బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయండి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయండి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
అనంతపురం, జూన్ 12 : *బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బాల కార్మిక నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు.* *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరూ పనిలో ఉండకూడదని, ప్రతి ఒక్కరూ బడిలో ఉండాలని సూచించారు . జిల్లాలో ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. చైల్డ్ లేబర్ గా పని చేస్తూ ఎక్కడైనా షాప్స్ లో, ఇతర ఇల్లు నందు దొరికిన పిల్లలను తిరిగి వారిని స్కూల్లో చేర్పించి పనిలో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవానికి సంబంధించి సంబంధిత అధికారులను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆయా అధికారులను కలుపుకొని ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆయా శాఖల వారితో విడుదల చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి B. N శ్రీదేవి, జిల్లా బాలల పరిరక్షణ సమితి అధికారి మంజునాథ్, ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వరి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ కృష్ణమాచారి, జిల్లా చైల్డ్ లేబర్ అధికారి లక్ష్మీనరసయ్య, రఘురాములు, ఇతర సిబ్బంది వసంత, కమలాక్షి, ఇర్ఫాన్, సుహాసిని పాల్గొన్నారు..
Jun 13 2024, 09:07