నీట్ యూజీ 2024 పరీక్ష రద్దుచేయకుంటే బిజెపి ప్రజా ప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తాం:PYL జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్

నీట్ యూజీ 2024 పరీక్ష రద్దుచేయకుంటే బిజెపి ప్రజా ప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తాం:PYL జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్

  

తెలంగాణలో జూన్ 4 మంగళవారం విడుదలైన నీట్ యూజీ 2024 ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయని,67 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకును సాధించారని నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఎన్.టి.ఎ)ప్రకటించింది.

ఈ సందర్బంగా ప్రగతిశీల యువజన సంఘం PYL జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ దీనిలో 8 మంది విద్యార్థులు ఒకే సెంటర్ కు చెందిన వాళ్లు ఉండడం గమనార్హం. అదేవిధంగా పరీక్షలో

కొంతమంది విద్యార్థులు 718,719 మార్కులు సాధించారు. నీట్ పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, అదేవిధంగా తప్పుడు సమాధానికి ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 720 పూర్తి మార్కులు సాధించిన విద్యార్థులు 68 మంది ఉన్నప్పుడు దాని తర్వాత వచ్చే ర్యాంకుల విద్యార్థులు వారి పూర్తి స్కోరు  ఒక ప్రశ్నకు సమాధానం అసలే ఇవ్వకపోతే 716 మార్కులు సాధించి ఉండాలి. లేదా ఒక ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇస్తే 715 మార్క్ లు వచ్చి ఉండాలి.

కానీ తర్వాతి ర్యాంకులలో వచ్చిన విద్యార్థులు 719,718 మార్కులు సాధించారని ఎన్.టి.ఎ ప్రకటించిన ఫలితాలల్లో వెళ్లడవుతుంది. అంటే మార్కుల ప్రకటనలో ఎన్.టి.ఎ డొల్లతనాన్ని తెలియజేస్తుంది.

 పరీక్ష నిర్వహణ సమయంలో సమయం కోల్పోయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులను కలిపామని అందుకే 719, 718 మార్కులు కూడా రావచ్చు అని ఎన్.టి.ఎ ప్రకటించింది. కానీ దేని ఆధారంగా, ఏ మెథడ్స్ ను ఉపయోగించి గ్రేస్ మార్కులు ఇచ్చారో స్పష్టత లేదు. 

 దేశవ్యాప్తంగా విద్యార్థులు నేడు ఒకే సెంటర్ నుండి 68 మంది టాపర్లు ఎందుకు ఉన్నారు, పాట్నా ,గుజరాత్ ఇంకా అనేక ప్రాంతాల్లో పేపర్ లీక్ అయిందని విద్యార్థులు,తల్లిదండ్రులు ఆందోళన గురవుతున్నారు. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద పరీక్ష స్కామ్ గా మారింది. ఈ స్కామ్ వల్ల డాక్టర్ చదువుదామనే లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. 

 ఎన్.టి.ఎ నిర్వహించిన అన్ని పరీక్షలు ఇలాగే ఉంటున్నాయి. గత సంవత్సరం సి.యు.ఈ.టి పీ.జీ ప్రవేశాల ప్రక్రియలో కూడా  ఎన్.టి.ఎ ఇలానే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.  

 దేశంలో వివిధ యూనివర్సిటీలకు ఒకే పరీక్ష విధానం పెట్టడం సరైనది కాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వివిధ పరీక్షలను సెంట్రలైజేషన్ చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్.టి.ఎ)ను తీసుకొచ్చింది. ఇది నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ప్రవేశ పరీక్షలన్నీ సెంట్రలైజేషన్ చేయడంలో భాగం. దీని ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పేద, బడుగు ,బలహీన వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే. దేశవ్యాప్తంగా వస్తున్న విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని పరీక్షను వెంటనే రద్దుచేసి తిరిగి నిర్వహించాలని ప్రగశీల యువజన సంఘం PYL జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో నూతనంగా ఎన్నికైన బిజెపి ఎం.పి, కేంద్ర మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇర్ప జయలక్ష్మి కొరసా నందిని సబ్కా చందు తదితరులు పాల్గొన్నారు.

నల్గొండకు నూతనంగా విచ్చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డికి మోడీ పుస్తకాన్ని బహకరించి స్వాగతం పలికిన బిజెపి నాయకులు

నల్గొండకు నూతనంగా విచ్చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డికి బిజెపి నాయకులు మోడీ పుస్తకాన్ని బహకరించి స్వాగతం పలకడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వీరెల్లి చంద్రశేఖర్ , సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రభారి, నల్లగొండ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మిర్యల వెంకటేశం, కిసాన్ మోర్చ నాయకులు బొబ్బిలి శ్రీనివాసరెడ్డి యువమోర్చ నాయకులు అనిల్ తది తరులు పాల్గొన్నారు.

చేనేత సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి...వస్త్రాల నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలి..

చేనేత సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి

వస్త్రాల నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలి

  

 రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వనం శాంతి కుమార్ గంజి మురళీధర్ డిమాండ్ చేశారు

      

సోమవారం దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మనదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న చేనేత రంగాన్ని కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా కాస్తో కూస్తో చేనేతకు ఉపయోగపడే హ్యాండ్లూమ్ బోర్డును, పవర్లూమ్ బోర్డ్ ను, మహాత్మా గాంధీ బున్కల్ యోజన పథకాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. చేనేత వస్త్రాలపై రంగులు రసాయనాలు నూలు కొనుగోలు చేయడానికి జీఎస్టీ విధించి మరింత ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. 2013 ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘాల ఎన్నికలు ఐదు సంవత్సరాల కాలపరిమితి ముగిసిన ఆరు నెలలకు ఒకసారి పర్సనల్ ఇన్చార్జిల నియమించి పొడిగించడం పొడిగించుకుంటూ ఇప్పటికి 9 సార్లు పొడిగించడం వలన సహకార సంఘాలు నిర్వీర్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా అన్ని సంఘాలకు సహకార ఎన్నికల నిర్వహించి బడ్జెట్లో నిధులు కేటాయించి సంఘాల బలవపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాల మరియు మాస్టర్ వీవర్స్ దగ్గర కోట్లాది రూపాయల విలువ కలిగిన వస్త్రాలు నిలువలు పేరుకపోయాయని మగ్గాలు నడపలేక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో చేనేత వస్త్రాల కొనుగోలు ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్ ఫoడ్, చేనేత మిత్ర పథకాలకు నిధులు కేటాయించి షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ సిబ్బంది యూనిఫామ్ లకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, గురుకులాలు ,ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫారాలకు చేనేత వస్త్రాలు అందజేసి చేనేత కార్మికులకు పని కల్పించి ఆదుకోవాలని కోరారు. చేనేత కార్మికులకు వర్క్ షెడ్ తో కూడిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, చేనేత సహకార సంఘాలకు, చేనేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి వెంటనే 80 శాతం సబ్సిడీ ద్వారా రెండు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని కోరారు. చేనేత రంగ అభివృద్ధికి బడ్జెట్లో 2000 కోట్లు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని కోరారు.

     

ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య చేనేత కార్మిక సంఘం నాయకులు రాపోలు రాములు ,రాపోలు వెంకన్న కర్నాటి శ్రీరంగం గడ్డం దశరథ వాలిగొండ మధు బొల్లు రవీంద్ర కుమార్,శివ, తదితరులు పాల్గొన్నారు.

బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం...

బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. రంగపాణి-నిజ్బారి స్టేషన్ల మధ్య గూడ్స్‌ రైలును ఢీకొన్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌.. పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు, ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడివున్న బోగీలు, కొనసాగుతోన్న సహాయక చర్యలు

పశ్చిమ బెంగాల్‌ రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు, కొందరి పరిస్థితి విషమం, ఆస్పత్రిలో చికిత్స, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

తిరుమల:శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం...

తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,870 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 42,119 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4 కోట్లు

ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు...జులై 1న ప్రాథమికంగా నిర్ధారణ...

ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

జులై 1న ప్రాథమికంగా నిర్ధారణ

అనంతరం 20 రోజులపాటు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ

కార్యాచరణ ప్రారంభించిన స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ

సబ్‌రిజిస్ట్రార్లకు మార్గదర్శకాలు

రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా క్షేత్ర స్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేపట్టనుంది. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఈ శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జులై 1న కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను ఖరారు చేయనున్నారు. అనంతరం పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్‌ విలువలను ఖరారు చేస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమలు చేసేలా స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్‌ విలువల సవరణ సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను శనివారం స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సవరించాల్సిన మార్కెట్‌ విలువలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఈ శాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే- ల్యాండ్‌ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు.

గ్రామీణంలో కసరత్తు ఇలా..

   

జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను గుర్తిస్తారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్‌లు తదితర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ భూముల ధరలను లెక్కలోకి తీసుకుని మార్కెట్‌ విలువను సవరిస్తారు.

   

భూముల ధరలు క్రమంగా పెరగడం లేదా తగ్గుతుండటాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారు. జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు ఆ రీతుల్ని గుర్తిస్తారు.

   

వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలు తీసుకుని బహిరంగ మార్కెట్‌ ధరలపై అంచనాకు వస్తారు.

పట్టణ ప్రాంతాల్లో ఇలా..

పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువను నిర్ధారిస్తారు. వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారుల లాంటి ఏరియాల్లో ఆ ప్రాంతానికి అనుగుణంగా విలువను నిర్ణయిస్తారు. కాలనీలు, అంతర్గత రహదారుల ప్రాంతాలు, మౌలిక వసతులు- అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ పాత విలువతో పోల్చి అవసరమైతే సవరిస్తారు. పెంపు లేదా తగ్గింపు కూడా చేపట్టడానికి వీలుంది.

పురపాలక, నగర పాలక సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువను బట్టి క్షేత్రస్థాయి ధరలను ప్రతిబింబించేలా సవరణ చేపడతారు.

