నిజందాగదుక్షణంఆగదు

Jun 17 2024, 07:27

తిరుమల:శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం...

తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,870 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 42,119 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4 కోట్లు

నిజందాగదుక్షణంఆగదు

Jun 17 2024, 06:55

ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు...జులై 1న ప్రాథమికంగా నిర్ధారణ...

ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

జులై 1న ప్రాథమికంగా నిర్ధారణ

అనంతరం 20 రోజులపాటు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ

కార్యాచరణ ప్రారంభించిన స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ

సబ్‌రిజిస్ట్రార్లకు మార్గదర్శకాలు

రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా క్షేత్ర స్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేపట్టనుంది. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఈ శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జులై 1న కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను ఖరారు చేయనున్నారు. అనంతరం పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్‌ విలువలను ఖరారు చేస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమలు చేసేలా స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్‌ విలువల సవరణ సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను శనివారం స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సవరించాల్సిన మార్కెట్‌ విలువలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఈ శాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే- ల్యాండ్‌ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు.

గ్రామీణంలో కసరత్తు ఇలా..

   

జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను గుర్తిస్తారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్‌లు తదితర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ భూముల ధరలను లెక్కలోకి తీసుకుని మార్కెట్‌ విలువను సవరిస్తారు.

   

భూముల ధరలు క్రమంగా పెరగడం లేదా తగ్గుతుండటాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారు. జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు ఆ రీతుల్ని గుర్తిస్తారు.

   

వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలు తీసుకుని బహిరంగ మార్కెట్‌ ధరలపై అంచనాకు వస్తారు.

పట్టణ ప్రాంతాల్లో ఇలా..

పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువను నిర్ధారిస్తారు. వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారుల లాంటి ఏరియాల్లో ఆ ప్రాంతానికి అనుగుణంగా విలువను నిర్ణయిస్తారు. కాలనీలు, అంతర్గత రహదారుల ప్రాంతాలు, మౌలిక వసతులు- అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ పాత విలువతో పోల్చి అవసరమైతే సవరిస్తారు. పెంపు లేదా తగ్గింపు కూడా చేపట్టడానికి వీలుంది.

పురపాలక, నగర పాలక సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువను బట్టి క్షేత్రస్థాయి ధరలను ప్రతిబింబించేలా సవరణ చేపడతారు.

కార్యాచరణ ఇలా..

   

రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వే అధికారులతో సమావేశం: 18.6.2024

   

మార్కెట్‌ విలువల సవరణ పూర్తి: 23.6.2024

   

పునస్సమీక్ష : 25.6.2024

   

కమిటీ ఆమోదం : 29.6.2024

   

వెబ్‌సైట్‌లో సవరించిన విలువల ప్రదర్శన : 1.7.2024

   

సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం: 20.7.2024

   

శాఖ వెబ్‌సైట్‌లో కొత్త ధరల అప్‌డేషన్‌: 31.7.2024

   

సవరించిన ధరల అమలు: 1.8.2024 నుంచి.

నిజందాగదుక్షణంఆగదు

Jun 17 2024, 06:42

సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది..

సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల పూర్తి కావడంతో ఉద్యోగ నియామకాల్లో టీజీపీఎస్సీ (TGPSC) దూకుడును పెంచింది. ఇటీవల గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు.. తాజాగా రాష్ట్రంలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 అధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్‌ పోస్టులకు 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పరీక్షలను జూన్‌ 24 నుంచి 29వరకు నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రతి రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్‌ ఆధారిత (CRBT)విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు ప్రారంభం కావడానికి మూడు రోజుల ముందు నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. 

సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది

₹లక్షన్నర జీతం.. సెబీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా?

ఇక పోస్టుల విషయానికి వస్తే.. అత్యధికంగా ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 298 పోస్టులున్నాయి. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్‌-2 మొత్తం 140 పోస్టుల్లో ప్రీమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 87, పోస్టుమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 14, ప్రీమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 26, పోస్టుమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 13 ఖాళీలు ఉన్నాయి.

ఖాళీలు ఇలా...

  గిరిజన సంక్షేమ వసతిగృహ అధికారులు గ్రేడ్‌-1 - 5; గ్రేడ్‌-2 - 106

  ఎస్సీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్‌-2 (మహిళ) - 70; గ్రేడ్‌-2 (పురుషులు) - 228

  బీసీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్‌-2 - 140

  దివ్యాంగుల సంక్షేమశాఖలో వార్డెన్‌ గ్రేడ్‌ -1 - 5; వార్డెన్‌ గ్రేడ్‌-2 - 3

  దివ్యాంగుల సంక్షేమశాఖలో మాట్రన్‌ గ్రేడ్‌-1 - 3; మాట్రన్‌ గ్రేడ్‌-2 - 2

  చిన్నారుల సంరక్షణ గృహాల్లో లేడీ సూపరింటెండెంట్లు - 19

నిజందాగదుక్షణంఆగదు

Jun 15 2024, 06:21

TG:నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..

నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే అవకాశాలు ఉన్నాయి.

ఆదివారం ఈ జిల్లాలతోపాటు ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోనూ కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. మరోవైపు శుక్రవారం పలు జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 7.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలలో 7.1, నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం చీమన్‌పల్లిలో 6.4, జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం మల్కాపూర్‌లో 6.3 సెం.మీ.వర్షం కురిసింది. కామారెడ్డి, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ పలు చోట్ల చినుకులు పడ్డాయి. 

నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 21:22

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు..

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు..

పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ అమ్మాయి ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీకి ఆదేశాలు,

నిందితునికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించిన సీఎం.. నారాయణపేట జిల్లా ఉట్కూర్ లో జరిగిన మర్డర్ పై ఆరా

నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 21:06

ఏపీ:ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.... ఎవరికి ఏ మంత్రి పదవి అంటే...

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. హోంశాఖ-వంగలపూడి అనిత, చంద్రబాబు-సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, పవన్ కళ్యాణ్- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, అచ్చెన్నాయుడు- వ్యవసాయం.. కొల్లు రవీంద్ర- గనులశాఖ, నాదెండ్ల మనోహర్- పౌరసరఫరాల శాఖ, పొంగూరు నారాయణ- పట్టణాభివృద్ధి, సత్యకుమార్- ఆరోగ్యశాఖ, నిమ్మల రామానాయుడు- జలవనరులు, నారా లోకేశ్- మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలు ఖరారు.

ఫరూక్- మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ, ఆనం రామనారాయణరెడ్డి- దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్- ఆర్థిక, చేనేత, శాసనసభ వ్యవహారాలు, అనగాని సత్యప్రసాద్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్, కొలుసు పార్థసారథి- గృహనిర్మాణం, పౌరసంబంధాలు, డోలా బాలవీరాంజనేయస్వామి- సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టిపాటి రవి- విద్యుత్ శాఖ, బీసీ జనార్దన్ రెడ్డి- ఆర్ అండ్ బీ, టీజీ భరత్- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు, కందుల దుర్గేష్- పర్యావరణం, సాంస్కృతిక శాఖ, రాంప్రసాద్ రెడ్డి- రవాణాశాఖ, క్రీడలు, గుమ్మడి సంధ్యారాణి- మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ, సవిత- బీసీ సంక్షేమం, చేనేత, వాసంశెట్టి సుభాష్- కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్- చిన్న మధ్య తరహా పరిశ్రమలు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కేటాయింపు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 08:58

కుల, మత రహితంగా పాఠశాల రికార్డుల తయారీపై కౌంటరు దాఖలు చేయండి...రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం...

కుల, మత రహితంగా పాఠశాల రికార్డుల తయారీపై కౌంటరు దాఖలు చేయండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: పాఠశాల అడ్మిషన్, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లలో కుల, మత ప్రస్తావన లేకుండా రికార్డులు రూపొందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానమేమిటో తెలియజేస్తూ మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలంటూ గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటరు దాఖలుకు మరోసారి గడువు కోరరాదని పేర్కొంది. పాఠశాల సర్టిఫికేట్లలో తల్లిదండ్రుల కులం, మతం పేర్కొనాలన్న నిబంధనను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన డి.వి.రామకృష్ణ, మరొకరు 2017లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేయడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. దీనిపై ఇప్పటికే కేంద్రం కౌంటరు దాఖలు చేస్తూ.. జనాభా గణన సమయంలో కుల, మతాల వారీగా సేకరించిన గణాంకాలు నిత్య జీవితంలో, పాఠశాల రికార్డుల్లో ఎందుకూ ఉపయోగపడవని వివరణ ఇచ్చింది. అయితే వాటిని ఉంచాలా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయమని తెలిపింది.

నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 08:46

ఏపీ: పింఛన్ పథకానికి పేరు మార్పు...

అమరావతి: పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ.. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు..

నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 08:41

కువైట్‌ అగ్నిప్రమాద ఘటనలో 45 మంది భారతీయులు మృతి.. వారి వివరాలు ఇలా..

కువైట్‌ అగ్నిప్రమాద ఘటనలో 45 మంది భారతీయులు మృతి

మృతదేహాలను తరలించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాట్లు

కువైట్‌ చేరుకున్న వాయుసేన విమానం

కువైట్‌ నుంచి కొచ్చి, ఢిల్లీ చేరుకోనున్న విమానం

కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు..

