ప్రజా సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం.. శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
ప్రజా సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం.. శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబు గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు సంతకాలు చేసిన సందర్భంగా శింగనమల నియోజకవర్గ పరిధిలోని శింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలుపుతూ, అభినందన సభా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మెగా డియస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ రూ.4,000 పెంపు, నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ అమలుకు సంతకాలు చేసిన చంద్రబాబు గారికి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లుగా చీకట్లో ఉన్న రాష్ట్రానికి ఇప్పుడే చంద్రబాబు గారి రూపంలో వెలుగు వచ్చిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు గారు ఐదు హామీల మీద సంతకాలు చేశారు. జగన్ నిరంకుశత్వానికి నిదర్శనం.. అన్న క్యాంటీన్ల మూసివేత, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక పిచ్చి తుగ్లక్ చర్య గా పేర్కొన్నారు. అందుకే చంద్రబాబు గారు ఆ చట్టాన్ని రద్దు చేశారని బండారు శ్రావణి శ్రీ గారు పేర్కొన్నారు. పింఛన్ల పెంపు తో అవ్వా తాతలు, నిరాశ్రయులు, దివ్యంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు బండారు శ్రావణి శ్రీ గారు తెలిపారు.
Flash.. Flash.. అడ్డదారులలో (Edify) ఎడిఫై స్కూలుకు అనుమతులు మంజూరు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి..
అడ్డదారులలో ఎడిఫై స్కూలుకు అనుమతులు మంజూరు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి..

అపార్ట్మెంట్లలో విద్యాసంస్థలకు అనుమతులు మంజూరు చేస్తున్న డిప్యూటీ డిఈఓ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలి* *పది సంవత్సరాల నుంచి అనంతపురంలో తిష్ట వేసిన ఎంఈఓ వెంకటస్వామిని విధులనుండి తొలగించాలి* *అపార్ట్మెంట్లో నడుపుతున్న భాష్యం స్కూల్ ను సీజ్ చేయాలి* *కార్పొరేట్ విద్యాసంవత్సర పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి* *విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పార్వతి గారికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి* *అనంతపురం: అనంతపురం నగరంలో అనుమతులు లేకుండా నడుపుతున్న విద్యాసంస్థలపై కాసులకు కక్కుర్తి పడి అపార్ట్మెంట్లలో మరియు బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నప్పటికీ విద్యాసంస్థలకు అనుమతులు మంజూరు చేసిన జిల్లా డిప్యూటీ డిఇఓ శ్రీనివాసరావు గారిని ఎంఈఓ వెంకటస్వామి గారిని విధుల నుంచి తొలగించాలని ఈరోజు విజయవాడలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో విద్యాశాఖ డైరెక్టర్ పార్వతి గారికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుల్లాయిస్వామి మాట్లాడుతూ అనంతపురం నగరంలో నిర్మాణంలో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సీబీఎస్సీ కేం బ్రిడ్జ్ కోర్స్ తో నడుపుతున్న ఎడిఫై వరల్డ్ స్కూల్ కు అనుమతులు మంజూరు జారీ చేసిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో అపార్ట్మెంట్లలో మరియు నిర్మాణంలో ఉన్న బిల్డింగులలో విద్యాసంస్థలకు కాసులకు కక్కుర్తి పడి అనుమతులు మంజూరు జారీ చేసిన డిప్యూటీ డిఈఓ శ్రీనివాసరావు గారిని ఎంఈఓ వెంకటస్వామి గారిని విధుల నుండి తొలగించాలని పేర్కొన్నారు.. అనంతపురం నగరంలోనే దాదాపు పది సంవత్సరాల నుంచి ఎంఈఓగా వెంకటస్వామి గారు ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. తక్షణమే ఎంఈఓ వెంకటస్వామిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బిల్డింగ్ నిర్మాణంలో జరుగుతున్నప్పటికీ భాష్యం స్కూల్ కి జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా అనుమతులు మంజూరు జారీ చేశారని పేర్కొన్నారు. తక్షణమే భాష్యం స్కూల్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత నెల రోజులుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇప్పటికైనా అనుమతులు లేకుండా నడుపుతున్న విద్యాసంస్థల పైన ఒక అనుమతి తీసుకొని మూడు నాలుగు బ్రాంచ్లు నడుపుతున్న విద్యాసంస్థల పైన పాఠ్యపుస్తకాల అమ్ముతున్న విద్యాసంస్థలపైన చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నాసర్ జి, మస్తాన్,వలరాజు,బండి చలపతి, షాబీర్ భాష తదితరులు పాల్గొన్నారు*
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయండి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయండి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, జూన్ 12 : *బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బాల కార్మిక నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు.* *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరూ పనిలో ఉండకూడదని, ప్రతి ఒక్కరూ బడిలో ఉండాలని సూచించారు ‌. జిల్లాలో ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. చైల్డ్ లేబర్ గా పని చేస్తూ ఎక్కడైనా షాప్స్ లో, ఇతర ఇల్లు నందు దొరికిన పిల్లలను తిరిగి వారిని స్కూల్లో చేర్పించి పనిలో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవానికి సంబంధించి సంబంధిత అధికారులను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆయా అధికారులను కలుపుకొని ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆయా శాఖల వారితో విడుదల చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి B. N శ్రీదేవి, జిల్లా బాలల పరిరక్షణ సమితి అధికారి మంజునాథ్, ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వరి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ కృష్ణమాచారి, జిల్లా చైల్డ్ లేబర్ అధికారి లక్ష్మీనరసయ్య, రఘురాములు, ఇతర సిబ్బంది వసంత, కమలాక్షి, ఇర్ఫాన్, సుహాసిని పాల్గొన్నారు..

అపార్ట్మెంట్లలో స్కూల్ ను నడుపుతున్న భాష్యం స్కూల్ ను సీజ్ చేయాలి, నగరంలో విచ్చలవిడిగా పాఠశాలలకు అనుమతులు ఇచ్చిన డిప్యూటీ DEO ను సస్పెండ్ చేయాలి
అపార్ట్మెంట్లలో స్కూల్ ను నడుపుతున్న భాష్యం స్కూల్ ను సీజ్ చేయాలి.. పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్న భాష్యం పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.. సెలవు దినాలలో తరగతులు నిర్వహిస్తున్న భాష్యం పాఠశాల.. నగరంలో విచ్చలవిడిగా పాఠశాలలకు అనుమతులు ఇచ్చిన డిప్యూటీ డిఇఓ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలి..

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లలో నడుపుతున్న భాష్యం స్కూల్ ను సీజ్ చేయాలని ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భాష్యం పాఠశాల దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనుమల నరేష్ ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి పృథ్వి వి ఎన్ ఐ వి రాష్ట్ర కార్యదర్శి వినోద్ కుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రమణయ్య ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఓబులేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ అనంతపురం నగరంలో అపార్ట్మెంట్లలో విద్య సంస్థలు నడుపుతున్న భాష్యం స్కూల్లో సీట్ చేయాలని డిమాండ్ చేశారు. కమర్షియల్ బిల్డింగ్లలో నడుపుతున్న వాటికి గ్రౌండ్ లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇష్టానుసారంగా విద్యాసంస్థలకు అనుమతులు మంజూరు చేస్తున్న డిప్యూటీ డిఈఓ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.. భాష్యం పాఠశాలలో పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేసిన స్పందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధన తుంగలో తొక్కుతూ రకరకాల కోర్సులు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క కోర్టుకు ఒక్కొక్క ఫీజు చొప్పున విద్యాసంస్థల వసూలు చేస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలిసిన చూసీచూడనట్టు వివరిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారుల పైన మండిపడ్డారు.. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు పట్టికను నగరంలో ఏ విద్యాసంస్థలు పాటించకుండా ఆ ఫీజు పట్టికను తుంగలో తొక్కుతున్నారని పేర్కొన్నారు ..సెలవు దినాలలో తరగతులు నిర్వహిస్తున్న భాష్యం స్కూల్ ను సీజ్ చేయాలని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు చేస్తు, నిబంధనలను తుంగలో తొక్కుతూ పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న అపార్ట్మెంట్లో నడుపుతున్న భాష్యం స్కూల్ ను వెంటనే సీట్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు హనుమంతు రాయుడు వంశీ మంజునాథ్ ఉమా మహేష్ హరికృష్ణ హర్ష శేఖర్ రారాజు ఆనంద్ నిశాంత్ కార్తీక్ యశ్వంత్ కుమార్ అభి గణేష్ తదితరులు పాల్గొన్నారు*
మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా కేక్ కట్ చేస్తూ సంబరాలు

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఇందిరమ్మ కాలనీ నందు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా కేక్ కట్ చేస్తూ సంబరాలు ఘనంగా జరుపుకున్న ముష్టూరుసాయి శివకుమార్ కులయప్ప వన్నూర్ వలి ప్రదీప్ ఓబుళపతి గణేష్ రాజు కొండ వడ్డెమనోహర్ మరియు కాలనీవాసులు

నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న సింగనమల మండల తెలుగుదేశం నాయకులు..
నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న సింగనమల మండల తెలుగుదేశం నాయకులు.
శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు ఆధ్వర్యంలో గన్నవరం సమీపాన కీసరపల్లి గ్రామంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొన్న అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ టి ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డే నాగభూషణ్ జిల్లా బీసీ సెల్ కార్యనిర్వ కార్యదర్శి కొయ్యగూర పెద్దన్న ఎల్లనూరు మండల పార్టీ కన్వీనర్ దొడ్లో రామాంజనేయులు చెన్నయ్య ప్రతాప్ నెట్టికంటి జయరాం వేణు* తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ యువతకి ఉపాధి హామీ కల్పించడంలో ప్రభుత్వం ముందుంటుందని మంచి పరిపాలన ధ్యేయంగా ముందుకు వెళ్తామని రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీ గారికి చేయడమైనది
బుక్కరాయసముద్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణస్వీకారం ఎల్ఈడి టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం

శ్రీ నారా చంద్రబాబు గారి ప్రమాణస్వీకారం సందర్భంగా బుక్కరాయసముద్రం మండలంలో సచివాలయం దగ్గర ఎల్ఈడి స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని ఎంపీపీ సునీత టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పసుపుల హనుమంత్ రెడ్డి. పొడ్రాళ్ళ రవీంద్ర బుల్లె నారాయణస్వామి తదితర ముఖ్య నాయకులు అధికారులు మరియు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు హాజరు కావడం విశేషం..

మంత్రి పయ్యావుల కేశవ్ గారిని విజయవాడ లో కలసి శుభకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..
రాష్ట్ర మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన శుభ సందర్బంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారిని విజయవాడ లో కలసి శుభకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు,రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ గారు*,రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కూచి హరి గారు మరియు నాయకులు
నార్పల మండల కేంద్రంలో అదుపు తప్పిన ట్రాక్టర్ ముగ్గురికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల క్రీడా మైదానం నందు ట్రాక్టర్ అదుపు తప్పి ప్రమాదం జరగడం వల్ల ముగ్గురికి తీవ్ర గాయాలు... వెంటనే ప్రమాదం జరిగిన చోటికి పోలీస్ లు చేరుకొని గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించడం జరిగింది..
నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతపురం 37 వ డివిజన్ కు చెందిన ముస్లిం మైనార్టీ మహిళ నాయకురాలు నిహా అయేషా
సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో పసుపు ప్రభంజనం సృష్టించి,రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారిని మంగళగిరిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతపురం అర్బన్ నియోజవర్గం 37 వ డివిజన్ కు చెందిన ముస్లిం మైనార్టీ మహిళ నాయకురాలు నిహా అయేషా.. ఈ సందర్భంగా నిహా అయేషా మాట్లాడుతూ:రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు సైకో జగన్ పాలనకు చమర గీతం పాడి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో కుంటు పడిన అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో భాగంగా అనంతపురం నియోజవర్గం అభివృద్ధివైపు అడుగులు వేస్తుందని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురాన్ని సుందరవణంగా తీర్చి దిద్దుతారని తెలియజేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇంతటి ఘన విజయానికి సహకారం అందించిన అర్బన్ నియోజవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..