కార్యాచరణ ఇలా..

   

రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వే అధికారులతో సమావేశం: 18.6.2024

   

మార్కెట్‌ విలువల సవరణ పూర్తి: 23.6.2024

   

పునస్సమీక్ష : 25.6.2024

   

కమిటీ ఆమోదం : 29.6.2024

   

వెబ్‌సైట్‌లో సవరించిన విలువల ప్రదర్శన : 1.7.2024

   

సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం: 20.7.2024

   

శాఖ వెబ్‌సైట్‌లో కొత్త ధరల అప్‌డేషన్‌: 31.7.2024

   

సవరించిన ధరల అమలు: 1.8.2024 నుంచి.

సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది..

సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల పూర్తి కావడంతో ఉద్యోగ నియామకాల్లో టీజీపీఎస్సీ (TGPSC) దూకుడును పెంచింది. ఇటీవల గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు.. తాజాగా రాష్ట్రంలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 అధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్‌ పోస్టులకు 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పరీక్షలను జూన్‌ 24 నుంచి 29వరకు నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రతి రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్‌ ఆధారిత (CRBT)విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు ప్రారంభం కావడానికి మూడు రోజుల ముందు నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. 

సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది

₹లక్షన్నర జీతం.. సెబీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా?

ఇక పోస్టుల విషయానికి వస్తే.. అత్యధికంగా ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 298 పోస్టులున్నాయి. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్‌-2 మొత్తం 140 పోస్టుల్లో ప్రీమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 87, పోస్టుమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 14, ప్రీమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 26, పోస్టుమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 13 ఖాళీలు ఉన్నాయి.

ఖాళీలు ఇలా...

  గిరిజన సంక్షేమ వసతిగృహ అధికారులు గ్రేడ్‌-1 - 5; గ్రేడ్‌-2 - 106

  ఎస్సీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్‌-2 (మహిళ) - 70; గ్రేడ్‌-2 (పురుషులు) - 228

  బీసీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్‌-2 - 140

  దివ్యాంగుల సంక్షేమశాఖలో వార్డెన్‌ గ్రేడ్‌ -1 - 5; వార్డెన్‌ గ్రేడ్‌-2 - 3

  దివ్యాంగుల సంక్షేమశాఖలో మాట్రన్‌ గ్రేడ్‌-1 - 3; మాట్రన్‌ గ్రేడ్‌-2 - 2

  చిన్నారుల సంరక్షణ గృహాల్లో లేడీ సూపరింటెండెంట్లు - 19

TG:నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..

నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే అవకాశాలు ఉన్నాయి.

ఆదివారం ఈ జిల్లాలతోపాటు ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోనూ కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. మరోవైపు శుక్రవారం పలు జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 7.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలలో 7.1, నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం చీమన్‌పల్లిలో 6.4, జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం మల్కాపూర్‌లో 6.3 సెం.మీ.వర్షం కురిసింది. కామారెడ్డి, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ పలు చోట్ల చినుకులు పడ్డాయి. 

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు..

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు..

పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ అమ్మాయి ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీకి ఆదేశాలు,

నిందితునికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించిన సీఎం.. నారాయణపేట జిల్లా ఉట్కూర్ లో జరిగిన మర్డర్ పై ఆరా

ఏపీ:ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.... ఎవరికి ఏ మంత్రి పదవి అంటే...

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. హోంశాఖ-వంగలపూడి అనిత, చంద్రబాబు-సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, పవన్ కళ్యాణ్- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, అచ్చెన్నాయుడు- వ్యవసాయం.. కొల్లు రవీంద్ర- గనులశాఖ, నాదెండ్ల మనోహర్- పౌరసరఫరాల శాఖ, పొంగూరు నారాయణ- పట్టణాభివృద్ధి, సత్యకుమార్- ఆరోగ్యశాఖ, నిమ్మల రామానాయుడు- జలవనరులు, నారా లోకేశ్- మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలు ఖరారు.

ఫరూక్- మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ, ఆనం రామనారాయణరెడ్డి- దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్- ఆర్థిక, చేనేత, శాసనసభ వ్యవహారాలు, అనగాని సత్యప్రసాద్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్, కొలుసు పార్థసారథి- గృహనిర్మాణం, పౌరసంబంధాలు, డోలా బాలవీరాంజనేయస్వామి- సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టిపాటి రవి- విద్యుత్ శాఖ, బీసీ జనార్దన్ రెడ్డి- ఆర్ అండ్ బీ, టీజీ భరత్- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు, కందుల దుర్గేష్- పర్యావరణం, సాంస్కృతిక శాఖ, రాంప్రసాద్ రెడ్డి- రవాణాశాఖ, క్రీడలు, గుమ్మడి సంధ్యారాణి- మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ, సవిత- బీసీ సంక్షేమం, చేనేత, వాసంశెట్టి సుభాష్- కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్- చిన్న మధ్య తరహా పరిశ్రమలు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కేటాయింపు.