ఏపీకి చెందిన ముగ్గురు, యూపీకి చెందిన ముగ్గురు మృతి

ఒడిశా, బిహార్, పంజాబ్,కర్నాటక, బెంగాల్,జార్ఖండ్‌..

మహారాష్ట్ర, హర్యానాకు చెందిన ఒక్కొక్కరు మృతి

కువైట్‌ అగ్నిప్రమాద మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు

ప.గో. జిల్లాకు చెందిన ఈశ్వరుడు, సత్యనారాయణ..

శ్రీకాకుళం వాసి లోకనాథం మృతి చెందినట్లు గుర్తింపు

నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 08:31

వాళ్లుఅర్హులా?... అనర్హులా...? గురుకుల నియామకాలపై తర్జనభర్జన..

వాళ్లుఅర్హులా?... అనర్హులా...?

గురుకుల నియామకాలపై తర్జనభర్జన

విద్యార్హతల నిర్ధారణపై ట్రిబ్‌కు అస్పష్టత

కోర్టుకు బాటనీ జేఎల్‌ అభ్యర్థులు

అర్హతలపై విద్యామండలికి ట్రిబ్‌ లేఖ

3 నెలలుగా అభ్యర్థుల ఎదురుచూపులు

హైదరాబాద్‌, జూన్‌13: తెలంగాణ గురుకుల విద్య సంస్థ నియామక మండలి (ట్రిబ్‌) నోటిఫికేషనలో ఒకటి పేర్కొని, నియామక ప్రక్రియలో మరోవిధంగా నడుచుకొన్నదని అభ్యర్థులు మండిపడుతున్నారు. పలు పోస్టుల విద్యార్హతలకు సంబంధించి దేనిపైనా స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు కోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు బోర్డు మాత్రం అభ్యర్థులు లేవనెత్తిన ఆయా విద్యార్హతల అంశాలపై ఉన్నత విద్యామండలికి లేఖ రాసి చేతులు దులుపుకొన్నది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మూడునెలలుగా సదరు అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు.

నోటిఫికేషన్‌కు విరుద్ధంగా జేఎల్‌ బాటనీ

ట్రిబ్‌ 160 బాటనీ జేఎల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ సమయంలో ఆ పోస్టులకు బాటనీతోపాటు బయోటెక్నాలజీ, మైక్రోబయోలజీ, మెరైన్‌ బయోలజీ, బయో సైన్స్‌, మాడ్రన్‌ బయోలజీ, ప్లాంట్‌ సైన్స్‌లో ఎమ్మెస్సీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులని ట్రిబ్‌ పేర్కొన్నది. ఈ మేరకు జేఎల్‌ పోస్టులకు సంబంధించి 1ః2 మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. డెమోలకు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. ఎంఎస్సీతోపాటు డిగ్రీలో కూడా బాటనీ చదివి ఉండాలంటూ అనేక మంది అభ్యర్థులను కనీసం డెమోకు కూడా ట్రిబ్‌ అనుమతించలేదు. నోటిఫికేషన్‌కు విరుద్ధంగా మైక్రోబయోలజీ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి చేసిన వారే జేఎల్‌ బాటనీకి అర్హులని కొంతమంది అభ్యర్థులను తిరస్కరించింది. అటు తరువాత తుది జాబితాను ప్రకటించింది. దీంతో బాధిత అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అయితే వాదనలు విన్న అనంతరం నోటిఫికేషన్‌ ప్రకారం జేఎల్‌ బాటనీ పోస్టుకు యూనివర్సిటీతో సంబంధం లేకుండా మైక్రో బయోలజీ అభ్యర్థులు కూడా అర్హులని ఎంపిక చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఈ తీర్పు అనంతరం ఇదే తరహా అభ్యర్థనతో మరికొందరు కోర్టును ఆశ్రయించగా, అందుకు అవే ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు వెల్లడించింది. ఇదే తరహాలో మరికొంత మంది సైతం వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఇప్పటికే కోర్టు ను ఆశ్రయించారు. దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఈ విద్యార్హతలకు సంబంధించి ట్రిబ్‌ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. విద్యార్హతలను తేల్చాలని కోరుతూ ఉన్నత విద్యామండలికి లేఖరాశామని, వారి మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తామని ట్రిబ్‌ అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఈ అంశం ఎటూ తేలకపోవడంతో దాదాపు 3 నెలలుగా అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. మరోవైపు ఆయా సొసైటీలు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్‌ ఇచ్చే ప్రక్రియను చేపడుతున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ఈ అంశాన్ని తేల్చాలని ట్రిబ్‌ను డిమాండ్‌ చేస్తున్నారు.