన్ రామ్ ప్రజలు ప్రేమగా పిలుచుకునే ‘బాబూజీ’ గా ప్రఖ్యాతులయ్యారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైద రవిందర్,బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్  పూజర్ల శంభయ్య,టీపీసీసీ మెనీఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్,స్థానిక కౌన్సిలర్లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Apr 01 2024, 15:38

పూలే అంబేడ్కర్ జన జాతర సందర్భంగా రక్తదాన శిబిరం పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
పూలే అంబేడ్కర్ జన జాతర సందర్భంగా రక్తదాన శిబిరం

    పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్గొండ జిల్లా :- ఏప్రిల్ మాసం మహానీయుల మాసంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కార్యక్రమాలు నిర్వహిస్తుందని పూలే అంబేడ్కర్ జన జాతర సందర్భంగా నల్లగొండ అంబేద్కర్ భవనంలో ఏప్రిల్ 13న రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. ఈరోజు దొడ్డి కొమరయ్య భవనంలో జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 11 మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల నిబంధనలకు లోబడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో మండలాలు నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించనున్నట్లు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు.  మహానీయుల ఆశయాలను ఆదర్శ లను నేటి యువతకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉందని తెలిపారు. దళితుల సంక్షేమం కొరకు కృషి చేస్తూనే  దళితులపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కెవిపిఎస్ పోరాడుతుందని తెలిపారు. పాలకులు మారిన ప్రభుత్వాలు మారినా దళితుల సంక్షేమం జీరో అన్నారు.  నేటికి సంక్షేమ హాస్టల్స్ కి బిల్లులు చెల్లించలేదని ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అందడం లేదని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించే స్థితి అసలే లేదని పేరుకే దళితుల సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకోవాలని సంక్షేమ పథకాలు గ్రీన్ ఛానల్ ద్వారా అమలు చేయాలని తెలిపారు. జిల్లాలో దాడులు దౌర్జన్యాలకు గురైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన బాధితులకు కూడా కనీసం పరిహారం అందించడం లేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏమిటో చూడాలని అన్నారు. దేశంలో మత ఉన్మాదం పెరిగిపోతుందని భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు దాపరిoచాయని రిజర్వేషన్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి మొదలుకొని ఉపముఖ్యమంత్రి వరకు అవమానాలు ఎదురై ఆత్మగౌరవం దెబ్బతింటుందని అన్నారు. దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తగు గుణపాఠం చెప్పాలని లౌకిక పార్టీలను గెలిపించాలని కెవిపిఎస్ సంఘం తీర్మానించిందని తెలిపారు. రక్తదాన శిబిరం ప్రారంభకులు డాక్టర్ ధరనీధర్ ప్రముఖ కార్డియో ప్రారంభించనున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా భారత స్వాతంత్రం దళితుల స్థితిగతులు పైన సెమినారు నిర్వహిస్తున్నట్టు దీనికి ముఖ్యఅతిథిగా అంబటి నాగన్న హాజరవుతారని తెలిపారు. పెద్ద ఎత్తున దళిత గిరిజన మైనారిటీ బలహీనవర్గాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యార్థులు యువకులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.  ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుష రాములు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గాదే నరసింహ బొల్లు రవీందర్ కుమార్ కోడి రెక్క మల్లయ్య ఒంటెపాక కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్యామ్ దొంతాల నాగార్జున దోరేపల్లి మల్లయ్య సోమలింగం నర్సింహా  శైలజ బొడ్డు బాబురావు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 31 2024, 20:32

ఇఫ్తార్ విందులో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఇఫ్తార్ విందులో నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం:- పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.అంతరం నకిరేకల్ మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో  నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో నకిరేకల్ పట్టణ వివిధ వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు..