జూలై 1వ తేదీన 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి.. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
జూలై 1వ తేదీన 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి.. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
అనంతపురం, జూన్ 27.. జూలై 1వ తేదీన 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పెన్షన్ల పంపిణీ పై జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్డీఏ పిడి ఈశ్వరయ్య, ఎంపీడీవోలు, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడ చిన్న పొరపాటు జరగడానికి వీలులేదన్నారు. అత్యంత పక్కాగా పెన్షన్ల పంపిణీ జరిగేలా అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం వెంటనే క్షేత్రస్థాయిలో బృందాలను ఏర్పాటు చేయాలని, సచివాలయ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులైన మండల స్థాయిలోని ఆర్ఐలు, జూనియర్ అసిస్టెంట్లు, మండల సర్వేయర్లు, బిల్ కలెక్టర్లు, తదితర సిబ్బందిని పెన్షన్ల పంపిణీకి నియమించాలన్నారు. ప్రతి 50 మంది లబ్ధిదారులకు ఒక సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో, నగరంలో, మున్సిపాలిటీలలో పెన్షన్ల పంపిణీ పై సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరికి పెన్షన్ల పంపిణీపై శిక్షణ ఇవ్వాలన్నారు. శనివారం రోజు పెన్షన్ల పంపిణీ అమౌంట్ బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకొని సిద్ధంగా పెట్టుకోవాలని, నగదును బ్యాంకుల నుంచి తీసుకెళ్లేటప్పుడు బందోబస్తు ఉండాలని ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని వార్డుల్లో, గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని, ఈ విషయం పంచాయతీ సెక్రెటరీలకు తెలియజేయాలన్నారు. అన్నిచోట్ల బయోమెట్రిక్ డివైసెస్ అవసరమైనన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పెన్షన్ల పంపిణీలో ఎక్కడైనా నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం లబ్ధిదారుల మ్యాపింగ్ 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.* - *ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిపిఓ ప్రభాకర్ రావు, ఆర్డీఓలు జి.వెంకటేష్, వి.శ్రీనివాసులరెడ్డి, ఎంపీడీవోలు, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు..
Jun 29 2024, 07:08