నిజంనిప్పులాంటిది

Jun 25 2024, 20:04

అనుమతుల్లేని ఎస్పిఆర్ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలి

•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు : అయితగోని జనార్దన్ గౌడ్

 బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఎలాంటి అనుమతులు లేకుండా నల్గొండ జిల్లా కేంద్రంలో దేవరకొండ రోడ్ లో ఎస్. పి .ఆర్ హైస్కూల్ పేరుమీద పాఠశాలను చలాయిస్తున్నారు.

దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్న పాఠశాల యజమానియం పైన చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని విద్యాశాఖ అధికారి గారిని కోరుతున్నాము.

తన ఇష్టానుసారంగా ప్రవేట్ పాఠశాలలను నెలకొల్పి పేద విద్యార్థుల నుండి లక్షల రూపాయలను దండుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాము జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చాలాఇస్తున్నారు.

తక్షణమే జిల్లా కలెక్టర్ గారు చరువచూపి ఇలాంటివి ఎక్కడున్నా తక్షణమే సీజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం.

ఈ కార్యక్రమంలో బిసి రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి ,విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్ ,సహదేవ్, ప్రమోద్, మహేష్ ,పృద్వి, సాయి ,రామ్ చరణ్ ,మల్లికార్జున్ ,హరికృష్ణ ,తరుణ్, రవి ,రాజు తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 25 2024, 11:30

వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్న పవన్ కల్యాణ్

అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఈరోజు నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు.

11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో భాగంగా పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు..

గత ఏడాది జూన్‌లో పవన్‌ వారాహి విజయ యాత్ర చేపట్టారు.

ఆ యాత్ర సందర్భంలోనూ అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు..

నిజంనిప్పులాంటిది

Jun 25 2024, 11:08

నేటి నుంచి చంద్రబాబు కుప్పం టూర్

నేటి నుంచి రెండు రోజుల పాటు సిఎం చంద్రబాబు కుప్పం టూర్ ఉండనుంది. ఇవాళ మ.12.30 గం. లకు పి ఈ ఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్, కుప్పంకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు..

మ.12.55 గం. శాంతిపురం జల్లిగానిపల్లి గ్రామం నందు లకు హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ పరిశీలన చేస్తారు.

మ.1.35 గం. లకు శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి గ్రామంలో హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ పరిశీలన…. మ.02.10 గం. లకు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో విరామం తీసుకుంటారు. ఇక మ.3.00 గం. లకు ఎన్ టి ఆర్ విగ్రహం కూడలి, కుప్పం-బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. సా.4.35 గం. లకు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహం పార్టీ నేతలతో సమావేశంలో పాల్గొంటారు.

26న (బుధవారం) కార్యక్రమాలు . .

బుధవారం రోజు ఉ.10.30 గం. లకు - ఆర్ అండ్ బి అతిథి గృహం, కుప్పం – ప్రజా ఫిర్యాధుల స్వీకరణలో పాల్గొంటారు చంద్రబాబు. మ.12 గం. లకు - గవర్నమెంట్ డిగ్రీ కళాశాల (పి ఈ ఎస్ కళాశాల సమీపం లో), కుప్పం- నియోజకవర్గ పరిధి అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మ.02.35 గం. లకు - పి ఈ ఎస్ మెడికల్ కాలేజీ - పార్టీ శ్రేణులతో మీటింగ్ ఉంటుంది. సా.4.10 – పి ఈ ఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్, కుప్పం నుండి ముఖ్యమంత్రి తిరోగమనం చేస్తారు.

నిజంనిప్పులాంటిది

Jun 24 2024, 11:54

సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ!

విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభినందనలు

మెగా డిఎస్సీ విధివిధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం

అమరావతి: రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ - 208 చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.

మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలిసంతకం చేసి, కేబినెట్ కు పంపారు. పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా

మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎస్.సవిత, టీజీ భరత్, మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ వేమూరి రవికుమార్,

తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, ప్రధాన కార్యదర్శి రవినాయుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం, మాజీ ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, ఏఎస్ రామకృష్ణ, బుద్ధా నాగ జగదీష్, అంగర రామ్మోహన్ రావు, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ నాగుల్ మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jun 24 2024, 10:55

ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం. సూపర్‌-6 పథకాల అమలుపై చర్చించనున్న కేబినెట్‌.

పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై చర్చించనున్న మంత్రివర్గం. 

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం. 

బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్య అంశాలపై దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు.

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Jun 24 2024, 10:54

నేడు లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మెహతాబ్‌ ప్రమాణ స్వీకారం

నేడు లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌ గా భర్తృహరి మెహతాబ్‌ ప్రమాణ స్వీకారం చేయను న్నారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి తో ప్రమాణస్వీకారం చేయిస్తారు. 

అనంతరం తొలుత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఎంపీల తో లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించను న్నారు. 

నేడు, రేపు లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకారం పర్వం కొనసాగనుంది. ఈనెల 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్య వాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం వచ్చే నెల 3వ తేదీన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి. 

వర్షాకాల సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

నిజంనిప్పులాంటిది

Jun 23 2024, 20:40

రేపు సినీ నిర్మాతలతో పవన్ భేటీ ‼️

- ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తో సినీ నిర్మాతలు సోమవారం భేటీ కానున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) తో సినీ నిర్మాతలు సోమవారం భేటీ కానున్నారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం ఈ భేటీ జరుగనుంది.

సినీ నిర్మాతలు (Movie producers ) అశ్వినీదత్‌, చినబాబు, నవీన్‌, రవిశంకర్‌, నాగవంశీ, విశ్వప్రసాద్‌, బోగవల్లి ప్రసాద్‌, డివివి.దానయ్య, ఫిల్మ్‌ ఛాంబర్ అధ్యక్షుడు దిల్‌రాజు, దామోదరప్రసాద్‌ తదితరులు కలువనున్నారు.

చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకురానున్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు వెసులుబాటు, థియేటర్ల సమస్యల వాటిపై చర్చించే అవకాశముంది. చిత్ర పరిశ్రమకు చెందిన పవన్‌కల్యాణ్‌ నటుడిగా ఎదిగి రాజకీయ రంగ ప్రవేశం చేసి , డిప్యూటీ సీఎం(Deputy CM) స్థాయికి ఎదిగినందుకు గాను అభినందనలు తెలియజేయడానికి కూడా నిర్మాతలు మొదటిసారి పవన్‌ను కలువనున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(YS Jagan) ను నేరుగా నటుడు చిరంజీవి ఆధ్వర్యంలో నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్‌, నిర్మాతలు దిల్‌రాజ్‌ కలిసి సమస్యలను విన్నవించారు. అప్పటి మంత్రుల వ్యవహారశైలీతో ప్రముఖ నటులు తమ చిత్రాల విడుదల సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనుకూలమైన వ్యక్తులకు ఆంక్షల సడలింపు, వ్యతిరేకంగా కనిపించిన వారికి ఆంక్షలు విధించి విమర్శల పాలయ్యారు.

నిజంనిప్పులాంటిది

Jun 23 2024, 20:35

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ !

- నామినేటెడ్ పోస్టుల పై కసరత్తు 

- మంత్రి వర్గంలో చోటు దక్కేది ఎవరికో ?

- రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ల మధ్య ఉత్కంఠ 

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు ఢిల్లీ (Delhi tour)వెళ్లనున్నారు. నామినేటెడ్ పోస్టులు, మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వంటి అంశాల‌పై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది.

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించకపోవడంతో నామినేటెడ్‌ పోస్టుల (Nominated posts) భర్తీని పునస్సమీక్షించాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు సమాచారం. సీనియార్టీ ప్రాతిపదికన కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్టు తెలిసింది.

అలాగే తమతో చర్చించకుండానే నామినేటెడ్‌ పోస్టులు ప్రకటించారని మంత్రులు, ముఖ్యనేతలు, ఎమ్మె ల్యేలు కొందరు సీఎం రేవంత్‌ రెడ్డిపై అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల ఆధారంగా వీటిలో మార్పుచేర్పులు ఉంటాయని అధిష్ఠానం అప్పుడు వారికి హామీ ఇచ్చింది. అలాగే మంత్రి పదవులను కూడా ఆశించే వారి సంఖ్య భారీగా ఉండటంతోఈ నేపథ్యంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

నిజంనిప్పులాంటిది

Jun 23 2024, 20:31

కావేరీ సీడ్స్‌ లాభంలో క్షీణత ‼️

- గతంలో ముడింతల్లో లాభాలు 

- కేసిఆర్ బంధువుల సీడ్స్ అంటూ ప్రచారం 

- తగ్గుతున్న ప్రాధాన్యత

ప్రముఖ విత్తనాల సంస్థ కావేరీ సీడ్స్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 69 శాతం తగ్గి రూ.11.78 కోట్లకు పరిమితమైంది.

క్రితం ఏడాది ఇది రూ.38.08 కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.144 కోట్ల నుంచి రూ.142.63 కోట్లకు తగ్గింది.

నిర్వహణ ఖర్చులు 3.50 శాతం పెరిగి రూ.140.86 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో గండిపడిందని కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించారు. ముడి సరుకుల ధరలు 42 శాతం పెరగడం, ఉద్యోగుల ప్రయోజనాల 28 శాతం పెరగడం కూడా లాభాలపై ప్రభావం చూపాయి. కంపెనీ షేరు ధర 6.35 శాతం తగ్గి రూ.670 వద్ద నిలిచింది.

నిజంనిప్పులాంటిది

Jun 23 2024, 20:26

పార్టీకి గంగుల కమలాకర్ గుడ్ బై ?

-జోరుగా సాగుతున్న ప్రచారం

- అసెంబ్లీ లాబీల్లో కవ్వంపల్లి వాఖ్యలతో కలకలం

- ప్రతిష్ట దిగజార్చేందుకే తప్పుడు ప్రచారమంటున్న గంగుల కమలాకర్‌

మాజీ మంత్రి, కరీంనగర్‌ శాసనసభ్యుడు గంగుల కమలాకర్‌ బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నది. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఈ ప్రచారం కలవరం కలిగిస్తున్నది. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యం మాజీ మంత్రి, కరీంనగర్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు అత్యంత కీలకమైన నేత పార్టీని వీడనున్నారని వస్తున్న సమాచారం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. 

కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలను అందులో ముఖ్యంగా శాసనసభ్యులను పార్టీలో చేర్చుకొని బీఆర్‌ఎస్‌ను నామమాత్రపు పార్టీగా మార్చాలనే ఆలోచనతో ఉందని ఆ దిశగా సాగిన మొదటి ప్రయత్నంగా పోచారం పార్టీ మార్పిడిని పేర్కొంటున్నారు. ప్రస్తుతం గంగులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కీలక వికెట్‌ను పడగొట్టాలని కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కొద్దిరోజులుగా గంగుల కమలాకర్‌ బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగినా కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సర్వం సిద్ధమైందని శనివారం వార్తలు వచ్చాయి.

అసెంబ్లీ లాబీల్లో కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మానకొండూర్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ మీడియాతో చిట్‌చాట్‌ చేస్తూ కమలాకర్‌ త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారని వాఖ్యానించడంతో ఈ ప్రచారం ఊపందుకున్నది.

కరీంనగర్‌ అసెంబ్లీ స్థానాన్ని, పార్లమెంట్‌ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ పెద్దలు జిల్లా కేంద్రంలో బలమైన నేతగా ఉన్న కమలాకర్‌ను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్‌ ఎన్నికల్లో ముఖ్యంగా కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో చేదు అనుభవం పునరావృతం కాకుండా చూసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తాను కాంగ్రెస్‌లో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన శనివారం ‘కోకిల డిజిటల్ మీడియా ' తో మాట్లాడుతూ తనను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేసేందుకే రాజకీయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కొంత కాలం బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం చేసి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని అంటున్నారని అన్నారు. తాను ఏ పార్టీకి వెళ్లేది లేదని, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సోమవారమే కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం అంటూ ప్రచారం చేస్తున్నారని, తాను ఆదివారమే విదేశాలకు వెళ్తున్నానని తెలిపారు.