నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 21:22

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు..

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు..

పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ అమ్మాయి ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీకి ఆదేశాలు,

నిందితునికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించిన సీఎం.. నారాయణపేట జిల్లా ఉట్కూర్ లో జరిగిన మర్డర్ పై ఆరా

నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 21:06

ఏపీ:ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.... ఎవరికి ఏ మంత్రి పదవి అంటే...

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. హోంశాఖ-వంగలపూడి అనిత, చంద్రబాబు-సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, పవన్ కళ్యాణ్- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, అచ్చెన్నాయుడు- వ్యవసాయం.. కొల్లు రవీంద్ర- గనులశాఖ, నాదెండ్ల మనోహర్- పౌరసరఫరాల శాఖ, పొంగూరు నారాయణ- పట్టణాభివృద్ధి, సత్యకుమార్- ఆరోగ్యశాఖ, నిమ్మల రామానాయుడు- జలవనరులు, నారా లోకేశ్- మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలు ఖరారు.

ఫరూక్- మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ, ఆనం రామనారాయణరెడ్డి- దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్- ఆర్థిక, చేనేత, శాసనసభ వ్యవహారాలు, అనగాని సత్యప్రసాద్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్, కొలుసు పార్థసారథి- గృహనిర్మాణం, పౌరసంబంధాలు, డోలా బాలవీరాంజనేయస్వామి- సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టిపాటి రవి- విద్యుత్ శాఖ, బీసీ జనార్దన్ రెడ్డి- ఆర్ అండ్ బీ, టీజీ భరత్- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు, కందుల దుర్గేష్- పర్యావరణం, సాంస్కృతిక శాఖ, రాంప్రసాద్ రెడ్డి- రవాణాశాఖ, క్రీడలు, గుమ్మడి సంధ్యారాణి- మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ, సవిత- బీసీ సంక్షేమం, చేనేత, వాసంశెట్టి సుభాష్- కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్- చిన్న మధ్య తరహా పరిశ్రమలు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కేటాయింపు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 08:58

కుల, మత రహితంగా పాఠశాల రికార్డుల తయారీపై కౌంటరు దాఖలు చేయండి...రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం...

కుల, మత రహితంగా పాఠశాల రికార్డుల తయారీపై కౌంటరు దాఖలు చేయండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: పాఠశాల అడ్మిషన్, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లలో కుల, మత ప్రస్తావన లేకుండా రికార్డులు రూపొందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానమేమిటో తెలియజేస్తూ మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలంటూ గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటరు దాఖలుకు మరోసారి గడువు కోరరాదని పేర్కొంది. పాఠశాల సర్టిఫికేట్లలో తల్లిదండ్రుల కులం, మతం పేర్కొనాలన్న నిబంధనను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన డి.వి.రామకృష్ణ, మరొకరు 2017లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేయడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. దీనిపై ఇప్పటికే కేంద్రం కౌంటరు దాఖలు చేస్తూ.. జనాభా గణన సమయంలో కుల, మతాల వారీగా సేకరించిన గణాంకాలు నిత్య జీవితంలో, పాఠశాల రికార్డుల్లో ఎందుకూ ఉపయోగపడవని వివరణ ఇచ్చింది. అయితే వాటిని ఉంచాలా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయమని తెలిపింది.

నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 08:46

ఏపీ: పింఛన్ పథకానికి పేరు మార్పు...

అమరావతి: పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ.. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు..

నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 08:41

కువైట్‌ అగ్నిప్రమాద ఘటనలో 45 మంది భారతీయులు మృతి.. వారి వివరాలు ఇలా..

కువైట్‌ అగ్నిప్రమాద ఘటనలో 45 మంది భారతీయులు మృతి

మృతదేహాలను తరలించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాట్లు

కువైట్‌ చేరుకున్న వాయుసేన విమానం

కువైట్‌ నుంచి కొచ్చి, ఢిల్లీ చేరుకోనున్న విమానం

కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు..

ఏపీకి చెందిన ముగ్గురు, యూపీకి చెందిన ముగ్గురు మృతి

ఒడిశా, బిహార్, పంజాబ్,కర్నాటక, బెంగాల్,జార్ఖండ్‌..

మహారాష్ట్ర, హర్యానాకు చెందిన ఒక్కొక్కరు మృతి

కువైట్‌ అగ్నిప్రమాద మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు

ప.గో. జిల్లాకు చెందిన ఈశ్వరుడు, సత్యనారాయణ..

శ్రీకాకుళం వాసి లోకనాథం మృతి చెందినట్లు గుర్తింపు

నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 08:31

వాళ్లుఅర్హులా?... అనర్హులా...? గురుకుల నియామకాలపై తర్జనభర్జన..

వాళ్లుఅర్హులా?... అనర్హులా...?

గురుకుల నియామకాలపై తర్జనభర్జన

విద్యార్హతల నిర్ధారణపై ట్రిబ్‌కు అస్పష్టత

కోర్టుకు బాటనీ జేఎల్‌ అభ్యర్థులు

అర్హతలపై విద్యామండలికి ట్రిబ్‌ లేఖ

3 నెలలుగా అభ్యర్థుల ఎదురుచూపులు

హైదరాబాద్‌, జూన్‌13: తెలంగాణ గురుకుల విద్య సంస్థ నియామక మండలి (ట్రిబ్‌) నోటిఫికేషనలో ఒకటి పేర్కొని, నియామక ప్రక్రియలో మరోవిధంగా నడుచుకొన్నదని అభ్యర్థులు మండిపడుతున్నారు. పలు పోస్టుల విద్యార్హతలకు సంబంధించి దేనిపైనా స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు కోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు బోర్డు మాత్రం అభ్యర్థులు లేవనెత్తిన ఆయా విద్యార్హతల అంశాలపై ఉన్నత విద్యామండలికి లేఖ రాసి చేతులు దులుపుకొన్నది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మూడునెలలుగా సదరు అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు.

నోటిఫికేషన్‌కు విరుద్ధంగా జేఎల్‌ బాటనీ

ట్రిబ్‌ 160 బాటనీ జేఎల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ సమయంలో ఆ పోస్టులకు బాటనీతోపాటు బయోటెక్నాలజీ, మైక్రోబయోలజీ, మెరైన్‌ బయోలజీ, బయో సైన్స్‌, మాడ్రన్‌ బయోలజీ, ప్లాంట్‌ సైన్స్‌లో ఎమ్మెస్సీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులని ట్రిబ్‌ పేర్కొన్నది. ఈ మేరకు జేఎల్‌ పోస్టులకు సంబంధించి 1ః2 మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. డెమోలకు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. ఎంఎస్సీతోపాటు డిగ్రీలో కూడా బాటనీ చదివి ఉండాలంటూ అనేక మంది అభ్యర్థులను కనీసం డెమోకు కూడా ట్రిబ్‌ అనుమతించలేదు. నోటిఫికేషన్‌కు విరుద్ధంగా మైక్రోబయోలజీ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి చేసిన వారే జేఎల్‌ బాటనీకి అర్హులని కొంతమంది అభ్యర్థులను తిరస్కరించింది. అటు తరువాత తుది జాబితాను ప్రకటించింది. దీంతో బాధిత అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అయితే వాదనలు విన్న అనంతరం నోటిఫికేషన్‌ ప్రకారం జేఎల్‌ బాటనీ పోస్టుకు యూనివర్సిటీతో సంబంధం లేకుండా మైక్రో బయోలజీ అభ్యర్థులు కూడా అర్హులని ఎంపిక చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఈ తీర్పు అనంతరం ఇదే తరహా అభ్యర్థనతో మరికొందరు కోర్టును ఆశ్రయించగా, అందుకు అవే ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు వెల్లడించింది. ఇదే తరహాలో మరికొంత మంది సైతం వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఇప్పటికే కోర్టు ను ఆశ్రయించారు. దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఈ విద్యార్హతలకు సంబంధించి ట్రిబ్‌ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. విద్యార్హతలను తేల్చాలని కోరుతూ ఉన్నత విద్యామండలికి లేఖరాశామని, వారి మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తామని ట్రిబ్‌ అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఈ అంశం ఎటూ తేలకపోవడంతో దాదాపు 3 నెలలుగా అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. మరోవైపు ఆయా సొసైటీలు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్‌ ఇచ్చే ప్రక్రియను చేపడుతున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ఈ అంశాన్ని తేల్చాలని ట్రిబ్‌ను డిమాండ్‌ చేస్తున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 08:21

TG: ములుగు జిల్లా లో పేలిన మందుపాతర....

ములుగు జిల్లా ఏజెన్సీలో పేలిన మరో మందుపాతర

సుజాత అనే మహిళకు తీవ్రగాయాలు

జోల కట్టి సుజాతను ఆస్పత్రికి తరలించిన స్థానికులు

దైవ దర్శనానికి వెళ్తుండగా పేలిన మందుపాతర

పోలీసులే టార్గెట్‌గా మందుపాతర అమర్చిన మావోయిస్టులు

వెంకటాపురం మండలం చొక్కాల అడవుల్లో ఘటన

నిజందాగదుక్షణంఆగదు

Jun 13 2024, 07:38

ఏపీ: నేడు సచివాలయానికి వెళ్లి బాధ్యతలు చేపట్టనున్న సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: ఇవాళ సాయంత్రం సచివాలయానికి సీఎం చంద్రబాబు.. ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు.. నేడు సచివాలయం మొదటి బ్లాక్‌ చాంబర్‌లో సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ.. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్న సీఎం చంద్రబాబు.. ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్న చంద్రబాబు.. పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్న చంద్రబాబు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 12 2024, 16:54

చర్ల: భద్రాచలం: నకిలీ విత్తనాలను అరికట్టాలి మరియు అమ్మిన వ్యాపారస్తులపై పిడి యాక్ట్ కేసు నమోదు చేయాలనీ తాసిల్దార్కు వినతి పత్రం అందజేత..

నకిలీ విత్తనాలను అరికట్టాలి,అమ్మిన వ్యాపారస్తులపై పిడియాక్ట్ కేసు నమోదు చేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్లలో ప్రదర్శనర్యాలీ ధర్నా తహసిల్దార్ కు వినతి పత్రం

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నకిలీ విత్తనాలను అరికట్టాలని అమ్మిన వ్యాపార వర్గాలపై పిడియక్ట్ కేసు నమోదు చేయాలని కోరుతూ ఈరోజు చర్ల మండల కేంద్రంలో ప్రదర్శన తహసిల్దార్ కార్యాలయం ధర్నా అనంతరం తాహాసిల్దార్ శ్రీనివాస్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.

ఈ కార్యక్రమం కు చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అధ్యక్షత వహించగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ 1 కోటి 60 లక్షల మంది రాష్ట్రంలో వ్యవసాయం సాగు చేసుకుంటుండగా అందులో 60 లక్షల మంది రైతులు పత్తి మిరప వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు.వీరికి సరిపడా విత్తనాలు సరఫరా చేయలేక కొంతమంది వ్యాపారస్తులు నకిలీ విత్తనాలను సరఫరా చేసి రైతులని మోసం చేస్తున్నారని అలాంటి వ్యాపార వర్గాలపై పిడి కేసులు నమోదు చేయాలని వారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలోకి రాగానే పాత రుణాలు రద్దుచేసి కొత్త రుణాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని అన్ని దేశాలలో ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీ ఇచ్చినట్టుగా ఈ భారత దేశంలో కూడా ఇవ్వాలని వారు కోరారు.వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలని పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నకిలీ విత్తనాలు అరికట్టాలని పర్మిషన్ లేకుండా వ్యాపారం చేస్తున్న వ్యాపార వర్గాలపై చర్యలు తీసుకోవాలని పంట బీమా,బి3 పత్తి విత్తనాల నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని,భూసార పరీక్షలు చేయాలని,సహకార సంఘాల ద్వారా ఎరువులు విత్తనాలు పురుగుమందులు సరఫరా చేయించాలని వారన్నారు.తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు రైతులు విత్తనాలు కొంటె రసీదులు ఇచ్చేటట్టుగా ఏ పంట పండుతుందో భూసార పరీక్షలు చేసేటట్టుగా వారిని చైతన్య పరచాలని వారు కోరారు.ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ నాయకులు కల్లూరి నర్సింగరావు,ఆదిలక్ష్మి,ఇర్ప సమ్మక్క,బొర్రా సమ్మక్క,కోట నాగమణి,కనకమ్మ ,శ్రీదేవి,బాయమ్మ,కల్లూరి నాగమని ,సబక నాగలక్ష్మి,వెంకటరమణ,జ్యోతి,కల్లూరు జయ,రామలక్ష్మి,ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 12 2024, 08:03

Ts:రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి: సీఎం

రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి: సీఎం

రాష్ట్ర రియల్‌ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, సభ్యులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి పల్లె, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చిత్రా రామచంద్రన్‌లు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడుతూ.. స్థిరాస్తి కొనుగోలుదారులు మోసపోకుండా రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు.