మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై గట్టి నిఘా ఉంచాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై గట్టి నిఘా ఉంచాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం, జూన్ 28 : *జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా గట్టి నిఘా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్సిఓఆర్డీ (నార్కో కోఆర్డినేషన్ సెంటర్, NCORD) జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, డ్రగ్స్, లాంటివి సాగు, రవాణా చేయకుండా చూడాలన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో గతేడాది జూన్ నుంచి నవంబర్ వరకు కెనాబీస్, ఆల్కహాల్, గంజాయిలాంటి కేసులు నమోదు కాగా, వైజాగ్, శ్రీకాకుళం నుంచి వస్తున్న, అనంతపురం మీదుగా బళ్లారి వెళుతున్న ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేయాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రయాణికులను కూడా తనిఖీ చేయాలని సూచించారు. పాఠశాలలు, హైస్కూల్ లలో కమ్యూనిటీ డ్రైవ్ చేపట్టాలన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద, సరిహద్దు ప్రాంతాలలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణాపై నిఘా ఉంచాలని, ఎక్కడి నుంచి రవాణా జరిగే అవకాశం ఉందో పరిశీలించి ముఖ్యమైన బ్లాక్ స్పాట్లను గుర్తించాలన్నారు. జిల్లాలో ఎక్కడ గంజాయి సాగు చేయడానికి వీలు లేకుండా చూడాలని, మారుమూల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో పలు చోట్ల పోస్టర్లను, ఐఈసీ మెటీరియల్ ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ కళాశాలలలో సిసి టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అన్నిచోట్ల సౌకర్యాలు బాగా కల్పించాలన్నారు. జిల్లాలోని రెస్టారెంట్లు, హోటల్స్, బార్లలో మత్తు పదార్థాలు ఉపయోగించకుండా అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. ఈ సందర్భంగా నశాముక్త భారత్ లో భాగంగా ఎన్హెచ్ఎం ఐఈసీ యాక్టివిటీల కింద "JUST SAY NO TO DRUGS" మరియు "SAY NO TO DRUGS" అనే పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.* - *ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, సెబ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్, డిటిసి వీర్రాజు, అనంతపురం ఆర్డిఓ గ్రంధి వెంకటేష్, డిఎంహెచ్ఓ డా.ఈ బి.దేవి, డీఈఓ వరలక్ష్మి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ రామసుబ్బారెడ్డి, హార్టికల్చర్ డిడి రఘునాథరెడ్డి, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డిసిహెచ్ఎస్ పాల్ రవికుమార్, జిల్లా సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, డివీఈఓ వెంకటరమణ నాయక్, ఏసిఐఓ శ్రీధర్ బాబు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది...జగనన్న ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తారు.. ఆలూరు సాంబ శివారెడ్డి..
అనంతపురం జిల్లా: పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తల దాడిలో మరణించిన వైఎస్ఆర్సిపి కార్యకర్త ఎరుకులయ్య(60) పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, వైఎస్ఆర్సిపి నేతలు ఆలూరు సాంబశివారెడ్డి, ఎం. వీరాంజ నేయులు. మృతునికి భార్య, ముగ్గురు కొడుకులు, ఇంటి పెద్ద దిక్కు తండ్రి చనిపోవటడంతో మృతి దేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడు ఎరుకులయ్య పార్టీకి చేసిన సేవలను గుర్తుకు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ సీపీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నా ఎస్సీ..నా ఎస్టి.. నా బిసి..ఆ మైనార్టీలు అని జగనన్న హక్కును చేర్చుకుంటే నేడు టీడీపీ బీసీలపై దాడులు చేస్తుంది. టీడీపీ చేతులో గాయపడి మృతి చెందిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను వైస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. టీడీపీ వాళ్ళు పైశాచిక ఆనందం కోసం వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంది. నియోజకవర్గంలోని జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ టిడిపి వైశాచిక ఆనందం పొందుతుంది.
తగు మోతదులో క్రిమిసంహారక మందులను వినియోగించాలి.. జిల్లా వనరుల కేంద్రం ఉప సంచాలకులు శ్రీ మద్దిలేటి..
క్రిమిసంహారక మందులు తక్కువ మొతదులో వాడండి. వేరుశనగ లో మిత్రపురుగులను శత్రు పురుగులను గుర్తించి తగు మోతదులో క్రిమిసంహారక మందులను వినియోగించవలేనని జిల్లా వనరుల కేంద్రం ఉప సంచాలకులు శ్రీ మద్దిలేటి గారు సూచించారు. మండలములోని దయ్యాలకుంటపల్లి గ్రామములో సాగుకు సమయత్తం పై రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులు లోతు దుక్కులు చేసుకోవాలని మట్టి నమూనా పరీక్షలు చేయుంచుకోవాలని ఉదజని సూచికలను బట్టి ఎరువులను వినియోగించుకోవాలని సకాలం లో మంచి విత్తనాన్ని ఎన్నుకొని విత్తనశుద్ధి చేసుకొని విత్తుకోవాలని సరైన క్రమములో నీటి తడులు ఇవ్వాలని సూక్ష్మ పోషక ఎరువులను ప్రతి రెండు పంటలకు ఒకసారి వినియోగించుకోవాలని పురుగుల ఉదృతి ని బట్టి మందులు వాడాలని రసాయనిక ఎరువులు తగ్గించి పశువుల ఎరువులను వినియోగించాలని రైతులను కోరారు, మరియు వివిధ పంటలపై రైతుల ప్రశ్నలకు సమాధానములు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో ADA శ్రీమతి శైలజ గారు, గ్రామ రైతులు రైతు భరోసా కేంద్ర ఇంచార్జి లు పాల్గొన్నారు.
హై స్కూల్స్, హాస్టల్స్ పై ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
విద్యార్థులకు రుచి, శుచికరమైన భోజనం అందించాలి నాణ్యత లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ శింగనమల నియోజకవర్గం: బుక్కరాయసముద్రం మండల కేంద్రం లోని జడ్పీ ఉన్నత పాఠశాలను నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈరోజు విద్యార్థుల మధ్యాహ్న భోజన సమయానికి ఎవ్వరికీ తెలియకుండా ఎమ్మెల్యే శ్రావణిశ్రీ హై స్కూల్ కు వచ్చారు. వచ్చి రాగానే భోజనాల వద్దకు నేరుగా వచ్చి, భోజన పాత్రలలో అన్నం, కూరలు పరిశీలించారు. భోజన వంటల పై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ ఆదేశించారు. లేదంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ తర్వాత భోజనాలు చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి, పలు విషయాలు మాట్లాడారు. భోజనాలు గురించే గాకుండా, విద్యా బోధన విషయాలు, సమస్యలు పై అడిగారు. ఆ తర్వాత ఆర్.డబ్ల్యు.యస్. అధికారులు ను పిలిపించి, విద్యార్థులు త్రాగుతున్న నీటి గురించి పరీక్షలు జరిపించారు. అధికారులు త్రాగునీటి వాడకం పై ఎలాంటి ఇబ్బంది లేదని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ గారికి తెలిపారు. ఆ తర్వాత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గోడల వరకు నిర్మించి, నిలిపివేసిన భోజన శాల ను పరిశీలించారు. భోజన శాల ను విద్యార్థులకు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. హై స్కూలు యందు అబ్బాయిలకు,ఉపాద్యాయులుకు టాయిలెట్స్ లేకపోవడంతో వెంటనే సంబంధించిన అధికారులు కు రిపోర్ట్ చేయాలని హెడ్ మాస్టర్ కు సూచించారు. అలాగే టీచర్ల కొరత గురించి ఉపాద్యాయులు ను అడిగారు. త్వరలోనే హిందీ టీచర్ రిటైర్డ్ అవుతారని, హిందీ టీచర్ ఏర్పాటు కొరకు ఎమ్మెల్యే శ్రావణిశ్రీ కి వినతి చేశారు. జిల్లా విద్యా శాఖాధికారి కి లేఖ వ్రాయాలని, అలాగే టీచర్ల, ఇతర సమస్యల గురించి ఒక రిపోర్ట్ కాపీ ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ ఉపాద్యాయులు కు సూచించారు.
పాచి పట్టిన పాత్రలో త్రాగునీరు నిల్వ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు...

పాచి పట్టిన పాత్రలో త్రాగునీరు నిల్వ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు.

శింగనమల నియోజకవర్గం,బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వసతి గృహంలోని గదులను ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు పరిశీలించారు. వసతి గృహ గదులలో పైకప్పు సిమెంట్ స్లాబ్ పెచ్చులు ఊడిపోయి ఉండడం చూసి సంబంధించిన వసతి గృహ వార్డెన్ ఫై అసహనం వ్యక్తం చేశారు.స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిన సంగతి గురించి సంబంధించిన అధికారులకు తెలిపినారా లేరా అని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు అధికారిని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో నాడు నేడు కింద మరమ్మత్తుల కోసం పంపించామని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారి దృష్టికి కాగితాలు చూపుతూ వసతి గృహ అధికారి రామ్ నాయక్ తెలిపారు.గడిచిన నాడు నేడు కింద వైసీపీ ప్రభుత్వం పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా నిర్లక్ష్యం చేయడం విద్యారంగానికి సంబంధించిన విద్యార్థుల వసతి గృహాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం చేసి వ్యవస్థలను ఎక్కడి గొంగళి అక్కడేఅన్న చందంగా పరిపాలన చేశారని ఎద్దేవా చేశారు.ఇంకొకసారి స్లాబ్ పై కప్పు సిమెంట్ పెచ్చులు ఊడి పోయాయని,మరమ్మతులు కోసం సంబంధించిన అధికారులు కు పంపండని సూచించారు. వంట గదిని పరిశీలించి,శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.ఆ తర్వాత అరుగు పై ఉంచిన స్టీల్ పాత్రను పరిశీలించారు. పాత్రలో నిల్వ ఉంచిన నీటిని విద్యార్థులు ఎల్లవేళలా త్రాగుటకు ఉపయోగిస్తారని సిబ్బంది ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారికి తెలిపారు.పాత్ర పై ఉంచిన మూత తీసి,పాత్రలోపలి భాగం చూశారు.నీటి అడుగున పాచిపట్టి,దోమలు పడి అపరిశుభ్రంగా ఉండటం చూసి,సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.మీ ఇండ్లలో త్రాగడానికి ఇలాగే పాత్రలు ఉంటాయా అని మండిపడ్డారు.వెంటనే పాత్ర ను మార్చాలని ఆదేశించారు. వసతి గృహంలో ని గదులు పరిశీలించే క్రమంలో నలుగురు విద్యార్థులు పాఠశాల కు వెళ్లకుండా ఉండటం చూసిన ఎమ్మెల్యే గారు,విద్యార్థులుకు ఆరోగ్యం బాగా లేదని,అందుకు వెళ్ళ లేదని సిబ్బంది తెలిపారు. సిబ్బంది ని పక్కకు పంపి,ఎమ్మెల్యే గారు విద్యార్థుల ఆరోగ్యం గురించి వివరాలు అడిగి,వైద్య సేవలు అందాయా లేవా అని అడిగారు.విద్యార్థులు వైద్య సేవలు అందాయాని ఎమ్మెల్యే గారికి తెలిపారు.విద్యార్థుల ఆరోగ్య విషయం లో జాగ్రత్తగా ఉండాలని సిబ్బందికి ఎమ్మెల్యే శ్రావణి గారు సూచించారు. అలాగే గదులలో విద్యుత్ ఫ్యాన్లు,బల్బులు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపించి,గాలి వెలుతురు ఉండేటట్లు చూడాలని అధికారికి ఎమ్మెల్యే తెలిపారు.

బీసీ సంక్షేమ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచు అందజేసిన సింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు..
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు *బీసి సంక్షేమం,ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖా మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారిని మర్యాద పూర్వకంగా కలసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు* మరియు నాయకులు పెనుకొండ నియోజకవర్గ కేంద్రం లో నిరుపేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాoటీన్ ద్వారా నిరుపేదల ఆకలి తీర్చడం పూర్వజన్మ సుకృతం పెనుకొoడ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 380 వ రోజు అన్నా క్యాoటీన్ ద్వారా భోజనం ఏర్పాటుచేసిన *బీసి సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖా మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారు
జూలై 1వ తేదీన 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి.. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
జూలై 1వ తేదీన 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి.. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, జూన్ 27.. జూలై 1వ తేదీన 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పెన్షన్ల పంపిణీ పై జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్డీఏ పిడి ఈశ్వరయ్య, ఎంపీడీవోలు, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడ చిన్న పొరపాటు జరగడానికి వీలులేదన్నారు. అత్యంత పక్కాగా పెన్షన్ల పంపిణీ జరిగేలా అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం వెంటనే క్షేత్రస్థాయిలో బృందాలను ఏర్పాటు చేయాలని, సచివాలయ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులైన మండల స్థాయిలోని ఆర్ఐలు, జూనియర్ అసిస్టెంట్లు, మండల సర్వేయర్లు, బిల్ కలెక్టర్లు, తదితర సిబ్బందిని పెన్షన్ల పంపిణీకి నియమించాలన్నారు. ప్రతి 50 మంది లబ్ధిదారులకు ఒక సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో, నగరంలో, మున్సిపాలిటీలలో పెన్షన్ల పంపిణీ పై సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరికి పెన్షన్ల పంపిణీపై శిక్షణ ఇవ్వాలన్నారు. శనివారం రోజు పెన్షన్ల పంపిణీ అమౌంట్ బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకొని సిద్ధంగా పెట్టుకోవాలని, నగదును బ్యాంకుల నుంచి తీసుకెళ్లేటప్పుడు బందోబస్తు ఉండాలని ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని వార్డుల్లో, గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని, ఈ విషయం పంచాయతీ సెక్రెటరీలకు తెలియజేయాలన్నారు. అన్నిచోట్ల బయోమెట్రిక్ డివైసెస్ అవసరమైనన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పెన్షన్ల పంపిణీలో ఎక్కడైనా నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం లబ్ధిదారుల మ్యాపింగ్ 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.* - *ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిపిఓ ప్రభాకర్ రావు, ఆర్డీఓలు జి.వెంకటేష్, వి.శ్రీనివాసులరెడ్డి, ఎంపీడీవోలు, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు..
టీడీపీ కార్యకర్త భౌతికాయనికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ..
టీడీపీ కార్యకర్త భౌతికాయనికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామ నివాసి, టీడీపీ కార్యకర్త తలారి రాజన్న అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు తలారి రాజన్న గారి పార్థివదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. రాజన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి, టీడీపీ తరపున ఎల్లవేళలా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు బండారు శ్రావణి శ్రీ గారు తెలిపారు.
హోంశాఖ మంత్రివర్యులు కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో భాగంగా అమరావతిలో హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు
జగన్ కాన్వాయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం..

జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది..

కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్ళుతుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ కొన్నాయి.

వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

కాగా నేడు సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు ఆయన వెళ్తున్నారు. మూడు రోజులు అక్కడే ఉంటారు. రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు.